Viral Video: ‘జిగ్‌జాగ్‌’ డ్రైవింగ్‌.. షాక్‌ ఇచ్చిన పోలీసులు | Delhi Man Arrested Over Viral Video Of Zigzagging Through Traffic In SUV | Sakshi
Sakshi News home page

Viral Video: ‘జిగ్‌జాగ్‌’ డ్రైవింగ్‌.. షాక్‌ ఇచ్చిన పోలీసులు

Jan 21 2026 12:14 PM | Updated on Jan 21 2026 12:40 PM

Delhi Man Arrested Over Viral Video Of  Zigzagging Through Traffic In SUV

ఢిల్లీ: ఎస్‌యూవీతో ప్రమాదకర విన్యాసాలు చేస్తున్న ఓ యువకుడికి ఢిల్లీ పోలీసులు షాక్‌ ఇచ్చారు. జాతీయ రహదారి-48పై అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలో ఎస్‌యూవీ వాహనంతో అతివేగంగా 'జిగ్‌జాగ్' డ్రైవింగ్ చేసిన యువకుడిని అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నిందితుడిని ఓఖ్లా ప్రాంతానికి చెందిన ఇగ్నో విద్యార్థి దావూద్ అన్సారీ (21)గా గుర్తించారు. నిందితుడు నడిపిన స్కార్పియో-ఎన్ వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాహనం అతని తండ్రి ముసాఫిర్ అన్సారీ పేరు మీద రిజిస్టర్ అయి ఉంది.

జనవరి 18న  మధ్యాహ్నం 3 నుండి 4 గంటల మధ్య జీటీ కర్నాల్ బైపాస్ రోడ్డు నుండి నరేలా వైపు వెళ్తున్న ఒక నల్లటి స్కార్పియో వాహనం, అద్దాలకు నల్లటి టింట్లు వేసుకుని, రహదారిపై వెళ్తున్న ఇతర వాహనదారులను భయపెట్టేలా అడ్డదిడ్డంగా వెళ్తున్న వీడియో వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన జరిగింది. ఈ వీడియోను తీవ్రంగా పరిగణించిన పోలీసులు.. నిందితుడిని వెంబడించి పట్టుకున్నారు. కేసు నమోదు చేయడంతో పాటు నిందుతుడి డ్రైవింగ్‌ లైసెన్స్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement