పిలవని పేరంటానికి వస్తే జైలు, జరిమానా | Function Hall Warning Board | Sakshi
Sakshi News home page

పిలవని పేరంటానికి వస్తే జైలు, జరిమానా

Mar 10 2026 11:15 AM | Updated on Mar 10 2026 12:31 PM

Function Hall Warning Board

మహబూబాబాద్‌ జిల్లా: పెళ్లి, ఇతర శుభకార్యాలను తమ హోదాతోపాటు బంధుమిత్రులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసుకునేందుకు ఫంక్షన్‌హాల్‌ను ఎంచుకుంటారు. ముక్కూమొహం తెలియని వారు ఫంక్షన్‌కు రావడం వల్ల అతిథులు ఇబ్బంది పడడం, చివరగా భోజనం పెట్టలేని పరిస్థితి వస్తుండడంతో ఆ ఫంక్షన్‌హాల్‌కు పెద్దగా గిరాకీ ఉండకపోవడంతో ఆ యజమాని వినూత్నంగా ఆలోచించాడు.

 ‘ఫంక్షన్‌కు సంబంధం లేని వ్యక్తులు లోనికి వచ్చి పట్టుబడితే సెక్షన్‌ 441 ప్రకారం 3 నెలల జైలుశిక్ష, రూ.5 వేల జరిమానా’అంటూ ఫంక్షన్‌హాల్‌ ముందు ఫ్లెక్సీ పెట్టాడు. మహబూబాబాద్‌ జిల్లాకేంద్రంలోని ఓ ఫంక్షన్‌హాల్‌ వద్ద ఏర్పాటు చేసిన ఆ ఫ్లెక్సీ సామాజిక మాధ్యమాల్లో వైరలైంది. ‘ఎవరైనా పిలవని పేరంటానికి వెళ్లకండి.. భోజనం లాగిద్దామని వెళ్తే..లాగి లోపలేస్తారు.. తస్మాత్‌ జాగ్రత్త’అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.  

వృథాగాగోదావరి జలాలు 
ఎయిర్‌ వాల్వ్‌ ఓపెన్‌ చేసిన గుర్తు తెలియని వ్యక్తులు 

చేర్యాల (సిద్దిపేట): గోదావరి జలాలు వృథాగా పోతున్నాయి. తపాసుపల్లి రిజర్వాయర్‌లోకి నీటిని పంపింగ్‌ చేసే పైప్‌లైన్‌ ఎయిర్‌ వాల్‌్వను గుర్తుతెలియని వ్యక్తులు ఓపెన్‌ చేశారు. దీంతో గోదావరి జలాలు పెద్దఎత్తున వృథాగా పొలాల్లోకి వెళ్తున్నాయి. ఈ సంఘటన సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం చుంచనకోట గ్రామ శివారులో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. రాత్రి సమయం కావడం వల్ల దేవాదులకు సంబంధించిన అధికారులు అందుబాటులో లేకపోవడంతో నీటి వృథా కొనసాగుతూనే ఉంది.  

Advertisement
 
Advertisement
Advertisement