
సాధారణంగా గజరాజులను మచ్చిక చేసుకునేది మగవారే. ఆ వృత్తిలో కొనసాగేది కూడా పురుషులే. కానీ అలాంటి వృతిలో ఓ మహిళ కొనసాగడమే గాక, ఎన్నో ఏగులను సంరక్షించి ఎన్నో అవార్డులే కాదు, రాష్ట్రపతిచే సత్కారం కూడా పొందారామె. అంతేగాదు ఆమెను హస్తి కన్య లేదా ఏనుగుల కుమార్తె అని కూడా పిలుస్తారు. ఇంతకీ ఎవరా మహిళ అంటే..
ఆమె దేశంలోనే తొలి మహిళా మావటి. ఏనుగులను మచ్చిక చేసుకోవడంలో ఆమెకు సాటిలేరెవ్వరూ. ఆమెనే అస్సాంకు చెందని పర్బతి బారువా. ఐదు దశాబ్దాలకు పైగా తన జీవితాన్ని ఏనుగులను మచ్చిక చేసుకోవడానికి, సంరక్షించడానికి అంకితం చేసింది.
చారిత్రాత్మకంగా పురుషులే కొనసాగుతున్న వృత్తిలోకి వచ్చి సత్తా చాటడమే గాక ఏళ్లనాటి మూసధోరణిని చేధించారామె. మహిళ మావాటిగా ఆమె ప్రస్థానం కేవలం అసామాన్య ధైర్యసాహాసాలకు సంబంధించినదే కాదు, ఏనుగుల పట్ల భారతదేశానికి ఉన్న లోతైన సాంస్కృతిక సంబంధాన్ని ఆధ్యాత్మిక గౌరవానికి, జ్ఞానానికి చిహ్నం కూడా.
ఆమె ఈ రంగంలోకి ఎలా వచ్చిందంటే..
మార్చి 14, 1953న అస్సాంలోని గౌరీపూర్ రాజకుటుంబంలో జన్మించిన పర్బతి. గౌరీపూర్ చివరి పాలకుడు దివంగత ప్రకృతిష్ చంద్ర బారువా కుమార్తె. ఆమె తండ్రి వేటగాడు, ఏనుగులను మచ్చిక చేసుకోవడంలో మంచి నిపుణుడు కూడా.
అలా ఆమెకు ఏనుగులను మచ్చిక చేసుకోవడం వంశపారంపర్యంగా అబ్బిన విద్యగా పేర్కొనవచ్చు. ఆమె గౌహతి విశ్వవిద్యాలయం నుంచి పాలిటిక్స్‌లో గ్రాడ్యుయేట్ కూడా. అయినా ఆమె అటు విద్యారంగం, ఇటు ప్రజాసేవను కాకుండా వంశపారంపర్య అభిరుచి వైపుకే మగ్గడం విశేషం.
14 ఏళ్లకే ఆ నైపుణ్యం..
ఇక పర్బతి 14 ఏళ్ల ప్రాయంలోనే అస్సాంలోని కొచుగావ్ అడవి ఏనుగును మంచిక చేసుకుని దాని బాగోగులు చూసుకునేది. అలా 1975 నుంచి 1978 వరకు సంప్రదాయ అస్సామీ టెక్నిక్ షికార్‌ని ఉపయోగించి ఏకంగా 14 అడవి ఏనుగులను విజయవంతంగా మచ్చిక చేసుకుందామె.
ఇక్కడ ఏనుగులను ట్రాంక్విలైజర్లతో అపస్మారక స్థితికి తీసుకువచ్చి మచ్చిక చేసుకోరు. లాస్సో పద్ధతిలో ఒక విధమైన తాడుతో బంధించి మచ్చిక చేసుకుంటారు.
మచ్చిక చేయడం, కేర్‌టేకర్‌గా..
అలా ఆమె అస్సాం, పశ్చిమ ెబెంగాల్, కేరళ, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ అటవీ శాఖలతో పనిచేసింది. అక్కడ మవాటిగా ఏనుగులకు శిక్షణ ఇవ్వడం ామానవులు-ఏనుగుల సంఘర్షణకు అడ్డుకట్ట వేయడం, గాయపడిన ఏనుగులు లేదా అనారోగ్యంతో ఉన్న ఏనుగులకు ఔషధ మూలికలతో చికిత్స అందించడంలో ఆమెకు మంచి నైపుణ్యం ఉంది. అయితే ఓ ఇంటర్వ్యూలో ఏనుగులు మానవులకంటే మంచివా అని ప్రశ్నించగా..నూటికి నూరు శాతం ఏనుగులే మంచివని నిర్మొహమాటంగా చెప్పేశారామె.
అవి కూడా మానవుల మాదిరిగానే ప్రత్యేక మనస్తత్వంతో ఉంటాయట. కొన్ని అత్యంత సహనంగా, మరికొన్ని తెలివిగా, లీడర్లుగా ఉంటాయట. వాటి సహనం హద్దు దాటిపోతేనే విజృంభిస్తాయట. అవి తమ పిల్లలను అమితంగా ప్రేమిస్తాయని, ఎట్టిపరిస్థితుల్లోనూ హాని చేయదని అన్నారామె.

అంతర్జాతీయంగా ఆమె సేవలు..
ఆమె నైపుణ్యాలు, సేవలు అంతర్జాతీయంగా కూడా ప్రదర్శించాల్సి వచ్చింది. ఆమె 2001లో బ్యాంకాక్ నుంచి తమిళనాడు, జల్దపారా, ఉత్తర బెంగాల్‌లోని వర్క్‌షాప్‌ల వరకు ఏనుగులపై ప్రపంచ సమావేశాలలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది.
అలాగే ఆసియాటిక్ ఏనుగుల స్థితిపై పరిశోధనకుగానూ సహాయసహకారాలు అందించింది. ఆమె ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (IUCN) ఆసియన్ ఎలిఫెంట్ స్పెషలిస్ట్ గ్రూప్‌లో సభ్యురాలిగా కూడా పనిచేశారు.
సత్కారాలు, అవార్డులు..
ఆమె అవిశ్రాంత కృషికి, పర్బతి బారువాను అనేక అవార్డులతో సత్కరించింది భారత ప్రభుత్వం.
ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం (UNEP) నుంచి గ్లోబల్ 500 రోల్ ఆఫ్ ఆనర్ (1989).
అస్సాం ప్రభుత్వం ప్రదానం చేసే గౌరవ చీఫ్ ఎలిఫెంట్ వార్డెన్ ఆఫ్ అస్సాం (2003).
అస్సాం అత్యున్నత పౌర గౌరవం అసోం గౌరవ్ అవార్డు (2023)
నేచర్స్ వారియర్ జ్యూరీ అవార్డు (2023)తో సహా వన్యప్రాణులు, పరిరక్షణ సమూహాలకు సంబంధించిన జీవితకాల సాధన గుర్తింపులు.
2024లో పర్బతి ఏనుగుల సంక్షేమానికి ఆమె చేసిన కృషికి గాను భారత అత్యున్నత పురస్కారం పద్మశ్రీతో సత్కరించారు.
(చదవండి: Weight loss story: మైండ్‌ఫుల్‌నెస్‌గా తినడం, ఒక యోగా భంగిమ అద్భుతం చేశాయ్..!)