
సుదీర్ఘ వీరామం తర్వాత, కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ టెలివిజన్ స్క్రీన్‌పై మరోసారి అభిమానులను అలరిస్తున్నారు. దాదాపు పాతికేళ్ల క్రితం భారతీయ టెలివిజన్ చరిత్రలో సంచలనం రేపిన సీరియల్ "క్యోం కీ సాస్ భీ కభీ బహు థీ" (Kyunki Saas Bhi Kabhi Bahu Thi) లో తులసి పాత్రతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇపుడు ఈ సీరియల్ సీజన్ 2 ద్వారా మళ్లీ నటించబోతున్నారు. దీనికి సంబంధించిన ఫస్ట్‌లుక్ బాగానే ఆకట్టుకుంది.
జరీ బోర్డర్‌తో కుంకుమ రంగుచీర, నుదిటిన పెద్ద బొట్టు, సాంప్రదాయ టెంపుల్ జ్యువెలరీతో ఆమె ఆమె రూపం, ఆ గంభీరమైన కళ్ళుఅచ్చం అలాగే ఉన్నాయంటూ నెటిజన్లు ప్రశంసించారు. ఇది గొప్ప సీరియల్‌గానే కాదు, తులసి పాత్ర సాంస్కృతిక మూలస్తంభమని తులసి విరానీగా స్మృతి ఇరానీని స్వాగతించారు. అటు ఆనాటి కుంటుంబ విలువలు, బంధాల ప్రాధాన్యతను నేటి తరానికి కూడా చూపించాలన్న లక్ష్యంతో పెట్టుకుని ఈ సీరియన్ సీజన్ 2 రూపొందిస్తున్నామని మేకర్స్ వెల్లడించారు.
ఈ ఐకానిక్ రీ ఎంట్రీని పురస్కరించుకుని, హైదరాబాద్‌కు చెందిన డిజైనర్ గౌరంగ్ షా ఫ్యాషన్‌కు మించిన వస్త్ర నివాళిని అందించారు. జామ్‌దానీ, చేతితో నేసిన భారతదేశ సంప్రదాయ వస్త్రాల డిజైనర్‌గా పేరుగాంచిన షా, స్వభావం, మూలాలు, బలానికి ప్రతిబింబించేలా స్మృతి ఇరానీ తులసి పాత్రకు దుస్తులను ఎంపిక చేయడం విశేషంగా నిలిచింది.
"గౌరంగ్ షా కేవలం చీరలను డిజైన్ చేయడమే కాదు, ప్రతీ దారంలోనూ సంప్రదాయాలు, ఆధునికతను మేళవించి రూపొందించారు. అతని నైపుణ్యం, నేత కార్మికుల కళాత్మకత ద్వారా భారతీయ చేతిపనుల ఆత్మను సజీవంగా తీసుకువచ్చింది. వారసత్వం, సమకాలీన ఆలోచనల కలకాలం కలిసే ఆయన సృష్టి దుస్తులపై మాయాజాలం అని నటి స్మృతి ఇరానీ కొనియాడారు.
తులసి పాత్రంకోసం మన దేశానికి చెందిన సంప్రదాయ చేనేత చీరలను సిద్దం చేశారట. షిఫాన్‌లో ఫెదర్ లైట్ కంజీవరం, సింబాలిక్ రంగుల్లో చేతితో రంగులద్దిన బంధానీ పట్టు, అరుదైన జామ్దానీ, డబుల్ ఇక్కత్ చీరలున్నాయి. ప్రతి డిజైన్‌కు దానికంటూ ఒక ప్రత్యేక అర్థం ఉంటుందనీ స్మృతి ఇరానీ తులసి పాత్ర, చాలా మంది భారతీయ మహిళ మర్యాదకు చిహ్నంగా మారిందని గౌరంగ్ షా అన్నారు. కాలంతో పాటు కదులుతున్నప్పటికీ తన విలువలకు కట్టుబడి ఉండే ప్రతి స్త్రీని తులసి సూచిస్తుందనీ ప్రతీ చీరను ‘తులసి’ కేరెక్టర్ ప్రయాణాన్ని ప్రతిబింబించేలా జాగ్రత్తగా డిజైన్ చేశామన్నారు. అంతేకాదు తులసి, స్మృతి ఇరానీ నిజ జీవిత ప్రయాణం రెండింటిలోనూ ప్రతిధ్వనించేలా వీటిని డిజైన్ చేసినట్టు డిజైనర్ గౌరంగ్ షా తెలిపారు. స్మృతి ఇరానీ కోసం వీటిని రూపొందించడం నిజంగా ఆనందంగా ఉందన్నారు.
ఇదీ చదవండి: Akhil Anand చెస్ గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ కుమారుడు 14 ఏళ్లకే!