breaking news
	
		
	
  IFS
- 
      
                   
                                                       తొలి ప్రయత్నంలోనే సివిల్స్‌లో సక్సెస్..కానీ ఐఏఎస్ వద్దని..ఏఎస్ కావాలనేది చాలామంది యువత డ్రీమ్. అందుకోసం ఎంతలా అహర్నిశలు కష్టపడతారో తెలిసిందే. ఒక్కోసారి త్రుటిలో తప్పితే. మరోసారి..ఆదిలోనే అంటే ప్రిలిమ్స్‌లోనే విఫలమవ్వడం వంటి పలు అవరోధాలను దాటి తమ కలను సాకారం చేసుకుంటుంటారు. ఈ ప్రతిష్టాత్మకమైన యూపీఎస్సీ ఎగ్జామ్‌లో పాసవ్వడం అంత ఈజీ కాదు. అలాగనే అసాధ్యము కాదు. అలాంటిది ఈ అమ్మాయి తొలి ప్రయత్నంలోనే గెలుపు అందుకుంది. అది కూడా అత్యంత చిన్న వయసులోనే అందర్నీ ఆశ్చర్యపరిచేలా విజయం సాదించినప్పటికీ.. ఐఏఎస్, ఐసీఎస్ రెండు వద్దనుకుని ఈ అమ్మాయి ఎందులో విధులు నిర్వర్తించాలనుకుందో వింటే విస్తుపోతారు. ఇదేంటి చాలామంది ఐఆర్ఎస్, ఫారెస్ట్ సర్వీస్ వంటివి వచ్చినా..సరే ఐఏఎస్ కోసం మళ్లీ.. మళ్లీ..రాస్తే..ఈ అమ్మాయి మాత్రం విభిన్నంగా ఎంచుకుని అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఆ అమ్మాయే అయెధ్యకు చెందిన 21 ఏళ్ల విదుషి సింగ్(Vidushi Singh). ఎలాంటి కోచింగ్‌లు తీసుకోకుండా తన తొలి ప్రయత్నంలోనే యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్(UPSC Civils Service Exam) పరీక్షలో విజయ ఢంకా మోగించి ఆలిండియా 13వ ర్యాంకు సాధించింది. ఢిల్లీ విశ్వవిద్యాలయంలో ప్రతిష్టాత్మక శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ (SRCC) నుంచి ఆర్థిక శాస్త్రంలో పట్టభద్రురాలైన విదుషి స్వీయంగా ప్రిపేరై సివిల్స్ సక్సెస్ అందుకుంది. క్రమశిక్షణ, దృఢసంకల్పం ఉంటే స్వీయ గైడెన్స్‌లో విజయం సాధించడం పెద్ద కష్టమేమి కాదని తన సక్సెస్‌తో చెప్పకనే చెప్పింది. అయితే ఆమె ఐఏఎస్, ఐపీఎస్ వంటి ప్రతిష్టాత్మకమైన హోదాలకు మించి దేశ సరిహద్దులకు అతీతంగా సేవలందించాలని, ఐఎఫ్ఎస్ని ఎంపిక చేసుకుంది. అది ఆమె జాతీయ సరిహద్దులకు అతీతమైన దూరదృష్టిని ప్రతిబింబిస్తోంది. కుటుంబ నేపథ్యం..ఆమె తండ్రి ఇంజనీర్ గ్రాడ్యుయేట్, ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు. విద్యకు విలువనిచ్చే వాతావరణంలో పెరిగిన అమ్మాయి విదూషి. ఆ నేపథ్యంలోనే స్వీయంగా ప్రిపేరయ్యి సివిల్స్ విజయం సాధించింది. ఆమెకు రాత పరీక్షలో 855 మార్కులు రాగా, ఇంటర్వ్యూలో 184 మార్కులతో కలిపి మొత్తం 1039 మార్కులు వచ్చాయి. దీంతో 21 ఏళ్ల వయసులోనే సివిల్స్‌లో ఇంతటి ఉన్నత ర్యాంకు సాధించిన అతి పిన్నవయస్కురాలిగా నిలిచింది. విదూషి సక్సెస్ జర్నీ ఎందరో సివిల్స్ ఔత్సాహికులకు మార్గదర్శం, స్ఫూర్తి కూడా. కోచింగ్‌లు తీసుకుంటేనే సక్సెస్ కాదని, సడలని పట్టుదల ఉంటే సాధించలేనిదంటూ లేదని ప్రూవ్ చేసింది విదూషి. (చదవండి: Diwali 2025: ఈ దీపావళి స్వీట్స్ కిలో ఏకంగా రూ. 1.1 లక్షలు? ఎందుకింత ఖరీదంటే..)
- 
      
                   
                                                       భారీగా ఐఏఎస్‌ల బదిలీసాక్షి, అమరావతి : రాష్ట్రంలో పెద్దఎత్తున అఖిల భారత సర్వీసు అధికారులను (ఐఏఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్) ప్రభుత్వం బదిలీ చేసింది. వెయిటింగ్లో ఉన్న వారికి పోస్టింగ్‌లు ఇచ్చిoది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. బదిలీ చేసిన వారిలో కొంతమందికి పోస్టింగ్‌లు ఇవ్వలేదు. వారికి వేరుగా పోస్టింగ్ ఉత్తర్వులు జారీ చేస్తామని పేర్కొన్నారు. పోస్టింగ్ కోసం వెయిటింగ్లో ఉన్న కేవీఎన్ చక్రధర్‌బాబును సెకండరీ హెల్త్ డైరెక్టర్‌గా నియమించారు. వ్యవసాయ శాఖ డైరెక్టర్ డిల్లీరావును పౌర సరఫరాల సంస్థ ఎండీగా బదిలీ చేశారు.
- 
      
                   
                                                       సివిల్స్‌పై సర్వే తప్పనిసరి!(మహేశ్వర్ పెరి, ఫౌండర్ చైర్మన్ కెరీర్స్ 360) : దేశంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సివిల్ సర్వీసెస్ పరీక్షలను ‘మదర్ ఆఫ్ ఆల్ ఎగ్జామ్స్’గా భావిస్తారు. సివిల్ సర్వీస్ పరీక్షల ద్వారానే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్), ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్), ఇండియన్ ఫారెన్ సర్వీస్ (ఐఎఫ్ఎస్), తదితర సర్వీసుల్లో పోస్టులను భర్తీ చేస్తారు. దేశంలోనే అత్యున్నత సర్వీసులైన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ లక్ష్యంగా ఏటా లక్షలాది మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. ఏటా దాదాపు వెయ్యి ఖాళీలు మాత్రమే అందుబాటులో ఉంటున్నా సుమారు 11 లక్షల మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అంతటి పోటీపరీక్షలో నెగ్గాలంటే పట్టుదల, అకుంఠిత దీక్ష, కఠోర శ్రమ, జనరల్ స్టడీస్, సంబంధిత సబ్జెక్టులపైన పట్టు తప్పనిసరి. చాలా తక్కువ సక్సెస్ రేటు మాత్రమే ఉన్న ఈ పరీక్షల్లో విజయం కోసం ఏళ్ల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. మొదటి ప్రయత్నంలోనే ఏదో ఒక సర్వీసును దక్కించుకుంటున్నవారు కేవలం 7 శాతం మాత్రమే ఉంటున్నారు. మిగతా 93 శాతం మందికి ఒకటి కంటే ఎక్కువ ప్రయత్నాలు అవసరమవుతున్నాయి. ఈ నేపథ్యంలో సుదీర్ఘ కాలం కొనసాగే ఈ పరీక్షల ప్రిపరేషన్ యువతపై అధిక భారాన్ని మోపుతూ వారు నేర్చుకునే సామర్థ్యాలపై ప్రతికూల ప్రభావం చూపుతోందన్న ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. ‘యూపీఎస్సీ పరీక్షలకు సన్నద్ధమయ్యే లక్షలాది మంది యువత కృషి, సమయం వృథా అవుతోంది. వారిపై ఒత్తిడి, వ్యయప్రయాసలు పెరుగుతున్నాయి. ఏళ్ల తరబడి సుదీర్ఘ ప్రిపరేషన్ యువత నేర్చుకునే సామర్థ్యాన్ని, వారి విమర్శనాత్మక ఆలోచనను హరించివేసే ప్రమాదముంది. దరఖాస్తులు పెరుగుతున్నప్పటికీ ఆ మేర పెరగని ఖాళీలు యూపీఎస్సీని ప్రెషర్ కుక్కర్‌గా మార్చాయి. అంతిమంగా ఈ స్థితి కోచింగ్ ఇన్స్టిట్యూట్లకు లాభం చేకూర్చుతోంది. యూపీఎస్సీ పరీక్ష విధానంపై దేశవ్యాప్తంగా తప్పనిసరిగా చర్చ జరగాలి. దేశంలో యువతతోపాటు అన్ని వైపుల నుంచి అభిప్రాయాలు స్వీకరించాలి. దేశవ్యాప్తంగా సర్వే నిర్వహించాలి’ అని నిపుణులు, విద్యావేత్తలు కోరుతున్నారు.ఖాళీలు కొన్నే.. అభ్యర్థులు లక్షల్లో..ఐఏఎస్, ఐపీఎస్ తదితర సర్వీసుల్లో చేరి ప్రజాసేవ చేయాలనుకునే అభ్యర్థులు సివిల్స్‌ను ఒకప్పుడు కఠినమైన పరీక్షగా భావించేవారు. కానీ ఇప్పుడు ఈ పరీక్షలు యుద్ధాన్ని తలపిస్తున్నాయి. కేవలం కొన్ని ఖాళీల కోసం ఏటా లక్షలాది మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 2000 సంవత్సరంలో ఒక్కో ఖాళీకి 365 మంది పోటీపడేవారు. ఇటీవల ఈ పోటీ మరింత అధికమైంది. 2020–23 మధ్య ఏటా దాదాపు 11.3 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఖాళీలు మాత్రం ఏటా దాదాపు వెయ్యి మాత్రమే ఉన్నాయి. చాలా తక్కువ విజయశాతం అత్యంత కఠినమైన పరీక్ష అయిన యూపీఎస్సీ సివిల్స్ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులు విజయం కోసం కొన్నేళ్లపాటు వేచిఉండాల్సి వస్తోంది. 2013కు ముందు ప్రతి 365 మంది అభ్యర్థులకు ఒకరిగా ఉన్న సక్సెస్ రేటు ఆ తర్వాత ప్రతి 1,215 మంది అభ్యర్థులకు ఒకరికి పడిపోయింది. అంటే.. సివిల్స్ సర్వీస్ పరీక్షల్లో విజయ శాతం 0.1%, వైఫల్య శాతం 99.9%. ఇదంతా ఒక దశాబ్దంలో జరిగింది. సుదీర్ఘ ప్రిపరేషన్..సివిల్స్ పరీక్షల్లో ప్రయత్నాల పెంపు అభ్యర్థులకు మేలు చేయడానికి బదులుగా వారిని సుదీర్ఘ కాలం పాటు పరీక్షల ప్రిపరేషన్‌కే పరిమితమయ్యేలా చేసింది. 2014కు ముందు చాలామంది 2 లేదా 3వ ప్రయత్నంలోనే యూపీఎస్సీ పరీక్షలో ఉత్తీర్ణులయ్యేవారు. ప్రయత్నాల సంఖ్య పెంచాక ఈ సగటు 3–4కు పెరిగింది. సివిల్స్‌లో విజయం సాధించడానికి 93% మంది విద్యార్థులు ఒకటి కంటే ఎక్కువ ప్రయత్నాలు తీసుకుంటుండటం గమనార్హం. తొలి ప్రయత్నంలో విజయం సాధించేవారు 7 శాతమే ఉంటున్నారు. అభ్యర్థులు తమ తొలి ప్రయత్నానికి ముందు రెండేళ్ల ప్రిపరేషన్ కాలాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటే.. ఈ పరీక్షల కోసం అభ్యర్థులు ఆరేళ్లకు పైగా తమ విలువైన సమయాన్ని కేటాయించాల్సి వస్తోంది. దీంతో సివిల్స్ ప్రతిభ పరీక్షగా కంటే ఓర్పు పరీక్షగా మారిందని చెప్పొచ్చు. అభ్యర్థులు ఎంత ఎక్కువ సమయం, డబ్బు, మానసిక బలాన్ని పెట్టుబడిగా పెట్టగలిగితేనే పరీక్షలో అంతగా అవకాశాలు మెరుగయ్యే పరిస్థితి ఏర్పడింది. టాప్ ర్యాంకర్లు సైతం..సివిల్స్‌లో టాప్ ర్యాంకర్లు సైతం 3 నుంచి 5 ప్రయత్నాల్లోనే విజయాన్ని అందుకుంటున్నారు. మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించాలనేది చాలామందికి కలగానే మిగులుతోంది. 2024లో టాపర్‌గా నిలిచిన శక్తి దూబే మొదటి మూడు ప్రయత్నాల్లో ప్రిలిమ్స్‌ను కూడా దాటలేకపోయింది. నాలుగో ప్రయత్నంలో మెయిన్స్ దాటినా ఇంటర్వూ్యలో విఫలమైంది. 5వ ప్రయత్నంలో ఆమె టాపర్‌గా నిలిచి సత్తా చాటింది. ఆమె 2018 నుంచి సివిల్స్‌కు సిద్ధమైతే 2025లో ఐఏఎస్ అధికారిణి అయ్యారు. అంటే.. శక్తి దూబేకు ఐఏఎస్ అధికారిణి కావడానికి ఏకంగా ఏడేళ్లు పట్టింది. అలాగే 2024లో రెండో ర్యాంకు సాధించిన హర్షిత గోయల్ 3 ప్రయత్నాల్లో, మూడో ర్యాంకు సాధించిన డోంగ్రే అర్చిత్ పరాగ్ 2, నాలుగో ర్యాంకు సాధించిన షా మార్గి చిరాగ్ 5, ఐదో ర్యాంకు సాధించిన ఆకాశ్ గార్గ్ 2, ఆరో ర్యాంకు సాధించిన కోమల్ పునియా 3, ఏడో ర్యాంకు సాధించిన ఆయుషి బన్సాల్ 3, ఎనిమిదో ర్యాంకు సాధించిన రాజ్ కృష్ణ ఝా 5, తొమ్మిదో ర్యాంకు సాధించిన ఆదిత్య విక్రమ్ అగర్వాల్ 5, పదో ర్యాంకు సాధించిన మయాంక్ త్రిపాఠి 3 ప్రయత్నాల్లో విజయం సాధించారు. అంటే.. టాప్ పది మందిలో 8 మంది సివిల్స్ సాధించడానికి 3–5 ప్రయత్నాలు చేయాల్సి వచ్చింది. మొత్తం మీద దాదాపు 93% మంది విజయవంతమైన అభ్యర్థులు ఒకటి కంటే ఎక్కువసార్లు సివిల్స్ కోసం ప్రయత్నించారు. తొలిసారి పరీక్షలకు హాజరైనవారిలో దాదాపు 7% మంది మాత్రమే విజయం సాధిస్తున్నారు. పునఃపరిశీలించాల్సిన సమయం ఆసన్నమైందా? ఏమీ నేర్చుకోకుండా పరీక్షకు సిద్ధమవుతున్న వారి ప్రాథమిక సంవత్సరాలను వృథా చేసుకోకుండా ఉండటానికి సివిల్స్ ప్రయత్నాల సంఖ్య, గరిష్ట వయసును పునఃపరిశీలించాల్సిన సమయం ఆసన్నమైందా? 6వ ప్రయత్నంలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థి మొదటి ప్రయత్నంలోనే ఫెయిలైన అభ్యర్థి కంటే మెరుగైనవాడా? మనం మెరిట్‌ను ఎలా అంచనా వేస్తాం? ప్రయత్నాలు, తీసుకున్న సంవత్సరాల ఆధారంగా విజయానికి వెయిటేజ్ ఇవ్వబడిందా?.. వీటిపైన దేశవ్యాప్తంగా సర్వే నిర్వహించాలి. పరీక్ష విధానం మార్పుతో మలుపుయూపీఎస్సీ చరిత్రలో 2013 ఒక ప్రధాన మలుపుగా నిలిచింది. ఆ ఏడాది పరీక్షకు కొన్ని నెలల ముందు యూపీఎస్సీ సివిల్స్ మెయిన్స్ పరీక్ష విధానాన్ని మార్చింది. జనరల్ స్టడీస్ పేపర్లను పెంచి వెయిటేజీలో మార్పులు తెచ్చింది. దీంతో ఏళ్ల తరబడి పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు ఆందోళనలు చేశారు. అదనపు ప్రయత్నాలు, వయోపరిమితి సడలింపు రూపంలో ఉపశమనం కోరుతూ దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తం చేశారు. దాంతో ప్రభుత్వం 2014 నుంచి పరీక్షలకు సన్నద్ధమయ్యేవారికి మరో రెండు అటెంప్ట్స్ అదనంగా అవకాశం కల్పించింది.
- 
      
                   
                                                       పట్టుబట్టాడు, ఐఎఫ్ఎస్ కొట్టాడు : రైతుబిడ్డ దీక్షిత్ సక్సెస్ స్టోరీమధ్య తరగతి కుటుంబం.. తల్లిదండ్రులిద్దరూ వ్యవసాయ పనులు చేసేవారు. అలాంటి ఇంట్లో పుట్టిన ఓ యువకుడు ఇప్పుడు ఆ మండలానికే ఆదర్శంగా నిలిచాడు. ఏకంగా యూపీఎస్సీ నిర్వహించిన పరీక్షల్లో సత్తా చాటడంతో పాటు ఇంటర్వ్యూలోనూ రాణించి ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్‌కు ఎంపికైనాడు ఆంధ్రప్రదేశ్, శ్రీసత్యసాయి జిల్లాలోని అమరాపురానికి చెందిన యువకుడు.అమరాపురం: మండల కేంద్రమైన అమరాపురానికి చెందిన పద్మ, ఈశ్వరప్ప దంపతుల కుమారుడు దీక్షిత్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్)కు ఎంపికయ్యాడు. సోమవారం రాత్రి ఫలితాలు విడుదల కాగా, ఓపెన్ కేటగిరిలో ఏకంగా 30వ ర్యాంకు కైవసం చేసుకున్నాడు. అఖిలభారత సర్వీసులకు మండలం నుంచి ఎంపికై న తొలి యువకుడిగా చరిత్ర సృష్టించాడు.మధ్య తరగతి కుటుంబం..పద్మ, ఈశ్వరప్ప దంపతులకు ఇద్దరు కుమారులు సంతానం. పెద్ద కుమారుడు మంజునాథ బెంగళూరులో ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు. చిన్నకుమారుడు దీక్షిత్ చిన్ననాటి నుంచే చదువుల్లో రాణించేవాడు. దీంతో ఈశ్వరప్ప ఎంతకష్టమైనా తన బిడ్డను బాగా చదివించాలనుకున్నాడు. వ్యవసాయంలో నష్టాలు వచ్చినా బిడ్డల చదువులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకున్నాడు. అందుకు తగ్గట్టుగానే దీక్షిత్ చిన్నపటి నుంచే చదువుల్లో బాగా రాణించేవాడు. అమరాపురంలోని స్ఫూర్తి పబ్లిక్ పాఠశాలలో పదోతరగతి వరకు చదువుకున్న దీక్షిత్ ఆ తర్వాత ఇంటర్ పూర్తి చేశాడు. అనంతరం హార్టికల్చర్‌లో డిగ్రీ పట్టా తీసుకున్నాడు.దీక్షిత్ డిగ్రీ పట్టా తీసుకున్నాక అందరూ ఏదైనా ఉద్యోగం చూసుకోవాలంటూ సలహా ఇచ్చారు. కానీ అతను ఇప్పటికే కేంద్రం అఖిల భారత సర్వీసులకు నిర్వహించే యూపీఎస్సీ పరీక్షలు రాయాలని నిర్ణయించుకున్నాడు. ఇదే విషయాన్ని తల్లిదండ్రులు, తన సోదరునికి చెప్పి ఢిల్లీకి వెళ్లాడు. అక్కడ కోచింగ్ తీసుకుని యూపీపీఎస్సీ పరీక్ష రాశాడు. అయితే ప్రిలిమ్స్ కూడా దాటలేకపోయాడు. దీంతో అందరూ అతన్ని నిరుత్సాహ పరిచారు. ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న కొద్దిపాటి డబ్బులు అయిపోవడంతో దీక్షిత్ ఆలోచనలో పడ్డాడు. కానీ యూపీఎస్సీని వదలకూడదనుకున్నాడు.ఇంట్లో ఉంటూ చదువుకుని..ఢిల్లీలో తీసుకున్న కోచింగ్‌తో దీక్షిత్‌కు యూపీఎస్సీలో ఎలా పరీక్ష రాయాలి, ఇంటర్వ్యూ ఎలా చేయాలో తెలిసింది. దీంతో మరోసారి పరీక్షకు సిద్ధమయ్యాడు. కొన్నిరోజులు అమరాపురంలో.. ఆ తర్వాత బెంగళూరులోని తన సోదరుడు మంజునాథ వద్ద ఉంటూ ప్రిపేర్ అయ్యి ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్‌కు ప్రత్యేకంగా నిర్వహించే పరీక్షకు దరఖాస్తు చేశాడు. మొదటి సారి చేసిన తప్పులు చేయకుండా రోజుకు 16 గంటల పాటు చదివేవాడు. అలా ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలు పాసయ్యాడు. ఈ ఏడాది మార్చిలో ఢిల్లీలో నిర్వహించిన ఇంటర్వ్యూకు కూడా వెళ్లి వచ్చాడు. కానీ గట్టెక్కుతానా లేదా అన్న సంశయం..ఎప్పుడు బయట కనబడినా యూపీఎస్సీ ఫలితాలు వచ్చాయా అని దీక్షిత్‌ను అడిగేవారు. దీంతో అతను కూడా ఫలితం కోసం రెండు నెలలుగా ఎంతో ఉత్కంఠతతో ఎదురుచూస్తూ గడిపాడు.ఇదీ చదవండి: ముత్యాల నగలు, ఘూంఘట్ : మహారాణిలా, ‘అమ్మ’ లా జాన్వీ స్టన్నింగ్ లుక్కష్టాన్ని మరిపించిన ఫలితం..యూపీఎస్సీ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ కోసం నిర్వహించిన ఇంటర్వ్యూ ఫలితాలు సోమవారం రాత్రి వెల్లడయ్యాయి. ఇందులో దీక్షిత్ ఏకంగా ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరిలో 30వ ర్యాంకు సాధించాడు. దీంతో అతని ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. వ్యవసాయ కుటుంబంలో పుట్టిన యువకుడు దేశంలోనే అత్యున్నత అఖిలభారత సర్వీసులకు ఎంపిక కావడంతో అతని స్వగ్రామం అమరాపురంలో పండుగ వాతావరణం నెలకొంది. దీక్షిత్‌ను స్నేహితులు, బంధువులు, కుటుంబీకులు అభినందనలతో ముంచెత్తారు.అమ్మానాన్నకు అంకితంఈ ఫలితం మా అమ్మానాన్నకు అంకితం. ఎందుకంటే నేను యూపీఎస్సీ పరీక్షకు సిద్ధమవుతానని చెప్పగా వారితో పాటు మా అన్న మంజునాథ నన్ను ప్రోత్సహించారు. తొలిసారి విఫలమైనా వెన్నుదన్నుగా నిలిచారు. నాకు ఏ లోటూ రాకుండా చూసుకున్నారు. కష్టపడి చదివితే గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు కూడా అఖిలభారత సర్వీసులు కొట్టవచ్చన్నదానికి నేనే ఉదాహరణ. నేను సర్వీసులోకి వచ్చాక నిరుపేద విద్యార్థులకు సాయంగా నిలుస్తా. – దీక్షిత్చదవండి: డిప్యూటీ సీఎం ‘మల్లు’ సతీమణి ఆవకాయ : గత పదేళ్లుగా..!
- 
      
                   
                                                       సుపరిపాలనకు దోవ‘సివిల్ సర్వీసు అధికారికి ఎంత తెలుసనేది కాదు... ఆ అధికారి ఎంత జాగ్రత్తగా విధి నిర్వహణ చేస్తారన్నదే అసలైన పరీక్ష’ అన్నారు ప్రథమ భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ. అఖిల భారత సర్వీసుల రూపశిల్పి, దేశ తొలి ఉపప్రధాని సర్దార్ పటేల్ సైతం ఈ అధికారుల గురించి చెప్పిన మాటలు వారి బాధ్యతను గుర్తుచేస్తాయి. సివిల్ సర్వీసులకు ఎంపికైనవారు స్వతంత్రంగా, నిజా యితీగా, నిర్భీతితో వ్యవహరించగలిగితేనే పటిష్టమైన దేశ నిర్మాణం సాధ్యమవుతుందని ఆయన అభిలషించారు. కానీ ఇప్పటికీ ఆచరణలో సమస్యలు తప్పడం లేదు.ఈమధ్య తమ ముందు కొచ్చిన ఒక పిటిషన్‌పై విచారణ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం ఐఏఎస్‌ల తీరుపై కటువుగా వ్యాఖ్యానించింది. ఐఏఎస్‌లు తరచు తాము ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులకన్నా అధికులమని భావిస్తారనీ, అది సరికాదనీ జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టీన్ జార్జి మాసిలతో కూడిన ధర్మా సనం తెలిపింది. సివిల్ సర్వీసుల రూపకర్తలు ఇలాంటి అంతరాలను చూడలేదు. విధి నిర్వహణకు సంబంధించినంత వరకూ ఈ సర్వీసుల్లోని వారు దేశాభివృద్ధినీ, భద్రతనూ కాంక్షించి అందుకు అనువైన నిర్ణయాలు తీసుకుంటూ తమ విధులు నిర్వర్తించాలని కోరుకుంది. స్వభావరీత్యా విధి నిర్వహణ భిన్నంగా ఉండొచ్చు. ఇందులో ఎక్కువ, తక్కువ అనే సమస్యే రాకూడదు. సాధారణంగా సివిల్ సర్వీస్ వైపు వచ్చే యువతీయువకులకు సమాజం ఎదుర్కొంటున్న సమస్యలపైనా, వాటివల్ల కలుగుతున్న అనర్థాలపైనా ఆగ్రహం ఉంటుంది. వాటి పరిష్కారం తమవల్ల సాధ్యమేనన్న విశ్వాసం ఉంటుంది. సంపాదనే ప్రధానమనుకుంటే ఏ బహుళజాతిసంస్థకో మేనేజర్‌గా లేదా సీఈవోగా వెళ్లవచ్చు. సివిల్ సర్వీసుల్లోకన్నా అత్యధిక జీతం, ఇతర సదు పాయాలూ, ఆస్తుల సంపాదన ఉంటాయి. పైగా అక్కడ అధిక శ్రమ, పని ఒత్తిడి ఉండవు. కానీ సివిల్ సర్వీస్‌లు అలా కాదు. ప్రభుత్వంలో ఎక్కడో కిందిస్థాయి అధికారి తీసుకునే పొరపాటు నిర్ణయం ఆ ప్రాంతంలోనో, ఆ జిల్లాలోనో, కొన్ని సందర్భాల్లో రాష్ట్రంలోనో కల్లోలానికి దారి తీయొచ్చు. ప్రభుత్వ పథకాల అమలులో చోటుచేసుకునే చిన్న లోపం కూడా సాధారణ పౌరులను కలవరపరిచి వారు ప్రాణం తీసుకునే ప్రమాదం కూడా ఉండొచ్చు. లేదా అధికారిపై దౌర్జన్యానికి దిగొచ్చు. ఇలాంటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవటం, అనుకోని సమస్య ఎదురైతే సమయస్ఫూర్తితో వ్యవహరించటం తప్పనిసరి. అలాగని ఈ అంతరాలు లేవని కాదు. ప్రాధాన్యత క్రమంలో ఐఏఎస్‌లు మొదటి స్థానంలో ఉంటారు. ఆ తర్వాత ఐపీఎస్‌లు వస్తారు. ఇది పాలనా సౌలభ్యం కోసం చేసిన ఏర్పాటు. స్వల్ప వ్యత్యాసంతో ఇద్దరి ప్రారంభ వేతనాలూ... ఆరోగ్యం, ఆవాసం, సెలవులు, ఇతర సదుపాయాలూ ఒకేలావుంటాయి. మొదటి మూడు నాలుగు నెలలు ఉమ్మడిగా శిక్షణనిచ్చినా బాధ్యతలరీత్యా ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్లకు వేర్వేరుచోట్ల ప్రత్యేక శిక్షణనిస్తారు. ఒక జిల్లాకో, ఒక ప్రాంతానికో బాధ్యత వహించే ఐఏఎస్ అధికారి అక్కడి పాలనా వ్యవస్థను పటిష్టపరచటానికి నిర్ణయాలు తీసుకోవాల్సి వుంటుంది. ఎవరిని ఏ స్థానంలో పనిచేయించాలో, అందుబాటులో ఉన్న వనరుల ఆధారంగా అక్కడి ప్రజల అభ్యున్నతికి ఏమేం చేయవచ్చునో అధ్యయనం చేయటం, దాని ఆధారంగా నిర్ణయాలు తీసుకోవటం కూడా ఐఏఎస్ అధికారుల బాధ్యత. ఐఏఎస్‌లకు భిన్న శాఖల్లో పనిచేసే అవకాశం లభిస్తుంది. ఐపీఎస్లకుశాంతిభద్రతల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి ఉంటుంది. దానికి అనుగుణంగా వారికి ప్రత్యేక శిక్షణ అవసరమవుతుంది. అలాగే ఐఎఫ్ఎస్లు అడవుల పరిరక్షణలో, భద్రతలో, వాటి నిర్వహణలో అవగాహన పెంచుకుంటారు. పర్యావరణం, వాతావరణ మార్పులు, సహజ వనరుల సంరక్షణ వారి ప్రధానాంశాలు. అందరి అంతిమ ధ్యేయమూ మెరుగైన పాలనా వ్యవస్థను ప్రజల అందుబాటులోకి తీసుకు రావటమే అయినప్పుడు ఎవరికీ ఆధిక్యతా భావన ఉండకూడదు. అటువంటి మనస్తత్వం పాలనపై దుష్ప్రభావం కలిగిస్తుంది. ప్రభుత్వ తీరుతెన్నులపై విమర్శలకు తావిస్తుంది. కానీ దురదృష్టమేమంటే, ధర్మాసనం చెప్పినట్టు చాలాచోట్ల ఇలాంటి పోకడలు కనిపిస్తున్నాయి. రెండేళ్ల క్రితం కర్ణాటకలో ఐఏఎస్, ఐపీఎస్ బాధ్యతల్లోవున్న ఇద్దరు మహిళా అధికారులు సామాజిక మాధ్యమాల్లో ఎలా దూషించుకున్నారో ఎవరూ మరిచిపోరు. అప్పట్లో ప్రధాని కార్యాలయం ఆనాటి ముఖ్యమంత్రిని వివరణ కోరింది. సుప్రీంకోర్టు ధర్మాసనం ఉత్తరాఖండ్‌లో అడవుల సంరక్షణ, అభివృద్ధి అవసరాలు సమతౌల్యం చేయటానికి ఉద్దేశించిన నిధులు దుర్వినియోగం కావటానికి సంబంధించి దాఖలైన కేసులో ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యవహారంలో ఐఏఎస్, ఐఎఫ్ఎస్ అధికారులిద్దరి మధ్య తలెత్తిన వివాదం ప్రస్తావనకొచ్చినప్పుడు న్యాయమూర్తులు ఐఏఎస్‌ల తీరును నిశితంగా విమర్శించారు. ఒకచోట పనిచేయాల్సి వచ్చినప్పుడు వివాదాలు తలెత్తటం అసాధారణమేమీ కాదు. కానీ వ్యక్తిగత స్థాయికి వివాదాల్ని దిగజార్చటంవల్ల వ్యవస్థ దెబ్బతింటుంది.చాలా రాష్ట్రాల్లో ఇలాంటి సమస్యలుంటున్నాయి. వీటికి ఎక్కడో ఒకచోట బ్రేక్ పడాలి. తాత్కాలిక సర్దుబాట్లుకాక మరోసారి సమస్య తలెత్తకుండా ఏం చేయవచ్చునో ఆలోచించాలి. ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఏర్పరిచిన అధి కార యంత్రాంగం కాస్తా అంతర్గత కలహాల్లో మునిగితే వ్యవస్థ నష్టపోతుంది. అంకితభావంతో, కర్తవ్యనిష్టతో పనిచేసిన ఎస్.ఆర్. శంకరన్, బి.డి. శర్మవంటివారు ఇవాళ్టికీ చిరస్మరణీయులు. అధికారులకు వారు ఆదర్శం కావాలి. అప్పుడు అహంభావానికి తావుండదు.
- 
      
