breaking news
Rado watch
-
ఆరు దశాబ్దాల ఎడారి జీవితం.. ఆ జ్ఞాపకాలే ఖరీదంటోన్న మలయాళీ.!
ఐదు దశాబ్దాల క్రితం గల్ఫ్‌లోని ఎడారిలో జీవితాన్ని ప్రారంభించిన మలయాళీ ముహమ్మద్ కుంజి (77). మత్స్యకారులైన పొన్నిచి ముసాన్, ఒలకోన్ సారా దంపతుల కుమారుడైన కుంజి 21 సంవత్సరాల వయసులో దుబాయ్‌కు ఓడ ఎక్కాడు. అతని తండ్రి సంపాదన అంతంత మాత్రమే కావడంతో అతని కుటుంబం ఆకలి కూడా తీర్చలేకపోయేవాడు. మడాయిలోని ముత్తోంలోని కొవ్వప్పురానికి చెందిన పొన్నిచి ముసాన్ ఇక జీవించడానికి అతనికి వేరే మార్గం లేకపోవడంతో.. ఐదవ తరగతిలో చదువు మానేసి బీడీ కార్మికుడిగా పనికి వెళ్లేవాడు.కానీ అతని సోదరుడు ముస్తఫా మాత్రం మొదట దుబాయ్‌కి వెళ్ళాడు. ముస్తఫా అక్కడ టీ దుకాణం నడుపుతున్నాడు. తన సోదరులను దుబాయ్‌కు తీసుకువస్తేనే కుటుంబంలో పేదరికం తొలగిపోతుందని తెలిసుకున్న ముస్తఫా.. వీసా వచ్చాక ముహమ్మద్ కుంజిని అక్కడికి రమ్మని కోరాడు. అలా మహమ్మద్ కుంజి మార్చి 3, 1967న దుబాయ్‌లో అడుగుపెట్టాడు.అలా మహమ్మద్ కుంజిని దుబాయ్ తీసుకువచ్చాడు ముస్తఫా. అక్కడికి వెళ్లిన కుంజి టీ, స్వీట్లు తయారు చేయడం నేర్చుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించాడు. అలా ఉదయం ఆరు గంటలకు ప్రారంభమయ్యే వ్యాపారం.. రాత్రి తొమ్మిది గంటల వరకు కొనసాగేది. తాను సంపాదించిన దానిలో కొంత భాగాన్ని నేను దాచుకునేవాడు. ఇంట్లో ఆకలితో అలమటిస్తున్న నా తండ్రి, తల్లి, తోబుట్టువుల కోసం పంపేవాడు. అప్పట్లో తమ అదృష్టాన్ని వెతుక్కుంటూ దుబాయ్‌కు వచ్చిన వారిలో ఎక్కువ మంది మలయాళీలు, బలూచిస్తానీలే ఎక్కువ. కుంజి దుబాయ్‌లో తొమ్మిది సంవత్సరాలు పనిచేశాజు.అప్పట్లో దుబాయ్ కరెన్సీ దిర్హామ్‌కి మన డబ్బుల్లో 2 రూపాయలు. ఆ తర్వాత 1976లో అబుదాబి పోలీస్ ఉద్యోగం వచ్చింది. పోలీస్ శాఖలో వంటవాడిగా కెరీర్ ప్రారంభించాడు. అప్పట్లో కుంజి జీతం 900 దిర్హామ్‌లు. అలా జీతం నుంచి కొంత మొత్తాన్ని ఆదా చేసుకుని మిగిలిన మొత్తాన్ని ఇంటికి పంపేవాడినని తెలిపారు. అప్పుడు కేవలం ఉత్తరాల ద్వారానే కమ్యూనికేషన్ ఉండేది. పనిలో భాగంగా ఒక చిన్న ప్రమాదం జరగడంతో నా ఉద్యోగాన్ని కోల్పోయి టీ అమ్మడం మొదలుపెట్టాను. నాకు ఉద్యోగం వచ్చే వరకు అది కష్టమైన పని. ఆ తర్వాత 1987లో అబుదాబి సైన్యంలో ఉద్యోగం. అక్కడ కూడా నా ఉద్యోగం వంట. జీతం 1800 దిర్హామ్‌లు. అప్పుడు ఇంటికి ఎక్కువ డబ్బు పంపగలిగానని కుంజి వెల్లడించారు. నేను మొదట మా ఊరికి వచ్చినప్పుడు, నేను కోటీశ్వరుడిననని నా కుటుంబం, స్థానికులు చాలా ఆశలు పెట్టుకునేవారని తెలిపారు.