
ఓ వయసు వచ్చాక రోగాల బారినపడటం అనేది సహజం. అయితే అప్పటికైనా తేరుకుని జీవనశైలిలో మార్పులు, ఫిట్నెస్పై దృష్టిసారించి కేర్ తీసుకుంటే చాలు. చాలామటుకు వ్యాధులు తగ్గుముఖం పడతాయి. ఇక్కడ ఆలస్యం అనే పదం గాక..ఆశావాహ దృక్పథానికి చోటిస్తే..కచ్చితంగా అద్భుతాలు తప్పక జరుగుతాయి. అందుకు నిదర్శంన ఈ అమ్మే..!. పాపం నడవలేక ఇబ్బంది పడింది. ఓ పక్క మధుమేహం, బీపీతో నరకం చూసింది. అలాంటామె కొడుకు సపోర్టుతో ఎంతలా ఆమె జీవితం మలుపు తిరిగిందంటే..ఈమె ఆమేనా అనే సందేహం కలిగేంతలా చురుగ్గా మారిపోయింది. ఓ అథ్లెటిక్ మాదిరిగా తయారైంది. అంతేగాదు చుట్టుముట్టిన అనారోగ్య సమస్యలన్ని ఒక్కొక్కటిగా మాయమైపోయాయి. ఎలా అంటే..
ఫిట్‌నెస్ నిపుణుడు కుల్విందర్ సింగ్ ఆరోగ్యవంతంగా మారిన తన 59 ఏళ్ల తల్లి కథను ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసుకున్నారు. తన తల్లి ఒకప్పుడు డయాబెటిస్ , రక్తపోటు సమస్యలతో బాధపడుతుండేదని తెలిపారు. వాటికి తోడు ఆర్థరైటిస్ సమస్య కూడా జత అవ్వడంతో కనీసం బాత్రూమ్కి కూడా వెళ్లలేని పరిస్థితికి చేరుకుందని చెప్పుకొచ్చారు.
తన పరిస్థితి చూసి తనకే బాధగా అనిపించేదని అన్నారు. కనీసం కాలు కదిపేందుకు చాలా బాధపడిపోయేదన్నారు. శరీరంలో యూరిక్ యాసిడ్స్ పెరిగిపోయి ఆమెకు కనీసం మోకాలిని వంచలేని పరిస్థితికి వచ్చేసింది. ఫలితంగా ఆమె 90 కిలోల అధిక బరువు కూడా చేరుకున్నట్లు తెలిపారు. ఇక ఇలానే ఉంటే ఆమె పరిస్థితి క్రిటికల్గా మారిపోతుందని తానే ఆమెను జిమ్కు తీసుకువెళ్లి బల శిక్షణ తీసుకోవాల్సిందిగా బలవంతం చేశారట.
అద్భుతమైన పరివర్తన..
దాంతో ఆమె పరిస్థితి రెండు నెలల్లోనూ పూర్తిగా మారిపోయిందిచి. పైగా మెరుగైన ఫలితాలు కనిపించాయని అన్నారు. చెప్పాలంటే శరీరంలో కొవ్వు చాలామటుకు తగ్గిపోయిందని చెప్పారు. రక్తపోటు, మధుమేహం సాధారణ స్థితికి వచ్చేశాయి. అలాగే ఆమె మోకాలి నొప్పి 50% మెరుగ్గా ఉండటమేగాక, చాలా అద్భుతమైన మార్పులు చోటుచేసుకున్నాయని అన్నారు.
స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అంటే..
బరువులు ఎత్తడం వంటి శిక్షణతో కండరాలను బలోపేతం చేయడం. ఇక్కడ కుల్విందర్ సింగ్ తల్లి ఒక గంటపాటు నిరంతరాయంగా నడవడం, రెండు గంటల వ్యాయామం, 40 కిలోలు వరకు బరువులు ఎత్తడం వంటివి చేసేది. ఒక నిమిషం పైనే ప్లాంక్ పొజిషన్లో ఉండటం వంటివి చేసి అద్భుతమైన మార్పులు చవిచూశారామె.
అంతేగాదు జస్ట్ ఆరు నెలలకే చలాకీగా పరిగెత్తగలిగింది. వృద్ధాప్యంలో ఇలాంటివి చేయడం గురించి ఆలస్యంగా పరిగణించొద్దు..ఆరోగ్యవంతమైన మార్పుకి గ్రాండ్ వెల్కమ్ చెప్పడమని భావించండి అని చెబుతున్నారు ఫిట్‌నెస్ నిపుణులుడు కుల్విందర్ సింగ్
స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ప్రాముఖ్యత..
కార్డియో, యోగా, పైలేట్స్ వంటి ఇతర రకాల వ్యాయామాలు మానసిక ఆరోగ్యానికి మంచివైతే ఈ బల శిక్షణ అనేది జీవన నాణ్యతను మెరుగుపరుస్తుందట. అంతేగాదు రోజువారీ కార్యకలాపాలను చేసేలా సామర్థ్యాన్ని పెంపొందించుకునేలా చేస్తుందని పరిశోధనలో తేలింది. అంతేగాదు ప్రపంచవ్యాప్తంగా జరిగిన 16 అధ్యయనాల్లో కండరాలను బలోపేతం చేసే వ్యాయామాలు ఆయుర్ధాయాన్ని పెంచుతాయని నిరూపితమైంది కూడా.
ఇది కండర ద్రవ్యరాశిని సంరక్షించడమే కాదు పెంచేందుకు సహాయపడుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) ప్రకారం, ఇది కండరాలు, ఎముకల పెరుగుదలను ప్రేరేపించి బోలు ఎముకల వ్యాధి, బలహీనతలను నివారించి, తద్వారా ఆరోగ్యవంతంగా ఉండేలా చేస్తుందట.
గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వ్యైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.
(చదవండి: కూలీ కుమార్తె సక్సెస్ స్టోరీ..! టీసీఎస్ నుంచి ఐఏఎస్ రేంజ్‌కి..)