                   
                                                       ఐఏఎస్‌లది ఆధిపత్య ధోరణిసాక్షి, న్యూఢిల్లీ: ఐఏఎస్ అధికారులు ఎప్పుడూ ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌లపై ఆధిపత్యం ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తారని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ వ్యాఖ్యానించారు. అందుకే ఐఏఎస్‌ల మాట మేం ఎందుకు వినాలనే అసహనం, అసంతృప్తి ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారుల్లో గూడుకట్టుకుపోయిందని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన ఒక కేసును జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మసీహ్‌ల ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. అటవీ అధికారులు తమ ఆదేశాలను పాటించాలని ఐఏఎస్ అధికారులు కోరడంపై ధర్మాసనం విస్త్రృతంగా చర్చించింది. ఇండియన్ అడ్మిస్ట్రేటివ్ సర్వీసెస్, ఇండియన్ పోలీస్ సర్వీసెస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ అధికారుల మధ్య జరుగుతున్న ఈర‡్ష్య యుద్దాన్ని ప్రస్తావిస్తూ జస్టిస్ గవాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఐఏఎస్‌లకు ఐపీఎస్, ఐఎఫ్ఎస్లకు మధ్య బేదాభిప్రాయాలు లేవని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా చేసిన వాదనను జడ్జి తప్పుబట్టారు. ‘‘నేను ప్రభుత్వ న్యాయవాదిగా మూడేళ్లు పనిచేశా. న్యాయమూర్తిగా 22 ఏళ్లుగా సేవలందిస్తున్నా. ఇన్నేళ్లలో నేను గమనించింది ఏంటంటే ఐఏఎస్‌లు ఎçప్పుడూ ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌లపై ఆధిపత్యాన్ని ప్రదర్శించాలని చూస్తుంటారు. ఈ వివాదం అన్ని రాష్ట్రాల్లో ఉంది. అందరూ ఒకే అఖిల భారత సర్వీస్‌లకు సంబంధించిన ఉన్నతాధికారులమే అయినప్పుడు ఐఎఎస్‌ల మాటే ఎందుకు వినాలి? అనే అసంతృప్తి ఐపీఎస్, ఐఎఫ్ఎస్లలో ఉంది. ఈ విధానం మారాలి. ఈ విషయంలో అందర్నీ సమానంగా చూడాలని భావన ఐఏఎస్‌లలో కల్పించండి’’ అని కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు జస్టిస్ గవాయ్ సూచించారు. అధికారుల మధ్య ఉన్న అంతర్గత వివాదాలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తానని కేంద్రం తరఫున తుషార్ కోర్టుకు తెలిపారు. జడ్జీలు కేసు తదుపరి విచారణను వచ్చే నెలకు వాయిదావేశారు.
- 
      
                   
                                                       కూరగాయల షాపింగ్ గైడ్!కూరగాయాలు కొనుగోలు చేసేందుకు మార్కెట్‌కి వెళ్లిన ప్రతిసారి పాడయినవే పొరపాటున కొనేస్తాం. ఎన్నాళ్లు కొన్నా కూడా ఏదో ఓ కూరగాయ వద్ద అంచనా తప్పి మంచివి కొనలేకపోతుంటాం. అలాంటప్పుడూ ఎలాంటి కూరగాయాలు కొంటే మంచిది అనేది ఎవరైనా పెద్దవాళ్ల సలహాతో ప్రయత్నించి చూస్తాం కదా..!. చాలామంది అందుకు ఓ కచ్చితమైన గైడ్ ఉంటే బాగుండును అని ఫీలవుతుంటారు. ప్రస్తుతం అలాంటి సలహాలు సూచనలతో కూడిన కూరగాయల షాపింగ్ గైడ్ ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మార్కెట్లో కూరగాయాలను కొనేముందు ఇలాంటి సూచనలు, సలహాలు పాటించండి అంటూ ఓ కూరగాయల షాపింగ్ గైడ్ నెటింట తెగ హల్చల్ చేస్తోంది. అందులో టమోటాలు పసుపు ఎరుపు రంగులో కాస్త ఓ మోస్తారు పచ్చిగా ఉన్నవి తీసుకుంటే ఎక్కువకాలం వాడుకోవచ్చు. రంధ్రాలు పడిన టమోటాలు ఎట్టిపరిస్థితుల్లో కొనుగోలు చెయ్యొద్దు. బంగాళదుంపలు గట్టిగా ఉంటేనే తీసుకోవాలి. కాస్త మెత్తగా ఎక్కడైన తగిలితే దాన్ని ఎంపిక చేసుకోకూడదు. అలాగే మెంతి ఆకులు తాజాగా కనిపిస్తేనే కొనాలి. అలాగే బచ్చలి, ఉల్లపాయలు, పచ్చిమిర్చి వంటివి.. ఎలాంటి కొంటే మంచిది అనేది.. ఆ గైడ్లో చాలా విపులంగా వివరించి ఉంది. ఓ రిటైర్డ్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్ తన భార్య స్వయంగా చేతులతో రాసిన.. ఎలాంటి కూరగాయలు కొనాలనే షాపింగ్ గైడ్‌ని నెటిజన్లతో షేర్ చేసుకున్నారు. తాను కూరగాయల కోసం మార్కెట్‌కి వెళ్తున్నపుడు ఉపయోగ పడుతుందంటూ.. ఈ చీటి తన చేతిలో పెట్టినట్లు చెప్పుకొచ్చారు. నెటిజన్లు వావ్ కూరగాయలు కొనుగోలు మార్గదర్శిని అంటూ అతడి భార్యపై ప్రశంసలు కురిపించారు. అలాగే పండ్ల గైడ్ కడా ఇస్తే బాగండు అంటూ పోస్టులు పెట్టారు. కొత్తగా మార్కెట్లో కూరగాయలు కొనేవాళ్లకు ఈ గైడ్ చక్కగా ఉపయోగపడుతుంది కదూ..!.While going for market for vegetables my wife shared with me this👇 stating that you can use this as a guide 🤔🤔😃 pic.twitter.com/aJv40GC6Vj— Mohan Pargaien IFS🇮🇳 (@pargaien) September 13, 2024 (చదవండి: ఎముకలు కొరికే చలి! ఆ ఫీల్ కావలంటే ఈ మ్యూజియంకి వెళ్లాల్సిందే..!)
- 
      
                   
                                                       సివిల్స్‌లో విజయం సాధించిన మిస్ ఇండియా ఫైనలిస్ట్!ఓ మోడల్ గ్లామర్ రంగంలో రాణిస్తూ ప్రతిష్టాత్మకమైన సివిల్స్ ఎగ్జామ్ వైపుకి అడుగులు వేసింది. తొలి ప్రయత్నంలోనే విజయం సాధించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. గ్లామరస్ రోల్‌కి విభిన్నమైన రంగంలోకి అడుగుపెట్టడమే గాక ఎలాంటి కోచింగ్ లేకుండా విజయ సాధించి అందరికీ స్పూర్తిగా నిలిచింది ఈ మోడల్. ఆమె ఎవరంటే..రాజస్థాన్‌కు చెందిన ఐశ్వర్య షియోరాన్ సైనిక నేపథ్య కుటుంబానికి చెందింది. అందువల్లే ఆమె దేశానికి సేవ చేసే ఈ సివిల్స్ వైపుకి మళ్లింది. ఆమె తన ప్రాథమిక విద్యనంతా చాణక్యపురిలోని సంస్కతి పాఠశాల్లో పూర్తి చేసింది. ఇంటర్లో ఏకంగా 97.5 శాతం మార్కులతో పాసయ్యింది. ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నప్పుడు మోడలింగ్ పోటీల్లో పాల్గొంది. అలా మొదలైన ఆమె ప్రస్థానం పలు మోడలింగ్ పోటీల్లో పాల్గొనడంతో సాగిపోయింది. ఆ విధంగా ఆమె 2015లో మిస్ ఢిల్లీ కిరీటం, 2014లో మిస్ క్లీన్ అండ్ కేర్ ఫ్రెష్ ఫేస్, 2016లో మిస్ ఇండియా పోటీల్లో ఫైనలిస్ట్‌గా నిలిచింది. ఈ మోడలింగ్ అనేది ఆమె అమ్మకల అని అందుకే ఈ రంగంలోకి వచ్చానని తెలిపింది ఐశ్వర్య. ఆ తర్వాత కెరీర్‌పై పూర్తి ఫోకస్ పెట్టినట్లు తెలిపారు. 2018లో ఐఐఎం ఇండోర్‌కు ఎంపికైన తాను సివిల్స్ వైపే దృష్టి సారించినట్లు తెలిపారు. అలా 2018-2019లో సివిల్స్ ప్రిపరేషన్లో మునిగిపోయింది. ఎలాంటి కోచింగ్ తీసుకోకుండా తనకు తానుగా ప్రిపేర్ అయ్యింది. తొలి ప్రయత్నలోనే సివిల్స్ 2019లో విజయం సాధించి..93వ ర్యాంక్ సాధించారు. తన ప్రిపరేషన్ గురించి మాట్లాడుతూ..ఇక తాను ఈ సివిల్స్ ప్రిపరేషన్ కోసం 10+8+6 టెక్నిక్ ఫాలో అయ్యానని చెప్పారు. అంటే పదిగంటలు నిద్ర, ఎనిమిది గంటలు నిద్ర, ఆరుగంటలు ఇతర కార్యకలాపాలు. ఇక కోచింగ్ దగ్గర కొచ్చేటప్పటికీ వారి వ్యక్తిగత అభిరుచికి సంబధించింది అని అన్నారు. ఎప్పుడైనా ఇలాంటి పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే ముందు సాధించగలమా లేదా అనేదానిపై పూర్తి అవగాహన ఉండాలి. అప్పుడే దిగాలి అని చెప్పుకొచ్చారు ఐశ్వర్య. ఇక ఆమె తండ్రి విజయ్ కుమార్ ఆర్మీలో కల్నల్. ఆమె తల్లి సుమన్ షియోరాన్ గృహిణి. రాజస్థాన్‌లో జన్మించిన ఐశ్వర్య ఢిల్లీలో ఉన్నత విద్యను పూర్తి చేసింది. ఈ మధ్యే తెలంగాణలో రాష్ట్రం కరీంనగర్‌కు బదిలీ అయ్యింది. కల్నల్ అజయ్ కుమార్ కరీంనగర్ ఎన్సీసీ తొమ్మిదో బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్. ప్రస్తుతం ఐశ్వర్య ఐఎఫ్ఎస్ ఆఫీసర్‌గా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో పనిచేస్తోంది. మోడల్ నుంచి ప్రజలకు సేవ చేసే అత్యున్నత రంగంలోకి రావడమే గాక కేవలంలో ఇంట్లోనే జస్ట్ పదినెల్లలో ప్రిపేర్ అయ్యి సివిల్స్‌లో విజయం సాధించింది. తపన ఉంటే ఎలాగైనా సాధించొచ్చు అనేందుకు స్ఫూర్తి ఐశ్వర్యనే అని చెప్పొచ్చు కదూ..!(చదవండి: కేబినెట్ మంత్రి చిరాగ్ పాశ్వాన్ ఇష్టపడే రెసిపీ ఇదే..!)
- 
      