నేను అబుదాబి సైన్యంలో చేరిన తర్వాత వివాహం చేసుకున్నానని తెలిపారు. నేను అప్పట్లో గల్ఫ్ గురించి చెబితే ప్రజలు నన్ను నమ్మలేదు. అప్పట్లో అరబ్బులకు కూడా చిన్న ఇళ్లే ఉండేవి. మేమందరం చిన్న గుడిసెలలో నివసించామని.. స్నానం చేయడానికి గాడిదలపై టిన్ డబ్బాల్లో తెచ్చిన నీటికి డబ్బు చెల్లించాల్సి వచ్చేదన్నారు. కేవలం ప్రతి నాలుగైదు రోజులకు నీరు వస్తుందన్నారు. కుటుంబ ఉత్తరం కోసం వేచి ఉన్న సమయం చాలా బాధాకరంగా ఉండేదని అన్నారు.నేను రాడో వాచ్‌ను 1987లో కొన్నాను. లడఖ్‌లో ఉద్యోగం వచ్చినప్పుడు నా మొదటి జీతంతో కొన్నానని తెలిపారు. ఈ వాచ్ ధర 2025 దిర్హామ్లని వెల్లడించారు. ఈ గడియారం నా గల్ఫ్ జీవితాన్ని గుర్తు చేస్తుందని అన్నారు. అప్పటి నుండి, నా కుటుంబం. ఈ గడియారం నాతోనే ఉన్నాయని తెలిపారు. ఒకరోజు నేను ఒక గడియార దుకాణానికి వెళ్లి రాడో వాచ్ ధర ఎంత అడిగా.. అర మిలియన్ రూపాయలు అన్నారు. కానీ నాకు, దాని విలువ కంటే జ్ఞాపకాలే చాలా రెట్లు ఎక్కువ అనిపించిందన్నారు.నా వయస్సు 60 సంవత్సరాల వరకు అబుదాబిలో పనిచేశానని.. తరువాత నా ప్రవాసాన్ని ముగించానని కుంజి వెల్లడించారు. నా కుమార్తెలు ఆయేషా, అమీనా వివాహం చేసుకున్నారు. మనదేశానికి తిరిగి వచ్చి ఎలక్ట్రికల్ వస్తువులు అమ్మే దుకాణాన్ని ప్రారంభించానని తెలిపారు. నేను ఖాళీగా ఉన్నప్పుడు, గల్ఫ్ జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయని.. అప్పుడు ఈ గడియారాన్ని ఎల్లప్పుడూ చూస్తానని పేర్కొన్నారు. -
గర్ల్‌ఫ్రెండ్ బర్త్‌డే గిఫ్ట్ కోసం..
సాక్షి, న్యూఢిల్లీ: గర్ల్‌ఫ్రెండ్‌ను సర్ప్రైజ్ చేద్దామనుకున్న ఓ బీటెక్ యువకుడు జైలు పాలయ్యాడు. ఖరీదైన వాచ్‌ను ఆమెకు బహుమతిగా ఇద్దామని మోసానికి పాల్పడ్డాడు. ఆన్లైన్లో వాచ్‌ను ఆర్డర్ చేసి.. డెలివరీ బాయ్‌ని మోసం చేశాడు. పోలీసులు ఫోన్ నెంబర్‌ను ట్రేస్ చేయడంతో దొరికిపోయాడు. వివరాలు..ఢిల్లీ మోడల్ టౌన్లో నివాసముండే వైభవ్ ఖురాన (22) తన గర్ల్‌ఫ్రెండ్‌కు పుట్టిన రోజు కానుక ఇవ్వాలనుకున్నాడు. 90 వేల ఖరీదు గల రాడో చేతిగడియారాన్ని ఆన్లైన్లో జూలై 23న తప్పుడు అడ్రస్ పెట్టి ఆర్డర్ చేశాడు. వాచ్ పార్సిల్‌తో డెలివరీ బాయ్ (సాహు) రాగానే కాశ్మీరే గేట్ మెట్రో స్టేషన్ వద్ద కలుసుకున్నారు. సాహుని ఓ ఇంటికి తీసుకెళ్లి.. ‘నువ్ కాలింగ్ బెల్ కొట్టు. మా వాళ్లు డబ్బులు తెచ్చిస్తారు. నేను వెనకే వస్తున్నాన’ని చెప్పాడు. అప్పటికే ఆర్డర్ చేసిన వాచ్ ప్యాకెట్‌ను తీసుకున్న వైభవ్ అక్కడి నుంచి తన బైక్‌పై పరారయ్యాడని పోలీసులు తెలిపారు. డెలివరీ బాయ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు కాల్‌డేటా ఆధారంగా నిందితున్ని పట్టుకున్నారు. నిందితుని వద్ద నుంచి వాచ్, బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. కాగా, రూ. 90 వేల విలువగల రాడో రిస్ట్‌వాచ్ ఆన్లైన్లో రూ. 67 వేలకే అందుబాటులో ఉండటం విశేషం. -
ట్రూ కాలర్ యాప్, ఫేస్ బుక్ లు పట్టించేశాయి..
