
ఇటీవలకాలంలో ప్రజల్లో ఆరోగ్య స్పృహ ఎక్కువైంది. అంతా తమ ఫిట్‌నెస్‌కి తొలి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆ నేపథ్యంలో కొందరు వాకింగ్, యోగా, జిమ్ వంటి ఇతరత్రా వర్కౌట్లు చేసేస్తున్నారు. అయితే కొందరు మాత్రం చాలా టెన్షన్‌గా పొద్దుపొద్దునే వాకింగ్‌కి వెళ్లిపోతుంటారు. ఎంతలా అంటే..ఒక్కరోజు వాకింగ్ మిస్ అయితే ఏదో పోయినట్లుగా గాభర పడిపోతుంటారు. అయితే అంతలా వాకింగ్ చేసేవాళ్లంతా ఆరోగ్యం కోసమేనా అన్న సందేహాన్ని లెవెనత్తారు శాస్త్రవేత్త-థైరోకేర్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు ఎ వేలుమణి. ఆయన దీనిపై స్వయంగా మూడేళ్లు అధ్యయనం చేసినట్లు కూడా వివరించారు. అలా ఉదయమే నడవడానికి వెనుకున్న ప్రధాన కారణాలేంటో సోషల్ మీడియో పోస్ట్‌లో చాలా ఆసక్తికరంగా చెప్పుకొచ్చారు.
కోయంబత్తూరులోని మూడు పార్కులలో ఉదయం నడిచేవారిపై అధ్యయనం చేశారట. దాదాపు 100 నుంచి 500 మీటర్లు వాకింగ్‌కి వెళ్లే వారందరిపై ఆయన అధ్యయనం చేశానన్నారు. అయితే అది ఫిట్‌నెస్ కాదు, క్రమశిక్షణ అంతకంటే కాదట. మరేంటంటే..ఇది హార్మోన్ల ప్రేరేపిత నడకగా తేల్చేశారాయన. అంతేగాదు ఉదయం పబ్లిక్ పార్కుల్లో వాకింగ్ చేసేవారందర్నీ మూడు గ్రూప్‌లుగా వర్గీకరించి మరి దాని వెనుకున్న కారణాలను వెల్లడించారు.
మొదటి రకం..
వేలుమణి గమనించి వ్యక్తుల్లో దాదాపు 20% మంది వివిధ వయసుల వారిగా వేగంగా నడవడం, లేదా పరుగెత్తడంలో చాలా యాక్టివ్‌గా నిమగ్నమై ఉన్నవారు. ఇది కొనితెచ్చుకున్న బలవంతంపై చేసున్న వాకింగ్ అట. వారంతా శ్రేయోభిలాషులు, ఆరోగ్య నిపుణులు మార్గనిర్దేశం ప్రకారం లక్ష్యం ఆధారిత వ్యక్తులట. శారరీక రూపం, ఫిట్‌నెస్‌కి కేరాప్ అడ్రస్‌గా స్ఫూర్తినిచ్చే కేటగిరి వ్యక్తులే వీరు అని చెప్పారు.
రెండో రకం..ఆరోగ్య స్ప్రుహతో..
40 ప్లస్‌లో వైద్య అవసరం రీత్యా తప్పక వాకింగ్ చేసే కేటగిరికి చెందినవారట. వీరంతా, టైప్ 2 డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక సమస్యలతో వాక్ చేసే వ్యక్తులట. అంటే వీళ్లంతా స్వచ్ఛందంగా నడక కోసం వచ్చిన వాళ్లు కాదని "హర్మోన్ల బందీలు"గా వ్యాఖ్యానించారు.
ప్రేమ పక్షులు..
ఇక మిగతా సముహం 18 నుంచి 22 ఏళ్ల వయస్సు గల యువ జంటల సముహం. ఉదయం పార్కుల్లో వాకింగ్ చేసేవాళ్లలో దాదాపు 30 శాతం యువత కూడా ఉన్నట్లు తెలిపారు. అయితే వాళ్లు ఫిట్‌నెస్ లేదా వైద్య పరిస్థితి వంటి కారణాలతో నడవడం లేదని చెప్పారు.
కేవలం వాళ్లు పార్కు మూలల్లో నిశబ్దంగా కూర్చొని గడిపేందుకు వస్తుంటారని అన్నారు. ఇది కూడా హార్మోన్ల బలవంతమే అని పేర్కొన్నారు. ఎందుకంటే యుక్త వయసులో సహజంగా వచ్చే ఫీలింగ్స్‌కి కారణం హార్మోన్ల ప్రభావమనే ఉద్దేశ్యంతో వేలుమణి ఆ విధంగా వ్యాఖ్యానించారు. చివరగా తాను చేసిన ఈ అధ్యయనంలో 80% మంది ఆరోగ్యం లేదా జీవనశైలిలో భాగంగా చేయలేదు.
కేవలం హర్మోన్ల ప్రభావం కారణంగానే చేసిన వాకింగ్ అని అన్నారు. ఎందుకంటే ఆ మూడు రకాల వ్యక్తుల సముహం..“లుకింగ్, డయాబెటిస్, ప్రేమ తదితర మూడు కారణాలతో వాకింగ్ చేస్తున్న వారు. ఇవన్ని హర్మోన్లతో లింక్ అప్ అయ్యి ఉన్నాయి కాబట్టి ఇది ఫిట్‌నెస్ కోసం చేసిన వాకింగ్ కాదు..హార్మోన్లతో ప్రేరేపించబడిన నడక అని పేర్కొన్నారు వేలుమణి.
(చదవండి: సిగరెట్టు ప్యాకెట్లపై ఉన్నట్లుగా ఆ చిరుతిండ్లపై హెల్త్ వార్నింగ్ మెసేజ్..!)