                   
                                 కార్పొరేట్ జాబ్ వదిలేసి మరీ..సివిల్స్ ర్యాంక్ కొట్టిన యువతి స్టోరీసివిల్స్ సాధించాలనే లక్ష్యంతో కార్పొరేట్ ఉద్యోగాన్ని విడిచి పెట్టేసింది. పట్టుదలతో చదివి ఊహించని ఫలితాన్ని సాధించింది. తాజా యూపీఎస్సీ ఫలితాల్లో టాప్-20లో ర్యాంకు సాధించింది. ఢిల్లీకి చెందిన 24 ఏళ్ల యువతి సక్సెస్ స్టోరీ గురించి తెలుసుకుందాం రండి..! ప్రతిష్టాత్మక పరీక్ష సివిల్స్ పరీక్షలో విజయం సాధించాలంటే అంత ఈజీకాదు. దీనికి ఎంతో పట్టుదల కృషి కావాలి. అలా దీక్షగా చదివి తన ప్రత్యేకతను చాటుకుంది నోయిడా సెక్టార్ 82 లోని వివేక్ విహార్‌లో నివసించే వార్దా ఖాన్. మంగళవారం ప్రకటించిన తాజా యూపీఎస్సీ ఫలితాల్లో 18 వ ర్యాంక్ సాధించింది. తన తొలి ప్రిఫరెన్స్‌గా ఇండియన్ ఫారిన్ సర్వీస్(ఐఎఫ్ఎస్) అని తెలిపింది. ప్రపంచంలోనే భారత దేశాన్ని మరింత ఉన్నత స్థానంలో ఉంచాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్దా ఖాన్ తెలిపింది. సివిల్స్‌లో మంచి తన టార్గెట్. కానీ టాప్ 20లో ఉంటానని అస్సలు ఊహించలేదంటూ సంతోషాన్ని వ్యక్తం చేసింది వార్దా ఖాన్. దీంతో తన ఫ్యామిలీ అంతా చాలా సంతోషంగా ఉందని పేర్కొంది. వాస్తవానికి సివిల్స్‌కోసం 2021 నుండి సిద్ధమవుతున్నాననీ, రెండో ప్రయత్నంలో విజయం సాధించానని వెల్లడించింది. ఈ సందర్బంగా కుటుంబం, స్నేహితులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. #WATCH | Uttar Pradesh | Noida resident Wardah Khan secures 18th rank in UPSC 2023. She says, "I had never thought that I would make it to Top 20. I just wanted to make it to the list (of qualifiers). This is a huge moment for my family and me. This was my second attempt. I have… pic.twitter.com/2KoPdlDPmV — ANI (@ANI) April 16, 2024 నోయిడా సెక్టార్ 82లోని వివేక్ విహార్‌లో ఉండే వార్ధా ఖాన్ ఆమె తల్లిదండ్రులకు ఏకైక సంతానం. తండ్రి తొమ్మిదేళ్ల క్రితం చనిపోగా ప్రస్తుతం తల్లితో కలసి ఉంటోంది. ఢిల్లీలోని ఖల్సా కాలేజీ నుంచి బీకామ్ హానర్స్ పూర్తి చేసింది. చదువు తరువాత ఎనిమిది నెలల పాటు కార్పొరేట్ కంపెనీలో పనిచేసింది. అది సంతృప్తి నివ్వలేదు. పైగా సమాజానికి సేవ చేయాలనే ఆశయం. దీంతో కష్టపడి చదవి తమ కలను సాకారం చేసుకుంది. హిస్టరీ, జియోపాలిటిక్స్ సబ్జెక్టులు అంటే ఇష్టమని పేర్కొంది. అలాగే కాలేజీ రోజుల్లో ఎక్కువగా డిబేట్లలో, MUN లలో (మాక్ యునైటెడ్ నేషన్స్) పాల్గొనేదాన్ని ఆ సమయంలో సివిల్స్ సాధించాలనే ఆలోచన తనలో కలిగిందని చెప్పుకొచ్చింది.
- 
      
                   
                                 సివిల్స్‌లో తెలుగు తేజాలుసాక్షి, హైదరాబాద్: సివిల్స్‌లో ర్యాంకు సాధించడం దేశంలో చాలామంది కల. ఇందులో ఈసారీ తెలుగు విద్యార్థులు సత్తా చాటి తమ లక్ష్యాన్ని అందుకున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన దోనూరు అనన్యరెడ్డి మూడో ర్యాంకు సాధించారు. వంద లోపు ర్యాంకుల్లో ముగ్గురు తెలుగువాళ్లే ఉన్నారు. నందాల సాయి కిరణ్ 27వ ర్యాంకు సాధిస్తే, కేఎన్ చందన జాహ్నవి 50, మెరుగు కౌశిక్ 82వ ర్యాంకు సాధించారు. మొత్తం ర్యాంకుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్థులు 36 మంది ఉన్నారు. అలాగే, ఇతర కేంద్ర సర్వీసులకు 20 మందికిపైగా ఎంపికయ్యారు. మొత్తమ్మీద కేంద్ర సర్వీసులకు 56 మందికిపైగా తెలుగు తేజాలు ఎంపికవడం విశేషం. అఖిల భారత సర్వీసుల్లో పోస్టుల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సివిల్స్– 2023 కోసం గత ఏడాది మే 28న ప్రిలిమ్స్ నిర్వహించింది. ప్రిలిమినరీలో అర్హత పొందిన వారికి గత నవంబర్‌లో మెయిన్స్ పరీక్ష నిర్వహించగా, ఈ పరీక్ష ఫలితాలను డిసెంబర్ 8న వెల్లడించారు. మెయిన్స్‌లోనూ అర్హత పొందిన వారికి జనవరి 2, ఏప్రిల్ 9 మధ్య వ్యక్తిగత ఇంటర్వ్యూలు నిర్వహించారు. మొత్తంగా పొందిన మార్కుల ఆధారంగా ర్యాంకులను యూపీఎస్సీ మంగళవారం ప్రకటించింది. ఆలిండియా టాపర్‌గా లక్నోకు చెందిన ఆదిత్య శ్రీవాత్సవ నిలవగా, ఒడిశాకు చెందిన అనిమేష్ ప్రదాన్ రెండో స్థానంలో నిలిచారు. తెలంగాణకు చెందిన అనన్య రెడ్డి మూడో ర్యాంకు సాధించారు. 2022 సివిల్స్‌లోనూ తెలుగు విద్యార్థి ఉమాహారతి మూడో స్థానం పొందడం విశేషం. 1,016 మంది ఎంపిక సివిల్స్–2023 కోసం యూపీఎస్సీ 1,016 మందిని ఎంపిక చేసింది. ఇందులో జనరల్ కేటగిరీలో 347 మంది ఉన్నారు. ఈడబ్ల్యూఎస్ కోటా నుంచి 115, ఓబీసీ నుంచి 303, ఎస్సీల నుంచి 165, ఎస్టీ విభాగం నుంచి 86 మంది ఎంపికయ్యారు. పోస్టుల వారీగా చూస్తే ఐఏఎస్ సర్వీసులకు 180 మంది, ఐఎఫ్ఎస్కు 37 మంది, ఐపీఎస్‌కు 200 మంది ఎంపికయ్యారు. సెంట్రల్ సర్వీసెస్ గ్రూప్–ఏ కేటగిరీకి 613 మంది, గ్రూప్ బీ సర్వీసెస్‌కు 113 మంది ఎంపికైనట్టు యూపీఎస్సీ వెల్లడించింది. అభ్యర్థులు పొందిన మార్కులను 15 రోజుల్లో తమ వెబ్సైట్లో ఉంచుతామని ప్రకటించింది. విజేతలకు సీఎం రేవంత్ శుభాకాంక్షలు సివిల్స్ ఫలితాల్లో మెరిసిన తెలుగు రాష్ట్రాల విజేతలకు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. తెలంగాణ, ఏపీ నుంచి ఈసారి 50 మందికి పైగా ఎంపికవడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. జాతీయ స్థాయిలో మూడో ర్యాంకు సాధించిన పాలమూరుకు చెందిన దోనూరి అనన్య రెడ్డికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. మహేష్ భగవత్ కృషి ఫలించింది సివిల్స్ పరీక్షల్లో సీనియర్ ఐపీఎస్ అధికారి మహేష్ భగవత్ గైడెన్స్ మంచి ఫలితాలను ఇచ్చింది. హైదరాబాద్ కేంద్రంగా శిక్షణ పొందుతున్న వారితో ప్రత్యక్షంగా, ఇతర రాష్ట్రాల వారితో ఆన్లైన్ ద్వారా ఆయన ఇచ్చిన సూచనలతో 200 మందికి పైగా ర్యాంకులు సాధించారు. అందులో తెలంగాణ నుంచి అనన్య రెడ్డి సహా జాతీయ పోలీస్ అకాడమీలో ఐపీఎస్ శిక్షణ పొందుతున్న వారు కూడా ఉన్నారు. సివిల్స్ ప్రిపేరయ్యే వారికి వ్యక్తిత్వ వికాసం, పరీక్ష సమయాల్లో ఒత్తిడి, సమయ పాలన, ఇంటర్వ్యూలో వ్యవహరించాల్సిన తీరు తదితర అంశాలపై మహేష్ భగవత్ సూచనలు చేశారు.
- 
      
                   
                                 UPSC: సివిల్స్ ఫలితాల్లో మెరిసిన తెలుగు తేజాలుసాక్షి, ఢిల్లీ: యూపీఎస్సీ సివిల్స్ ఫలితాలు విడుదలయ్యాయి. ఇందులో 1,016 మంది ఎంపికయ్యారు. ఆదిత్య శ్రీవాత్సవకు మొదటి ర్యాంకు, అనిమేష్ ప్రధాన్‌కు రెండో ర్యాంకు, దోనూరి అనన్యరెడ్డికి మూడో ర్యాంకు దక్కింది. ఇక ఈ యూపీఎస్సీ ఫలితాల్లో వరంగల్‌కు చెందిన ఇద్దరు సెలక్ట్ అయ్యారు. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు ర్యాంకుల పంట పండింది. మొత్తం 1,016 మంది ఎంపికయితే.. అందులో తెలుగు అభ్యర్థులు కనీసం 50కి పైగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. దోనూరు అనన్యారెడ్డికి మూడో ర్యాంకు అన్షుల్ భట్ 22వ ర్యాంకు నందల సాయి కిరణ్‌కు 27 ర్యాంకు మెరుగు కౌశిక్‌కు 82వ ర్యాంకు పింకిస్ ధీరజ్ రెడ్డి 173 ర్యాంకు అక్షయ్ దీపక్ 196 ర్యాంకు భానుశ్రీ 198 ర్యాంకు ప్రదీప్ రెడ్డి 382 ర్యాంకు వెంకటేష్ 467 ర్యాంకు హరిప్రసాద్ రాజు 475వ ర్యాంకు పూల ధనుష్ 480 ర్యాంకు కె. శ్రీనివాసులు 526 ర్యాంకు సాయితేజ 558 ర్యాంకు కిరణ్ సాయింపు 568 ర్యాంకు మర్రిపాటి నాగభరత్ 580 ర్యాంకు పీ. భార్గవ్ 590 ర్యాంకు అర్పిత 639 ర్యాంకు ఐశ్వర్య నీలిశ్యామల 649 ర్యాంకు సాక్షి కుమార్ 679 ర్యాంకు రాజ్‌కుమార్ చౌహన్ 703 ర్యాంకు జి.శ్వేత 711 ర్యాంకు ధనుంజయ్ కుమార్ 810 ర్యాంకు లక్ష్మీ భానోతు 828 ర్యాంకు ఆదా సందీప్ కుమార్ 830 ర్యాంకు జె.రాహుల్ 873 ర్యాంకు హనిత వేములపాటి 887 ర్యాంకు కె.శశికాంత్ 891 ర్యాంకు కెసారపు మీనా 899 ర్యాంకు రావూరి సాయి అలేఖ్య 938 ర్యాంకు గోపద నవ్యశ్రీ 995 ర్యాంకు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ముగ్గురికి ర్యాంకులు వచ్చాయి. వరంగల్ నగరానికి చెందిన జయసింహారెడ్డికి 103వ ర్యాంకు వచ్చింది. గీసుకొండ మండలం అనంతరం గ్రామానికి చెందిన సయింపు కిరణ్‌కు 568 ర్యాంకు వచ్చింది. శివనగర్ కు చెందిన కోట అనిల్ కుమార్‌కు 764వ ర్యాంకు వచ్చింది. జయసింహారెడ్డికి IAS వచ్చే అవకాశం ఉంది. కిరణ్‌కు IPS లేదా IRS రావొచ్చు. అనిల్ కుమార్‌కు IRS వచ్చే అవకాశం ఉంది. (సయింపు కిరణ్) గతేడాది మే 28వ తేదీన యూపీఎస్పీ ప్రిలిమ్స్ పరీక్ష జరిగాయి. ప్రిలిమ్స్ పరీక్షల అనంతరం మేయిన్స్ పరీక్షలు సెప్టెంబర్ 15, 16, 17, 23, 24 తేదీల్లో జరిగాయి. మేయిన్స్ పరీక్షల ఫలితాలను డిసెంబర్ ఎనిమిదో తేదీన విడుదల చేశారు. అనంతరం జనవరి రెండో తేదీ నుంచి ఏప్రిల్ రెండు నుంచి ఏప్రిల్ తొమ్మిదో తేదీ వరకు ఇంటర్వ్యూలు జరిగాయి. నేడు తుది ఫలితాలు వెలువడ్డాయి. UPSC has announced the final results of the Civil Services Examination. Congratulations to all achievers who have cleared this prestigious milestone! Your hard work and dedication have paid off.#Upsc_final_result#UPSC2024 #upsc#upsc2023 pic.twitter.com/jkj3sCPoSD — आदर्श यादव(Adarsh Yadav) (@AdarshY59491482) April 16, 2024
- 
            
