హారిక డ్రగ్స్ పరిశ్రమలో రియాక్టర్ పేలుడు | Reactor Explosion at Harika Drugs Industry Sanga Reddy District | Sakshi
Sakshi News home page

హారిక డ్రగ్స్ పరిశ్రమలో రియాక్టర్ పేలుడు

Feb 17 2026 8:42 PM | Updated on Feb 17 2026 9:17 PM

Reactor Explosion at Harika Drugs Industry Sanga Reddy District

సంగారెడ్డి: జిల్లాలోని గుమ్మడల మండలం హారిక డ్రగ్స్ పరిశ్రమలో  రియాక్టర్ పేలింది. గుమ్మిడదల కేంద్రంలోని హారిక డ్రగ్స్‌ పరిశ్రమలో మంగళవారం రాత్రి రియాక్టర్‌ పేలింది. పేలుడు తీవ్రతతో  పక్కనే ఉన్న ప్రహరీ గోడ కూలింది. ఘటన సమయంలో పరిశ్రమలో కార్మికులు విధుల్లో ఉన్నట్టు సమాచారం



పేలుడు శబ్దంతో పరిసర ప్రాంతాల్లో భయాందోళన వాతావరణం కనిపిస్తోంది. సమాచారం  అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. గాయాల వివరాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. పేలుడు కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement