
ప్రేమ వివాహం చేసుకున్న ఓ యువ జంటపై పెద్దలు అమానుషంగా ప్రవర్తించారు. నాగలికి ఎద్దుల్లాగా కట్టి.. కర్రలతో కొడుతూ వాళ్లతో పొలం దున్నడం పేరిట చితకబాదారు. ఆపై పాపపరిహారం అంటూ గుడిలోనూ చిత్రహింసలకు గురి చేశారు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
ఒడిశాలో దారుణం జరిగింది. ప్రేమ వివాహం చేసుకున్న ఓ యువజంట పట్ల ఊరి పెద్దలు అమానుషంగా ప్రవర్తించారు. నాగలికి ఎద్దుల్లాగా ఆ జంటను కట్టి.. కర్రలతో కొడుతూ వాళ్లతో పొలం దున్నించారు. రాయగడ జిల్లాలోని కంజమజ్హిరా గ్రామంలో ఈ ఘటన జరిగింది.
గ్రామానికి చెందిన యువకుడు, యువతి చాలాకాలంగా ప్రేమించుకుంటున్నారు. పెద్దలను ఒప్పించి ఇటీవలె వివాహం చేసుకున్నారు. అయితే ఈ వివాహానికి ఊరి పెద్దలు కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే ఈ ఇద్దరూ వరుసకు బంధువులే అయినప్పటికీ.. గ్రామ ఆచారం ప్రకారం ఈ తరహా వివాహం అపచారమని చెబుతూ ఈ శిక్షను విధించారు.
తొలుత వీళ్లతో పొలం దున్నడం పేరిట హింసించిన కొందరు.. ఆపై గుడికి తీసుకెళ్లి పాపపరిహారం పేరిట ప్రత్యేక పూజలు చేయించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
ଘୃଣ୍ୟ ମାନସିକତା...ପ୍ରେମ ପାଇଁ ବଳଦ ସାଜିଲେ ପ୍ରେମୀଯୁଗଳ...ଏଭଳି ଦୃଶ୍ୟ ଦେଖିବାକୁ ମିଳିଛି ରାୟଗଡ଼ା ଜିଲ୍ଲା କଲ୍ୟାଣସିଂହପୁର ଅଞ୍ଚଳରରେ #Rayagada #Kalyansinghapur #Badakhabar #badakhabaratv #Odisha pic.twitter.com/mVr79DFarv
— Bada Khabar (@badakhabarnews) July 11, 2025