థాంక్యూ నాన్నా..! మాజీ మంత్రికి దక్కిన అపూర్వ స్వాగతం .. | Former Goa Minister Gets Heartfelt Announcement From Pilot Daughter, Watch Video Trending On Social Media | Sakshi
Sakshi News home page

థాంక్యూ నాన్నా..! మాజీ మంత్రికి దక్కిన అపూర్వ స్వాగతం..

Jul 10 2025 12:56 PM | Updated on Jul 10 2025 4:27 PM

Former Goa Minister heartfelt announcement from pilot daughter

కొన్ని అరుదైన ఘటనలు కోటిలో ఇద్దరో ఒక్కరో తల్లిదండ్రులుకే అలాంటి అదృష్టం దక్కుతుంది. మనం పెంచి ప్రయోజకులుగా తీర్చిదిద్దిన మన పిల్లల చేత అందరూ గౌరవమన్ననలను అదుకోవడం అనేది సర్వసాధారణమే. కానీ అనుకోకుండా పిల్లల ఉద్యోగ బాధ్యతల నడుమే మన తల్లిదండ్రులనే కలిసి అవకాశం లభిస్తే..ఆ ఆనందమే వేరు. పైగా సగర్వంగా వాళ్ల గురించి మనం చెబుతుంటే ఆ మాటలు వింటున్నా..లేదా ఆ అత్యున్న హోదాలో మనల్ని చూసినా..మన తల్లిందండ్రుల కళ్లల్లో ఉప్పొంగే ఆ ఆనంద క్షణాలు ఎన్నటికీ మర్చిపోలేం. అలాంటి ఆనంద క్షణాలే ఓ మాజీ మంత్రికి దక్కాయి. నెట్టింట ఆ విషయం తెగ వైరల్‌ అవ్వడమే గాక కొందరికే దక్కుతుంది ఇలాంటి అదృష్టం అని అంతా కొనియాడుతున్నారు ఆ తండ్రి కూతుళ్లను. 

అసలేం జరిగిందంటే..చెన్నై నుంచి గోవాకు వెళ్తున్న గోవా మాజీ మంత్రి దీపక్ ధవళికర్‌కు అరుదైన స్వాగతం లభించింది. ఊహించని విధంగా తాను ప్రయాణించే విమానంలోనే కూతురు గౌరీ ధవళికర్ పైలట్‌గా ఉన్నారు. అది తెలుసుకున్న కూతురు గౌరీ ధవళికర్‌ వెంటనే ఆమె సాధారణ ప్రయాణికులను స్వాగతిస్తున్నట్లుగా మాట్లాడుతూ..వారిలో తండ్రి కూడా ఉన్నారంటూ పరిచయం చేయడమే గాక ఈ విమాన జర్నీ నాకు చాలా ప్రత్యేకమైనది అని ఉద్వేగంగా చెబుతుంది. 

"ఈ రోజు నేనే నా తండ్రితో కలిసి ఈ విమానంల ప్రయాణిస్తున్నా. ఈ రోజు మొట్టమొదటిసారిగా ఆయన్ను గోవాలోని మా ఇంటికి పైలట్‌గా నేను తీసుకువెళ్తున్నా. నా తండ్రే ఇప్పుడు ప్రయాణికుడు అని ఆనందంగా అనౌన్స్‌మెంట్‌ ఇచ్చారు." పైలట్‌ గౌరీ ధవళికర్. ఇలా ఆమె మాటలు పూర్తి అయ్యేలోపే.. ప్రయాణకులు హర్షధ్వానాలతో చప్పట్లు కొట్టి ప్రశంసించారు ఆ తండ్రి కూతుళ్లని. 

అంతేగాదు ఆ విమానంలోని ప్రయాణికులందరి సమక్షంలోనే కృతజ్ఞతలు తెలిపింది. నా కలలన్నింటిన నిజంచేసేలా ఈ మొత్తం ప్రపంచాన్ని ఇచ్చినందుకు నా తండ్రికి కృతజ్ఞతలు అని చాలా భావోద్వేగంగా చెప్పారు.   

ఎవరీ  దీపక్ ధవళికర్‌..
గోవాలోని ప్రియోల్ నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన దీపక్ ధవలికర్ 2012 నుంచి 2016 వరకు మనోహర్ పారికర్ నేతృత్వంలోని అధికార గోవా ప్రభుత్వంలో మంత్రి పనిచేశారు. 

1961లో పోర్చుగీస్ వలస పాలన ముగిసిన తర్వాత గోవాలో తొలి పాలక పార్టీ అయిన మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ (MGP)కి ఆయన ప్రస్తుత చీఫ్. ఇక ఆయన సోదరుడు సుదిన్ ధవలికర్ మార్కైమ్ ఆ నియోజకవర్గం నుంచే ఆరుసార్లు శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు, అలాగే గోవా మాజీ ఉప ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు.

 

(చదవండి: ఆ సినిమా నేర్పిన పాఠం..! సరికొత్త మార్పుకి శ్రీకారం..)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement