ఆ నింగే పెళ్లికి సాక్ష్యం అంటూ ఆ జంట..! | Sam Chui, an aviation influencer, celebrated his wedding On Sky | Sakshi
Sakshi News home page

ఆ నింగే పెళ్లికి సాక్ష్యం అంటూ ఆ జంట..!

Jul 14 2025 5:18 PM | Updated on Jul 14 2025 6:31 PM

Sam Chui, an aviation influencer, celebrated his wedding On Sky

భూమిపై అంగరంగ వైభవోపేతంగా వివాహాలు చేసుకోవడం చూశాం. ఇంకాస్త ముందుకెళ్తే..కొందరూ నీటి అడుగున వివాహం చేసుకున్న తంతును కూడా చూశాం. కానీ ఈ దంపతులు ఆకాశంలోనే మా పెళ్లి జరగాలని ఎలా ప్లాన్‌ చేసుకున్నారో తెలిస్తే ఆశ్చర్యపోతారు. వాహ్‌ ఏం వెడ్డింగ్‌ రా ఇది అని అంతా అనుకునేలా అంగరంగ వైభవంగా జరిగింది.

ఏవియేషన్ ఇన్‌ఫ్లుయెన్సర్‌ సామ్ చుయ్ తన పెళ్లి వేలాది అడుగుల ఎత్తులో ఆకాశంలో జరగాలని కోరుకున్నాడు. అందుకోసం అని ఫుజైరా అంతర్జాతీయ విమానాశ్రయం (FJR)లో చార్టర్డ్ బోయింగ్ 747-400 విమానాన్ని బుక్‌ చేసుకున్నాడు. ఎంచక్కా తన భార్య ఫియోనా, కొందరు దగ్గరి బంధువుతో కలసి విమానం ఎక్కి ఒమెన్‌ గల్ఫ్‌ మీదుగా ప్రయాణించారు. 

ఆ విమానంలో ముఖ్యమైన అతిథుల సమక్షంలో చుయ్‌ తన కాబోయే భార్య ఫియోనాని పరిణయమాడాడు. వాళ్లంతా ఆ జంటను అభినందిస్తూ..చుట్టూ చేరి ఆడుతూ, నృత్యం చేస్తూ ఎంజాయ్‌ చేశారు. ఆకాశమే హద్దుగా పెళ్లి చేసుకున్న ఈ జంట మరో నింగిని తలపించేలా తెల్లటి దుస్తులే ధరించడం విశేషం. 

ఈ వివాహ వేడుక మా జీవితాల్లో అత్యుత్తమమైన రోజుగా అభివర్ణిస్తూ..అందుకు సంబంధించిన వీడియోకి "మా ప్రేమ గాలిలో ఉంది. మా 747 స్కై వెడ్డింగ్ ఫ్లైట్‌కు స్వాగతం. మా ఇద్దరికి జీవితకాల జ్ఞాపకాలు" అనే క్యాప్షన్‌ని జత చేస్తూ నెట్టింట షేర్‌ చేశారు. కాగా సింగపూర్‌ ఎయిర్‌లైన్‌కి సంబంధించిన ఈ బోయింగ్‌ 747 విమానం జూలై 12, 2025న ఒమన్ గల్ఫ్ మీదుగా ప్రయాణించి, రాత్రి 8 గంటలకు ఫుజైరాకు తిరిగి వచ్చింది.

 

(చదవండి: 'మార్నింగ్‌ వాకింగ్‌' ఎందుకంటే..! థైరోకేర్‌ వేలుమణి ఆసక్తికర వివరణ)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement