
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముఖేశ్ అంబానీ ఇంట ఏ పండుగైనా ఏ రేంజ్‌లో జరుగుతుందనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందులోనూ ప్రథమ పూజలందుకునే గణేశ్ చతుర్థి గురించి ఇక చెప్పాల్సిన పనిలేదు. ప్రముఖులు, బాలీవుడ్ తారాగణమే కదలివచ్చి మరీ ఈ వేడుకల్లో పాలు పంచుకుంటారు. అలానే ఈ ఏడాది ఆగస్టు 27న ముంబైలోని తమ ఇంటి యాంటిలియాలో గణపతి బప్పాను అంబానీ కుటుంబం ఘనంగా ఆహ్వానించింది. ఆ గణపతి విగ్రహాన్ని ముఖేశ్-నీతా దంపుతుల తోపాటు వారి చిన్న కుమారుడు అనంత్ -రాధికలు స్వయంగా ఇంటికి తీసుకు వచ్చారు. గణేశ్ చతుర్థిని ధూమ్ ధామ్‌గా జరుపుకున్నారు. ఆగస్టు 28న గణపతి నిమజ్జనం ఆచారాలు నిర్వహించారు. ఆ పండుగ తాలుకా వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
ఆ వీడియోలో గణపతి నిమజ్జనం వేడుకలో రాధిక గులాబి రంగు అనార్కలిలో మెరిసింది. బంధానీ నమునా కుర్తా, గుండ్రని స్ప్లిట్ నెక్‌న్, క్వార్టర్‌లెంగ్త్ స్లీవ్‌లు, ఎంబ్రాయిడరీ టాసెల్స్‌తో ఆకర్షనీయంగా ఉండే డిజైనర్‌వేర్‌లో సింపుల్ లుక్‌లో కనిపించింది రాధిక. ఆ డ్రెస్‌కి తగ్గ చెప్పులు, బంగారు గాజులు, డైమండ్ ఇయర్ స్టడ్స్‌తో సాధారణ అమ్మాయిలా ఆశ్చర్యపరిచారు. అయితే ఈ గణేశ్ నిమజ్జనం ఆచారాలన్నింటిని అనంత్ రాధికాలు కలిసి నిర్వహించారు.
అనంతరం రాధిక ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఓర్హాన్ అవత్రమణి, అకా ఓర్రీ, మరికొందరు స్నేహితులు, కుటుంబసభ్యులతో కలసి ట్రక్కు లోపల కూర్చొని ఉన్నారు. ఇక అనంత్ తన భద్రతా బృందం, ఇతరులతో కలిసి వాహనం వెనుక నడిచి ఆనందరకరమైన ఆ సంబరాన్ని జరుపకుంటున్నట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. అంతేగాదు రాధిక అనంత్ అంబానీపై సరదాగా పువ్వులు విసురుతున్నట్లు కూడా కనిపిస్తోంది. రాధిక చేసిన పనికి అనంత్ నవ్వుతూ కనిపించడం చూడొచ్చు.
కాగా, గణేష్ నిమజ్జనం 2025 సెప్టెంబర్ 6న వస్తుంది. దృక్ పంచాంగం ప్రకారం ముందుగా చేయాలనుకునే వారు చతుర్థి తిథి మరుసటి రోజు (ఒకటిన్నర రోజుల తర్వాత) అంటే ఆగస్టు 28న చేయవచ్చు. ఇది గణేష్ నిమజ్జనంకు ప్రసిద్ధి చెందిన రోజులలో ఒకటి. ఆ రోజు మధ్యాహ్నం గణేష్ పూజ చేసిన తర్వాత విగ్రహాన్ని నిమజ్జనం చేస్తారు.
(చదవండి: ఆరుపదులు దాటినా ఫిట్‌గా కనిపించాలంటే..! నాగార్జున ఫిట్‌నెస్ మంత్ర..)