Odisha: క్వారీలో భారీ పేలుడు.. పలువురు కార్మికులు మృతి? | Multiple Workers Feared Dead After Odisha Quarry Blast, Rescue Operations Underway | Sakshi
Sakshi News home page

Odisha: క్వారీలో భారీ పేలుడు.. పలువురు కార్మికులు మృతి?

Jan 4 2026 11:57 AM | Updated on Jan 4 2026 1:37 PM

Odisha Several feared dead in massive explosion at stone quarry

ధెంకనల్: ఒడిశాలోని ధెంకనల్ జిల్లాలోని ఒక క్వారీలో విషాదం చోటుచేసుకుంది.  గోపాల్‌పూర్ గ్రామం సమీపంలోని స్టోన్ క్వారీలో కార్మికులు డ్రిల్లింగ్, మైనింగ్ పనులు చేస్తున్న సమయంలో ఒక్కసారిగా పెద్ద ఎత్తున కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో పలువురు కార్మికులు ప్రాణాలు కోల్పోయి ఉంటారని అధికారులు  భావిస్తున్నారు. ఈ ఘటన మోతంగా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నట్లు ఒడిశా పోలీసులు తెలిపారు.

ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది, ఒడిశా డిజాస్టర్ రాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఓడీఆర్డీఎప్‌) బృందాలు, డాగ్ స్క్వాడ్‌ సంఘటన జరిగిన స్థలానికి చేరుకున్నాయి. భారీ బండరాళ్ల కింద నలుగురు కార్మికులు చిక్కుకున్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ రాళ్లను తొలగించి, లోపల చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తెచ్చేందుకు అత్యాధునిక యంత్రాలను వినియోగిస్తున్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతాన్ని అధికారులు తమ ఆధీనంలోకి తీసుకుని, ప్రజలెవరూ అటువైపు వెళ్లకుండా ఆంక్షలు విధించారు.

ధెంకనల్ జిల్లా కలెక్టర్ ఆశిష్ ఈశ్వర్ పాటిల్, ఎస్పీ అభినవ్ సోంకర్‌లు ఘటనాస్థలిలో ఉండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. పేలుడు కారణంగానే కొండచరియలు విరిగిపడ్డాయని స్థానికులు చెబుతున్నప్పటికీ, ప్రమాదానికి గల సరైన కారణాలు తెలుసుకునేందుకు విచారణ జరుపుతున్నట్లు అధికారులు వెల్లడించారు. అగ్నిమాపక అధికారి నవఘన మల్లిక్ మాట్లాడుతూ, శిథిలాలను తొలగించి, బాధితులను రక్షించే ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు.

ఈ దుర్ఘటనపై ఒడిశా మాజీ ముఖ్యమంత్రి, బీజేడీ అధినేత నవీన్ పట్నాయక్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, సోషల్ మీడియా వేదికగా స్పందించారు. కార్మికుల భద్రతా ప్రమాణాల విషయంలో ప్రభుత్వం తక్షణమే దృష్టి సారించాలని, ఈ ప్రమాదం ఏ పరిస్థితుల్లో జరిగిందో సమగ్ర విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. సహాయక చర్యలను మరింత వేగవంతం చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement