
ఫుడ్ డెలివరి బాయ్ సాధారణంగా కస్టమర్తో మేడమ్ మీ ఆర్డర్ అని అంటారు. ఇది సర్వసాధారణం. కానీ ఇతడు ఏకంగా ఐ లవ్ యు అన్నాడు. ఆ హఠాత్పరిణామానికి కంగుతిన్న ఆ మహిళా కస్టమర్ కూడా ఐలవ్ యు అని అతడికి రిప్లై ఇవ్వడం కొసమెరుపు. సినిమాల్లో చూపించినట్లుగా తొలిచూపులోనే ప్రేమలో పడటం అన్నట్లుగా ఆ ఒక్క క్షణంలోనే ఇద్దరు ప్రేమలో పడ్డారు. కట్చేస్తే ఆ తర్వాత ఇద్దరూ..
ఇదంతా చైనాలో చోటుచేసుకుంది. చైనాలోని లియోనింగ్ ప్రావిన్స్‌కు చెందిన 27 ఏళ్ల లియు హావో ఫుడ్ డెలివరీ బాయ్. అమెరికా అలబామా నివాసి హన్నా హారిస్ 2024లో షెన్యాంగ్ కు వెళ్లింది. ఆమె అక్కడ కిండర్ గార్టెన్ టీచర్ గా పనిచేస్తోంది. ఆమెకు ఫుడ్ డెలివరీ చేసేందుకు వెళ్లినప్పుడే ఈ వింత ఘటన చోటుచేసుకుంది. హన్నా అతడిని చూడటం అదే తొలిసారి. అయితే ఆ రోజు ఆ ఫుడ్ని మేడపైన రూమ్‌కి డెలిరీ చేయాల్సి ఉంది. ఆ నిమిత్తం లిప్ట్లో వెళ్తుండగా ప్రమాదవశాత్తు హన్నా కూడా అదే లిఫ్ట్లో ఉండటం జరిగింది.
దాంతో అతడు ఆమెను ఎలా పలకరించాలో తోచక హాయ్..!.. ఐలవ్ యు అని పలికరించాడు. ఆ సంబోధనకు విస్తుపోతూ..ఆమె కూడా అనాలోచితంగా ఐ లవ్ యు అని రిప్లై ఇచ్చేసింది. అంతే ఇరువురు ఒక్కసారిగా తెల్లబోయనట్లుగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని నవ్వుకున్నారు కాసేపు. అంతే ఆ క్షణం నుంచి ఇరువురి మధ్య విడదీయరాని ప్రేమ బంధం గాఢంగా అల్లుకుపోయింది.
డెలివరీ బ్యాకెండ్ యూప్ సాయంతో ఇరువురు చాట్ చేసుకునేవారు. నిజానికి ఇద్దరికి ఒకరి భాష ఒకరికి సరిగా రాదు, అర్థం కాదు. కానీ భాషా అంతరంతో సంబంధంలేని ప్రేమ వారిని ఒక్కటిగా చేయడమే కాదు, కమ్యునికేషన్ సమస్యకు తావులేకుండానే సాంకేతిక సాయంతో వారి వారి భాషల్లోనే సంభాషించుకోవడం విశేషం.
ఈ ఏడాది మార్చిలోనే పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు కూడా. అంతేగాదు జూన్లో తన బాయ్‌ఫ్రెండ్ పుట్టినరోజుని జరుపుకుంది హన్నా. ఆమె అతడిని యూఎస్ తీసుకువెళ్లాలని భావిస్తున్నప్పటికీ..లియు మాత్రం తమ భవిష్యత్తును చైనాలోనే ప్లాన్ చేయాలని యోచిస్తున్నాడు. ఈ ఇద్దరు లవ్స్టోరీ నెట్టింట వైరల్గా మారడమే కాదు..మనోడు మాములోడు కాదు అంటూ లియూపై ఫన్నీగా సెటైర్లు వేస్తూ..పోస్టులు పెట్టారు.
(చదవండి: స్ట్రెంగ్త్ ట్రైనింగ్‌తో ఆ అమ్మ లైఫే మారిపోయింది..! బీపీ, షుగర్ మాయం..)