గర్ల్‌ఫ్రెండ్‌ బర్త్‌డే గిఫ్ట్‌ కోసం..

Delhi BTech Graduate Held For Cheating Delivery Boy, Stealing 90k Watch - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: గర్ల్‌ఫ్రెండ్‌ను సర్‌ప్రైజ్‌ చేద్దామనుకున్న ఓ బీటెక్‌ యువకుడు జైలు పాలయ్యాడు. ఖరీదైన వాచ్‌ను ఆమెకు బహుమతిగా ఇద్దామని మోసానికి పాల్పడ్డాడు. ఆన్‌లైన్‌లో వాచ్‌ను ఆర్డర్‌ చేసి.. డెలివరీ బాయ్‌ని మోసం చేశాడు. పోలీసులు ఫోన్‌ నెంబర్‌ను ట్రేస్‌ చేయడంతో దొరికిపోయాడు. వివరాలు..ఢిల్లీ మోడల్‌ టౌన్‌లో నివాసముండే వైభవ్‌ ఖురాన (22) తన గర్ల్‌ఫ్రెండ్‌కు పుట్టిన రోజు కానుక ఇవ్వాలనుకున్నాడు. 90 వేల ఖరీదు గల రాడో చేతిగడియారాన్ని ఆన్‌లైన్‌లో జూలై 23న తప్పుడు అడ్రస్‌ పెట్టి ఆర్డర్‌ చేశాడు.

వాచ్‌ పార్సిల్‌తో డెలివరీ బాయ్‌ (సాహు) రాగానే కాశ్మీరే గేట్‌ మెట్రో స్టేషన్‌ వద్ద కలుసుకున్నారు. సాహుని ఓ ఇంటికి తీసుకెళ్లి.. ‘నువ్‌ కాలింగ్‌ బెల్‌ కొట్టు. మా వాళ్లు డబ్బులు తెచ్చిస్తారు. నేను వెనకే వస్తున్నాన’ని చెప్పాడు. అప్పటికే ఆర్డర్‌ చేసిన వాచ్‌ ప్యాకెట్‌ను తీసుకున్న వైభవ్‌ అక్కడి నుంచి తన బైక్‌పై పరారయ్యాడని పోలీసులు తెలిపారు. డెలివరీ బాయ్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు కాల్‌డేటా ఆధారంగా నిందితున్ని పట్టుకున్నారు. నిందితుని వద్ద నుంచి వాచ్‌, బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. కాగా, రూ. 90 వేల విలువగల రాడో  రిస్ట్‌వాచ్‌ ఆన్‌లైన్‌లో రూ. 67 వేలకే అందుబాటులో ఉండటం విశేషం.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top