
పట్టుబడిన రూ. 2.44 కోట్ల నగదు, విలువైన బంగారు ఆభరణాలు
విలువైన భవనాలు ఉన్నట్టు గుర్తింపు
ఒడిశా: కొరాపుట్ జిల్లా జయపురం అటవీ శాఖ డిప్యూటీ రేంజర్ రామ చంద్ర నేపక్ విజిలెన్స్ వలలో పడ్డారు. పట్టణం సోంబారు తోట వీధిలోని అతని భవవనంలో, ప్రసాదరావుపేటలోని ఇంటిపైన విజిలెన్స్ అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు. అతనికి సోంబారుతోటతోపాటు ప్రసాదరావుపేటలో ఇల్లు, ఎన్‌కేటీవో రోడ్డులో ఒక ఇల్లు, మరో అపార్ట్‌మెంట్, భువనేశ్వర్‌లో మరో భవనం, జయపురం ప్రాంతంలో 26 ఎకరాల పంట భూమి ఉన్నట్లు ఇంతవరకు ఆధారాలు లభించినట్లు కొరాపుట్ ప్రాంతీయ బిజిలెన్స్ ఎస్పీ నరేంద్రకుమార్ పాఢీ సూచనప్రాయంగా వెల్లడించారు.
ఇంకా మరికొన్ని ప్రాంతాలోని అతని ఆస్తులపై జయపురం విజిలెన్స్ విభాగ అధికారులు దాడులు కొనసాగిస్తున్నట్టు వెల్లడించారు. ఇంతవరకు రెండు కోట్ల 44 లక్షల రూపాయల నగదు, 500 గ్రాముల బంగారు నగలు, రెండ కేజీల వెండి, వాటితో పాటు మరికొని విలువైన బంగారు నగలు సీజ్ చేసినట్లు ఎస్పీ వెల్లడించారు.
#BreakingNews:
Source :… pic.twitter.com/RziEAPMBZC— Odishalinks (@odisha_links) July 25, 2025