
హెల్త్ వార్నింగ్ మెసేజ్‌లు సిగరెట్, గుట్కా ప్యాకెట్లపై ఉండటం చూసే ఉంటాం. పొగాకు ఉత్పత్తుల ప్యాకెట్లపై ఈ హెచ్చరిక సందేశం స్పష్టంగా కనిపిస్తుంది. ఇంతలా కనిపిస్తున్నా..ఎలా పొగరాయళ్లు వీటికి అలవాటు పడతారా అని తెగ అనుకునేవాళ్లు చాలామంది. దానికి కారణం ఏంటో ఇప్పుడు దాదాపుగా అందరికి తెలుస్తుంది. ఎందుకంటే అలాంటి జాబితాలోకి నోరూరించే ఈ చిరుతిండ్ల ఇప్పుడు చేరిపోనున్నాయి. తలుచుకుంటేనే తినాలనిపిచే ఆ స్నాక్స్ ఐటెంపై ఇలా వార్నింగ్ మెసెజ్‌లు ఉంటే ఆహారప్రియుల పరిస్థితి ఊహకందనిది..
పొగాకు ఉత్పత్తులపై ఉండే హెల్త్ వార్నింగ్ మెసేజ్ జాబితాలోకి సమోసాలు, జిలేబీలు కూడా వచ్చేశాయి. ఇదేంటి ఎంతో ఇష్టంగా ఆ చిరుతిండ్ల అని అవాక్కవ్వకండి. ఎందుకంటే వాటిని తినే మనం చేజేతులారా ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నామని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ నేపథ్యంలోనే ప్రభుత్వం సిగరెట్ ప్యాకెట్లపై ఉన్నట్లుగా ఆ ఆహార పదార్థాలపై కూడా ఈ హెచ్చరిక సందేశాలు ఉండాలని ఆదేశాలు జారీ చేసిందట. త్వరలో ఇది అమలు కానుందట కూడా.
నిజానికి మనదేశంలో ప్రతి నలుగులో ఒకరు ఊబకాయ సమస్యతో ఇబ్బంది పడుతున్నట్లు నివేదకలు చెబుతున్నాయి. దాన్ని నివారించేందుకు ఇలా సిగరెట్ ప్యాకట్లపై ఉన్నట్లుగానే సమోసాలు, జిలేబీలు మాదిరిగా డీప్‌ఫ్రై చేసే ఇతర స్నాక్స్‌పై కూడా హెల్త్ వార్నింగ్ మెసేజ్‌లు ఉండాలని ఆరోగ్య మత్రిత్వ శాఖ ఆదేశించింది.
అంతేగాదు కేంద్ర ఆరోగ్య సంస్థలు బహిరంగ ప్రదేశాల్లో అమ్మే ఈ జిలేబీలు, సమోసాలు ఉన్నచోట తప్పనిసరిగా ఆరోగ్య హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని పేర్కొంది. ఆ ఆరోగ్య హెచ్చరికలో ఆ ఆహారాల్లో ఉండే కొవ్వు, చక్కెర శాతాన్ని హైలట్ చేస్తారట. కాబట్టి ఇది అచ్చం సిగరెట్లపై ఉండే ఆరోగ్య హెచ్చరిక లేబుల్ వలే ప్రభావవంతంగా ఉంటుందని ఆరోగ్య మంత్రిశాఖ పేర్కొంది.
ఇది అవసరమా..
ఇటీవల కాలంలో భారతదేశంలో పెరుగుతున్న అనారోగ్యకరమైన జీవనశైలి, ఉద్ధృతమవుతున్న వ్యాధుల ఆందోళనల నేపథ్యంలోనే ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇలా ఆదేశాలు జారి చేసింది. ప్రస్తుతం, ఊబకాయం, చక్కెర, అధిర రక్తపోటు, గుండె జబ్బు వంటి సమస్యల బారిన ఏటా వేలాది మంది పడుతున్నారని, అందుకు ప్రధాన కారణాలు ఆహారపు అలవాట్లు, జీవనశైలే అని నిపుణులు చెబుతున్నారు. అంతేగాదు 2050 నాటికి సుమారు 449 మిలియన్లకు పైగా భారతీయులు అధిక బరువు లేదా ఊబకాయంతో బాధపడే అవకాశం ఉందని నివేదికలు హెచ్చరిస్తున్నాయి.
బ్యాన్ కాదు...
ఇలా హెల్త్ వార్నింగ్ మెసేజ్‌ల పెట్టడం వెనుక ప్రధాన ఉద్దేశ్యం ఆయా చిరుతిండ్లను పూర్తిగా నిషేధించడం కాదని స్ఫష్టం చేసింది ప్రభుత్వం. కేవలం ప్రజలకు ఆయా ఆహారపదార్థాలపై అవగాహన కల్పించి ఆరోగ్యంగా జీవించేలా చేయడమే లక్ష్యం అని పేర్కొంది. ఈ చొరవ ప్రధాని మోదీ ఫిట్ ఇండియా" ఉద్యమం నుంచి వచ్చిందట. ఆయన పిలుపునిచ్చిన 10% నూనెని తగ్గించి ఆరోగ్యంగా ఉందాం..అలాగే భారతదేశాన్ని మరింత బలోపేతంగా మారుద్దాం అన్న నినాదం నుంచి పుట్టుకొచ్చిందే ఈ ఆలోచన అని ఆరోగ్య మంత్రిత్వశాఖ పేర్కొంది.
(చదవండి: దారి తప్పుతున్న ఆన్‌లైన్ ట్రోలింగ్!)