
ఇటీవల కాలంలో అందరిని వేదించే సమస్య అధిక బరువు, జీర్ణ సంబంధిత సమస్యలు. ఎందుకంటే నచ్చిన ఆహారం కాస్త ఎక్కువగా తినకుండా ఉండలేరు చాలామంది. చెప్పాలంటే.. ఫుడ్ విషయంలో నోరు కంట్రోల్‌లో ఉంటే చాలా వరకు ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవు. అది చాలా కష్టం. ఎందుకంటే నోరూరించే పదార్థాలు తినమని పిలుస్తుంటే ఆగకుండా ఉండటం ఎవరికి సాధ్యం. మరి అలాంటి సమస్యను అధిగమించి రుచిని ఆస్వాదిస్తూ..బి లిమిట్‌ని పాటించటం ఎలాగో తెలుసుకుందామా..!.
బాలీవుడ్ నటి కరీనా కపూర్ పోషకాహార నిపుణురాలు రుజుతా దివేకర్ ..మనసారా నచ్చిన ఆహారం తింటూనే అధిక బరువు, గ్యాస్ సమస్యకు ఎలా చెక్ పెట్టొచ్చొ షేర్ చేసుకున్నారు. నిజానికి మనం ఏ ఆహారాన్ని తింటున్నా..ఒకటి రెండు, మూడు..అలా అన్ని సార్లు పెట్టుకుంటూ లాగించేస్తాం. మరి ఇష్టమైన ఫుడ్ అయితే ..ఎంతలా తింటారో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. నియంత్రణ లేకుండా తినడాన్ని నియంత్రణలోకి తెచ్చుకోవాలంటే..ఈ మైండ్‌ఫుల్‌నెస్ టెక్నీక్ అయినా జోర్డాన్ ఫార్ములాను ఫాలోకండని చెబుతున్నారామె. ఇంతకీ అదేంటంటే..
అందుకు ఆమె ఒక స్నాక్స్ ఐటెంని ఉదాహారణ తీసుకుంటూ చెప్పుకొచ్చారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఉదాహరణకు సగ్గుబియ్యం వడలు స్నాక్స్‌గా తినాలనుకున్నారు. అప్పుడు వెంటనే ప్లేట్ ఓ ఐదు వడలు తక్కువ కాకుండా లాగించేస్తారు. కానీ అలా కాకుండా ఇంత వరకు తినాలని ఫిక్స్‌అవ్వాలి. వంటకాలు నోరూరించేలా ఉండొచ్చు..కానీ ఆరోగ్యంపై ధ్యాస..ఎలా తింటే బెటర్‌గా ఉంటానన్నది ఆ పదార్థాలను చూడగానే ఠక్కున గుర్తుకు రావాలి.
అలాంటి ఆలోచన రాగానే తినాలనే ఆలోచన ఆటోమెటిగ్గా నియంత్రణలోకి వచ్చేస్తుంది. వేసుకునేటప్పుడే రెండు లేదా మూడుతో ఆపేస్తారని చెబుతున్నారామె. పైగా దాన్ని ఎంజాయ్ చేసేలా చట్నీ లేదా ఇతరత్రా వాటిని సిద్ధం చేసుకుని ప్రతి ముక్కను ఆస్వాదిస్తూ..తింటుంటే కడుపు నిండిన అనుభూతి ప్లస్..తక్కువ తినడం రెండు సాధ్యమవుతాయట. దీన్ని మైండ్‌ఫుల్‌నెస్ తినడం అంటారని అన్నారు. రుజుతా ఈ చిట్కాకు జోర్డాన్ ఫార్ములాగా పేర్కొన్నారు.
మంచి జోష్‌తో నచ్చిన ఫుడ్‌ని ఎంజాయ్ చేస్తూ లిమిట్‌గా తినడమే ఈ జోర్డాన్ ఫార్ములానట. ఈ టెక్నిక్‌లో బేసి సంఖ్యలో పదార్థాలను తీసుకునేలా ఫిక్స్ అవ్వడం తోపాటు..క్రమశిక్షణతో తినడం అలవడుతుందట. అయితే ఇక్కడ తప్పనిసరిగా బుద్ధిపూర్వకంగా, నెమ్మదిగా ఆస్వాదిస్తూ తినడం అనేది అత్యంత కీలకం. అప్పుడే తీసుకునే ఆహారంపై కంట్రోల్ ఉంటుందట.
ఇది స్వీయ నియంత్రణను మెరుగుపరుస్తూ..ఆహారంపై అవగాహన ఉండేలా తీసుకునేలా చేస్తుందట. ఇది చక్కటి సత్ఫలితాలనిస్తుందని ఆమె ధీమాగా చెబుతున్నారు. మంచి ఆరోగ్యానికి సమతుల్య ఆహారం, ఆకలే ప్రధానం. అందుకోసం ఆనందిస్తూ తినేలా..పరిమితంగా తినడం అనేదానిపై శ్రద్ధ పెట్టడం అనే జోర్డాన్ సూత్రం పాటిస్తే చాలు అని చెబుతున్నారు పోషకాహార నిపుణురాలు రుజుతా దివేకర్. మరి ఇంకెందు ఆలస్యం ప్రయత్నంచి చూడండి.
గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.
(చదవండి: 12వ తరగతి డ్రాపౌట్..సొంతంగా జిమ్..ఇంతలో ఊహకందని మలుపు..!))