
ప్రతీకాత్మక చిత్రం
ఒడిశా, జయపురం: జయపురంలో నకిలీ బంగారు శంఖాల మోసం జరిగింది. ఒక నకిలీ బంగారంతో తయారు చేసిన శంఖాన్ని ఒక వ్యాపారికి ఇచ్చి రూ.10 లక్షలు మోసం చేసిన సంఘటన వెలుగు చూసింది. జగత్‌సింగపూర్ జిల్లా కుజంగ పోలీసు స్టేషన్ గండకిపూర్ వ్యాపారి నిత్యానంద మహాపాత్రోకి బంగారు శంఖం ఇస్తామని కొందరు మోసగాళ్లు నమ్మించి రూ.10 లక్షలు తీసుకుని మోసం చేశారు. దీంతో జయపురం పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారని పట్టణ పోలీసు అధికారి ఉల్లాస్ చంద్ర రౌత్ వెల్లడించారు.
ఇదీ చదవండి: MegaStar Chiranjeevi Birthday70 ఏళ్లలోనూ షాకింగ్ ఫిట్నెస్, డైట్ సీక్రెట్స్
పోలీసు అధికారి వివరణ ప్రకారం నిత్యానంద మహాపాత్రో భువనేశ్వర్‌లో వ్యాపారం చేస్తున్నారు. అతడికి జయపురంలో బంగారు శంఖం ఇస్తానని ఓ వ్యక్తి తెలిపాడు. ఈ నెల 16న స్థానిక ఒక హొటల్‌కు ఆ వ్యక్తి అతడి అనుచరులు వచ్చారు. మహాపాత్రోకు బంగారంలా కనిపించే ఒక శంఖం ఇచ్చి రూ.10 లక్షల నగదు తీసుకున్నారు.

వ్యాపారికి దుండగులుఇచ్చిన నకిలీ బంగారు శంఖం
తర్వాత మహాపాత్రో బంగారు శంఖాన్ని పరీక్షించగా అది ఇత్తడి అని బయట పడింది. వారికి ఫోన్ చేస్తే స్విచాఫ్ అని వచ్చింది. దీంతో ఆ వ్యాపారి పోలీసులను ఆశ్రయించాడు. ఎస్‌ఐ రాజేంద్ర పంగి కేసు దర్యాప్తు చేస్తున్నారు.