అసోంలో ఉగ్రవాదుల భారీ కుట్రను అధికారులు భగ్నం చేశారు. అసోం, త్రిపురలో దాడులకు స్కెచ్ వేసిన 11 మంది ఉగ్రవాదులను సోమవారం అరెస్టు చేశారు. బంగ్లాదేశ్ కేంద్రంగా ఈ టెర్రరిస్ట్ క్యాంపు నడుస్తోందని భారీదాడులకు వీరు ప్లాన్ చేసినట్లు ప్రాథమిక విచారణలో గుర్తించినట్లు తెలిపారు. అరెస్ట్ చేసిన సందర్భంలో ఉగ్రవాదుల వద్ద జిహదీ సాహిత్యంలో పాటు పలు కీలక ఆధారాలు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు..
కాగా ఇటీవల ఢిల్లీ ఎర్రకోట బాంబు దాడుల నేపథ్యంలో జాతీయ దర్యాప్తు సంస్థ దేశవ్యాప్తంగా దర్యాప్తును ముమ్మరం చేసింది. అనుమానిత ప్రాంతాలలో ప్రత్యేక సోదాలు నిర్వహించింది. ఈ దాడులలో ఉగ్రవాద దాడులకు సంబంధించిన కీలక ఆధారాలు సేకరించడంతో పలువురిని అరెస్ట్ చేసింది. కాగా గత నెల 10వ తేదీన ఢిల్లీ ఎర్రకోట వద్ద బాంబు పేలుళ్లు జరిగాయి. ఇందులో దాదాపు 13 మంది మృతిచెందగా పలువురు గాయపడ్డారు.


