breaking news
strenght
-
స్ట్రెంగ్త్ ట్రైనింగ్‌తో ఆ అమ్మ లైఫే మారిపోయింది..! బీపీ, షుగర్ మాయం..
ఓ వయసు వచ్చాక రోగాల బారినపడటం అనేది సహజం. అయితే అప్పటికైనా తేరుకుని జీవనశైలిలో మార్పులు, ఫిట్‌నెస్‌పై దృష్టిసారించి కేర్ తీసుకుంటే చాలు. చాలామటుకు వ్యాధులు తగ్గుముఖం పడతాయి. ఇక్కడ ఆలస్యం అనే పదం గాక..ఆశావాహ దృక్పథానికి చోటిస్తే..కచ్చితంగా అద్భుతాలు తప్పక జరుగుతాయి. అందుకు నిదర్శంన ఈ అమ్మే..!. పాపం నడవలేక ఇబ్బంది పడింది. ఓ పక్క మధుమేహం, బీపీతో నరకం చూసింది. అలాంటామె కొడుకు సపోర్టుతో ఎంతలా ఆమె జీవితం మలుపు తిరిగిందంటే..ఈమె ఆమేనా అనే సందేహం కలిగేంతలా చురుగ్గా మారిపోయింది. ఓ అథ్లెటిక్ మాదిరిగా తయారైంది. అంతేగాదు చుట్టుముట్టిన అనారోగ్య సమస్యలన్ని ఒక్కొక్కటిగా మాయమైపోయాయి. ఎలా అంటే..ఫిట్నెస్ నిపుణుడు కుల్విందర్ సింగ్ ఆరోగ్యవంతంగా మారిన తన 59 ఏళ్ల తల్లి కథను ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసుకున్నారు. తన తల్లి ఒకప్పుడు డయాబెటిస్ , రక్తపోటు సమస్యలతో బాధపడుతుండేదని తెలిపారు. వాటికి తోడు ఆర్థరైటిస్ సమస్య కూడా జత అవ్వడంతో కనీసం బాత్రూమ్కి కూడా వెళ్లలేని పరిస్థితికి చేరుకుందని చెప్పుకొచ్చారు. తన పరిస్థితి చూసి తనకే బాధగా అనిపించేదని అన్నారు. కనీసం కాలు కదిపేందుకు చాలా బాధపడిపోయేదన్నారు. శరీరంలో యూరిక్ యాసిడ్స్ పెరిగిపోయి ఆమెకు కనీసం మోకాలిని వంచలేని పరిస్థితికి వచ్చేసింది. ఫలితంగా ఆమె 90 కిలోల అధిక బరువు కూడా చేరుకున్నట్లు తెలిపారు. ఇక ఇలానే ఉంటే ఆమె పరిస్థితి క్రిటికల్‌గా మారిపోతుందని తానే ఆమెను జిమ్‌కు తీసుకువెళ్లి బల శిక్షణ తీసుకోవాల్సిందిగా బలవంతం చేశారట.అద్భుతమైన పరివర్తన..దాంతో ఆమె పరిస్థితి రెండు నెలల్లోనూ పూర్తిగా మారిపోయిందిచి. పైగా మెరుగైన ఫలితాలు కనిపించాయని అన్నారు. చెప్పాలంటే శరీరంలో కొవ్వు చాలామటుకు తగ్గిపోయిందని చెప్పారు. రక్తపోటు, మధుమేహం సాధారణ స్థితికి వచ్చేశాయి. అలాగే ఆమె మోకాలి నొప్పి 50% మెరుగ్గా ఉండటమేగాక, చాలా అద్భుతమైన మార్పులు చోటుచేసుకున్నాయని అన్నారు.స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అంటే..బరువులు ఎత్తడం వంటి శిక్షణతో కండరాలను బలోపేతం చేయడం. ఇక్కడ కుల్విందర్ సింగ్ తల్లి ఒక గంటపాటు నిరంతరాయంగా నడవడం, రెండు గంటల వ్యాయామం, 40 కిలోలు వరకు బరువులు ఎత్తడం వంటివి చేసేది. ఒక నిమిషం పైనే ప్లాంక్ పొజిషన్లో ఉండటం వంటివి చేసి అద్భుతమైన మార్పులు చవిచూశారామె. అంతేగాదు జస్ట్ ఆరు నెలలకే చలాకీగా పరిగెత్తగలిగింది. వృద్ధాప్యంలో ఇలాంటివి చేయడం గురించి ఆలస్యంగా పరిగణించొద్దు..ఆరోగ్యవంతమైన మార్పుకి గ్రాండ్ వెల్కమ్ చెప్పడమని భావించండి అని చెబుతున్నారు ఫిట్నెస్ నిపుణులుడు కుల్విందర్ సింగ్స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ప్రాముఖ్యత..కార్డియో, యోగా, పైలేట్స్ వంటి ఇతర రకాల వ్యాయామాలు మానసిక ఆరోగ్యానికి మంచివైతే ఈ బల శిక్షణ అనేది జీవన నాణ్యతను మెరుగుపరుస్తుందట. అంతేగాదు రోజువారీ కార్యకలాపాలను చేసేలా సామర్థ్యాన్ని పెంపొందించుకునేలా చేస్తుందని పరిశోధనలో తేలింది. అంతేగాదు ప్రపంచవ్యాప్తంగా జరిగిన 16 అధ్యయనాల్లో కండరాలను బలోపేతం చేసే వ్యాయామాలు ఆయుర్ధాయాన్ని పెంచుతాయని నిరూపితమైంది కూడా. ఇది కండర ద్రవ్యరాశిని సంరక్షించడమే కాదు పెంచేందుకు సహాయపడుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) ప్రకారం, ఇది కండరాలు, ఎముకల పెరుగుదలను ప్రేరేపించి బోలు ఎముకల వ్యాధి, బలహీనతలను నివారించి, తద్వారా ఆరోగ్యవంతంగా ఉండేలా చేస్తుందట. View this post on Instagram A post shared by Kulwinder Singh (@freebird.sodhi)గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వ్యైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: కూలీ కుమార్తె సక్సెస్ స్టోరీ..! టీసీఎస్ నుంచి ఐఏఎస్ రేంజ్‌కి..) -
పెంచిన పాము కాటేస్తే.. సరిగ్గా పాక్ దుస్థితి ఇదే
ఆఫ్ఘానిస్థాన్‌లో తాలిబాన్ పాలన మొదలయ్యాక పాకిస్తాన్లో తెహ్రిక్-ఈ తాలిబాన్ పాకిస్తాన్(టీటీపీ) మరింత పుంజుకున్నదని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (యూఎన్ఎస్సీ)కి చెందిన మానిటరింగ్ కమిటీ ఒక నివేదికలో తెలిపింది. పాకిస్తాన్‌లోని గిరిజన ప్రాంతాలపై పట్టు కోసం ఆఫ్ఘానిస్థాన్ సరిహద్దుల్లో ఉన్న పాకిస్తాన్‌లోని గిరిజన ప్రాంతాలపై నియంత్రణ సాధించేందుకు టీటీపీ తన ప్రయత్నాలను ముమ్మరం చేసిందని ఈ నివేదిక వెల్లడించింది. కాబూల్ పతనం అనంతరం ఈ దిశగా ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయని సమాచారం. టీటీపీ సరిహద్దు ఆవల నుండి తాలిబాన్ మద్దతు పొందుతోంది. పాకిస్తాన్‌పై పట్టు బిగించడంలో టీటీపీ ఊపందుకుంటున్నట్లు సభ్య దేశాల అంచనా. ఆఫ్ఘానిస్తాన్‌ను తాలిబాన్ స్వాధీనం చేసుకోవడం ద్వారా ధైర్యాన్ని పొందిన టీటీపీ ఇప్పుడు పాకిస్తాన్లో భూభాగంపై నియంత్రణను తిరిగి స్థాపించాలనే ఆశయంతో పనిచేస్తున్నదని నివేదిక తెలియజేస్తున్నది. బలోపేతమవుతున్న టీటీపీ పాకిస్తాన్లో ఇటీవల జరిగిన తీవ్రవాద దాడులు టీటీపీ బలోపేతాన్ని రుజువు చేస్తున్నాయి. సరిహద్దు ప్రాంతాల్లోని ముఖ్య లక్ష్యాలు, పట్టణ ప్రాంతాల్లో సాఫ్ట్ లక్ష్యాలపై టీటీపీ దృష్టి సారిస్తోందని నివేదిక పేర్కొంది. ఆఫ్ఘానిస్తాన్‌లో టీటీపీ యధేచ్ఛగా తన కార్యకలాపాలను కొనసాగిస్తే అది ప్రాంతీయ ముప్పుగా మారుతుందని సభ్య దేశాలు ఆందోళన చెందుతున్నాయని నివేదిక పేర్కొంది. యూఎన్‌ఎస్‌సీలోని కొన్ని సభ్య దేశాలు కూడా టీటీపీ తిరిగి పుంజుకోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. భవిష్యత్‌లో టీటీపీ వివిధ విదేశీ సంస్థలతో అనుబంధం ఏర్పరుచుకోవచ్చని, సమీప భవిష్యత్తులో అల్-ఖైదాతో విలీనమయ్యే అవకాశం కూడా ఉండవచ్చని నివేదిక తెలిపింది. టీటీపీకి అల్-ఖైదా మార్గనిర్దేశం అల్-ఖైదా ఇప్పటికే టీటీపీకి మార్గనిర్దేశం చేస్తోందని, పాకిస్తాన్ లోపల లక్షిత ఉగ్రవాద దాడులను నిర్వహించడానికి సహాయం చేస్తున్నదని నివేదిక పేర్కొంది. ఆఫ్ఘానిస్థాన్‌లోని కునార్ ప్రావిన్స్‌లో నిషేధిత సంస్థ ఈస్ట్ టర్కెస్తాన్ ఇస్లామిక్ మూవ్మెంట్ (ఈటీఐఎం)శిక్షణా శిబిరాలను టీటీపీ నాయకులు ఉపయోగిస్తున్నారని, ఇది తాలిబాన్ పాలన కింద వివిధ సమూహాల మధ్య సమన్వయం, మద్దతును సూచిస్తున్నదని నివేదిక తెలిపింది. 20కిపైగా ఉగ్రసంస్థలకు ఆఫ్ఘానిస్తాన్ అండ? తీవ్రవాదం విషయంలో ఆఫ్ఘానిస్తాన్ ప్రపంచవ్యాప్తంగా పేరొందింది. దాని పొరుగున ఉన్న పాకిస్తాన్లో అశాంతిని వ్యాప్తి చేయడానికి పనిచేస్తున్న 20కి మించిన ఉగ్రవాద సమూహాలకు ఆఫ్ఘానిస్తాన్ సురక్షితమైన ప్రాంతంగా ఉంది. తాలిబాన్, టీటీపీ, అల్ ఖైదాలు సైద్ధాంతికంగా కూడా సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నాయనేది వాస్తవం. ఆఫ్ఘానిస్తాన్‌లో తాలిబాన్, అల్ ఖైదాలు రహస్యంగా పనిచేస్తున్నాయి. అల్ ఖైదా తన కార్యాచరణ సామర్థ్యాన్ని రహస్యంగా పునర్నిర్మించుకుంటూ, నూతనంగా యువతను రిక్రూట్ చేయడానికి ఆఫ్ఘానిస్తాన్‌ను రవాణా కేంద్రంగా ఉపయోగిస్తోంది. ప్రాంతీయ తీవ్రవాద గ్రూపుల సహకారంతో.. అల్ ఖైదా నాయకులు ఆఫ్ఘానిస్తాన్‌లో ఉన్న నాన్-ఆఫ్ఘన్ మూలాలు కలిగిన ప్రాంతీయ తీవ్రవాద గ్రూపులతో సహకారాన్ని బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఉజ్బెకిస్తాన్, జమాత్ అన్సరుల్లా సహకారంతో మధ్య ఆసియాతో పాటు ఇతర దేశాలలో చొరబడేందుకు ప్రయత్నిస్తున్నారని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఆ నివేదికలో పేర్కొంది. ఇది కూడా చదవండి: పాపం.. జపాన్ భవిష్యత్తు అలా ఏడ్చింది -
రసవత్తరంగా ఎద్దుల బల ప్రదర్శన
జంగహేశ్వరపురం(గురజాలరూరల్): జంగమహేశ్వరపురం గ్రామంలో పలనాటి తిరుమలగా ప్రసిద్ధి చెందిన శ్రీవేంకటేశ్వరస్వామి తిరునాళ్ల సందర్భంగా రైతుసంఘ కమిటీ వారు ఎద్దుల బండలాగు పోటీలను ఆదివారం రాత్రి వరకు నిర్వహించారు. సేద్యపు విభాగాలకు జాతీయ స్థాయిలో పోటీలను నిర్వహిస్తున్నట్లు, ప్రతి విభాగంలో 5 బహుమతులు అందిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. సేద్యపు విభాగంలో: దాచేపల్లి మండలం, కేసానుపల్లి గ్రామానికి చెందిన నెల్లూరి రామకోటయ్య ఎద్దులు 3500 అడుగుల లాగి రూ. 30,000 మొదటి బహుమతి, కృష్ణా జిల్లా గన్నవరం మండలం మెట్లపల్లి గ్రామానికి చెందిన చికలపాటి రాజీవ్ ఎద్దులు 3250 అడుగులు లాగి రూ. 25,000 రెండోహుమతిని, కర్నూలు జిల్లా పాణ్యం మండలం, కుండజూటూరు గ్రామానికి చెందిన సద్దల సూర్యనారాయణరెడ్డి ఎద్దులు 3059 అడుగులు లాగి రూ. 15,000 మూడవ బహుమతిని, పత్తిపాడుకు చెందిన కాకాని శ్రీహరిరావు ఎద్దులు 3016 అడుగులు లాగి రూ.10,000 నాల్గో బహుమతిని, మాచవరం మండలం, కొత్తపాలెం గ్రామానికి చెందిన యామని మోహన్శ్రీ ఎద్దులు 3000 అడుగులు లాగి రూ. 8,000 ఐదో బహుమతిని గెలుపొందాయి. న్యాయనిర్ణేతలుగా పి.సుబ్బారెడ్డి, గూడ శ్రీనివాసరావు పాల్గొన్నారు. కార్యక్రమంలో నిర్వహణ కమిటీ, చవ్వా చౌరెడ్డి, రెక్కల యలమందారెడ్డి, భవనాసి పకీరరెడ్డి, ఎనుముల వెంకటరెడ్డి, అడుసుమల్లి కోటయ్య, ఎనుముల సుబ్బారెడ్డి ,గొల్లపల్లి సత్యం, ఆవుల లక్ష్యారెడ్డి, గ్రామపెద్దలు, ఎడ్లపోటీలను లకించేందుకు చుట్టు పక్కల గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.