
MMDiwali ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా దివాలీ బాష్‌లో స్టన్నింగ్ లుక్‌తో అలరించారు. 61ఏళ్ల వయసులో కూడా ఆరోగ్యంగా, అందంగా తనదైన ఫ్యాషన్ స్టైల్‌తో ఆకట్టుకుంటారు. అటు వ్యాపారవేత్తగా రాణిస్తూ, ఫిట్‌గా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు.అంతేకాదు మహిళలు 40 ఏళ్లు దాటిన తరువాత కనీసం వ్యాయామం యోగా లాంటివి చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటూమహిళలకు సందేశమిస్తారు. తాజాగా అరుదైన హెర్మేస్ జ్యువెలరీ బ్యాగ్ , కొలంబియన్ ఎమరాల్డ్స్‌తో సీక్విన్డ్ మనీష్ మల్హోత్రా చీరలో నీతా అంబానీ మరోసారి ఫ్యాషన్ ఐకాన్ అనిపించుకున్నారు.
దీపావళి సమీపిస్తున్న తరుణంలో మనీష్ మల్హోత్రా ఎప్పటిలాగే తన ఇంట్లో బి-టౌన్ సెలబ్రిటీలతో గ్రాండ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ వేడుకకు మొత్తం బాలీవుడ్ పరిశ్రమ తరలివచ్చింది. అంబానీ ఫ్యామిలీకి చెందిన అత్తాకోడళ్ల ద్వయం చీరలలో అందరి దృష్టిని ఆకర్షించింది.
(మూడు నెలలు ముహూర్తాలు లేవు..నగరానికి పెళ్లి కళ వచ్చేసింది!)
బిలియనీర్ వ్యాపార దిగ్గజం, రిలయన్స్ చైర్మన్,ముఖేష్ అంబానీ భార్య డిజైనర్ నీతా అంబానీ, చిన్నకోడలు రాధికా మర్చంట్‌తో చీరల్లో ఫెస్టివ్‌ల్ లుక్‌లో అదరగొట్టేశారు. ముఖ్యంగా నీతా బ్రైట్ సిల్వర్ వెండి సీక్విన్ సారీ, స్లీవ్‌లెస్ బ్లౌజ్‌తో క్లాసిక్ అండ్ ఫెస్టివ్ లుక్‌లో ఆకట్టుకున్నారు. దీనికి తగ్గట్టు స్పెషల్ హై జ్యువెలరీ కలెక్షన్ అద్భుతమైన ఎమరాల్డ్స్ చెవిపోగులు, వజ్రాల బ్రాస్‌లెట్‌తో హైలైట్‌గా నిలిచారు. ఇంకా తనదైన శైలిలో ధరించిన ప్రత్యేక ఎడిషన్ మినియేచర్ లగ్జరీ బిర్కిన్ మరో హైలైట్. వజ్రాలతో పొదిగి రోజ్ గోల్డ్‌తో తయారు చేసిన ఈ బ్యాగ్ ధర రూ.17.74 కోట్లు ఉంటుందని అంచనా.
నీతా వెండి సీక్విన్ చీరను ధరించగా, కోడలు రాధిక ముత్యాలతో రూపొందించిన మనీష్ మల్హోత్రా చీరలో క్లాసీ వైబ్‌ను పంచారు. డీప్ నెక్‌లైన్ స్లీవ్‌లెస్ బ్లౌజ్, ఓపెన్ పల్లుతో స్టైల్ చేసింది. అలాగే అత్తగారిలాగానే తన లుక్‌కి మ్యాచింగ్ బ్యాగ్ ధరించింది. అత్తగారి చేయి పట్టుకుని నడిచి వచ్చిన తీరు అక్కడున్నవారినందర్నీ ఎంతగానో ఆకట్టుకుంది.