తమిళనాట సంచలనం.. డీఎంకేలో చేరిన మాజీ సీఎం | Panneer Selvam joins DMK | Sakshi
Sakshi News home page

తమిళనాట సంచలనం.. డీఎంకేలో చేరిన మాజీ సీఎం

Feb 27 2026 11:08 AM | Updated on Feb 27 2026 11:54 AM

Panneer Selvam joins DMK

తమిళనాడు రాజకీయాల్లో సంచలనం చోటు చేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి, ఏఐడిఎంకే బహిష్కృత  నేత పన్నీరు సెల్వం డీఎంకే పార్టీలో చేరారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ ఆయనను సాధరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అయితే పన్నీరు సెల్వానికి ఆయన గతంలో పోటీ చేసిన స్థానం నుంచే ఎమ్మెల్యే టికెట్ ఇస్తారని సమాచారం.

పన్నీరు సెల్వం దివంగత నేత  ఆ రాష్ట్ర మాజీ సీఎం జయలలితకు అత్యంత సన్నిహితుడు. జయలలితపై  అనర్హత వేటు పడిన సందర్భంతో పాటు ఆమె మరణాంతరం తమిళనాడుకు సీఎంగా వ్యవహరించారు. అనంతరం జరిగిన రాజకీయ పరిణామాలతో 2022లో ఆయన ఏఐడీఎంకే నుంచి బహిష్కరణకు గురయ్యారు. కాగా కొద్దిరోజుల క్రితమే దివంగత నేత ఆరాష్ట్ర మాజీ సీఎం జయలలిత సన్నిహితురాలు శశికళ కొత్త పార్టీ పెడుతున్నట్లు ప్రకటించింది. 

కాగా తాజాగా జయలలిత  వీర విధేయుడిని అని చెప్పుకునే పన్నీరు సెల్వం డీఎంకేలో చేరారు. దీంతో తమిళనాట రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ఈ ఏడాది ఆ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పన్నీరు సెల్వం డీఎంకేలో చేరడం ఆ రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌ టాఫిక్‌గా మారింది.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement