రూ. 25,000తో ప్రీ–బుకింగ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆటోమొబైల్ దిగ్గజం కియా ఇండియా తాజాగా సరికొత్త సెల్టోస్ వెర్షన్‌ని ప్రవేశపెట్టింది. భద్రత, టెక్నాలజీ, డిజైన్‌కి ప్రాధాన్యమిస్తూ మిడ్‌సైజ్ ఎస్‌యూవీ విభాగంలో మరింత విశాలమైనదిగా దీన్ని తీర్చిదిద్దినట్లు బుధవారమిక్కడ నిర్వహించిన గ్లోబల్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా కంపెనీ ఎండీ గ్వాంగు లీ తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలు, భారతీయ పరిస్థితులకు అనుగుణంగా కొత్త సెల్టోస్‌ను రూపొందించినట్లు చెప్పారు.
వినూత్న స్టైలింగ్, ప్రీమియం ఇంటీరియర్స్, ఏడీఏఎస్ లెవెల్ 2, బోస్ 8–స్పీకర్ ఆడియో, 30 అంగుళాల పనోరమిక్ డిస్‌ప్లే ప్యానెల్ తదితర ఫీచర్లు ఇందులో ఉన్నట్లు చీఫ్ సేల్స్ ఆఫీసర్ సున్‌హాక్ పార్క్, సీనియర్ వీపీ అతుల్ సూద్ వివరించారు. దీనికి దేశవ్యాప్తంగా బుకింగ్స్ ప్రారంభించినట్లు పేర్కొన్నారు. ప్రాథమికంగా రూ. 25,000 కట్టి బుక్ చేసుకోవచ్చు. తుది ధరను జనవరి 2న ప్రకటిస్తామని, డెలివరీలు ఆ నెల మధ్య నుంచి ప్రారంభమవుతాయని పార్క్ తెలిపారు. దేశీయంగా 5,80,000 పైచిలుకు సెల్టోస్ వాహనాలను కియా విక్రయించింది.


