పేరెంటింగ్‌కు సరికొత్త దిక్సూచి..! | An innovative parenting app Smart Parenting Tools Revolutionizing Child Rearing | Sakshi
Sakshi News home page

‘పేరెంట్‌ షాలా’: పేరెంటింగ్‌కు సరికొత్త దిక్సూచి..!

Jun 3 2025 10:09 AM | Updated on Jun 3 2025 10:10 AM

An innovative parenting app Smart Parenting Tools Revolutionizing Child Rearing

ప్రస్తుత కాలంలో పిల్లల్ని పెంచడం ఒక ఛాలెంజింగ్‌గా మారిందని, శరవేగంగా అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌ ఇందుకు ముఖ్య కారణాలని ప్రముఖ మనస్తత్వవేత్త సుదీర్‌ సండ్రా తెలిపారు. సుధీర్‌ ఆధ్వర్యంలో నగరంలోని శిల్పకళా వేదికగా నిర్వహించిన సూపర్‌ ఫ్యామిలీ ఫెస్ట్‌ ఈవెంట్‌లో 1,300 మందికి పైగా తల్లిదండ్రులు, పిల్లలు పాల్గొన్నారు. 

ఈ కార్యక్రమంలో భాగంగా తల్లిదండ్రులకు ఉపయోగపడే అధునాతన యాప్‌ ‘పేరెంట్‌ షాలా’ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సుదీర్‌ మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితుల్లో చాలా మంది తల్లిదండ్రులు చిన్నారులకు సరైన గైడెన్స్‌ ఇచ్చే వేదిక కోసం వెతుకుతున్నారని, దీనికి అనువైన వేదిక ‘పేరెంట్‌ షాలా’ అని పేర్కొన్నారు. వారికి ఇదొక మెంటార్‌ లా సాయపడుతుందని చెప్పారు. 

నిపుణుల మార్గదర్శకత్వంతో పాటు కమ్యూనిటీ పరంగా సహాయం అందిస్తుందని, భారతీయ సంప్రదాయాలకు, ఆధునిక పేరెంటింగ్‌ పద్ధతులను జతచేసి అనుబంధాలను పెంచేందుకు దోహదపడుతుందని తెలిపారు. మొబైల్‌ ఫోన్లకు అతుక్కుపోకుండా చిన్నారుల దృష్టిని మళ్లిస్తుందని, అలాగే తల్లిదండ్రుల్లో ఆత్మస్థైర్యాన్ని పెంచి పిల్లల భవిష్యత్తును అద్భుతంగా తీర్చిదిద్దేందుకు ఒక సాధనంగా ఉపయోగపడుతుందని అన్నారు. 

ఇదే వేదికపై సూపర్‌ ఫ్యామిలీ ఫెస్ట్‌లో భాగంగా నలుగురు మహిళలను సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రఖ్యాత స్టోరీ టెల్లర్‌ రమా రావి, డాక్టర్‌ ఇప్పలపల్లి రమేశ్, నేషనల్‌ హ్యాండ్‌ రైటింగ్‌ అకాడమీ (ఎన్‌హెచ్‌ఏ) డైరెక్టర్‌ మల్లికార్జునరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. 

(చదవండి: చల్‌ మేరే దిల్‌..! క్రేజ్‌ సంతరించుకుంటున్న సైకిల్‌)

Advertisement
 
Advertisement
Advertisement