ఏడాదికి కోట్లు సంపాదిస్తున్నా.. ఐనా సంతోషం నిల్‌ ! | Indian Entrepreneur Earning Rs 1 Crore Yearly Shares Why He's Not Happy | Sakshi
Sakshi News home page

ఏడాదికి కోట్లు సంపాదిస్తున్నా.. ఐనా సంతోషంగా నిల్‌!: ఎంటర్‌ప్రెన్యూర్‌ ఆవేదన

Jul 15 2025 2:05 PM | Updated on Jul 15 2025 3:06 PM

Indian Entrepreneur Earning Rs 1 Crore Yearly Shares Why He's Not Happy

28 ఏళ్ల యువకుడు ఎంతో కష్టపడి వృద్ధిలోకి వచ్చాడు. పలు ఓటములు చవిచూసి..స్వయంకృషితో ఎదిగాడు. ఏకంగా ఏడాదికి కోట్లు గడించే స్థాయికి చేరుకున్నాడు. చాలా కింద స్థాయి నుంచి శ్రీమంతుడిగా మారాడు. ఇంత సక్సెస్‌ అందుకున్నా..ఆనందించలేకపోతున్నా అంటూ సోషల్‌ మీడియా వేదికగా వాపోయాడు ఓ ఎంటర్‌ప్రెన్యూర్‌. పైగా అంతకుమునుపే..చాలా ఆనందంగా ఉన్నా..అప్పుడే చాలా హెల్దీగా ఉన్నా. ఇప్పుడు మాత్రం అంతలా ఉత్సాహంగా అస్సలు ఉండలేకపోతున్నా అని బాధగా చెప్పాడు. అయితే తన తల్లిదండ్రులు మాత్రం తన విజయాన్ని ఆస్వాదిస్తున్నారని గర్వంగా చెప్పాడు. విజయం సాధించాక ఆనందం దూరమైపోతుందా అంటే.

28 ఏళ్ల భారతీయ ఎంటర్‌ప్రెన్యూర్‌ రెడ్డిట్‌లో షేర్‌ చేసిన పోస్టు నెట్టింట పెద్ద దుమారం రేపి చర్చలకు దారితీసింది. ఇంతకీ ఆ పోస్ట్‌లో ఏముందంటే.. వ్యవస్థాపకుడిగా తన జర్నీ ప్రారంభమైన విధానం గురించి వివరించారు. తనకు ఒక ప్రీమియం కారు, విదేశీ పర్యటనలు చుట్టొచ్చేంత మనీ, మంచి బంగ్లా కొనేంత డబ్బు ఉందని చెప్పుకొచ్చారు. ఐతే 12 ఏళ్ల క్రితం తానొక సాధారణ విద్యార్థినని, స్కాలర్‌షిప్‌పై సీఏ చేస్తున్నట్లు తెలిపాడు. 2017లో ఒక లక్ష పెట్టుబడితో స్టార్టప్‌ ప్రారంభించి పూర్తిగా విఫలమైనట్లు తెలిపారు. 

ఇక 2020 కోవిడ్‌ సమయంలో సీఏ ఫైనల్‌లో ఉన్నట్లు గుర్తుచేసుకున్నాడు. అయితే అది కరోనా టైం కావడంతో పరీక్ష వాయిదా పడిందని చెప్పుకొచ్చారు. దాంతో ఆన్‌లైన్‌ సర్వీస్‌ ఆధారిత వ్యాపారాన్ని ప్రారంభించాడు. అదేనండి ఇన్‌స్టాగ్రామ్ మార్కెటింగ్ ద్వారా ఒక్క రూపాయి పెట్టుబడి లేకుండా చేసే వ్యాపారం. అలా అతడు నెలకు 1 నుంచి రెండు లక్షలు సంపాదించడం ప్రారంభించాడు. 

అలా వెను తిరిగి చూడకుండా కోట్లు సంపాదించే రేంజ్‌కి వచ్చేశాడు. అంతేగాదు దుబాయ్‌ వంటి విదేశాల్లో కూడా తన కార్యకలపాలు ప్రారభించే స్థాయికి చేరుకున్నాడు. అది కూడా మంచి ఆదాయన్ని తెచ్చిపెట్టింది. ఇక్కడ అతడి అదృష్టం ఏంటంటే ఒక్క రూపాయి పెట్టుబడి పెట్టకుండానే సక్సెస్‌ అందుకుని అంచలంచెలుగా ఎదిగాడు. కేవలం తనకు వచ్చిన లాభాల్లో కొద్ది మొత్తం డబ్బు మాత్రమే పెట్టుబడి పెడుతూ..కోట్లు గడించాడు. 

ఒక్క సింగిల్‌ లోను లేకుండా పైకొచ్చానంటూ తన వ్యవస్థాపక జర్నీని షేర్‌ చేసుకున్నాడు. అయితే నెటిజన్లు అతడి పోస్ట్‌ని చూసి ప్రశంసిస్తూ..మీరు ఇప్పుడు హ్యాపీనేగా అని ప్రశ్నించగా..అందుకు ఆ వ్యక్తి చాలా మంచి ప్రశ్న వేశారంటూ సమాధాన మిచ్చాడు ఇలా. "అస్సలు సంతోషంగా లేను. ఒకప్పుడు చాలా ఉల్లాసంగా ఉండేవాడిని కానీ ఇప్పుడు ప్రతి నిమిషం టెన్షన్‌ పడుతున్నా. ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతున్నా. ప్రయాణాలు చేయలేకపోతున్నా. ఎక్కువ పనిగంటలు. 

ఇప్పుడు నా వద్ద కావల్సినంత డబ్బు ఉంది కానీ సంతోషించ లేకపోతున్నా. ఐతే తన తల్లిదండ్రులు తన సక్సెస్‌ని చూసి గర్వంగా ఫీలవుతున్నారు. అలాగే ఏ వస్తువు అయినా ఈజీగా కొనేయొచ్చు.. అన్నతం ధైర్యం గుండెల్లో ఉంది. డబ్బు కేవలం భద్రతనే ఇస్తుంది తప్ప సంతోషాన్ని ఇవ్వలేదని బాధగా బదులిచ్చాడు. 

అందుకు నెటిజన్లు మిత్రమా ఎందరో కలల ప్రపంచాన్ని నువ్వు సాకారం చేసుకోగలిగావు. అందుకు సంతోషం. పైగా వ్యాపారాన్ని నడిపంచే స్థాయికి చేరుకున్నావు. అంటే ఆర్థికంగా స్వతంత్రంగా ఉండగలవు. మంచి సంతోషాన్ని కూడా కచ్చితంగా పొందగలుగుతావు అని ఆశ్వీరదిస్తూ పోస్టులు పెట్టారు.  

(చదవండి: ఇష్టమైన గులాబ్‌ జామ్‌లు తింటూనే 40 కిలోలు బరువు తగ్గాడు!)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement