
కియా ఇండియా.. ఎంపిక చేసిన మోడళ్లపై రూ.2.25 లక్షల వరకు ఫ్రీ-జీఎస్‌టీ & పండుగ ప్రయోజనాలను కలిపి అందించే ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్ 2025 సెప్టెంబర్ 22 వరకు చెల్లుతుంది.
ఈ ఆఫర్‌లో రూ.58,000 వరకు ప్రీ-జీఎస్‌టీ సేవింగ్స్ & రూ.1.67 లక్షల వరకు ఫెస్టివల్ బెనిఫిట్స్ అందుబాటులో ఉన్నాయి. కంపెనీ ఇప్పుడు సెల్టోస్, కారెన్స్ క్లావిస్, కారెన్స్ వంటి ప్రసిద్ధ మోడళ్లపై డిస్కౌంట్స్ ప్రకటించింది. ఆఫర్ అనేది ప్రాంతాన్ని బట్టి మారే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: చిన్న కారుపై.. భారీ తగ్గింపు: ఏకంగా రూ.3 లక్షలు
ఈ సందర్భంగా, కియా ఇండియా సీఎస్ఓ జూన్సు చో మాట్లాడుతూ.. పండుగల సమయంలో మా కస్టమర్లకు మరింత ప్రత్యేకంగా చేయాలనుకుంటున్నాము. ప్రత్యేకమైన ప్రీ-జీఎస్‌టీ సేవింగ్స్ & పండుగ ప్రయోజనాలతో, కస్టమర్‌లు ఇప్పుడు తమకు ఇష్టమైన కియాను ఇంటికి తీసుకెళ్లవచ్చు. కియాను సొంతం చేసుకోవడం అంటే కేవలం కారు నడపడం మాత్రమే కాదు, రోజువారీ జీవితానికి సౌకర్యం, ఆనందాన్ని జోడించడం అని మేము విశ్వసిస్తున్నామని ఆయన అన్నారు.