న్యూఢిల్లీ: భారతీయ ఆటోమొబైల్ రంగంలోని ఎస్‌యూవీ విభాగంలో ఒకప్పుడు సంచలనం సృష్టించిన ‘రెనో డస్టర్’ మళ్లీ గ్రాండ్‌గా రీఎంట్రీ ఇచి్చంది. వేగంగా విస్తరిస్తున్న మిడ్–సైజ్ ఎస్‌యూవీ విభాగం దేశీయ కస్టమర్ల ఆసక్తిని తెలియజేస్తోంది. అలాంటి అత్యంత పోటీ ఉన్న విభాగంలోకి డస్టర్‌తో మళ్లీ అడుగుపెట్టడం ద్వారా రెనో తన పోటీ సంస్థలకు గట్టి సవాలు విసిరేందుకు సిద్ధమైంది. పెట్రోల్ ఇంజిన్‌తో వచి్చన 2026 డస్టర్ ఎస్‌యూవీ మోడల్, ఫీచర్లు ఆకట్టుకునేలా ఉన్నాయి. కస్టమర్లు రూ.21,000 చెల్లించి ముందస్తు బుకింగ్ చేసుకోవచ్చు.
ఏడేళ్ల లేదా 1.50 లక్షల కిలోమీటర్ల వరకు వారంటీని అందిస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న టాటా సియెర్రా, హ్యుందాయ్ క్రెటా, మారుతీ గ్రాండ్ విటారా, కియా సెల్టాస్ వంటి కార్లతో ఇది పోటీ పడనుంది. లాంచింగ్ సందర్భంగా రెనో గ్రూప్ సీఈవో ఫాబ్రిస్ కాంబోలివ్ మాట్లాడుతూ ... ‘‘2022లో ఉత్పత్తి నిలిపివేసిన డస్టర్‌ను తిరిగి భారతీయ మార్కెట్లోకి తీసుకురావడం సంతోషంగా ఉంది. తద్వారా వృద్ధిపరంగా కొత్త దశలోకి అడుగుపెట్టబోతున్నాము. యూరప్ వెలుపల రెనోకు భారత్ కీలక మార్కెట్. చెన్నై తయారీ ప్లాంట్‌ను పూర్తిగా సొంతం చేసుకోవడం రెనోకు వ్యూహాత్మక బలాన్ని చేకూర్చింది’’ అన్నారు.


