
రిలయన్స్ ముఖేష్ అంబానీ, నీతా దంపతుల ముద్దుల కోడలు, అనంత్ అంబానీ భార్య రాధిక మర్చంట్ పుట్టిన రోజు పార్టీ ఉత్సాహంగా జరిగింది.అనన్య పాండే, జాన్వి కపూర్ , తారా సుతారియా వంటి అనేక మంది బి-టౌన్ సెలబ్రిటీలు వేడుకలకు హాజరు కావడంతో ఈ బర్త్‌డే వేడుక స్టార్-స్టడ్ ఈవెంట్‌గా మారింది. ఓర్రీ అని పిలిచే ఓర్హాన్ అవత్రమణి తన సోషల్ మీడియా హ్యాండిల్ దీనికి సంబంధించిన వీడియోను షేర్ చేశాడు. దీంతో వేడుకలు వైరల్‌గా మారాయి.
అక్టోబర్ 16న రాధిక మర్చంట్ పుట్టినరోజు సెలబ్రేషన్ జరిగింది. ఈ వేడుకలో అత్తగారు నీతా అంబానీ హైలైట్‌గా నిలిచారు. రాధిక ఫోటో ఉన్నటీ షర్టు ధరించి, ముద్దుల కోడల్ని ముద్దుగా ఆలింగనం చేసుకోవడం అందర్నీ ఆకట్టుకుంది. ఈ బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో ఆకాష్ అంబానీతో పాటు, రాధిక స్నేహితులు కూడా పార్టీలో కనిపించారు.
కాగా వ్యాపారవేత్త వీరెన్ , శైలా మర్చంట్ దంపతుల కుమార్తె రాధిక, తన బాల్య స్నేహితుడు, ప్రేమికుడుఆకాష్ అంబానీని ( జూలై 2024)వివాహం చేసుకుంది.