Velumani
-
'గారాబం చేస్తే ఇలా అవుతుందా'..? థైరోకేర్ వ్యవస్థాపకుడి అద్భుతమైన పేరెంటింగ్ పాఠం
అతిగారాబం ఎన్నటికీ అనర్థమే అని మన పెద్దలు చెబుతుంటారు. పిల్లల్ని ముద్దు చేయాల్సినప్పుడూ ముద్దు చేయాలి, బాధ్యతయుతంగా ప్రవర్తించకపోతే గట్టిగా మందలించాలి కూడా. రెండూ సమతూకంలో ఉండాలి లేదంటే..ఎందుకు పనికిరానివారుగా తయారవుతారని హెచ్చరిస్తున్నారు థైరోకేర్ వ్యవస్థాపకుడు. గారాబం వల్ల చిన్నారులు పాడైపోవడమే గాక అది మొత్తం కుటుంబాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో..తెలియజేసే అద్భుతమైన రియల్ స్టోరీని షేర్ చేసుకున్నారు థైరోకేర్ వ్యవస్థాపకుడు డాక్టర్ ఏ. వేలుమణి. మంచి పేరేంటింగ్ కుటుంబానికి ఎలా శ్రీరామరక్షలా ఉంటుందో హైలెట్ చేసి మరీ చెప్పారు. మరీ కథేంటో చూద్దామా..!1980ల ప్రారంభంలో, డాక్టర్ వేలుమణి BARC(బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్)లో ఉద్యోగం చేసేవారట. ఆ సంపాదనతో తన కుటుంబాన్ని పోషించడం కష్టంగా ఉండేదట. దాంతో మరోవైపు ట్యూషన్లు కూగా చెప్పేవారట వేలుమణి. తన ఇంటికి సమీపంలో శివాజీ పార్క్‌లో నివసిస్తున్న ఒక ధనవంతురాలైన మార్వారీ మహిళ ద్వారా ఆయనకు ట్యూషన్ చెప్పే అవకాశం లభించింది. ఆమె తన కొడుకు నాల్గవ తరగతి చదువుతున్నాడని, అతనికి ట్యూషన్ చెప్పాల్సిందిగా వేలుమణిని కోరారట. తన కొడుకుకి చదువు రావడమే ముఖ్యం అని ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదని వేలుమణికి చెప్పారామె. ఇప్పటికే నలుగురు ట్యూటర్ల మార్చామని అయినా మా అబ్బాయికి చదువు మాత్రం అబ్బలేదని కూడా వాపోయిందట. చదువు వచ్చేలా చేయాలిగానీ, మా అబ్బాయి సంతోషానికి ఆటంకం ఉండకూడదనే షరతు విధించిందట ఆ తల్లి. అయితే వేలుమణి మంచి జీతం వచ్చే ఈ అవకాశాన్ని వదులుకోకూడదని ఆ అబ్బాయికి ట్యూషన్ చెప్పేందుకు అంగీకరించారట. కానీ ఆ పిల్లవాడి సంతోషంగా ఉంచేలా పాఠాలు చెప్పడం అనేది కష్టం. ఎందుకంటే..చదువు రావాలంటే ఒక్కొసారి కష్టపెట్టక తప్పదు. అయితే ఆ తల్లి షరతు మేరకు ఆ కుర్రాడికి అలరించేలా కథలు చెబుతూ పాఠాలు చెప్పే యత్నం చేసేవారు వేలుమణి. సంతోషంగా ఉండేలా చూడాలి కాబట్టి ఏవిధంగా బలవంతం చేయడానికి వీలులేదు. అందువల్ల వేలుమణి హాస్యభరితమైన కథలతో చదువుపై ఆసక్తికలిగేలా చేశారు. అది చూసి ఆ పిల్లాడి తల్లి వేలుమణి జీతాన్ని నెలకు రూ. 300 నుంచి రూ. 600లకు పెంచేసింది. బార్క్‌లో సంపాదించిన దానికంటే అధిక జీవితం, పైగా ప్రయాణపు ఛార్జీలు కూడా ఆ తల్లే చెల్లించేదట. అయితే అతడికి నేర్పించాల్సిన చదువును నేర్పించలేకపోతున్న అనే అపరాధభావం కలిగి మానేయాలనుకున్నారట వేలుమణి. కానీ ఆ కుటుంబం మరింత జీతం పెంచి తన పిల్లాడికి చదువు చెప్పాల్సిందిగా బలవంతం చేశారు. దీంతో ఆయన అలా 1983 నుంచి 1984 వరకు అతడికి ట్యూసన్ చెప్పడం కొనసాగించారు. అంతేగాదు ఆ అదనపు డబ్బుతో తన ఆరోగ్యానికి, ఆంగ్లంలో పట్టు సాధించడానికి వినియోగించుకున్నాడట. అయితే ఆ బాలుడికి శతవిధాల చదువు నేర్పించే యత్నం చేసినా..ఏం నేర్చుకోలేకపోయాడట. చివరికీ..కనీసం ఇంటర్మీడియట్ కూడా ఉత్తీర్ణుడు కాలేకపోయాడు. ఆ తర్వాత వేలుమణి కూడా ట్యూటర్‌గా కొనసాగడం మానేయడం వంటివి జరిగాయి. అలా దశాబ్దాలు గడిచాక.. అనూహ్యమైన మలుపు తిరిగింది. ఆ సంపన్న కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో పడింది. అనుకోని విధంగా డాక్టర్ వేలుమణి భార్య చివరికి అదే బాలుడికి థైరోకేర్‌లో హార్డ్‌వేర్ టెక్నీషియన్‌గా ఉద్యోగం ఇచ్చింది. ఈ అనుభవాన్ని గుర్తుచేసుకుంటూ..ఆ తల్లి తన కొడుకు ఏ కష్టం తెలియకుండా పెరగాలనుకుంది..అదే చివరికి కుటుంబానికి శాపంగా మారిపోయింది. అంతేగాదు కుటుంబం ఆర్థిక సమస్యల్లో ఉన్నప్పుడూ.. కొడుకు ఆసరాగా నిలవలేని దుస్థితిని ఎదుర్కొనాల్సి వచ్చిందామెకు. గారం తెచ్చిపెట్టే అనర్థం ఇలా ఉంటుంది. పరిస్థితులు తారుమారైనప్పుడూ..కష్టపడక తప్పదని ఆ తల్లి చెప్పలేకపోయింది, పైగా ఆ పిల్లాడు తెలుసుకోలేడు కూడా. ఇక్కడ పిల్లల్ని క్రమశిక్షణాయుతంగా పెంచడం అనేది గొప్ప పేరేంటింగ్కి సంకేతం. దాన్ని చాలా జాగురకతతో నిర్వహించాలి. అదే భవిష్యత్తులో కుటుంబ ఉన్నతికి దోహదపడుతుందని నొక్కి చెప్పారు వేలుమణి. నెట్టింట షేర్ చేసిన ఈ పోస్ట్ ..ప్రతి నెటిజన్ మనసుని దోచుకుంది. సార్ ఇది మంచి స్ఫూర్తిదాయకమైన కథ అని డాక్టర్ వేలుమణిని ప్రశంసించారు. చివరగా వేలుమణి తల్లిదండ్రుబంగా పెంచకండి, విలాసవంతంగా పెరగాలని కోరుకోవద్దని..నేటి కాలానికి అస్సలు పనికిరాదని వ్యాఖ్యానించారు.This tweet and the pics reminded me my luck in early 80s. Thanks to @howto9to5 I had a BARC job, good salary but was not enough to support my big family back home. I wanted to send more money home and wanted to earn more by doing tuitions while working in BARC. A filthy rich… https://t.co/Mi5mkR6ocT pic.twitter.com/mkAgrqVXtz— Dr. A. Velumani.PhD. (@velumania) May 6, 2025(చదవండి: Parenting Tips: చిన్నారులకు ఈ వేసవిలో సేవ చేయడం నేర్పిద్దాం ఇలా..!) -
ఒకప్పుడు చెప్పులు కొనలేని స్థితి!.. నేడు రూ.3000 కోట్ల సామ్రాజ్యం
ఒక వ్యక్తి సక్సెస్ సాధించాడు అంటే.. దాని వెనుక ఓ యుద్ధమే జరిగి ఉంటుంది. అయితే ఈ మాట అందరికి వర్తించకపోవచ్చు. తాతలు, తండ్రుల ఆస్తులతో కుబేరులైనవారు కొంతమంది ఉంటే.. అప్పులు చేసి, కష్టపడి పైకొచ్చినవారు మరికొందరు ఉన్నారు. ప్రారంభం నుంచి ఎన్నో ఆటుపోట్లను అధిగమించి.. వేలకోట్ల సామ్రాజ్యాన్ని స్థాపించిన 'థైరోకేర్ టెక్నాలజీస్' ఫౌండర్ 'వేలుమణి' గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.1959లో తమిళనాడులోని కోయంబత్తూరు సమీపంలోని అప్పనైకెన్‌పట్టి పుదూర్ గ్రామంలో వేలుమణి జన్మించారు. ఆయన తండ్రికి వ్యవసాయ భూమి కూడా లేదు. దీంతో కుటుంబ పోషణకు గేదెల పెంపకాన్ని ఎంచుకుని, వాటిద్వారా వచ్చిన పాలను అమ్మి కుటుంబాన్ని పోషించేవారు. అయితే పిల్లలకు బట్టలు, చెప్పులు వంటివాటిని కొనుగోలు చేయడానికి కూడా వేలుమణి తండ్రి చాలా కష్టపడ్డాడు.ఎన్ని కష్టాలు ఎదురొచ్చినా వేలుమణి చిన్నప్పటి నుంచే దృఢంగా ఉన్నారు. ప్రాధమిక విద్యను అప్పనాయికెన్‌పట్టి పూదూర్‌లో, ఆ తరువాత మద్రాస్ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న రామకృష్ణ మిషన్ విద్యాలయం నుంచి డిగ్రీ పూర్తి చేశారు. 1955లో థైరాయిడ్ బయోకెమిస్ట్రీలో డాక్టర్ డిగ్రీ పొందారు. థైరోకేర్ ప్రారంభించడానికి ముందు, ఈయన భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్ ముంబైలో 15 సంవత్సరాలు పనిచేశారు.వేలుమణి న్యూక్లియర్ హెల్త్‌కేర్ లిమిటెడ్ ఎండీగా కూడా పని చేశారు. ఉద్యోగం చేస్తున్న రోజుల్లోనే ఆంకాలజీ, రేడియాలజీ వంటి వాటిలో ఉపయోగించే టెక్నాలజీలను గురించి తెలుసుకోవడం ప్రారంభించారు.వేలుమణి 1996లో తన స్వంత థైరాయిడ్ టెస్టింగ్ లాబొరేటరీ, థైరోకేర్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగానే డయాగ్నస్టిక్ లాబొరేటరీలో ఫ్రాంఛైజీ మోడల్‌ను ప్రవేశపెట్టాడు. అనుకున్న విధంగా ముందుకు సాగుతున్న సమయంలో స్టార్టప్ ఇన్వెస్ట్మెంట్లో ఏకంగా రూ.1400 కోట్ల నష్టాలను చూడాల్సి వచ్చింది. అయినప్పటికీ ఏ మాత్రం వెనుకడుగు వేయకుండా ముందుకు సాగారు.థైరోకేర్ టెక్నాలజీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ నేడు రూ.3300 కోట్లుగా ఉంది. నా మొదటి 24 సంవత్సరాల మనుగడ నా తల్లి పొదుపు వల్ల, నా వ్యాపార విజయం నా భార్య పొదుపు వల్ల సాధ్యమైందని ఓ సందర్భంలో వేలుమణి చెప్పుకున్నారు. బాల్యం నుంచే కష్టాలు చూసి.. జీవితంలో స్థిరపడాలని ఉద్దేశ్యంతో కష్టపడి వేలకోట్ల సంపదను సృష్టించారు. వేలుమణి నాయకత్వంలో థైరోకేర్ భారతదేశం, నేపాల్, బంగ్లాదేశ్, మధ్యప్రాచ్య దేశాల్లో సుమారు 1000 కంటే ఎక్కువ అవుట్లెట్లను కలిగి ఉంది.ఇదీ చదవండి: రూ.3 లక్షల అప్పుతో రూ.1300 కోట్లు సంపాదన.. అసిన్ భర్త సక్సెస్ స్టోరీ -
ఏసీబీ కొరడా: మాజీ మంత్రి చుట్టూ బిగుస్తున్న ఉచ్చు
సాక్షి ప్రతినిధి, చెన్నై: గత ప్రభుత్వ అవినీతిపై ఏసీబీ ఝుళింపించిన కొరడా ఉచ్చు.. మాజీ మంత్రి ఎస్పీ వేలుమణి చుట్టూ గట్టిగా బిగుస్తోంది. చెన్నై, కోయంబత్తూరు కార్పొరేషన్లలో రూ.811 కోట్ల టెండర్ల కేటాయింపులో అక్రమాలకు పాల్పడినట్లు ఏసీబీ అధికారులు ఇటీవల జరిపిన దాడుల ద్వారా నిర్ధారించుకున్నారు. వేలుమణి, సహా ఏడుగురిపై, 10 కార్యాలయాలపై కేసులు పెట్టారు. ఈ అక్రమాల వెనుక ఉన్నతాధికారుల హస్తం కూడా ఉందని ఏసీబీ అనుమానిస్తోంది. గత అన్నాడీఎంకే ప్రభుత్వంలో మంత్రులు అనేక అవినీతి, అక్రమాలకు పాల్పడినట్లుగా డీఎంకే అధ్యక్షుడిగా స్టాలిన్ ఆరోపించడంతోపాటూ విచారణ జరపాల్సిందిగా గవర్నర్‌కు అప్పట్లో వినతిపత్రం సమర్పించారు. కొందరు డీఎంకే అగ్రనేతలు అవినీతి నిరోధకశాఖకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం పట్టించుకోనందున డీఎంకే నేతలు కోర్టుకెక్కడంతో న్యాయస్థానం అదేశాలతో ఏసీబీలో కదలిక వచ్చింది. అంతేగాక స్టాలిన్ అధికారంలోకి వచ్చిన తరువాత అన్నాడీఎంకే ప్రభుత్వంలో చోటుచేసుకున్న అవినీతిపై దృష్టి సారించారు. గతంలో డీఎంకే అగ్రనేతలు ఇచ్చిన ఫిర్యాదుపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. ఇందులో భాగంగా మాజీ మంత్రి వేలుమణి ఇళ్లు, కార్యాలయాల్లో ఏసీబీ దాడులు జరిగాయి. వేలుమణి బినామీగా భావిస్తున్న కేసీపీ మేనేజింగ్ డైరక్టర్ చంద్రప్రకాష్‌కు చెందిన ఎంశాండ్ క్వారీ కార్యాలయం నుంచి రెండు సంచుల నిండా డాక్యుమెంట్లను ఏసీబీ స్వాదీనం చేసుకున్నట్లు సమాచారం. అంతేగాక వేలుమణి, తదితరుల బ్యాంకు ఖాతాలు, లాకర్లను ఏసీబీ అధికారులు సీజ్ చేశారు. మంత్రి హోదాలో వేలుమణి అక్రమాలకు అండగా నిలిచిన అధికారులను విచారించి ఎఫ్ఐఆర్లో చేర్చాలని ఏసీబీ నిర్ణయించుకున్నట్లు సమాచారం. -
మాజీ మంత్రి ఎస్పీ వేలుమణి ఇంట్లో సోదాలు
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే నేత, మాజీ మంత్రి ఎస్పీ వేలుమణికి సంబంధించిన ఇళ్లు, సంస్థలే లక్ష్యంగా మంగళవారం తమిళనాడులో 60 చోట్ల డైరెక్టరేట్ ఆఫ్ విజిలెన్స్ అండ్ యాంటీకరప్షన్ (డీవీఏసీ) సోదాలు నిర్వహించింది. ఆయన సన్నిహితులు, బంధువుల ఇళ్లలోనూ దాడులు జరిగాయి. వేలుమణితో సహా 17 మందిపై డీవీఏసీ కేసుల్ని నమోదు చేసింది. డీఎంకే సర్కారు అధికారంలోకి వచ్చిన అనంతరం గత నెల అన్నాడీఎంకేకు చెందిన రవాణాశాఖ మాజీ మంత్రి ఎంఆర్ విజయభాస్కర్‌పై ఐటీ దాడులు జరిగాయి. ప్రస్తుతం నగరాభివృద్ధి శాఖ మాజీ మంత్రి ఎస్పీ వేలుమణి టార్గెట్‌గా కోయంబత్తూరులో 42 చోట్ల, చెన్నైలో 16 చోట్ల, దిండుగల్, కాంచీపురంలలో తలా ఓ చోట డీవీఏసీ అధికారులు తనిఖీలు చేపట్టారు. గతంలో చెన్నై , కోయంబత్తూరు కార్పొరేషన్లలో రూ. 810 కోట్ల టెండర్లలో అక్రమాలు జరిగినట్లు, మంత్రి , ఆయన సన్నిహితులు ఆదాయానికి మించి ఆస్తులు గడించినట్లు దర్యాప్తులో స్పష్టం కావడంతో డీవీఏసీ ఈ దాడులు చేసింది. వేలుమణి, ఆయన సోదరుడు అన్భరసన్, సన్నిహితుడు చంద్రశేఖర్, గతంలో అసిస్టెంట్ కమిషనర్‌గా పనిచేసిన మధురాంతకీ, చెన్నై కార్పొరేషన్ ప్రధాన ఇంజినీరు నందకుమార్, మాజీ ఇంజినీరు పుగలేంది ఇళ్లల్లోనూ సోదాలు జరిగాయి. కాగా దాడులను నిరసిస్తూ అన్నాడీఎంకే వర్గాలు పలుచోట్ల ఆందోళన నిర్వహించాయి. -
సీఎం జగన్‌ను కలిసిన తమిళనాడు మంత్రులు
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని బుధవారం తమిళనాడు మంత్రులు కలిశారు. ఈ సందర్భంగా రెండు రాష్ట్రాల మధ్య నదుల అనుసంధానంపై చర్చ జరిగింది. ఈ భేటీలో తమిళనాడు మంత్రులు ఎస్పీ వేలుమణి (మున్సిపల్ అండ్ రూరల్ డెవలప్మెంట్), డి.జయకుమార్ (ఫిషరీస్ అండ్ అడ్మినిస్ట్రేషన్ రిఫార్మ్స్) పాల్గొన్నారు. -
మంత్రి వేలుమణి ఫిర్యాదు.. స్టాలిన్‌పై కేసు
సాక్షి, చెన్నై: డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌పై కొయంబత్తూర్ జిల్లా పోలీసులు కేసు నమోదు చేశారు. తన పరువుకు భంగం కలిగిస్తూ స్టాలిన్ అనవసర అభియోగాలు చేశారని తమిళనాడు మంత్రి ఎస్పీ వేలుమణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో స్టాలిన్‌పై ఐపీసీ 153 (ఏ) సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కోయంబత్తూర్ జిల్లాలోని తొండముతుర్లో నిర్వహించిన ర్యాలీలో స్టాలిన్ మాట్లాడుతూ.. ‘మంత్రి వేలుమణి పలు ప్రభుత్వ కాంట్రాక్ట్‌లను తన కుటుంబానికే దక్కేలా చూశారు. డీఎంకే ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఆయనను జైలుకు పంపుతాం. వేలుమణి అవినీతికి సంబంధించిన ఆధారాలు మా దగ్గరున్నాయి. వాటిని ఇప్పుడే అవినీతి నిరోధక శాఖకు ఇచ్చే ఉద్దేశం మాకు లేదు. డీఎంకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే, వివరాలను డీవీఏసీ (డైరెక్టర్ ఆఫ్ విజిలెన్స్ అండ్ కరప్షన్)కు అందిస్తామ’ని అన్నారు. -
బోర్లపై ఆంక్షలు
సాగు, తాగునీరు కోసం ఎక్కడబడితే అక్కడ బోరు బావులు తవ్వడం ఇక కుదరదు. బోర్లకు ప్రభుత్వం అనుమతి తప్పనిసరి. అనుమతి లేకుండా బోర్లు వేసే వారికి ఏడేళ్ల వరకు జైలు శిక్ష విధించేలా సోమవారం నాటి అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి వేలుమణి ముసాయిదాను ప్రవేశపెట్టారు. చెన్నై, సాక్షి ప్రతినిధి : ఎండిపోతున్న పంటను కాపాడుకోవాలనే ఆతృతలో రైతన్నలు తమ వ్యవసాయ భూములో బోర్లు తవ్వడం పరిపాటి. నిబంధనల ప్రకారం, భూగర్భ జలశాఖ ద్వారా ముందుగా సర్వే చేయించి, నీళ్లు ఎక్కడపడతాయో తెలుసుకుని తరువాత బోరుబావులను తవ్వాల్సి ఉంటుంది. అయితే ఇందులోని జాప్యాన్ని, అధికారుల ఖర్చును భరించే స్తోమత లేని రైతులు తమకున్న అరకొర పరిజ్ఞానాన్ని వినియోగించి బోర్లు తవ్వేస్తారు. నీరు పడని పక్షంలో పలు చోట్ల తవ్వుకుంటూ పోతారు. అయితే నీళ్లుపడని బోర్లను అలాగే వదిలేస్తుంటారు. ఈ బారుబావుల్లో చిన్నారులు జారి పడిపోవడం, ప్రాణాలు కోల్పోవడం వంటి సంఘటనలు రాష్ట్రంలో ఎన్నో చోటుచేసుకున్నాయి. బోరులో పడిన చిన్నారిని రక్షించేందుకు వివిధ శాఖల అధికారులు లక్షలాది రూపాయలను వెచ్చించి రాత్రింబవళ్లూ శ్రమించాల్సి వస్తోంది. అనేక సార్లు శ్రమ వృథాగా మారి తల్లిదండ్రులకు కడుపుకోతనే మిగులుస్తోంది. ఇలాంటి సంఘటనలు ఎన్ని జరుగుతున్నా ప్రజల్లో మాత్రం చైతన్యం రాకపోవడంతో సంఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయి. అనుమతి మీరితే జైలే చర్యలు చేపడితే గానీ ప్రజల్లో మార్పురాదని ప్రభుత్వం భావిస్తోంది. బోరు ప్రమాదాలు జరిగినపుడల్లా ప్రభుత్వం అనేక హెచ్చరికలు చేస్తోంది. ఖాళీ బోర్లు ఎక్కడ కనపడినా పూడ్చివేయాలని, తవ్వకం పనులు జరుగుతున్న సమయంలో బోరు రంధ్రాలకు గట్టిమూతలు వేయాలని, చిన్నారులను ఒంటరిగా వదలరాదని ఇలా సామధాన, భేద పద్దతుల్లో అనేక జాగ్రత్తలు చెబుతూనే ఉంది. ఇక దండోపాయమే మిగిలిందన్నట్లుగా అసెంబ్లీలో ముసాయిదాను ప్రవేశపెట్టింది. సాగు, తాగునీటి వనరుల కోసం బోర్లు, బావులు తవ్వాలంటే ముందుగా ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవాలి. ఆ తరువాత అధికారులు సర్వే చేసి తగిన స్థలాన్ని నిర్ణయిస్తారు. పనులు జరుగుతున్న సమయంలో జాగ్రత్తలు తీసుకుంటారు. దురదృష్టవశాత్తు నీళ్లుపడని పక్షంలో ఆ బోరును వెంటనే పూడ్చివేస్తారు. అనుమతి పొందకుండా తవ్వకాలకు పాల్పడితే ఐపీసీ 143 ఏ లేదా ఐపీసీ 143 బీ సెక్షన్ల కింద కేసులు బనాయించి కనిష్టం 3 ఏళ్లు, గరిష్టం 7 ఏళ్ల జైలు శిక్ష, రూ.50వేల జరిమానా చెల్లించాలని చట్టం తెస్తున్నారు.