ఆరు దశాబ్దాల ఎడారి జీవితం.. ఆ జ్ఞాపకాలే ఖరీదంటోన్న మలయాళీ.! | Gulf life focuses enduring memories of the Muhammad Kunji | Sakshi
Sakshi News home page

Muhammad Kunji: ఆరు దశాబ్దాల ఎడారి జీవితం.. ఆ జ్ఞాపకాలే ఖరీదంటోన్న మలయాళీ.!

Jan 10 2026 4:22 AM | Updated on Jan 10 2026 6:04 AM

Gulf life focuses enduring memories of the Muhammad Kunji

ఐదు దశాబ్దాల క్రితం గల్ఫ్‌లోని ఎడారిలో జీవితాన్ని ప్రారంభించిన మలయాళీ ముహమ్మద్ కుంజి (77). మత్స్యకారులైన పొన్నిచి ముసాన్, ఒలకోన్ సారా దంపతుల కుమారుడైన కుంజి 21 సంవత్సరాల వయసులో దుబాయ్‌కు ఓడ ఎక్కాడు. అతని తండ్రి సంపాదన అంతంత మాత్రమే కావడంతో  అతని కుటుంబం ఆకలి కూడా తీర్చలేకపోయేవాడు. మడాయిలోని ముత్తోంలోని కొవ్వప్పురానికి చెందిన పొన్నిచి ముసాన్ ఇక జీవించడానికి అతనికి వేరే మార్గం లేకపోవడంతో.. ఐదవ తరగతిలో చదువు మానేసి బీడీ కార్మికుడిగా పనికి వెళ్లేవాడు.

కానీ అతని సోదరుడు ముస్తఫా మాత్రం మొదట దుబాయ్‌కి వెళ్ళాడు. ముస్తఫా అక్కడ టీ దుకాణం నడుపుతున్నాడు. తన సోదరులను దుబాయ్‌కు తీసుకువస్తేనే కుటుంబంలో పేదరికం తొలగిపోతుందని తెలిసుకున్న ముస్తఫా.. వీసా వచ్చాక ముహమ్మద్ కుంజిని అక్కడికి రమ్మని కోరాడు. అలా మహమ్మద్ కుంజి మార్చి 3, 1967న దుబాయ్‌లో అడుగుపెట్టాడు.

అలా మహమ్మద్ కుంజిని దుబాయ్ తీసుకువచ్చాడు ముస్తఫా. అక్కడికి వెళ్లిన కుంజి టీ, స్వీట్లు తయారు చేయడం నేర్చుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించాడు. అలా ఉదయం ఆరు గంటలకు ప్రారంభమయ్యే వ్యాపారం.. రాత్రి తొమ్మిది గంటల వరకు కొనసాగేది. తాను సంపాదించిన దానిలో కొంత భాగాన్ని నేను దాచుకునేవాడు. ఇంట్లో ఆకలితో అలమటిస్తున్న నా తండ్రి, తల్లి, తోబుట్టువుల కోసం పంపేవాడు. అప్పట్లో తమ అదృష్టాన్ని వెతుక్కుంటూ దుబాయ్‌కు వచ్చిన వారిలో ఎక్కువ మంది మలయాళీలు, బలూచిస్తానీలే ఎక్కువ. కుంజి దుబాయ్‌లో తొమ్మిది సంవత్సరాలు పనిచేశాజు.


అప్పట్లో దుబాయ్ కరెన్సీ దిర్హామ్‌కి మన డబ్బుల్లో 2 రూపాయలు. ఆ తర్వాత 1976లో అబుదాబి పోలీస్ ఉద్యోగం వచ్చింది. పోలీస్ శాఖలో వంటవాడిగా కెరీర్ ప్రారంభించాడు. అప్పట్లో కుంజి జీతం 900 దిర్హామ్‌లు. అలా  జీతం నుంచి కొంత మొత్తాన్ని ఆదా చేసుకుని మిగిలిన మొత్తాన్ని ఇంటికి పంపేవాడినని తెలిపారు. అప్పుడు కేవలం ఉత్తరాల ద్వారానే కమ్యూనికేషన్ ఉండేది. పనిలో భాగంగా ఒక చిన్న ప్రమాదం జరగడంతో నా ఉద్యోగాన్ని కోల్పోయి టీ అమ్మడం మొదలుపెట్టాను. నాకు ఉద్యోగం వచ్చే వరకు అది కష్టమైన పని.  ఆ తర్వాత 1987లో అబుదాబి సైన్యంలో ఉద్యోగం. అక్కడ కూడా నా ఉద్యోగం వంట. జీతం 1800 దిర్హామ్‌లు. అప్పుడు ఇంటికి ఎక్కువ డబ్బు పంపగలిగానని కుంజి వెల్లడించారు. నేను మొదట మా ఊరికి వచ్చినప్పుడు, నేను కోటీశ్వరుడిననని నా కుటుంబం, స్థానికులు చాలా ఆశలు పెట్టుకునేవారని తెలిపారు.


నేను అబుదాబి సైన్యంలో చేరిన తర్వాత వివాహం చేసుకున్నానని తెలిపారు. నేను అప్పట్లో గల్ఫ్ గురించి చెబితే  ప్రజలు నన్ను నమ్మలేదు. అప్పట్లో అరబ్బులకు కూడా చిన్న ఇళ్లే ఉండేవి. మేమందరం చిన్న గుడిసెలలో నివసించామని.. స్నానం చేయడానికి గాడిదలపై టిన్ డబ్బాల్లో తెచ్చిన నీటికి డబ్బు చెల్లించాల్సి వచ్చేదన్నారు. కేవలం ప్రతి నాలుగైదు రోజులకు నీరు వస్తుందన్నారు. కుటుంబ ఉత్తరం కోసం వేచి ఉన్న సమయం చాలా బాధాకరంగా ఉండేదని అన్నారు.

నేను రాడో వాచ్‌ను 1987లో కొన్నాను. లడఖ్‌లో ఉద్యోగం వచ్చినప్పుడు నా మొదటి జీతంతో  కొన్నానని తెలిపారు. ఈ వాచ్ ధర 2025 దిర్హామ్‌లని వెల్లడించారు. ఈ గడియారం నా గల్ఫ్ జీవితాన్ని గుర్తు చేస్తుందని అన్నారు. అప్పటి నుండి, నా కుటుంబం. ఈ గడియారం నాతోనే ఉన్నాయని తెలిపారు. ఒకరోజు నేను ఒక గడియార దుకాణానికి వెళ్లి రాడో వాచ్ ధర ఎంత  అడిగా..  అర మిలియన్ రూపాయలు అన్నారు. కానీ నాకు, దాని విలువ కంటే జ్ఞాపకాలే చాలా రెట్లు ఎక్కువ అనిపించిందన్నారు.


నా వయస్సు 60 సంవత్సరాల వరకు అబుదాబిలో పనిచేశానని.. తరువాత నా ప్రవాసాన్ని ముగించానని కుంజి వెల్లడించారు. నా కుమార్తెలు ఆయేషా, అమీనా వివాహం చేసుకున్నారు. మనదేశానికి తిరిగి వచ్చి ఎలక్ట్రికల్ వస్తువులు అమ్మే దుకాణాన్ని ప్రారంభించానని తెలిపారు. నేను ఖాళీగా ఉన్నప్పుడు, గల్ఫ్ జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయని.. అప్పుడు ఈ గడియారాన్ని ఎల్లప్పుడూ చూస్తానని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement