
భారతదేశంలో మహిళ భద్రత గురించి తీవ్రమైన ఆందోళనలు రేకెత్తుత్తున్న తరుణంలో ఈ ఘటన భరోసాకు అర్థం ఏంటో చూపించింది. సోషల్ మీడియాలో చాలామంది మహిళలు పంచుకున్న చేదు అనుభవాలు రీత్యా ఇక్కడ క్యాబ్ రైడ్ అనేది అంత సేఫ్ కాదనే అభిప్రాయం సర్వత్రా బలంగా ఉంది. అలాంటి టైంలో ఈ డ్రైవర్ ప్రతిస్పందన ప్రతి ఒక్కర్ని కదిలించింది. నెటిజన్లు అతడిని హ్యాట్సాప్ భయ్యా అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
యాషికా రాపారియా అనే భారతీయ మహిళ ఒక రైడ్‌లో తాను ఎదుర్కొన్న అసాధారణ అనుభవాన్ని షేర్ చేసుకుంది. ఆ క్యాబ్ డ్రైవర్ అసాధారణ సంజ్ఞ తనను మంత్రముగ్గుల్ని చేసిందని అంటోందామె. ఇలాంటి మనుషులకు కూడా ఉన్నారా అని భావన కలిగిందని చెప్పుకొచ్చిందామె. ఇది పూణేలో చోటుచేసుకుంది. అసలేం జరిగిందంటే..ఆమె తన నెలల పసికందుతో కలిసి క్యాబ్‌లో ప్రయాణిస్తోంది. ఇంతలో బిడ్డకు పాలివ్వాల్సి వచ్చింది.
అయితే ఇది భారతదేశం. ఇక్కడ పాలివ్వడం అనేది అసాధారణమైన పనిగా భావిస్తారని ఫీల్‌తో క్యాబ్‌లో బిడ్డకు పాలివ్వడానికి ఇబ్బంది పడింది. ఆ నిమిత్తమై ముందు జాగ్రత్తగా ఒక దుప్పటి కూడా తెచ్చుకుంది. అది వేసుకని మరి పాలిస్తున్న ఏదో తెలియని భయంతో చాలా నెర్వస్‌గా ఫీలయ్యింది. అలానే భయపడుతూ ఒక్కసారి తలెత్తి పైకి చూసింది. ఆ క్యాబ్ డ్రైవర్ ఆమెకు బీ సేవ్ అంటూ భరోసా ఇస్తున్నట్లుగా తన ముందున్న అద్దాన్ని ఎడ్జెస్ట్ చేశాడు.
అస్సలు వెనుకసీటులో ఏం జరుగుతుందనేది అస్సలు ఆడ్రైవర్‌కి తెలియను కూడా తెలియదు. ఒక్కసారిగా ఆ బిడ్డ తల్లిని ఒక్క సంజ్ఞతో ఓ తల్లికి గౌరవం తోపాటు భద్రతకు అర్థం ఏంటో చేతల్లో చేసి చూపించాడు. అయినా అవతలివాళ్లకు భరోసా ఇవ్వాలంటే మాటలతో పనిలేదని, చిన్న సర్దుబాటు చాలని చెప్పకనే చెప్పాడు. క్యాబ్ డ్రైవర్లపై ఉండే అభిప్రాయమే మార్చుకునేలా చేశాడు తన ప్రవర్తనతో. అంతేగాదు మానవత్వం ఇంకా బతికే ఉందని చూపించాడు కూడా అంటూ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో తన అనుభవాన్ని రాసుకొచ్చింది ఆ తల్లి.
(చదవండి: గణేశ్ నిమజ్జనం: భర్తపై పూలు జల్లుతూ రాధికా అంబానీ.. ! వీడియో వైరల్)