
ఒడిశాలో విద్యార్థుల అద్భుతమైన పాక ప్రతిభతో ప్రధాని మోదీ శిల్పానికి ప్రాణాం పోశారు. తమ కళాత్మక ప్రతిభతో మోదీ చాక్లెట్ శిల్పాన్ని రూపొందించారు. దీన్ని పూర్తిగా చాక్లెట్ తయారు చేశారు. దాదాపు 70 కిలోలు బరువు ఉంటుంది. అందుకోసం ఆ విద్యార్థులు సుమారు 55 కిలోల డార్క్ చాక్లెట్, 15 కిలోల వైట్ చాక్లెట్‌ని విపియోగించారు. భువనేశ్వర్ చాక్లెట్ క్లబ్‌లో డిప్లోమా చేస్తున్న ఈ విద్యార్థు ఆ ప్రతిమలో ప్రభుత్వ సంబంధిత పథకాలకు సంబంధించిన క్లిష్లమైన వివరాలను పొందుపర్చేలా కళాత్మకంగా తీర్చిదిద్దారు.
ఈ క్లబ్ ప్రొఫెషనల్ బేకింగ్ అండ్ ఫైన్ పాటిస్సేరీ పాఠశాల. రాకేష్ కుమార్ సాహు, రంజాన్ పరిదా నేతృత్వంలో సుమారు 15 మంది విద్యార్థుల బృందం ఈ ప్రత్యేకమైన కళకు జీవం పోశారు. మోదీ చాక్లెట్ కళాకృతి తయారు చేసేందుకు సుమారు ఏడు రోజులు పట్టిందట. ఈ ప్రతిమలో ప్రధాన మంత్రి ఉజ్వల యోజన, ప్రధాన మంత్రి ఆపరేషన్ సిందూర్, స్వచ్ఛ భారత్ మిషన్ వంటి కీలకమైన ప్రభుత్వ కార్యక్రమాలన్నీ ఇందులో ఉన్నాయి.
అంతేగాదు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) సాధించిన విజయాలను కూడా ఈ ప్రతిమలో హైలెట్ చేశారు. ఆ సంస్థ ప్రకారం..భారతదేశంలో ఇలా మోదీ చాక్లెట్ శిల్పాన్ని రూపొందించడం ఇదే ప్రప్రథమం. దీన్ని విద్యార్థులు కళ, నైపుణ్యాల కలయికగా అభివర్ణించారు. గతేడాది కూడా మోదీ పుట్టిన రోజు పురస్కరించుకుని ఒడిశాలోని భువనేశ్వర్‌లోని గడకానాలో 2.5 మిలియన్లకు పైగా ప్రధానమంత్రి ఆవాస్ గృహాలను ప్రారంభించారు.
రాష్ట్రంలోని లక్షలాది మంది మహిళలకు ప్రయోజనం చేకూర్చే లక్ష్యంతో సుభద్ర యోజనను కూడా ప్రారంభించారు. అలాగే భారతీయ జనతా పార్టీ(బీజేపీ) కూడా మోదీ పుట్టినరోజు నిమిత్తం పఖ్వాడా" లేదా "సేవా పర్వ్" ప్రచారంతో రక్తదాన శిబిరాలు, డ్రైవ్లు వంటి సామాజిక సేవ కార్యక్రమాలను ప్రారంభించారు.
అలాగే ప్రధాని మోదీ సైతం తన పుట్టినరోజు సందర్భంగా ప్రజలకు లబ్ధి చేకూర్చే పథకాలను ప్రకటించేవారు. అలాగనే మోదీ కూడా తన పుట్టినరోజు సందర్భంగా 2023లో చేతివృత్తులవారి కోసం విశ్వకర్మ యోజన, 2022లో ఎనిమిది చిరుతలను మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లోకి విడుదల చేయడం వంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాలను చేపట్టిన సంగతి తెలిసిందే.
(చదవండి: దేశంలోనే తొలి మహిళా మావటి..!)