అపార్ట్‌మెంట్‌ కిటికీ నుంచి 500 నోట్ల వర్షం.. ఏమైందో తెలిసే లోపే ట్విస్ట్‌.. | Two Crore Found In Raids On Odisha Engineer Baikuntha Nath Sarangi | Sakshi
Sakshi News home page

అపార్ట్‌మెంట్‌ కిటికీ నుంచి 500 నోట్ల వర్షం.. ఏమైందో తెలిసే లోపే ట్విస్ట్‌..

May 30 2025 1:49 PM | Updated on May 30 2025 3:11 PM

Two Crore Found In Raids On Odisha Engineer Baikuntha Nath Sarangi

భువనేశ్వర్‌: ఒక ప్రభుత్వ ఇంజినీర్‌ ఇంట్లో ఆదాయానికి మించిన ఆస్తులు బయటపడ్డాయి. భారీ అవినీతి తిమింగ‌లం విజిలెన్స్‌కు చిక్కింది. విజిలెన్స్‌ అధికారులు తన ఇంటికి వస్తున్నారన్న విషయం తెలుసుకుని సదరు అధికారి.. ఇంట్లోని నోట్ల కట్టలను కిటికీలోంచి బయటపడేశాడు. ఆ కరెన్సీ నోట్ల వర్షంతో స్థానికులు అవాక్కయ్యారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

వివరాల ప్రకారం.. ఒడిశా రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖలో బైకుంఠనాథ్ సారంగి చీఫ్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. ఆయన ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారంటూ ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన విజిలెన్స్‌ అధికారులు.. సోదాలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. శుక్రవారం ఉదయం నుంచి ఒడిశాలోని అంగుల్‌, భువనేశ్వర్‌, పూరిలోని పిపిలి సహా మొత్తం ఏడు ప్రాంతాల్లోని సారంగి నివాసాలు, కుటుంబ సభ్యులు, సన్నిహితుల ఇళ్లలో అధికారులు ఏకకాలంలో దాడులు చేపట్టారు.

 

ఈ క్రమంలో విజిలెన్స్‌ అధికారులు తన ఫ్లాట్‌ వద్దకు రాగానే సారంగి ఇంట్లోని నోట్ల కట్టలను కిటికీలోంచి బయటకు పడేశాడు. కింద వెళ్తున్న వారు కిటికిలో నుంచి పడుతున్న నోట్లను చూసి ఖంగుతున్నారు. అనంతరం, నగదును అధికారులు రికవరీ చేశారు. ఈ సోదాల్లో భాగంగా రూ.రెండు కోట్లకు పైగా నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇందులో భాగంగా 26 మంది అధికారులు సోదాల్లో పాల్గొన్నారు. వారు నోట్ల కట్టలు లెక్క పెడుతోన్న ఫొటోలు, వీడియోలు వెలుగులోకి వచ్చాయి.

 

Advertisement
 
Advertisement
Advertisement