తిరువనంతపురం: శబరిమల అయ్యప్ప ఆలయంలో ఆరేళ్ల క్రితం వెలుగుచూసిన బంగారం అపహరణ కేసులో మాజీ మంత్రి కడకంపల్లి సురేంద్రన్‌ను ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) విచారించింది. ఈ కేసులో దేవస్థానం మాజీ బోర్డు సభ్యులు పలువురు అరెస్ట్ కాగా, తాజాగా ఇది దేవస్థానం శాఖ మంత్రిగా పని చేసిన కడకంపల్లి సురేంద్రన్ వద్దకు చేరింది.
గత శనివారం కడకంపల్లి సురేంద్రన్‌ను సిట్ బృందం విచారించింది. శబరిమల ఆలయానికి సంబంధించి తలుపులకు పూసి ఉన్న బంగారం మాయం కావడాన్ని ప్రధానంగా ప్రశ్నించింది. ఈ కేసులో ఆయన నేరుగా పాలు పంచుకున్నారనేందుకు ఎటువంటి ఆధారాలు లేకపోయినా, సంబంధాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో సిట విచారణ చేపట్టింది.
అయితే దేవస్థానం(దేవస్వం శాఖ) పాలసీ నిర్ణయాలు మాత్రమే తీసుకుంటుందని, బంగారం పూత తొలగించడం, చెన్నైలోని ప్రైవేట సంస్థకు పంపడం వంటి నిర్ణయాలు టీడీబీ(ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు) స్వతంత్రంగా తీసుకుంటుందన్నారు.
కేసు వివరాలు
శబరిమల ఆలయంలోని విగ్రహాలు, తలుపులపై ఉన్న బంగారు పూతలో కొంత భాగం కనిపించకుండా పోయింది.
మాజీ దేవస్వం మంత్రి కడకంపల్లి సురేంద్రన్, మాజీ టీడీబీ అధ్యక్షులు ప్రశాంత్, పద్మకుమార్ తదితరులు విచారణ ఎదుర్కొంటున్నారు.
ఇప్పటివరకు SIT 10 మందిని అరెస్టు చేసింది, వీరిలో ఇద్దరు మాజీ టీడీబీ అధ్యక్షులు కూడా ఉన్నారు.
ఈ కేసును విచారించేందుకు సిట్‌కు ఇంకా ఆరు నెలల సమయం ఉంది.
కొత్త సాక్ష్యాలు, సంబంధాలు వెలుగులోకి వస్తే మరిన్ని అరెస్టులు జరగవచ్చు.
బంగారం కనిపించకుండా పోయిన ఈ ఘటన 2019లో జరిగింది.


