మూడువేల అడుగుల లోతుల భూగర్భంలో మారథాన్‌..! 18 దేశాలు.. | Worlds Deepest Marathon Over 3,000 Feet Underground Set World Record | Sakshi
Sakshi News home page

మూడువేల అడుగుల లోతుల భూగర్భంలో మారథాన్‌..! 18 దేశాలు..

Mar 16 2026 10:37 AM | Updated on Mar 16 2026 11:12 AM

Worlds Deepest Marathon Over 3,000 Feet Underground Set World Record

సాధారణ పరిస్థితుల్లో మారథాన్‌ చేయడమే కష్టం. అలాంటిది ప్రపంచంలోనే అత్యంత లోతైన భూగర్భంలో మారథాన్‌ అంటే..సవాలు ఏ రేంజ్‌లో ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. అలాంటి భయానక పరిస్థితులను తట్టుకుని విజయవంతంగా అత్యంత లోతైన భూగర్భంలో మారథాన్‌ చేసి ప్రపంచ రికార్డు సృష్టించి.. అరుదైన ఘనతను రన్నర్‌ నమోదు చేశారు . ఈ అసాధారణ మారథాన​ అక్టోబర్ 25, 2025న స్వీడన్‌లోని గార్పెన్‌బర్గ్‌లో జరిగింది.

తలకు హెడ్‌ల్యాంప్‌లు ధరించి షూలేస్‌లను గట్టిగా కట్టి ..రన్నర్లు అత్యంత లోతైన భూమి లోపల ఈ ప్రత్యేకమైన రేసుని పూర్తి చేశారు. భూమి ఉపరితలం నుంచి సుమారు 1,118.56 మీటర్లు (3,669 అడుగుల 10 అంగుళాలు) లోతులో జరిగిన సర్టిఫైడ్ మారథాన్‌లో దాదాపు 18 దేశాల నుంచి యాభైఐదు మంది రన్నర్లు పాల్గొన్నారు. ఇక్కడ వాతావరణం వేడిగా, తేమగా, కొద్దిగా దుమ్ముతో కూడినది. ఇక ఈ రేసు జరిగిన లోతుని గురించి చెప్పాలంటే..ఈ భూగర్భ స్థాయి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన  ఏంజెల్ జలపాతం, స్కాట్లాండ్‌లోని UKలోని ఎత్తైన పర్వతం బెన్ నెవిస్ కిందగా ఎంతో లోతు ఉంటుందో అంత లోతైనదిగా గుర్తించారు. 

ఈ మారథాన్‌ని బికమింగ్‌ఎక్స్ (యూకే), ఐసిఎంఎం (యూకే), బోలిడెన్ (స్వీడన్) సంయుక్తంగా నిర్వహించాయి.  ఈ మారథాన్‌తో దాదాపు రూ. 8 కోట్ల డబ్బుని సేకరించారు. వీటిని దాతృత్వ కార్యక్రమాలకు వినియోగించనున్నారు. ఈ మారథాన్‌ రైసుతో మరో ప్రపంచ రికార్డుని కూడా నమోదు చేశారు. అదేంటంటే ఈ రన్నర్లు లోతైన భూగర్భ మారథాన్‌ దూరం వచ్చేసి  1,082.30 మీటర్ల (3,550 అడుగుల 10 అంగుళాలు) రన్‌ చేసి మరో రికార్డుని క్రియేట్‌ చేశారు. 

ఈ మేరకు ఈ మారథాన్‌ని నిర్వహించిన బికమింగ్‌ఎక్స్ సహ వ్యవస్థాపకుడు బేర్ గ్రిల్స్‌ మాట్లాడుతూ..వందల మీటర్ల భూగర్భంలో మారథాన్‌ను నిర్వహించడం అసాధారణమైన ఘనత అని, అయినప్పటికీ అది సాధ్యమయ్యే పరిధిలో ఉండేలా చూసుకోవడం చాలా అవసరమని పేర్కొన్నారు. సాధారణ పరిస్థితుల్లో కూడా మారథాన్ సహజంగానే కష్టమైనది, అలాంటి కఠినమైన వాతావరణంలో ఈ మారథాన్‌ రేసులో పాల్గొనడం అనేది తీవ్రమైన ఒత్తిడి అధిగమించే సవాలుగా పేర్కొన్నారు.

(చదవండి: అదే అసలైన కాన్ఫిడెన్స్..!)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement