
అంగరంగ వైభవంగా పెళ్లి.... వేల మంది అతిథులు వేల కోట్ల రూపాయల ఖర్చు ఇలా మన దేశంలో ముఖేష్ అంబానీ ,అదానీ లాంటి కుబేరుల ఇళ్లల్లో జరిగే పెళ్లిళ్ల గురించి తెలుసు. భారీ కట్నాలు, కానుకల గురించి మరీ బహిరంగంగా కాకపోయినాఅప్పుడప్పుడు వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. తాజాగా సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్‌గా మారింది. మనదేశంలో వరుడుకిచ్చిన షాకింగ్ కట్నం చర్చనీయాంశంగా మారింది.
ఇండియా వరకట్నం చట్టపరంగా నేరం. కానీ కట్న కానుకలివ్వడం లోపాయికారీగా జరిపోతూనే ఉంది. కానీ ఈ వీడియోలో వరుడికిచ్చిన కట్నం గురించి తెలిస్తే నోరెళ్ల బెట్టాల్సిందే. ఏకంగా ఒక పెట్రోల్ పంపు, 210 ఎకరాల భూమి, 3 కిలోల వెండి.. రూ.15 కోట్ల నగదును కట్నంగా ఇచ్చారు ఈ వివరాలన్నీ ఈ వీడియోలో ప్రస్తావించడం విశేషం. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో జరిగినట్టు తెలుస్తోంది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు విభిన్నంగా స్పందించారు. Wednesday @Shizukahuji అనే ట్విటర్ ఖాతాలో ఈ వీడియోను షేర్ చేశారు
ఇదీ చదవండి: PCOS Belly తగ్గేదెలా? ఇవిగో అమోఘమైన టిప్స్
Love marriage vo kya hota hai 💀 pic.twitter.com/otmFucQnep
— Wednesday (@Shizukahuji) August 20, 2025
దీనిపై స్పందించిన కొంతమంది నెటిజన్లు ఆదాయ పన్ను శాఖ, ఈడీ ఎక్కడ ఉన్నాయి అంటూ ఫన్నీగా ప్రశ్నించారు. ఇంత బహిరంగంగా కట్నం తీసుకుంటోంటే పోలీసులు స్పందించరా అంటూ మరికొంతమంది కమెంట్ చేశారు.
ఇదీ చదవండి: MegaStar Chiranjeevi Birthday70 ఏళ్లలోనూ షాకింగ్ ఫిట్నెస్, డైట్ సీక్రెట్స్