
ఏఎస్ కావాలనేది చాలామంది యువత డ్రీమ్. అందుకోసం ఎంతలా అహర్నిశలు కష్టపడతారో తెలిసిందే. ఒక్కోసారి త్రుటిలో తప్పితే. మరోసారి..ఆదిలోనే అంటే ప్రిలిమ్స్‌లోనే విఫలమవ్వడం వంటి పలు అవరోధాలను దాటి తమ కలను సాకారం చేసుకుంటుంటారు. ఈ ప్రతిష్టాత్మకమైన యూపీఎస్సీ ఎగ్జామ్‌లో పాసవ్వడం అంత ఈజీ కాదు. అలాగనే అసాధ్యము కాదు. అలాంటిది ఈ అమ్మాయి తొలి ప్రయత్నంలోనే గెలుపు అందుకుంది.
అది కూడా అత్యంత చిన్న వయసులోనే అందర్నీ ఆశ్చర్యపరిచేలా విజయం సాదించినప్పటికీ.. ఐఏఎస్, ఐసీఎస్ రెండు వద్దనుకుని ఈ అమ్మాయి ఎందులో విధులు నిర్వర్తించాలనుకుందో వింటే విస్తుపోతారు. ఇదేంటి చాలామంది ఐఆర్‌ఎస్, ఫారెస్ట్ సర్వీస్ వంటివి వచ్చినా..సరే ఐఏఎస్ కోసం మళ్లీ.. మళ్లీ..రాస్తే..ఈ అమ్మాయి మాత్రం విభిన్నంగా ఎంచుకుని అందర్నీ ఆశ్చర్యపరిచింది.
ఆ అమ్మాయే అయెధ్యకు చెందిన 21 ఏళ్ల విదుషి సింగ్(Vidushi Singh). ఎలాంటి కోచింగ్‌లు తీసుకోకుండా తన తొలి ప్రయత్నంలోనే యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్(UPSC Civils Service Exam) పరీక్షలో విజయ ఢంకా మోగించి ఆలిండియా 13వ ర్యాంకు సాధించింది. ఢిల్లీ విశ్వవిద్యాలయంలో ప్రతిష్టాత్మక శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ (SRCC) నుంచి ఆర్థిక శాస్త్రంలో పట్టభద్రురాలైన విదుషి స్వీయంగా ప్రిపేరై సివిల్స్ సక్సెస్ అందుకుంది.
క్రమశిక్షణ, దృఢసంకల్పం ఉంటే స్వీయ గైడెన్స్‌లో విజయం సాధించడం పెద్ద కష్టమేమి కాదని తన సక్సెస్‌తో చెప్పకనే చెప్పింది. అయితే ఆమె ఐఏఎస్, ఐపీఎస్ వంటి ప్రతిష్టాత్మకమైన హోదాలకు మించి దేశ సరిహద్దులకు అతీతంగా సేవలందించాలని, ఐఎఫ్‌ఎస్‌ని ఎంపిక చేసుకుంది. అది ఆమె జాతీయ సరిహద్దులకు అతీతమైన దూరదృష్టిని ప్రతిబింబిస్తోంది.
కుటుంబ నేపథ్యం..
ఆమె తండ్రి ఇంజనీర్ గ్రాడ్యుయేట్, ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు. విద్యకు విలువనిచ్చే వాతావరణంలో పెరిగిన అమ్మాయి విదూషి. ఆ నేపథ్యంలోనే స్వీయంగా ప్రిపేరయ్యి సివిల్స్ విజయం సాధించింది. ఆమెకు రాత పరీక్షలో 855 మార్కులు రాగా, ఇంటర్వ్యూలో 184 మార్కులతో కలిపి మొత్తం 1039 మార్కులు వచ్చాయి.
దీంతో 21 ఏళ్ల వయసులోనే సివిల్స్‌లో ఇంతటి ఉన్నత ర్యాంకు సాధించిన అతి పిన్నవయస్కురాలిగా నిలిచింది. విదూషి సక్సెస్ జర్నీ ఎందరో సివిల్స్ ఔత్సాహికులకు మార్గదర్శం, స్ఫూర్తి కూడా. కోచింగ్‌లు తీసుకుంటేనే సక్సెస్ కాదని, సడలని పట్టుదల ఉంటే సాధించలేనిదంటూ లేదని ప్రూవ్ చేసింది విదూషి.
(చదవండి: Diwali 2025: ఈ దీపావళి స్వీట్స్ కిలో ఏకంగా రూ. 1.1 లక్షలు? ఎందుకింత ఖరీదంటే..)