
మహిళలకు సమాన అవకాశాలు కల్పించాలి. అన్ని రంగాల్లో ముందుండాలి వంటి ఉపన్యాసాలు లెక్కకు మించి చూసుంటాం. చేతల్లో మాత్రం శూన్యం. అతివల తమ ప్రతిభతో సంపాదించుకున్న అత్యున్నత స్థానాలే తప్ప..చాలమటుకు కొన్ని రంగాల్లో అవకాశాలు ఉండనే ఉండవు. అంతెందుకు మహిళా అధికారులు సైతం..తమ వరకు వచ్చేటప్పటికీ ఒకలా..బయటకు ఎన్నో లెక్చర్లు ఇస్తారు. కానీ ఈ అధికారిణి..మాటల్లోనే కాదు..చేతల్లో కూడా మహిళలకే తన తొలి ప్రాధాన్యాత అంటూ చేసి చూపించింది. ఆమె చేసిన పని భారతదేశంలో ఒక సరికొత్త మైలు రాయి. ఇలాంటి అద్భుతం ఇదే దేశంలోనే తొలిసారి కూడా కావొచ్చు.
ఒడిశాలో మహిళా డ్రైవర్‌ను అధికారికంగా నియమించిన తొలి మహిళా ప్రభుత్వాధికారిణిగా ఉషా పాధీ గుర్తింపు పొందారు. ఒడిశా రవాణా, గృహనిర్మాణం, పట్టణాభివృద్ధి ప్రధాన కార్యదర్శి అయినా ఆమె తన శక్తిమంతమైన అధికారంతో ఒక సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారు. మయూర్ భంజ్‌కి చెందిన సంధ్యారాణి మాఝిని తన అధికారిక డ్రైవర్లలో ఒకరిగా నియమించుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు ఉషా. దీంతో ప్రభుత్వ వాహన తొలి మహిళా డ్రైవర్‌గా రికార్డు సృష్టించింది సంధ్యారాణి
సంధ్యా జాజ్‌పూర్ ఛటియాలోని హెచ్‌ఎంవీ శిక్షణా కేంద్రంలో డ్రైవింగ్ శిక్షణ పొందారామె. తదనంతరం ఒక అధికారి వద్ద డ్రైవర్‌గా పనిచేసే అవకాశాన్ని అందుకుంది. ఆమెకు వరకూ ప్రైవేట్ స్కూల్ బస్ వంటి భారీ వాహనాలను నడిపిన అనుభవం కూడా ఉందట! మహిళలు అన్నింట్లో ముందుడాలంటూనే, డ్రైవింగ్, పాలన, సేవా బట్వాడా వంటి వాటిల్లో సమాన అవకాశాలు ఇవ్వం. ఆ లింగ మూసధోరణికి తిలోదకాలు ఇస్తూ..ఆమెనే డ్రైవర్‌గా కేటాయించుకున్నారు ఉషా. ఇది కేవలం సంధ్యతో మొదలైన మార్పు కాదు.
అక్కడ రవాణా శాఖ హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్ కింద అమాబస్ ఓఎస్‌ఆర్‌టీసీ అనేక మంది మహిళా కండక్టర్లను నియమించుకుని సంచలనం సృష్టించింది. బస్సులను, జీవితాలను కమాండ్ చేసే సత్తా మహిళలకే ఉందంటూ ఉమె సువాహాక్ చొరవతో వాణిజ్య రవాణా శాఖ మంత్రి ఈ ఏడాది సుమారు 500 మంది మహిళా డ్రైవర్లకు శిక్షణ ఇచ్చి, ఆర్థిక స్వాతంత్ర్యం, స్వీయ విలువల దిశగా నడిపించాలని చూస్తుండటం విశేషం.
శక్తిమంతమైన మార్పు పుష్కలమైన అవకాశాలు అందించనప్పుడే అని చెప్పడానికి ఈ ఘటనలే ఉదాహారణలు. అంతేగాదు అధికారుల సరైన నిర్ణయాలే ప్రజల అభ్యున్నతికి బాటలు వేసి నవ సమాజ నిర్మాణానికి దోహదపడతాయి అనే మాటకు ఇదే నిదర్శనం కూడా.
(చదవండి: ఏడాదికి కోట్లు సంపాదిస్తున్నా.. ఐనా సంతోషంగా నిల్!: ఎంటర్‌ప్రెన్యూర్ ఆవేదన)