ఇష్టమైన గులాబ్‌ జామ్‌లు తింటూనే 40 కిలోలు బరువు తగ్గాడు! | Ashish Chanchalani Lost 40 kilos Without Giving Up Favourite Gulab Jamuns | Sakshi
Sakshi News home page

ఇష్టమైన గులాబ్‌ జామ్‌లు తింటూనే 40 కిలోలు బరువు తగ్గాడు!

Jul 14 2025 6:05 PM | Updated on Jul 14 2025 6:59 PM

Ashish Chanchalani Lost 40 kilos Without Giving Up Favourite Gulab Jamuns

అధిక బరువుని సులభంగా తగ్గించుకుని స్మార్ట్‌గా మారిన ఎన్నో స్ఫూర్తిదాయక కథలు విన్నాం. ఎన్నో విభిన్న డైట్‌లతో తేలిగ్గా కొలెస్ట్రాల్‌ని మాయం చేసుకుని ఫిట్‌గా మారారు. ఇక్కడున్న వ్యక్తి తనకిష్టమైన స్వీట్‌ని త్యాగం చేయకుండానే ఆరోగ్యకరమైన రీతీలో బరువు తగ్గి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. అస్సలు అదెలా సాధ్యమైదనేది అతడి మాటల్లోనే తెలుసుకుందామా..!

ప్రసిద్ధ యూట్యూబర్‌ ఆశిష్‌ చంచలానీకి ఎక్కువగా చిన్నారులు, యువకులు అతడి అభిమానులు. అతడు మంచి టైమింగ్‌ కామెడీకి ప్రసిద్ధి. అదే అతడికి వేలాది అభిమానులను సంపాదించి పెట్టింది. అలాంటి వ్యక్తి జస్ట్‌ ఆరు నెలల్లో 40 కిలోలు తగ్గాడు. ఒ​క్కసారిగా మారిన అతడి బాడీ ఆకృతి అదరిని ఫిదా చేసింది. అబ్బా అంతలా ఎలా బరువు తగ్గాడని ఏంటా డైట్‌ సీక్రెట్‌ అని ఆరా తీయడం ప్రారంభించారు. అయితే ఆశిష్‌ స్వయంగా ఆ సీక్రెట్‌ ఏంటో స్వయంగా వెల్లడించారు.  

నిజానికి ఆయన దగ్గర దగ్గరగా 130 కిలోలు పైనే బరువు ఉండేవాడు. తన 30వ పుట్టనరోజున తన ఆరోగ్యానికి ప్రాధానత ఇచ్చేలా స్మార్ట్‌గా మారిపోవాలని గట్టిగా తీర్మానం చేసుకున్నాడట. అయితే తన బరువు, ప్రకారం తనను తాను అద్దంలో చూసుకుంటే చాలా బాధగా అనిపించిందట. అలా అని నోరు కట్టేసుకునేలా ఆహారాన్ని పూర్తిగా తగ్గించలేడట ఆశిష్‌. దాంతో ఆహారాన్ని సర్దుబాటు చేసుకున్నాడట. అంటే..తనకు నచ్చిన ఆహారాన్ని వదులుకోకుండా క్రమబద్ధమైన జీవనశైలిని అనుసరిచడం అన్నమాట. 

తనకు నచ్చిన గులాబ్‌ జామ్‌లు ఆస్వాదిస్తూ డైట్‌ ఎలా తీసుకోవాలో ప్లాన్‌ చేసుకున్నారట. అందుకోసం ఫైబర్‌, ఆరోగ్యకరమైన కొవ్వులు, కార్బోహైడ్రేట్లు ఎంచుకున్నారు. తన ఆహారంలో తప్పనిసరిగా ప్రోటీన్‌ పుష్కలంగా ఉండేలా జాగ్రత్త పడేవాడట. ఫైబర్‌, కార్బోహైడ్రేట్లు తన డైట్‌ జాబితాలో చివరి ప్రాధాన్యత అని చెబుతున్నాడు ఆశిష్‌. 

డైట్‌ విధానం..

అల్పాహారం: ఆశిష్ కనీసం ఆరు ఉడికించిన గుడ్లు లేదా కొన్నిసార్లు వెరైటీగా ఆమ్లెట్, కాల్చిన మొలకలు తీసుకుంటాడు. 

లంచ్
ఆశిష్ భోజనంలో 200 గ్రాముల చికెన్‌తో పాటు ఒక రోటీ ఉండేది, సలాడ్ ఎక్కువగా దోసకాయ, సెలెరీ జ్యూస్‌తో ఉంటుంది.

స్నాక్స్
సాయంత్రం స్నాక్స్ కోసం, ఆశిష్ వ్యాయామం చేస్తున్నందున సాయంత్రం 6 గంటలకు క్రమం తప్పకుండా పాలవిరుగుడు ప్రోటీన్ తీసుకుంటాడు.

విందు
ఆశిష్ విందు కూడా ప్రోటీన్‌తో నిండి ఉండేది - రోటీ లేదా రైస్ వంటి కార్బోహైడ్రేట్లు లేకుండా గ్రిల్డ్ లేదా రోస్ట్ చేసిన చికెన్.  బర్న్ చేసే కేలరీల సంఖ్య, తినే కేలరీలను బ్యాలెన్స్‌ చేసుకుంటూ బరువు తగ్గారట. తింటున్న ప్రతిదాన్ని లెక్కించేవాడట.. అలా తన ప్లేట్‌ని చూడగానే ఎంత కేలరీల మొత్తంలో ఆహారం తీసుకోవాలో అర్థమయ్యేదట.

అప్పడప్పుడు చీట్‌మీల్‌..
ఆశిష్ తనకు బాగా ఇష్టమైన డెజర్ట్‌లు తినకుండా ఉండలేడట. అందుకనే టీ, గులాబ్ జామున్లు, రసమలై  వంటి స్వీట్లను వదులుకోలేదని చెప్పాడు. అయితే తన కేలరీలను కూడా పర్యవేక్షించడం ఎప్పటికీ మిస్‌ అయ్యేవాడు కాదట.

(చదవండి: ఆ నింగే పెళ్లికి సాక్ష్యం అంటూ ఆ జంట..!)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement