
పెట్ డాగ్స్‌కు తెలుగు సెలబ్రిటీల ప్రాధాన్యత,సోషల్ బ్రీడ్స్
నాగ్, రామ్ చరణ్, పూరీ, అమల, కవిత, చార్మీ సహా ప్రతిష్టాత్మక టుస్సాడ్స్
మ్యూజియంలో మైనపు కుక్క బొమ్మలు
గతంలో సినిమా సెలబ్రిటీలు వారి లైఫ్‌స్టైల్, ఫ్యాషన్, కార్లు, ఇంటీరియర్స్‌తో వార్తల్లో ఉండేవారు. కానీ ప్రస్తుతం పెంపుడు జంతువులు, ముఖ్యంగా కుక్కలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఈ మధ్యకాలంలో సెలబ్రిటీల కుక్కలు ఇంటర్వ్యూలకు, షూటింగులకు, ఫొటోషూట్లకు, ఇతర ఈవెంట్లకు ప్రత్యేక ఆకర్షణగా మారుతున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో వీటి ఫొటోలు, వీడియోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఇది కేవలం ట్రెండ్ మాత్రమే కాదు.. వారి వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే ఫ్యాషన్ స్టేట్‌మెంట్‌లా మారిపోయింది. – సాక్షి, సిటీబ్యూరో
రామ్ చరణ్ తన పెంపుడు కుక్క రైమ్ (ఫ్రెంచ్ బార్బెట్)ను ఎంతో ప్రేమగా పెంచుతున్నారు. ఇటీవల మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఏర్పాటైన రామ్‌చరణ్ తన మైనపు విగ్రహానికి తన కుక్కతో కలిసి ఉన్న స్టైలిష్ పోజ్ మరింత ఆకర్షణగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఓ ఇంటర్వ్యూలో భాగంగా ఇలా ఒక్క పెట్ డాగ్‌ను ఈ మ్యూజియంలో ఏర్పాటు చేయడం చరిత్రలో రెండోసారి మాత్రమని వివరించారు. ఉపాసన పలు వేదికలపై యానిమల్ థెరపీ, పెట్ పేరెంటింగ్ వంటి అంశాలపై తరచూ మాట్లాడతారు. కుక్కలతో కలిసి తీసుకున్న ఫొటోలు తరచూ ఇన్‌స్టాలో షేర్ అవుతుంటాయి.
ఆత్మీయమైన అమల–నాగార్జున..
ప్రముఖ సినీతార, అక్కినేని నాగార్జున సతీమణి అమలకు మూగజీవాల పైన ఉన్న ప్రేమ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బ్లూక్రాస్ సొసైటీతో మూగజీవాల సంరక్షణకు ఎన్నో యేళ్లుగా సేవలందిస్తున్నారు. తన ఇంట్లో కూడా కుక్కలను ప్రత్యేకంగా పెంచుతుంటారు. ఇందులో పలు బ్రీడ్ డాగ్స్‌తో పాటు స్ట్రీట్ డాగ్స్ సైతం ఉన్నాయి. నాగార్జున–అమల పెళ్లి తరువాత రెండు పప్పీలను తనకు గిఫ్ట్‌గా ఇచ్చారని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. తనయుడు అఖిల్ కూడా ఓ ఇంటర్వ్యూల్లో కుక్కతో సందడి
కుక్క, పక్షి.. ఓ పూరీ..
ఖరీదైన బ్రీడ్ కుక్కలు, పక్షులు పెంచడంలో డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌ది ప్రత్యేక శైలి. వాటి కోసమే లక్షలు ఖర్చు చేస్తాడన్న విషయం విధితమే. పూరీ వద్ద ఖరీదైన కుక్కలు ఉన్నాయి. గతంలో తన ఆఫీస్‌లో విభిన్న రకాల పక్షులు అక్కడికి వచ్చేవారిని ఆశ్చర్యపరిచేవి. సోషల్ మీడియాలోనూ వీడియోలు షేర్ చేస్తుంటారు.
ఇదీ చదవండి: Today Tip : మూడు నెలల్లో బాన పొట్ట కరిగిపోవాలంటే..!
రాజకీయ రంగంలోనూ.. : బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇటీవల తన పెంపుడు కుక్కతో ఉన్న పోస్టు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. సాదు జంతువులు తమ చుట్టూ ఉండే నెగెటివ్ ఎనర్జీని తీసుకుని యజమానులకు మేలు చేస్తాయని, ఈ విషయాన్ని తాను నమ్ముతానని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. కష్టకాలంలో తనకు తోడ్పాటుగా ఉందని ఆమె వెల్లడించారు.

స్టార్ డాగ్స్..
వీరితో పాటు తెలుగు సినీ రంగంలో నాని ‘స్మైలీ’తో ఉన్న అనుబంధాన్ని సోషల్‌మీడియా వేదికగా పంచుకున్నారు. సినీతార సాయిపల్లవి, ఇతర సెలబ్రిటీలు ఇన్‌స్టాలో ప్రత్యేక ఖాతాలు కూడా మెయిటేన్ చేస్తున్నారు.
సమంత ‘హష్ అండ్ శాష’.. : సమంతకు కుక్కలంటే చాలా ఇష్టం. ముఖ్యంగా తన రెండు డాగ్స్ హాష్ అండ్ శాషతో పలుమార్లు సందడి చేశారు. సోషల్‌మీడియాలోనూ వైరల్‌గా మారారు. తన కుక్కను కొన్ని సందర్భాల్లో షూటింగ్స్‌కు కూడా తీసుకెళ్లారు.
పర్సనల్ బెస్ట్ ఫ్రెండ్..
తన కుక్కను ‘పర్సనల్ బెస్ట్ ఫ్రెండ్’గా పిలుచుకునే చార్మీ కౌర్ గతంలో కొన్ని ఇంటర్వ్యూలకు కుక్కను వెంట తీసుకొచి్చన సందర్భాలున్నాయి. పెట్ డాగ్‌తో సెలీ్ఫలు, స్టైలిష్ డ్రెస్సులతో తీసిన ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి.