breaking news
deepak dhavalikar
-
థాంక్యూ నాన్నా..! మాజీ మంత్రికి దక్కిన అపూర్వ స్వాగతం ..
కొన్ని అరుదైన ఘటనలు కోటిలో ఇద్దరో ఒక్కరో తల్లిదండ్రులుకే అలాంటి అదృష్టం దక్కుతుంది. మనం పెంచి ప్రయోజకులుగా తీర్చిదిద్దిన మన పిల్లల చేత అందరూ గౌరవమన్ననలను అదుకోవడం అనేది సర్వసాధారణమే. కానీ అనుకోకుండా పిల్లల ఉద్యోగ బాధ్యతల నడుమే మన తల్లిదండ్రులనే కలిసి అవకాశం లభిస్తే..ఆ ఆనందమే వేరు. పైగా సగర్వంగా వాళ్ల గురించి మనం చెబుతుంటే ఆ మాటలు వింటున్నా..లేదా ఆ అత్యున్న హోదాలో మనల్ని చూసినా..మన తల్లిందండ్రుల కళ్లల్లో ఉప్పొంగే ఆ ఆనంద క్షణాలు ఎన్నటికీ మర్చిపోలేం. అలాంటి ఆనంద క్షణాలే ఓ మాజీ మంత్రికి దక్కాయి. నెట్టింట ఆ విషయం తెగ వైరల్ అవ్వడమే గాక కొందరికే దక్కుతుంది ఇలాంటి అదృష్టం అని అంతా కొనియాడుతున్నారు ఆ తండ్రి కూతుళ్లను. అసలేం జరిగిందంటే..చెన్నై నుంచి గోవాకు వెళ్తున్న గోవా మాజీ మంత్రి దీపక్ ధవళికర్కు అరుదైన స్వాగతం లభించింది. ఊహించని విధంగా తాను ప్రయాణించే విమానంలోనే కూతురు గౌరీ ధవళికర్ పైలట్‌గా ఉన్నారు. అది తెలుసుకున్న కూతురు గౌరీ ధవళికర్ వెంటనే ఆమె సాధారణ ప్రయాణికులను స్వాగతిస్తున్నట్లుగా మాట్లాడుతూ..వారిలో తండ్రి కూడా ఉన్నారంటూ పరిచయం చేయడమే గాక ఈ విమాన జర్నీ నాకు చాలా ప్రత్యేకమైనది అని ఉద్వేగంగా చెబుతుంది. "ఈ రోజు నేనే నా తండ్రితో కలిసి ఈ విమానంల ప్రయాణిస్తున్నా. ఈ రోజు మొట్టమొదటిసారిగా ఆయన్ను గోవాలోని మా ఇంటికి పైలట్‌గా నేను తీసుకువెళ్తున్నా. నా తండ్రే ఇప్పుడు ప్రయాణికుడు అని ఆనందంగా అనౌన్స్మెంట్ ఇచ్చారు." పైలట్ గౌరీ ధవళికర్. ఇలా ఆమె మాటలు పూర్తి అయ్యేలోపే.. ప్రయాణకులు హర్షధ్వానాలతో చప్పట్లు కొట్టి ప్రశంసించారు ఆ తండ్రి కూతుళ్లని. అంతేగాదు ఆ విమానంలోని ప్రయాణికులందరి సమక్షంలోనే కృతజ్ఞతలు తెలిపింది. నా కలలన్నింటిన నిజంచేసేలా ఈ మొత్తం ప్రపంచాన్ని ఇచ్చినందుకు నా తండ్రికి కృతజ్ఞతలు అని చాలా భావోద్వేగంగా చెప్పారు. ఎవరీ దీపక్ ధవళికర్..గోవాలోని ప్రియోల్ నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన దీపక్ ధవలికర్ 2012 నుంచి 2016 వరకు మనోహర్ పారికర్ నేతృత్వంలోని అధికార గోవా ప్రభుత్వంలో మంత్రి పనిచేశారు. 1961లో పోర్చుగీస్ వలస పాలన ముగిసిన తర్వాత గోవాలో తొలి పాలక పార్టీ అయిన మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ (MGP)కి ఆయన ప్రస్తుత చీఫ్. ఇక ఆయన సోదరుడు సుదిన్ ధవలికర్ మార్కైమ్ ఆ నియోజకవర్గం నుంచే ఆరుసార్లు శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు, అలాగే గోవా మాజీ ఉప ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. View this post on Instagram A post shared by Prudent Media Official (@prudentmediagoa) (చదవండి: ఆ సినిమా నేర్పిన పాఠం..! సరికొత్త మార్పుకి శ్రీకారం..) -
'జడలు వేసుకోవడం మానేశారు'
పణజి: హిందువుల పిల్లలను కాన్వెంట్ స్కూళ్లకు పంపొద్దంటూ తన భార్య చేసిన వ్యాఖ్యలను గోవా మంత్రి దీపక్ ధవలికర్ సమర్థించారు. ఆమె వ్యాఖ్యల్లో తప్పేముందని ప్రశ్నించారు. తమ మతం గురించి ప్రచారం చేసుకునే హక్కు ప్రతి ఒక్కరికి ఉందని అన్నారు. భారతీయ మహిళలు పాశ్చాత్య పోకడలు పోవడం వల్లే అత్యాచారాలు పెరుగుతున్నాయని ధవలికర్ సతీమణి లత వ్యాఖ్యానించారు. భారతీయ సంస్కృతిని నాశనం చేస్తున్నారని ధవలికర్ ఆందోళన వ్యక్తం చేశారు. 'పూర్వం మహిళలు కుంకుమ పెట్టుకునేవారు. సంప్రదాయ చీరలు ధరించేవారు. జుత్తును చక్కగా దువ్వుకుని జడలు వేసుకునేవారు. ఇది భారతీయ స్త్రీత్వము. రానురాను ఈ సంప్రదాయం కనుమరుగవుతోంది' అని ధవలికర్ అన్నారు. పిల్లలను హిందూ మతం గురించే బోధించే పాఠశాలలకే పంపాలని ఆయన సలహాయిచ్చారు. -
మోడీ భారత్‌ను హిందూ దేశంగా మారుస్తారు
పణజీ: ప్రధానమంత్రి నరేంద్రమోడీ భారతదేశాన్ని హిందూ దేశంగా మారుస్తారంటూ గోవా సహకార మంత్రి దీపక్ ధావలికర్ వ్యాఖ్యానించారు. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ విజయానికి నరేంద్రమోడీని అభినందిస్తూ చేసిన తీర్మానంపై గురువారం దీపక్ గోవా అసెంబ్లీలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘మోడీజీ నాయకత్వంలో భారత్ హిందూ దేశంగా అభివృద్ధి చెందుతుందనే నమ్మకం నాకుంది. ఈ దిశగా ప్రధాని పనిచేస్తారని నేను భావిస్తున్నా..’’ అని దీపక్ అన్నారు. దీపక్ సోదరుడు, రవాణా మంత్రి సుదిన్ కొద్ది రోజుల క్రితం బీచ్‌ల్లో బికినీలపై నిషేధం విధించాలని చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన ఘటన మరువక ముందే దీపక్ తాజా వ్యాఖ్యలు చేయడం గమనార్హం. బీజేపీ కూటమిలోని మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీకి చెందిన దీపక్, సుదిన్.. మనోహర్ పారికర్ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నారు. మరోవైపు గోవా కాంగ్రెస్ ఎమ్మెల్యే మౌవిన్ గొడిన్హో మోడీని దివంగత ప్రధాని ఇందిరాగాంధీతో పోల్చారు. అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మోడీ పనితీరు, నాయకత్వ లక్షణాలు, ఆలోచనా విధానం ఇందిర ప్రధానిగా ఉన్నప్పుడు చూడగలిగామని కొనియాడారు. మోడీ నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉందని, ఆయన గెలుపు చారిత్రకమని వ్యాఖ్యానించారు.