ఆరుపదులు దాటినా ఫిట్‌గా కనిపించాలంటే..! నాగార్జున ఫిట్‌నెస్‌ మంత్ర. | Tollywood King Nagarjuna Turns 67: Fitness Secrets Behind His Youthful Looks | Sakshi
Sakshi News home page

ఆరుపదులు దాటినా ఫిట్‌గా కనిపించాలంటే..! నాగార్జున ఫిట్‌నెస్‌ మంత్ర..

Aug 29 2025 1:30 PM | Updated on Aug 29 2025 6:06 PM

Nagarjunas fitness secrets for toned body at 66

టాలీవుడ్‌ కింగ్‌, హీరోయిన్ల మన్మథుడు హీరో నాగార్జున ఇవాళ 67వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. అయితే ఆయన ఇప్పటికీ అంతే గ్లామర్‌గా టోన్డ్‌ బాడీతో ఆకర్షణగా కనిపిస్తారు. ఆగస్టు 29 ఆయన పుట్టిన రోజు సందర్భంగా అంతలా ఫిట్‌గా ఉండేందుకు నాగార్జున ఎలాంటి వ్యాయామాలు చేస్తుంటారు, ఆరుపదులు వయసులో కూడా అంతలా యంగ్‌గా కనిపించేందుకు ఎలాంటి చిట్కాలు అనుసరిస్తారు వంటి వాటి గురించి సవివరంగా తెలుసుకుందామా..!.

నాగార్జున ఇంచుమించుగా గత 30 లేదా 35 సంవత్సరాలుగా వర్కౌట్లు చేస్తూనే ఉన్నారు. ఎన్నడు స్కిప్‌ చేయలేదని ఆయన ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ చెబుతున్నారు. ఒక ఇంటర్వ్యూలో కూడా క్రమంతప్పకుండా వ్యాయామం చేస్తానని ఆయనే స్వయంగా చెప్పారు. వాటిలో కార్డియో, స్ట్రెంగ్త్‌ ట్రైనింగ్‌ వంటి వ్యాయామాలు తప్పనిసరి. అయితే అవన్ని ప్రతి ఉదయం జస్ట్‌ 45 నిమిషాల నుంచి ఒక గంట వరకే చేస్తారట. 

అంతలా ఫిట్‌గా ఉండటానికి రీజన్‌..
క్రమంతప్పకుండా వ్యాయామం చేయడం అనేది తప్పనిసరి అని చెబుతున్నారు నాగార్జున. అంతేగాదు పనిచేయకుండానైనా ఉంటాను గానీ వ్యాయామం చేయకుండా అస్సలు ఉండనని చెబుతున్నారు. మేల్కొన్న వెంటనే వ్యాయామం తన తొలి ప్రాధాన్యతని చెబుతున్నారు. కచ్చితంగా వారానికి ఐదు నుంచి ఆరు రోజులు వర్కౌట్లనేవి తన దినచర్యలో భాగమని చెబుతున్నారు. అయితే అవి చాలా తీవ్రంగా ఉంటాయట.

ఆ ఏజ్‌లో కూడా యంగ్‌గా కనిపించాలంటే..
వర్కౌట్‌ల సమయంలో తన హృదయ స్పందన రేటును గరిష్ట రేటు 70 శాతం కంటే ఎక్కువగా ఉంచుకోవడం ఎలాగై తన ట్రైనర్‌ నేర్పించాడని తెలిపారు నాగార్జున.  అధిక జీవక్రియను నిర్వహించడానికి వర్కౌట్‌ల సమయంలో విశ్రాంతి , పరధ్యానం అనేవి అస్సలు పనికిరావని, పైగా మెరుగైన ఫలితాలు అందుకోలేమని చెప్పారు. చేసేపని చిన్నదైన, పెద్దదైనా ఫోకస్‌, స్కిప్‌ చేయని అంకిత భావం అంత్యంత ముఖ్యమని, అప్పుడే ఎప్పటికీ యవ్వనంగా ఉండగలమని పరోక్షంగా చెప్పకనే చెప్పారు హీరో నాగార్జున.

 

(చదవండి: ఫుడ్ డెలివరికి వెళ్లి కస్టమర్‌కి ప్రపోజ్‌ చేశాడు ..కట్‌చేస్తే..!)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement