మెగాస్టార్ చిరంజీవి 7 పదుల వయస్సులోనూ షాకింగ్‌ ఫిట్​నెస్, డైట్ సీక్రెట్స్ | Megastar Chiranjeevi Turns 70: Fitness Secrets Behind His Evergreen Energy | Sakshi
Sakshi News home page

MegaStar Chiranjeevi Birthday70 ఏళ్లలోనూ షాకింగ్‌ ఫిట్​నెస్, డైట్ సీక్రెట్స్

Aug 22 2025 1:01 PM | Updated on Aug 22 2025 2:07 PM

MegaStar Chiranjeevi 70th Birthday his Fitness and Diet Secrets

మెగాస్టార్ చిరంజీవి 70వ పుట్టిన రోజు. ఈ మాట వినిగానే  చిరంజీవికి  డెబ్భై ఏళ్లా? అని ఆశ్చర్యపోతారు. నటనలోనే కాదు, అందం, ఆరోగ్యం విషయంలోనూ ఫ్యాన్స్‌ను మెస్మరైజ్‌ చేసే ఫిట్‌ నెస్‌ చిరంజీవి సొంతం. 70 ఏళ్ల వయస్సులో  చాలా చురుగ్గా ఉంటూ డ్యాన్సులైనా, ఫైట్లైనా  నేను ఎవర్‌ రెడీ అన్నట్టు  ఉంటారాయన. కొడితే కొట్టాలిరా సిక్స్‌ కొట్టాలి అన్నట్టుంటే ఆయన ఫిట్నెస్‌ సీక్రెట్‌ ఏంటో తెలుసుకుందాం.

తాము అనుకున్న రంగంలో విజయం సాధించి  స్టార్‌గా నిలవడం ఎంత అవసరమో, ముఖ్యంగా ఎంటర్‌టైన్‌ మెంట్‌ రంగంలో నిలదొక్కుకోవాలంటే.. అందాన్ని, ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కూడా అంతే అవసరం.   కోట్లాది ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకొని, ప్రపంచవ్యాప్తంగా అశేష అభిమానులను సంపాదించుకొని, ఇప్పటికీ చిరు అన్నయ్యగా పిలిపించుకునే ఘనత ఆయనది. ఎన్నో విభిన్నమైన చిత్రాలు, మరెన్నో  విభిన్న పాత్రలతో ఎందరో యువ హీరోలకు సైతం స్ఫూర్తినిచ్చే చిరంజీవి ఆరోగ్యం రహస్యం వెనుకాల గొప్ప శ్రమే  ఉంది. 

జీవితంలో ఒడిదుకులు, ఒత్తిడిని తట్టుకుంటూ, చక్కని జీవనశైలి, ఆరోగ్యకరమైన ఆహార నియమావళి  క్రమ తప్పనివ్యాయామం ఇవే ఆయన సీక్రెట్స్‌ అనడంలో ఎలాంటి సందేహం లేదు.‌ ముఖ్యంగా చిరంజీవి ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారట. ఇంటి ఫుడ్‌కే  ప్రాధాన్యత, తక్కువ నూనె, తక్కువ చక్కర, ప్రాసెస్‌డ్‌ ఫుడ్‌ పూర్తిగా దూరం. ఆరోగ్య నిపుణుడిపర్యవేక్షణలో ఆహార ప్రణాళికలో ప్రోటీన్లు, ఫైబర్, కార్బోహైడ్రేట్లు సమపాళ్లలో ఉండేలా జాగ్రత్త పడతారు.

చదవండి: ఎంబీఏ చదివి క్యాప్సికం సాగుతో ఏడాదికి రూ. 4 కోట్లు

ఒకసారి స్వయంగా ఆయనే  చెప్పినట్టు రోజువారీ ఆహారంలో తేలికపాటి, పోషకాలతో కూడిన అల్పాహారంతో ప్రారంభిస్తారు. ఎక్కువగా ఆవిరి మీద ఉడికించిన ఇడ్లీ, దోశ లేదా గుడ్డులోని తెల్లసొనతో చేసిన ఆమ్లెట్‌ను తీసుకుంటారు.  మధ్యాహ్న భోజనంలో ఒక బ్రౌన్ రైస్ లేదా మిల్లెట్స్‌ తో పాటు, కూరలు ఎక్కువ  ఉండేలా జాగ్రత్తపడతారు. ప్రోటీన్ కోసం పప్పు లేదా గ్రిల్ చేసిన చికెన్, చేపలు, బాయిల్డ్‌ ఎగ్స్‌ తింటారు.  డిన్నర్ చాలా లైట్‌గా ఉండేలా చూసుకుంటారు.

ఇదీ చదవండి: పెట్రోల్‌ పంపు, 210 ఎకరాలు, 3 కిలోల వెండి.. రూ.15 కోట్ల కట్నం : వైరల్‌ వీడియో

కసరత్తులు
సాధారణంగా వయసు పెరిగే కొద్ది శక్తి తగ్గుతుంది. ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి.  చర్మ ఆరోగ్యంలో కూడా తేడాలొస్తాయి. వీటినుంచి బయటపడాలంటే ఖచ్చితంగా  డైలీ రొటీన​ వ్యాయామంతోపాటు, బాడీ స్ట్రెంత్, మజిల్ బిల్డింగ్,కార్డియో, కసరత్తు అవసరం. ఇవి శరీరం బరువు పెరగకుండా మెటబాలీజం పెంచి, కలకలం ఆరోగ్యంగా చురుగ్గా ఉండేందుకు తోడ్పడతాయి. సరిగ్గి  చిరంజీవికూడా ఇదే ఫాలో అవుతున్నారు. దీనికి   విశ్వంభర సినిమా కోసం జిమ్‌లో కసరత్తు చేస్తున్న వీడియో ఒకటి బాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇందులో బెంచ్ ప్రెస్, డంబెల్ కర్ల్స్, స్క్వాడ్స్, కార్డియో ఎక్స్‌ర్‌ సైజ్‌లు చేయడం మనం చూశాం.  

సో ఏజ్‌ ఈజ్‌  నంబర్‌ మాత్రమే. ఎలాంటి అనారోగ్యాలు దరిచేరకుండా, ఆరోగ్యంగా, చురుగ్గా ఉండాలంటే ఒత్తిడిలేని జీవితం, మంచినిద్ర, చక్కటి జీవనశైలి, ఆరోగ్య కరమైన ఆహారం, కనీస వ్యాయామం,  అప్పుడప్పుడు కొన్ని ఆరోగ్య పరీక్షలు చేసుకుంటే ఫిట్‌ నెస్‌  సొంతం చేసుకోవచ్చు అని నిరూపించిన చిరంజీవికి హ్యాపీ బర్తడే చెప్పేద్దామా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement