
టీనేజ్ వయసులో అందరూ సుఖం వెంబడి పరుగులు తీస్తుంటారు. కానీ అవేమి మనకు లైవ్‌లో మంచిగా సెటిల్ అవ్వడానికి ఉపకరించవట. ఓ వ్యక్తి ఎదుగదలలో కీలక పాత్ర వహించేది పేదరికం, అసౌకర్యం. ఇవే ఎదుగుదలకు సోపానాలుగా మారతాయట. లేమి అనేది ప్రతి క్షణం తలంపుకు వచ్చి సంపాదన అనే ఆలోచన వైపుకి మళ్లీ,, లక్ష్యంపై ఫోకస్‌పెట్టేలా చేస్తుందట. అంతేగాదు సవాళ్లను స్వీకరించగలిగే సత్తాని అందిస్తుందట. అసౌకర్యం అన్నింటిని అలవోకగా నేర్పించినంతంగా విలాసవంతమైన జీవితం ఏమి నేర్పించలేదట.
అందువల్లే పిల్లలను అతిగా ప్రేమించొద్దని సదా హెచ్చరిస్తుంటారు థైరోకేర్ వ్యవస్థాపకుడు డాక్టర్ ఏ వేలుమణి. ఇక్కడ యువత ప్రతి కష్టాన్ని ఎదిగేందుకు అవకాశంగా చూసే దృక్పథం అలవర్చుకుంటే..కష్టానికి భయపడటం అన్న మాటే ఉండదని అంటున్నారాయన. అదే తనకు పనిచేసిందని కూడా చెబుతున్నారు. తాను ఇవాళ రూ. 3 వేల కోట్ల సామ్రజ్యాన్ని సృష్టించగలిగానంటే ఆ పేదరికం, అసౌకర్యాలే వల్లనేనని అంటున్నారు వేలుమణి.
అతిగారాబం, అతిప్రేమ ఎప్పటికీ పిల్లలను ఉన్నత విద్యావంతులుగా ఎదిగేందుకు తోడ్పడదని నొక్కి చెబుతున్నారు. అంతేగాదు పేదరికంలోని లేమి అనే లోటు ఓర్పుని, ఒప్పించే నైపుణ్యాలను, పొదుపుని, క్రమశిక్షణ, స్పష్టత, ధైర్యం, వంటి ఆయుధాలను అందిస్తుందట. దాంతో ప్రతికూలతలు దరిదాపుల్లోకి రావడానికి భయపడతాయట. అసౌకర్యాన్ని అసహనంగా చూడొద్దు..అది మన మనస్సుని అత్యంత దృడంగా మారుస్తుందనే విషయాన్ని గ్రహించండి.
కటిక దారిద్ర్యం, ఎటువంటి సౌకర్యాలు లేకపోవడమే ఉన్నతికి, అభ్యున్నతికి పెట్టుబడులనే విషయం గ్రహించండి అని నొక్కి చెబుతున్నారు థైరోకేర్ వ్యవస్థాపకుడు డాక్టర్ ఏ వేలుమణి. చివరగా ఆయన నిజమైన పేరెంటింగ్ అంటే ప్రతి సవాలు నుంచి పిల్లలను రక్షించడం కాదని వక్కాణించారు. స్థితిస్థాపకత, క్రమశిక్షణ, స్వతంత్రంగా ఉండటం నేర్పించాలని చెబుతున్నారు.
అలాగే తన తల్లి తనకు స్వేచ్ఛ తప్ప ఇంకేమి ఇవ్వలేదని కూడా చెప్పారు. నిజానికి వేలుమణి బాల్యం నుంచే కష్టాలు చూసి.. జీవితంలో స్థిరపడాలని ఉద్దేశ్యంతో కష్టపడి వేలకోట్ల సంపదను సృష్టించారు. వేలుమణి నాయకత్వంలో థైరోకేర్ భారతదేశం, నేపాల్, బంగ్లాదేశ్, మధ్యప్రాచ్య దేశాల్లో సుమారు వెయ్యి కోట్లకు పైనే అవుట్‌లెట్‌లను కలిగి ఉంది.
Differentiate. You too can.
Unlike the vast majority, if you enjoy poverty, challenges hardships and sufferings in teens it is an investment.
At 20 you would have the power to enjoy every discomfort which brings in the essentials for sure success and prosperity.
Essentials… pic.twitter.com/IJUJM2aP28— Dr. A. Velumani.PhD. (@velumania) August 12, 2025