అయ్యప్ప భక్తుల కారు బోల్తా.. పలువురికి గాయాలు | Few People Injured In Car Accident At Agarala Tirupati District | Sakshi
Sakshi News home page

అయ్యప్ప భక్తుల కారు బోల్తా.. పలువురికి గాయాలు

Dec 7 2025 6:16 PM | Updated on Dec 7 2025 6:35 PM

Few People Injured In Car Accident At Agarala Tirupati District

తిరుపతి: జిల్లాలోని చంద్రగిరి మండలం అగరాలలో కారు బోల్తా పడిన ఘటనలో పలువురు అయ్యప్ప భక్తులకు గాయాలయ్యాయి. శబరిమల నుంచి కోడూరు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.  స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. గాయపడ్డ వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. కాగా, నిన్న(శనివారం, డిసెంబర్‌ 6వ తేదీ) తమిళనాడులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మరణించారు. 

ఏపీకి చెందిన అయ్యప్ప భక్తులు శబరిమల దర్శనం తర్వాత రామేశ్వరం వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘోరం జరిగింది. శనివారం ఉదయం కీళకరై ఈసీఆర్‌ వద్ద వీళ్లు ప్రయాణిస్తున్న కారు.. ఆగి ఉన్న కారును వేగంగా వచ్చి బలంగా ఢీ కొట్టింది. 

మృతుల్లో నలుగురు ఏపీకి చెందినవారని పోలీసులు తెలిపారు. డ్రైవర్‌ ముస్తాక్‌ కూడా అక్కడికక్కడే మృతి చెందాడన్నారు. రెండు కార్లలోనూ అయ్యప్ప భక్తులు ఉన్నారని చెప్పారు. మృతులు విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం కోరపు కొత్తవలస, మరుపల్లి కి చెందిన వారిగా గుర్తించారు. శబరిమల దర్శనం ముగించుకుని రామేశ్వరం.. అక్కడి నుంచి వస్తుండగా ఈ దుర్ఘటనలో ప్రాణాలు పొగొట్టుకున్నారని పోలీసులు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement