డబుల్ ఇంజిన్ వేగంతో రాష్ట్రాభివృద్ధి: ఒడిశాలో ప్రధాని మోదీ | PM Modi in Odisha live Updates Development Projects | Sakshi
Sakshi News home page

డబుల్ ఇంజిన్ వేగంతో రాష్ట్రాభివృద్ధి: ఒడిశాలో ప్రధాని మోదీ

Sep 27 2025 1:16 PM | Updated on Sep 27 2025 1:27 PM

PM Modi in Odisha live Updates Development Projects

ఝార్సుగూడ: ‘ఇప్పటివరకు మా ప్రభుత్వం దేశవ్యాప్తంగా నాలుగు కోట్లకు పైగా పక్కా ఇళ్లను నిర్మించింది. ఒడిశాలో ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ, అతని బృందం  అభివృద్ధి కోసం పాటుపడుతోంది. ఇక్కడి ప్రజలకు 50 వేల పక్కా ఇళ్లను అందించాం. గిరిజన సమాజంలో వెనుకబడిన వారికి కూడా మేము ప్రత్యేక సహాయం అందిస్తున్నాం.  ఏ దేశమైనా ఆర్థికంగా సాధికారత సాధించాలంటే నౌకా నిర్మాణంపై దృష్టి సారించాలి. బీజేపీ ప్రభుత్వం ఈ దిశగా ప్రధాన అడుగు వేసింది. నౌకా నిర్మాణాన్ని ప్రోత్సహించేందుకు మేము రూ. 70 వేల కోట్ల ప్యాకేజీని ఆమోదించాం. ఇది భారతదేశానికి రూ. 4.5 లక్షల కోట్ల పెట్టుబడిని తెస్తుంది. డబుల్ ఇంజిన్ వేగంతో రాష్ట్రం అభివృద్ధి చెందుతోంది’ అని ప్రధాని మోదీ తన ఒడిశా పర్యటనలో పేర్కొన్నారు.
 

ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబర్ 27న ఒడిశాలో వివిధ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. ఝార్సుగూడలో, టెలికమ్యూనికేషన్స్, రైల్వేలు, ఆరోగ్య సంరక్షణ, ఉన్నత విద్య, నైపుణ్య అభివృద్ధి, గ్రామీణ గృహనిర్మాణం తదితర రూ. 60 వేల కోట్లకు పైగా విలువైన బహుళ ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఝార్సుగూడలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.

 


ఈరోజు ‍ప్రారంభమైన బెర్హంపూర్-ఉధ్నా అమృత్ భారత్ రైలు గుజరాత్‌లోని ఒడియా ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తుందని ఝార్సుగూడ ర్యాలీలో ప్రధాని మోదీ పేర్కొన్నారు.  బీఎస్‌ఎన్ఎల్‌కు చెందిన స్వదేశీ 4జీ సేవలు ఈరోజు ప్రారంభమయ్యాయని అన్నారు. ఈ ర్యాలీకి ముందు ప్రధాని నరేంద్ర మోదీ అంత్యోదయ గృహ యోజన కింద 50 వేల మంది లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఈ పథకం కింద వికలాంగులు, వితంతువులు, ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్నవారు, ప్రకృతి వైపరీత్యాల బాధితులతో పాటు బలహీన గ్రామీణ కుటుంబాలకు పక్కా గృహాల నిర్మాణానికి ఆర్థిక సాయం అందించనున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement