
అతిగారాబం ఎన్నటికీ అనర్థమే అని మన పెద్దలు చెబుతుంటారు. పిల్లల్ని ముద్దు చేయాల్సినప్పుడూ ముద్దు చేయాలి, బాధ్యతయుతంగా ప్రవర్తించకపోతే గట్టిగా మందలించాలి కూడా. రెండూ సమతూకంలో ఉండాలి లేదంటే..ఎందుకు పనికిరానివారుగా తయారవుతారని హెచ్చరిస్తున్నారు థైరోకేర్ వ్యవస్థాపకుడు. గారాబం వల్ల చిన్నారులు పాడైపోవడమే గాక అది మొత్తం కుటుంబాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో..తెలియజేసే అద్భుతమైన రియల్ స్టోరీని షేర్ చేసుకున్నారు థైరోకేర్ వ్యవస్థాపకుడు డాక్టర్ ఏ. వేలుమణి. మంచి పేరేంటింగ్ కుటుంబానికి ఎలా శ్రీరామరక్షలా ఉంటుందో హైలెట్ చేసి మరీ చెప్పారు. మరీ కథేంటో చూద్దామా..!
1980ల ప్రారంభంలో, డాక్టర్ వేలుమణి BARC(బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్)లో ఉద్యోగం చేసేవారట. ఆ సంపాదనతో తన కుటుంబాన్ని పోషించడం కష్టంగా ఉండేదట. దాంతో మరోవైపు ట్యూషన్‌లు కూగా చెప్పేవారట వేలుమణి. తన ఇంటికి సమీపంలో శివాజీ పార్క్‌లో నివసిస్తున్న ఒక ధనవంతురాలైన మార్వారీ మహిళ ద్వారా ఆయనకు ట్యూషన్ చెప్పే అవకాశం లభించింది.
ఆమె తన కొడుకు నాల్గవ తరగతి చదువుతున్నాడని, అతనికి ట్యూషన్ చెప్పాల్సిందిగా వేలుమణిని కోరారట. తన కొడుకుకి చదువు రావడమే ముఖ్యం అని ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదని వేలుమణికి చెప్పారామె. ఇప్పటికే నలుగురు ట్యూటర్ల మార్చామని అయినా మా అబ్బాయికి చదువు మాత్రం అబ్బలేదని కూడా వాపోయిందట. చదువు వచ్చేలా చేయాలిగానీ, మా అబ్బాయి సంతోషానికి ఆటంకం ఉండకూడదనే షరతు విధించిందట ఆ తల్లి.
అయితే వేలుమణి మంచి జీతం వచ్చే ఈ అవకాశాన్ని వదులుకోకూడదని ఆ అబ్బాయికి ట్యూషన్ చెప్పేందుకు అంగీకరించారట. కానీ ఆ పిల్లవాడి సంతోషంగా ఉంచేలా పాఠాలు చెప్పడం అనేది కష్టం. ఎందుకంటే..చదువు రావాలంటే ఒక్కొసారి కష్టపెట్టక తప్పదు. అయితే ఆ తల్లి షరతు మేరకు ఆ కుర్రాడికి అలరించేలా కథలు చెబుతూ పాఠాలు చెప్పే యత్నం చేసేవారు వేలుమణి.
సంతోషంగా ఉండేలా చూడాలి కాబట్టి ఏవిధంగా బలవంతం చేయడానికి వీలులేదు. అందువల్ల వేలుమణి హాస్యభరితమైన కథలతో చదువుపై ఆసక్తికలిగేలా చేశారు. అది చూసి ఆ పిల్లాడి తల్లి వేలుమణి జీతాన్ని నెలకు రూ. 300 నుంచి రూ. 600లకు పెంచేసింది. బార్క్‌లో సంపాదించిన దానికంటే అధిక జీవితం, పైగా ప్రయాణపు ఛార్జీలు కూడా ఆ తల్లే చెల్లించేదట. అయితే అతడికి నేర్పించాల్సిన చదువును నేర్పించలేకపోతున్న అనే అపరాధభావం కలిగి మానేయాలనుకున్నారట వేలుమణి.
కానీ ఆ కుటుంబం మరింత జీతం పెంచి తన పిల్లాడికి చదువు చెప్పాల్సిందిగా బలవంతం చేశారు. దీంతో ఆయన అలా 1983 నుంచి 1984 వరకు అతడికి ట్యూసన్ చెప్పడం కొనసాగించారు. అంతేగాదు ఆ అదనపు డబ్బుతో తన ఆరోగ్యానికి, ఆంగ్లంలో పట్టు సాధించడానికి వినియోగించుకున్నాడట. అయితే ఆ బాలుడికి శతవిధాల చదువు నేర్పించే యత్నం చేసినా..ఏం నేర్చుకోలేకపోయాడట. చివరికీ..కనీసం ఇంటర్మీడియట్ కూడా ఉత్తీర్ణుడు కాలేకపోయాడు.
ఆ తర్వాత వేలుమణి కూడా ట్యూటర్‌గా కొనసాగడం మానేయడం వంటివి జరిగాయి. అలా దశాబ్దాలు గడిచాక.. అనూహ్యమైన మలుపు తిరిగింది. ఆ సంపన్న కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో పడింది. అనుకోని విధంగా డాక్టర్ వేలుమణి భార్య చివరికి అదే బాలుడికి థైరోకేర్‌లో హార్డ్‌వేర్ టెక్నీషియన్‌గా ఉద్యోగం ఇచ్చింది.
ఈ అనుభవాన్ని గుర్తుచేసుకుంటూ..ఆ తల్లి తన కొడుకు ఏ కష్టం తెలియకుండా పెరగాలనుకుంది..అదే చివరికి కుటుంబానికి శాపంగా మారిపోయింది. అంతేగాదు కుటుంబం ఆర్థిక సమస్యల్లో ఉన్నప్పుడూ.. కొడుకు ఆసరాగా నిలవలేని దుస్థితిని ఎదుర్కొనాల్సి వచ్చిందామెకు. గారం తెచ్చిపెట్టే అనర్థం ఇలా ఉంటుంది. పరిస్థితులు తారుమారైనప్పుడూ..కష్టపడక తప్పదని ఆ తల్లి చెప్పలేకపోయింది, పైగా ఆ పిల్లాడు తెలుసుకోలేడు కూడా.
ఇక్కడ పిల్లల్ని క్రమశిక్షణాయుతంగా పెంచడం అనేది గొప్ప పేరేంటింగ్‌కి సంకేతం. దాన్ని చాలా జాగురకతతో నిర్వహించాలి. అదే భవిష్యత్తులో కుటుంబ ఉన్నతికి దోహదపడుతుందని నొక్కి చెప్పారు వేలుమణి. నెట్టింట షేర్ చేసిన ఈ పోస్ట్ ..ప్రతి నెటిజన్ మనసుని దోచుకుంది. సార్ ఇది మంచి స్ఫూర్తిదాయకమైన కథ అని డాక్టర్ వేలుమణిని ప్రశంసించారు. చివరగా వేలుమణి తల్లిదండ్రుబంగా పెంచకండి, విలాసవంతంగా పెరగాలని కోరుకోవద్దని..నేటి కాలానికి అస్సలు పనికిరాదని వ్యాఖ్యానించారు.
This tweet and the pics reminded me my luck in early 80s. Thanks to @howto9to5
I had a BARC job, good salary but was not enough to support my big family back home.
I wanted to send more money home and wanted to earn more by doing tuitions while working in BARC.
A filthy rich… https://t.co/Mi5mkR6ocT pic.twitter.com/mkAgrqVXtz— Dr. A. Velumani.PhD. (@velumania) May 6, 2025
(చదవండి: Parenting Tips: చిన్నారులకు ఈ వేసవిలో సేవ చేయడం నేర్పిద్దాం ఇలా..!)