హైదరాబాద్ : మాదాపూర్‌లోని ఇనార్బిట్ మాల్లో జరిగిన రూ.1.21 లక్షల విలువైన రాడో వాచ్ చోరీ కేసును పోలీసులు ఫేస్బుక్, ట్రూ కాలర్ యాప్, సీసీ కెమెరాల సాయంతోనే చేధించారు. సాధారణ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని సింపుల్ ఇన్వెస్టిగేషన్ చేసిన డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ శశాంక్‌రెడ్డి చాకచక్యంగా వ్యవహరించి గురువారం నిందితుల్ని అరెస్టు చేయగలిగారు. సరదాగా వచ్చి చోరీ చేసి... కూకట్‌పల్లికి చెందిన బీటెక్ విద్యార్థులు ఆర్.సుహాస్ చౌదరి, జి.తేజ గత నెల 9న మాదాపూర్‌లోని ఇనార్బిట్ మాల్‌కు వెళ్లారు. అటూ ఇటు తిరిగిన ఈ ద్వయం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో మాల్లో ఉన్న ఇతోస్ వాచ్ స్టోర్‌లోకి ప్రవేశించారు. కొద్దిసేపు వాచీలను ఖరీదు చేసే నెపంతో పరిశీలించారు. షాపు యజమాని మరో వినియోగదారుడితో మాట్లాడుతుండగా.. అదను చూసి రూ.1.21 లక్షల విలువైన రాడో కంపెనీ వాచ్‌ను తస్కరించారు. ఎవరికీ అనుమానం రాకుండా అక్కడ నుంచి జారుకున్న ద్వయం తమ బైక్‌పై మాదాపూర్ వైపు వెళ్లిపోయారు. తన దుకాణంలో వాచ్ చోరీకి గురైందని గుర్తించిన యజమాని అదే రోజు మాదాపూర్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ప్రాథమిక ఆధారాలిచ్చిన సీసీ కెమెరాలు... ఈ కేసు దర్యాప్తు ప్రారంభించిన ఇన్స్పెక్టర్ శశాంక్‌రెడ్డి నేతృత్వంలోని బృందం ప్రాథమికమైన ఆధారాలపై దృష్టి పెట్టింది. తొలుత మాల్లోని సీసీ కెమెరాల్లో రికార్డు అయిన నిందితుల ఫుటేజ్ సేకరించింది. ఎంట్రీ వద్ద ఉన్న సీసీ కెమెరాలో ఇద్దరూ ఓ క్యారీబ్యాగ్ తీసుకుని లోపలకు వచ్చినట్లు రికార్డయ్యింది. మాల్‌కు సమీపంలో ఉన్న ఓ సాఫ్ట్వేర్ కంపెనీ ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫీడ్‌ను పరిశీలించిన నేపథ్యంలో ఆ ఇద్దరు యువకులూ పల్సర్ వాహనంపై వచ్చి వెళ్లినట్లు వెల్లడైంది. యాప్స్, సోషల్ మీడియా ద్వారా క్లూస్... సీసీ టీవీ ఫీడ్‌లో ఉన్న వాహనం నంబర్‌ను గుర్తించిన దర్యాప్తు అధికారులు ఆర్టీఏ అధికారుల సాయంతో రిజిస్టర్ అయి ఉన్న చిరునామా, రికార్డుల్లో పొందుపరిచిన సెల్‌ఫోన్ నంబర్ సేకరించారు. అయితే వాహనాన్ని ప్రస్తుతం రిజిస్టర్ చేసుకున్న యజమాని (నిందితుడు) వినియోగిస్తున్నాడా? చేతులు మారిందా? అనే అంశాలను తెలుసుకోవడానికి దర్యాప్తు అధికారి యాప్స్, సోషల్ మీడియాలను ఆశ్రయించారు. ఆ సెల్‌ఫోన్ నంబర్ ఆధారంగా మొబైల్ యాప్ ట్రూ కాలర్‌లో, ఆర్టీఏ రికార్డుల్లో ఉన్న పేరును సోషల్ మీడియా ఫేస్‌బుక్స్‌లో సెర్చ్ చేశారు. వాటిలో ఉన్న ఫొటో, సీసీ కెమెరా ఫీడ్స్‌లో నమోదైన ఫీడ్‌లోని దాంతో సరిపోలడంతో అతడే నిందితుడిగా గుర్తించారు. గురువారం నిందితులు ఉంటున్న ఇంటిపై దాడి చేసి ఇద్దరినీ అరెస్టు చేయడంతో పాటు వాచ్ రికవరీ చేశారు.


