
నిస్సాన్ మోటార్ ఇండియా సీ-సెగ్మెంట్ ఎస్‌యూవీ (SUV) మార్కెట్‌లో కొత్త మోడల్‌ను తీసుకురాబోతున్నట్లు తెలిపింది. నిస్సాన్ టెక్టాన్(Nissan Tecton) పేరుతో త్వరలో కొత్త ఎస్‌యూవీని లాంచ్ చేస్తామని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. కొత్త మోడల్ పేరు వెల్లడించడంతోపాటు దీని ఉత్పత్తికి సిద్ధంగా ఉన్నట్లు చెబుతూ డిజైన్ టీజర్‌ను విడుదల చేసింది. డీలర్‌లకు ఇప్పటికే దీని వివరాలు వెల్లడించినట్లు కంపెనీ తెలిపింది. 2026 రెండో త్రైమాసికంలో భారత మార్కెట్‌లో ఈ మోడల్‌ను లాంచ్ చేయనున్నట్లు తెలిపింది.
నిస్సాన్ టెక్టాన్ డిజైనింగ్ పరంగా వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఎస్‌యూవీ ఇంజిన్ పైభాగం బానెట్ వెడల్పుగా ఉండడంతోపాటు ముందు భాగంలో ఎల్ఈడీ డీఆర్‌ఎల్ (LED DRL) సిగ్నేచర్ మధ్యలో నిస్సాన్ లోగోతో ఆకర్షణీయంగా ఉంటుందని చెప్పారు. స్ప్లిట్ హెడ్‌ల్యాంప్ సెటప్, ఎల్ఈడీ క్లస్టర్‌లు, ఫ్రంట్ బంపర్ డిజైన్‌తో కలిసి దీని ఎస్‌యూవీ ఆకర్షణను పెంచుతుందని తెలిపారు.
వెనుక భాగంలో టెక్టాన్ ఇటీవలి నిస్సాన్ గ్లోబల్ మోడళ్ల మాదిరిగానే కనెక్ట్ ఎల్ఈడీ టెయిల్ లైట్ బార్, స్క్వేర్డ్ టెయిల్ ల్యాంప్స్‌ను కలిగి ఉంటుందని చెప్పింది. టెక్టాన్ అల్లాయ్ వీల్స్ దీనికి డైనమిక్, ప్రీమియం లుక్‌ను అందిస్తాయని కంపెనీ తెలిపింది. ఇంటీరియర్‌లో ప్రీమియం ఫీచర్లు ఉంటాయని తెలిపింది. లేయర్డ్ డాష్‌బోర్డ్ డిజైన్, లార్జ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్, పూర్తి డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, వెంటిలేటెడ్ సీట్లు, అధునాతన డ్రైవర్-సహాయక వ్యవస్థల (ADAS)సూట్‌ను అందించాలని కంపెనీ భావిస్తున్నట్లు తెలిపింది. అయితే దీన్ని ఏ ప్రైస్ రేంజ్‌లో మార్కెట్‌లో తీసుకొస్తారని అంశాలను వెల్లడించాల్సి ఉంది.
ఇదీ చదవండి: బంగారం ధరల తుపాను.. తులం ఎంతంటే..