                                     
                                                             ఐఎఫ్ఎస్ ఇంటర్నేషనల్ ఫ్యాషన్‌షోలో అదరగొట్టిన మోడల్స్, విద్యార్థులు (ఫోటోలు)
- 
      
                   
                                 అప్పట్లో .. చీతాలు వేటకుక్కల్లా..మన దేశంలో 70 ఏళ్ల క్రితమే చీతాలు అంతరించిపోయాయి. వాటిని తిరిగి దేశంలో ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం నమీబియా నుంచి ఎనిమిది చీతాలను తెచ్చి కునో నేషనల్ పార్క్‌లో వదిలింది. దీనితో దేశవ్యాప్తంగా ఈ చీతాలు ఏమిటి, వాటి బలం, వేగం ఏమిటన్నదానిపై పెద్ద చర్చే జరుగుతోంది. కానీ అన్నింటికన్నా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఒకప్పుడు మన దేశంలో చీతాలను పెంపుడు వేటకుక్కల్లా వినియోగించేవారు. ఇళ్ల వద్ద మేకలు, గొర్రెల్లా కట్టేసుకునేవారు. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) అధికారి పర్వీన్ కాస్వాన్ దీనికి సంబంధించి 1939 నాటి ‘వైల్డర్నెస్ ఫిల్మస్ ఇండియా లిమిటెడ్’ తీసిన వీడియోలు, ఫొటోలను ట్విట్టర్లో పోస్టు చేశారు. మిగతావి అంతరించక ముందే స్పందించాలి చీతాలను వేటకుక్కల్లా వాడుకోవడంతోపాటు.. అడవుల్లోని చీతాలను సరదాకు వేటాడేవారని ఐఎఫ్ఎస్ అధికారి పర్వీన్ కాస్వాన్ వివరించారు. పెంపుడు చీతాల సాయంతో ‘హంటింగ్ పార్టీ’లను నిర్వహించేవారని.. ఇలాంటివన్నీ కలిసి చీతాలు అంతరించిపోవడానికి కారణమైందని పేర్కొన్నారు. ఇప్పుడు కొన్ని రకాల జంతువులు ఇలాంటి పరిస్థితిలో ఉన్నాయని.. వాటి సంరక్షణపై దృష్టిపెట్టకుంటే చీతాల తరహాలో వాటిని కూడా ఫొటోల్లోనే చూడాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు. పెంపుడు కుక్కల్లా పెంచుకుని.. అప్పట్లో అడవుల్లోంచి చీతాలను పట్టుకుని వచ్చి పెంపుడు కుక్కల్లా పెంచుకునేవారు. వాటిని ఇంటి ముందు కట్టేసేవారు. జింకలు, దుప్పులను వేటాడటానికి చీతాలను వినియోగించేవారు. ఆ చీతాల కళ్లకు గంతలు కట్టి ఎడ్ల బండ్లపై జింకలు, దుప్పులు ఉన్న ప్రదేశాలకు తీసుకెళ్లేవారు. అక్కడ కళ్లగంతలు విప్పి వదిలేసేవారు. చీతాలు వేగంగా పరుగెత్తి జింకలు, దుప్పులను వేటాడేవి. అప్పుడు వాటి యజమానులు వెళ్లి.. ఆ జింకలు, దుప్పులను చంపి మాంసం తెచ్చుకునేవారు. ఈ సమయంలో ఆ జంతువుల రక్తాన్ని, కొంత మాంసాన్ని చీతాలకు పెట్టేవారు. ఈ దృశ్యాలన్నీ కూడా వైల్డర్నెస్ వీడియోలో స్పష్టంగా ఉన్నాయి. ►సాధారణంగా చీతాలు ప్రశాంతంగా ఉంటాయి. అనవసరంగా దాడి చేయవు. అందుకే మనుషులు వాటిని సులువుగా పెంచుకోగలిగారని నిపుణులు చెబుతున్నారు. ►బ్రిటన్‌కు చెందిన మరియన్ నార్త్ అనే బయాలజిస్ట్, ఆర్టిస్ట్ 1878లో విడుదల చేసిన పుస్తకంలోని ఒక పెయింటింగ్‌ను కూడా పర్వీన్ పోస్ట్ చేశారు. రాజస్థాన్‌లోని ఆల్వార్‌లో ఇళ్ల ముందు పెంపుడు కుక్కల్లా చీతాలను కట్టేసిన చిత్రం అది. ►1921–22 సమయంలో బ్రిటన్‌కు చెందిన ప్రిన్స్ ఆఫ్ వేల్స్ రాజస్థాన్‌లో జింకలను వేటడానికి పెంపుడు చీతాలతో వెళ్తున్నప్పటి ఫొటోను, 1947లో ఛత్తీస్‌గఢ్‌లో కింగ్ ఆఫ్ కొరియా మూడు చీతాలను వేటాడి చంపిన ఫొటోను పర్వీన్ షేర్ చేశారు. ►ఒక్క చీతాలు అనే కాదు.. పులులు, సింహాలు, చిరుతç³#లులు, అడవి ఏనుగులు వంటి జంతువులను కూడా నాటి రాజులు, బ్రిటిషర్లు సరదా కోసం, గొప్పగా చూపుకోవడం కోసం వేటాడేవారు. ►952లో భారత ప్రభుత్వం మన దేశంలో ఆసియన్ చీతాలు అంతరించిపోయినట్టు అధికారికంగా ప్రకటించింది. ►అసలు మన దేశంలో తొలుత వన్యప్రాణి సంరక్షణ చట్టం లేదు. 1972లో తొలిసారిగా ‘వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్’ పేరిట చట్టాన్ని తెచ్చారు. వేగం ఎక్కువ.. దూరం తక్కువ చీతాలు గంటలకు వంద కిలోమీటర్ల వేగంతో పరుగెత్తగలవు. కేవలం మూడు సెకన్లలోనే అంత వేగాన్ని అందుకుంటాయి కూడా. కాకపోతే 30, 40 సెకన్లకు మించి ఆ వేగాన్ని కొనసాగించలేవు. అందుకే వేచి చూసి వేటకు దిగుతాయి. 30, 40 సెకన్లలో జంతువును చంపలేకపోతే వదిలేస్తాయి. తర్వాత కాసేపు విశ్రాంతి తీసుకుంటాయి. సీనియర్ జర్నలిస్టు సంజయ్ తాను రాసిన పుస్తకంలో చీతాలకు సంబంధించి ఇలాంటి కొన్ని ఆసక్తికర అంశాలు వెల్లడించారు. కేవలం సెకన్లలోనే సూపర్ స్పీడ్ అందుకునేలా, వేగంగా మలుపు తిరిగేలా చీతాల శరీర నిర్మాణం ఉంటుంది. చీతాల కళ్ల నుంచి నోటి వరకు ఉండే నల్లని చార సౌర కాంతి రిఫ్లెక్షన్ నుంచి కాపాడుతుందని.. దీనితో వాటి కళ్లు దూరంలో ఉన్న జంతువులను సైతం స్పష్టంగా చూడగలవని నిపుణులు చెబుతుంటారు. చిత్రమైన విషయం ఏమిటంటే.. పులులు, సింహాలు, చిరుతల తరహాలో చీతాలు గర్జించవు. పిల్లుల్లా ధ్వనులు చేస్తాయి. ఎప్పుడైనా ప్రమాదం అనిపించినప్పుడు మాత్రమే గుర్రుమని శబ్దం చేస్తాయి. చీతాల సగటు జీవితకాలం పన్నెండేళ్లు. జూలలో మాత్రం 20 ఏళ్ల వరకు బతికే అవకాశం ఉంది. అయితే చీతాల పిల్లల్లో మరణాల శాతం ఎక్కువ. పదింటిలో ఒకటే బతికి పెద్దది అవుతుంది. అందుకే వాటి జాతి వేగంగా పెరిగే అవకాశాలు తక్కువ.
- 
      
                   
                                 కోటపాడు యువకుడికి ఐఎఫ్ఎస్
 - యూపీఎస్సీ పరీక్షల్లో ఆల్ఇండియా 41వ ర్యాంకు
 - ఫలితాలు ప్రకటించిన కమిషన్
 
 శిరివెళ్ల: మండల పరిధిలోని కోటపాడుకు చెందిన మేర్వ సునీల్ కుమార్‌రెడ్డి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల్లో సత్తా చాటారు. ఆల్ ఇండియా 41వ ర్యాంకు సాధించి ఐఎఫ్ఎస్(ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్)కు ఎంపికయ్యారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం దుర్గాపూర్‌లో బీటెక్ పూర్తి చేసిన సునీల్ దిల్లీలో ఐఏఎస్ కోచింగ్ తీసుకున్నారు. ఈ నెల 21వ తేదీన యూపీఎస్సీ ప్రకటించిన తుది ఫలితాల్లో (హాల్ టికెట్ నెంబర్: 0001295) ఎంపికయ్యారు. 
 
 ఐఏఎస్ సాధనే లక్ష్యం...
 ఐఏఎస్ సాధనే తన లక్ష్యమని సునీల్ కుమార్‌రెడ్డి తెలిపారు. ఈ ఏడాడి మే 11వ తేదీన ఇంటర్యూ ఉందని, అందుకు ప్రిపేరవుతున్నట్లు తెలిపారు. యువకుని తండ్రి మేర్వ వెంకటరెడ్డి వైఎస్సార్ జిల్లా పెండ్లిమర్రి ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ మేనేజర్‌గా, తమ్ముడు అనిల్‌కుమార్ వరంగల్ పవర్‌గ్రిడ్‌లో ఇంజనీరుగా పనిచేస్త్ననారు. తల్లి నిర్మల బీఎస్సీ వరకు చదివి గృహిణిగా ఉంది.
- 
      
                   
                                 ఐఎఫ్ఎస్ ఎగ్జామ్..మెయిన్స్‌లో మెరుపులకు..
 ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామినేషన్.. సివిల్ సర్వీసెస్ తర్వాత అత్యంత ప్రాధాన్యం కలిగిన పరీక్ష. అటవీ శాఖలో డివిజనల్ స్థాయి అధికారి హోదాతో కెరీర్ ప్రారంభించేందుకు మార్గం. ఇటీవల ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ప్రిలిమినరీ ఫలితాలు వెల్లడయ్యాయి. మెయిన్ పరీక్షలు నవంబర్ 12 నుంచి జరగనున్నాయి.ఈ క్రమంలో మెయిన్‌లో విజయం సాధించి, తుదిదశ ఇంటర్వ్యూకు చేరుకునేందుకు వ్యూహాలు..
 
 ప్రస్తుతం ఐఎఫ్ఎస్ మెయిన్ ఎగ్జామినేషన్‌లో రెండు ఆప్షనల్ సబ్జెక్టులకు సంబంధించిన నాలుగు పేపర్లు (ఒక్కో సబ్జెక్ట్‌లో రెండు పేపర్లు) రాయాల్సి ఉంటుంది. సాధారణంగా ఔత్సాహిక అభ్యర్థులు ఒక ఆప్షనల్‌ను తమ అకడమిక్ నేపథ్యం నుంచి ఎంపిక చేసుకుంటారు. మరో ఆప్షనల్ పూర్తిగా కొత్త సబ్జెక్టు. యూపీఎస్సీ నిబంధన కూడా ఇదే రీతిలో ఉంది. ఒకే స్వరూపం ఉండే సబ్జెక్ట్‌లనే రెండు ఆప్షనల్స్‌గా తీసుకోకూడదని నిబంధన విధించింది. ఉదాహరణకు అగ్రికల్చర్ సబ్జెక్ట్‌ను ఆప్షనల్‌గా ఎంపిక చేసుకున్న అభ్యర్థులు రెండో ఆప్షనల్‌గా అగ్రికల్చరల్ ఇంజనీరింగ్‌ను ఎంపిక చేసుకునేందుకు వీల్లేదు. అదే విధంగా బీటెక్ అర్హతతో పరీక్షకు హాజరవుతున్న అభ్యర్థులు రెండు ఆప్షనల్స్‌ను ఇంజనీరింగ్ నేపథ్యం సబ్జెక్టుల నుంచి ఎంపిక చేసుకోకూడదు. దీన్ని దృష్టిలో ఉంచుకొని, అభ్యర్థులు ముందుగా తమ అకడమిక్ నేపథ్యానికి సంబంధంలేని, కొత్తగా ఎంపిక చేసుకున్న సబ్జెక్టుతో మెయిన్స్ ప్రిపరేషన్ ప్రారంభించాలి.
 
 అప్లికేషన్ ఓరియెంటేషన్‌తో..
 అభ్యర్థులు ప్రిపరేషన్ సమయంలో అప్లికేషన్ ఓరియెంటేషన్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. సబ్జెక్టుకు సంబంధించిన బేసిక్స్, కాన్సెప్టులపై పట్టు సాధిస్తూనే వాటిని వాస్తవ పరిస్థితుల్లో అన్వయించే విధంగా నైపుణ్యం సొంతం చేసుకోవాలి. ముఖ్యంగా జియాలజీ, సివిల్ ఇంజనీరింగ్, జువాలజీ సబ్జెక్టులను ఆప్షనల్స్‌గా ఎంపిక చేసుకున్న వారికి ఇది అత్యంత ఆవశ్యకం. ఆయా రంగాల్లో తాజా పరిణామాల గురించి తెలుసుకుంటూ వాటికి సబ్జెక్టు నేపథ్యాన్ని అన్వయించే నైపుణ్యంతో ముందుకు సాగాలి.
 
 ఫ్లో చార్ట్స్, పై చార్ట్స్, డయాగ్రమ్స్...
 ప్రిపరేషన్ సమయంలో అభ్యర్థులు తాము చదివే అంశాలను ఫ్లో చార్ట్స్, పై చార్ట్స్, డయాగ్రమ్స్ రూపంలో షార్ట్‌కట్ మెథడ్‌లో సొంత నోట్స్ రూపొందించుకోవాలి. ముఖ్యంగా మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ, కెమికల్ ఇంజనీరింగ్, జువాలజీ, బోటనీ సబ్జెక్టులకు ఇది ఎంతో ఉపకరిస్తుంది. రివిజన్ పరంగా సమయం ఆదా అవుతుంది.
 
 జీకే.. జనరల్‌గా...
 ఐఎఫ్ఎస్ మెయిన్ ఎగ్జామినేషన్‌లో అభ్యర్థులు బాగా దృష్టిసారించాల్సిన పేపర్ జనరల్ నాలెడ్జ్. ఇందులో హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ తదితర కోర్ సబ్జెక్టుల నుంచి కాంటెంపరరీ అంశాల వరకు అన్నింటిపైనా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. అందువల్ల అభ్యర్థులు ఆయా సబ్జెక్టులకు సంబంధించి బేసిక్స్‌పై అవగాహన ఏర్పరచుకుంటూ.. ప్రస్తుతం సంబంధిత విభాగాల్లో జరుగుతున్న పరిణామాలను విశ్లేషించే నైపుణ్యం సొంతం చేసుకోవాలి.
 
 రైటింగ్ ప్రాక్టీస్..
 ప్రిపరేషన్ పరంగా అనుసరించాల్సిన మరో వ్యూహం రైటింగ్ ప్రాక్టీస్. అభ్యర్థులు ప్రతిరోజూ ఒక సబ్జెక్ట్‌కు సంబంధించి ఒక అంశాన్ని చదవడం పూర్తిచేశాక.. దాన్ని ‘ప్రశ్న - సమాధానం’ కోణంలో స్వయంగా విశ్లేషిస్తూ రాయాలి. దీనివల్ల తాము ఆ అంశానికి సంబంధించి ఏ స్థాయిలో ప్రిపరేషన్ సాగించామో తెలుస్తుంది.
 
 అన్ని సబ్జెక్టులకు సమయం కేటాయించేలా...
 ప్రిపరేషన్ సమయంలో అన్ని సబ్జెక్టులకు సమయం కేటాయించేలా టైం టేబుల్ రూపొందించుకోవాలి. కనీసం రోజుకు పది గంటలు చదవాలి. అక్టోబర్ చివరి వారం నాటికి సబ్జెక్ట్స్ ప్రిపరేషన్ పూర్తి చేసుకుని.. తర్వాత రివిజన్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి.
 
 సివిల్స్ మెయిన్స్‌కు కూడా
 అర్హత లభిస్తే...
 సివిల్ సర్వీసెస్, ఐఎఫ్ఎస్ రెండింటికీ ప్రిలిమ్స్ పరీక్ష ఒకటే ఉంటుంది. ఈ క్రమంలో అధిక శాతం మంది అభ్యర్థులు ఐఎఫ్‌ఎస్‌తోపాటు సివిల్స్ వైపు కూడా దృష్టి పెడుతున్నారు. ఐఎఫ్‌ఎస్‌తోపాటు సివిల్స్ మెయిన్స్‌కు సైతం అర్హత సాధించిన అభ్యర్థులు.. ప్రస్తుత సమయాన్ని పూర్తిగా ఐఎఫ్ఎస్ ప్రిపరేషన్‌కే కేటాయించాలి. ఆప్షనల్ పరంగా రెండు పరీక్షలకు ఒకే సబ్జెక్ట్‌ను ఎంపిక చేసుకున్న అభ్యర్థులు.. రెండు పరీక్షల సిలబస్‌ను బేరీజు వేసుకుంటూ ప్రిపరేషన్ సాగిస్తే ఫలవంతంగా ఉంటుంది. 
- 
      
                    సివిల్స్ సమరానికి సన్నద్ధమవ్వండిలా..
 దేశ వ్యాప్తంగా లక్షల మంది పోటీపడే ప్రతిష్టాత్మక సివిల్ సర్వీసెస్ ఎంపిక ప్రక్రియకు మరో రెండు రోజుల్లో తెరలేవనుంది. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ తదితర అత్యున్నత సర్వీసుల్లో పోస్టుల భర్తీకి ప్రిలిమినరీ, మెయిన్స్, ఇంటర్వ్యూ.. ఇలా మూడంచెల్లో వడపోత ఉంటుంది. తొలి దశ ప్రిలిమినరీకి యూపీఎస్సీ క్యాలెండర్ ప్రకారం- మే 16న నోటిఫికేషన్ వెలువడనుంది. ఇప్పటికే ఏళ్లుగా ప్రిపరేషన్ సాగిస్తున్న అభ్యర్థులతోపాటు తాజా గ్రాడ్యుయేట్లు సైతం గురిపెట్టిన సివిల్స్‌లో విజయానికి నిపుణులు అందిస్తున్న సలహాలు.. సూచనలు..
 
 ప్రాథమిక అంశాలపై పట్టు.. వర్తమాన వ్యవహారాలపై అవగాహన.. తులనాత్మక అధ్యయనం.. విశ్లేషణాత్మక దృక్పథం.. ఇవీ సివిల్స్ ఔత్సాహికులకు ఉండాల్సిన ప్రాథమిక లక్షణాలన్నది నిపుణుల మాట! పరీక్షకు సంబంధించి న సిలబస్‌లోని అంశాల కాన్సెప్ట్స్ మొదలు వాటికి సంబంధించిన సమకాలీన పరిణామాల వరకు అన్నిటిపై సమగ్ర అవగాహన పెంచుకుంటూ శాస్త్రీయంగా అడుగులు వేయాలి. అప్పుడే విజయం దరిచేరుతుందని నిపుణులు చెబుతున్నారు.
 
 సిలబస్ అధ్యయనం
 సివిల్స్ ఔత్సాహిక అభ్యర్థులు ప్రిపరేషన్లో భాగంగా మొదట చేయాల్సిన పని సిలబస్ అధ్యయనం. నిర్దేశిత సిలబస్‌ను ఆసాంతం క్షుణ్నంగా పరిశీలించాలి. ముఖ్యంగా మొదటిసారి పరీక్షకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు ఇది చాలా అవసరం. సిలబస్ పరిశీలన ద్వారా తమకు అవగాహన ఉన్న అంశాలేవి? పూర్తిస్థాయిలో దృష్టిసారించాల్సిన అంశాలేవి? అనేది తెలుస్తుంది. ఇది ప్రిపరేషన్‌కు ఎంతగానో ఉపకరిస్తుంది. ఇప్పటికే పరీక్షకు హాజరై విఫలమై, మరోసారి ప్రయత్నిస్తున్న అభ్యర్థులు కూడా సిలబస్‌ను పరిశీలించాలి. గత పరీక్షల్లో తమ ప్రదర్శనను బేరీజు వేసుకోవాలి. సిలబస్‌లో ఏ అంశాలకు సంబంధించిన ప్రశ్నలకు సరిగా సమాధానాలు ఇవ్వలేకపోయారో గుర్తించాలి. తాజా ప్రిపరేషన్లో వాటికి కొంత అధిక సమయం కేటాయించాలి. సిలబస్ పరిశీలన ఆధారంగా అవగాహన లేని అంశాలను లోతుగా అధ్యయనం చేసే విషయంలో ఒక అంచనాకు రావాలి.
 
 ఆందోళన అనవసరం
 సివిల్స్ పరీక్షలో సైన్స్ అండ్ టెక్నాలజీ, పాలిటీ, ఎకానమీ, హిస్టరీ.. ఇలా అన్ని నేపథ్యాల అంశాలు ఉంటాయి. దీంతో పరీక్షకు పోటీపడే ప్రతి అభ్యర్థి తమ అకడమిక్ నేపథ్యానికి సంబంధంలేని అంశాల్లో కొంత ఆందోళన చెందుతుంటారు. ఉదాహరణకు ఆర్ట్స్ విద్యార్థులు సైన్స్ అండ్ టెక్నాలజీ; సైన్స్ విద్యార్థులు జనరల్ నాలెడ్జ్‌లోని పాలిటీ, ఎకానమీ, హిస్టరీ, జాగ్రఫీలకు ప్రిపరేషన్ విషయంలో ఇబ్బంది పడుతున్నారు. అయితే నిపుణుల అభిప్రాయం ప్రకారం.. సిలబస్‌లో పేర్కొన్న అంశాలన్నీ గ్రాడ్యుయేషన్ స్థాయిలోనే ఉంటున్నాయి. కాబట్టి ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమయంలో తమ అకడమిక్ నేపథ్యం లేని అంశాలకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకోవాలి. రోజుకు పది నుంచి పన్నెండు గంటల పాటు ప్రిపరేషన్ సాగించే అభ్యర్థులు తమకు పరిచయం లేని అంశాలకు కనీసం మూడు గంటలు కేటాయించాలి.
 
 గత ప్రశ్నపత్రాల పరిశీలన
 సివిల్స్ ప్రిపరేషన్ పరంగా అభ్యర్థులకు ప్రయోజనం చేకూర్చే మరో సాధనం.. గత ప్రశ్నపత్రాల పరిశీలన. దీని ద్వారా ప్రధానంగా ప్రశ్నల శైలి అర్థమవుతుంది. సివిల్స్ పరీక్షలో ఇటీవల కాలంలో నేరుగా వస్తున్న ప్రశ్నలు తగ్గాయి. పరోక్ష లేదా విశ్లేషణాత్మక దృక్పథాన్ని, నిర్దిష్ట అంశంలో పూర్తిస్థాయి పరిజ్ఞానాన్ని పరీక్షించేలా ప్రశ్నలు వస్తున్నాయి. ఈ క్రమంలో స్టేట్మెంట్ ఆధారిత ప్రశ్నలు, అసెర్షన్ అండ్ రీజన్ ప్రశ్నలకు వెయిటేజీ పెరుగుతోంది.
 ఉదాహరణకు..
 Which of the following is/are the function/ functions of the cabinet Secretariat?
 1) Preparation of agenda for cabinet meetings
 2) Secretarial assistance to Cabinet committees
 3) Allocation of financial resources to the ministers
 Select the correct answers using the code given below
 a) 1 b) 2 and 3 only
 c) 1 and 2 only d) 1, 2 and 3
 Ans: c
 
 ఈ ప్రశ్నను పరిశీలిస్తే కేబినెట్ సెక్రటేరియట్ స్వరూపంతోపాటు విధులు గురించి పూర్తిస్థాయి అవగాహన ఉంటేనే సమాధానం ఇవ్వగలరు. కాబట్టి గత ప్రశ్నపత్రాలను పరిశీలించడం ద్వారా ఒక అంశం నుంచి ఎన్ని కోణాల్లో ప్రశ్నలు ఎదురుకావొచ్చో తెలుస్తుంది. దాని ఆధారంగా ప్రిపరేషన్లో అనుసరించాల్సిన వ్యూహాలను రూపొందించుకోవాలి.
 
 మెటీరియల్ ఎంపిక
 సివిల్స్ విజయంలో మెటీరియల్ ఎంపికది ఎంతో కీలక పాత్ర. ప్రస్తుతం ఒక సబ్జెక్ట్‌కు సంబంధించి పదుల సంఖ్య లో పుస్తకాలు, వెబ్ రిసోర్సెస్ అందుబాటులో ఉన్నాయి. ఆయా పుస్తకాలను ఎంపిక చేసుకునే ముందు సిలబస్‌లోని అన్ని అంశాలు ఉన్నాయా? లేవా? ఉంటే నిర్దిష్ట అంశంపై అన్ని కోణాల్లో సమాచారం ఉందా? అనేది పరిశీలించాలి. సమగ్ర సమాచారం ఉన్న మెటీరియల్‌నే ఎంపిక చేసుకోవాలి. ఆయా అంశాలపై విశ్లేషణాత్మక సమాచారం ఉన్న పుస్తకాలను ఎంచుకోవాలి. ఫలితంగా ప్రిలిమ్స్‌కు సమాంతరంగా మెయిన్స్‌కు సిద్ధమయ్యే అవకాశం ఉంటుంది. గైడ్లు, ప్రశ్న-సమాధానం తరహా పుస్తకాలకు ప్రాధాన్యమివ్వడం సరికాదు.
 
 ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్
 ప్రస్తుతం సివిల్ సర్వీసెస్ రెండు దశల రాత పరీక్షల్లో (ప్రిలిమ్స్, మెయిన్స్) అభ్యర్థులకు కలిసొచ్చే అంశం పరీక్ష విధానం. మెయిన్ ఎగ్జామినేషన్‌లో రెండు పేపర్లుగా ఉండే ఒక ఆప్షనల్ సబ్జెక్ట్, ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ సబ్జెక్ట్‌లు మినహా మిగతా అన్ని విభాగాలు కూడా ప్రిలిమ్స్, మెయిన్స్ రెండింటిలోనూ ఉమ్మడి అంశాలే. దీన్ని అభ్యర్థులు తమకు అనుకూలంగా మలచుకోవాలి. ఒక అంశాన్ని విశ్లేషణాత్మకంగా, డిస్క్రిప్టివ్ విధానంలో చదివితే ఒకే సమయంలో ప్రిలిమ్స్, మెయిన్స్ రెండిటికీ సన్నద్ధత లభిస్తుంది.
 
 సమకాలీన అంశాలతో..
 సివిల్స్ ఔత్సాహిక అభ్యర్థులు ప్రాథమిక (కాన్సెప్ట్స్) అంశాలను సమకాలీన (కాంటెంపరరీ) పరిణామాలతో బేరీజు వేసుకుంటూ ప్రిపరేషన్ సాగించాలి. గత కొన్నేళ్లుగా సివిల్స్ ప్రిలిమ్స్ ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే.. సమకాలీనంగా చోటు చేసుకున్న అంశాల నేపథ్యంపై అవగాహనను పరీక్షించే విధంగా ప్రశ్నలు ఉంటున్నాయి. ఉదాహరణకు పార్లమెంట్ ఏదైనా రాజ్యంగ సవరణ చేస్తే రాజ్యాంగంలో ప్రకరణల సవరణకు పార్లమెంటుకున్న అధికారాలు, తాజా సవరణ ఏ ప్రకరణ పరిధిలోనిది లేదా ఇది ఎన్నో సవరణ వంటి ప్రశ్నలు ఎదురుకావచ్చు.
 
 అంతర్గత సంబంధం
 సివిల్స్ ప్రిపరేషన్ పరంగా అభ్యర్థులు అనుసరించాల్సిన మరో వ్యూహం అంతర్గత సంబంధం ఉన్న సబ్జెక్ట్‌లు లేదా అంశాలను గుర్తించి తులనాత్మక అధ్యయనం సాగించడం. ప్రస్తుత సిలబస్ ప్రకారం ఎకానమీ-పాలిటీ, జాగ్రఫీ-ఎన్విరాన్మెంట్-బయో డైవర్సిటీ అంశాలు అంతర్గత సంబంధం ఉన్నవిగా కనిపిస్తున్నాయి. ఉదాహరణకు ఇటీవల పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఎఫ్‌డీఐల బిల్లు ఎకానమీ పరిధిలోకి రాగా.. దాని ఆమోద ప్రక్రియ పాలిటీ పరిధిలోకి వస్తుంది. ఇలాంటి వాటిని గుర్తించి చదివితే అభ్యర్థులకు ఉపయుక్తంగా ఉంటుంది.
 
 ప్రతి సబ్జెక్ట్‌కు సమప్రాధాన్యం
 సివిల్స్ పరీక్షల శైలిని పరిశీలిస్తే ప్రిలిమ్స్, మెయిన్స్ రెండు పరీక్షల్లో పేర్కొన్న ప్రతి సబ్జెక్ట్‌కు సమ ప్రాధాన్యం కనిపిస్తోంది. కొంతమంది అభ్యర్థులు తమకు ఇష్టంగా అనిపించిన లేదా సులువుగా భావించిన సబ్జెక్ట్‌లకు ఎక్కువ సమయం కేటాయిస్తారు. ఈ విధానం సరికాదు. ప్రిపరేషన్ సమయంలో అన్ని అంశాలను చదివేలా సమయ ప్రణాళిక రూపొందించుకోవాలి.
 
 ప్రస్తుత సమయంలో ఇలా
 సివిల్ సర్వీసెస్-2015 ఎంపిక ప్రక్రియలో భాగంగా ప్రిలిమినరీ పరీక్ష ఆగస్టు 23న, మెయిన్ ఎగ్జామినేషన్స్ డిసెంబర్ 18 నుంచి జరగనున్నాయి. అభ్యర్థులు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకునే విధంగా టైంమేనేజ్మెంట్ పాటిం చాలి. జూన్ 30వరకు ప్రిలిమ్స్, మెయిన్స్‌లకు ఉమ్మడి ప్రిపరేషన్ సాగించాలి. జూలై నుంచి పూర్తిగా ప్రిలిమినరీ పరీక్ష కు కేటాయించాలి. జూలై నుంచి ఆగస్ట్ 10 మధ్యలో కనీసం మూడు, నాలుగు మోడల్ టెస్ట్‌లు లేదా గ్రాండ్ టెస్ట్‌లకు హాజరై తమ బలాలు, బలహీనతలు బేరీజు వేసుకోవాలి.
 
 ప్రిలిమ్స్ రెండో పేపర్
 సివిల్స్ ప్రిలిమ్స్‌లోని రెండో పేపర్ (సీ-శాట్) విషయంలో అభ్యర్థులు ఎక్కువగా ఆందోళన చెందుతున్నారు. ఇది మ్యాథ్స్ నేపథ్యం ఉన్నవారికే అనుకూలంగా ఉందని, ఫలితంగా తమ విజయావకాశాలు తగ్గిపోతున్నాయని నాన్-మ్యాథ్స్ అభ్యర్థులు అభిప్రాయపడుతున్నారు. వాస్తవానికి పదో తరగతి వరకు మ్యాథమెటిక్స్‌లో మెరుగ్గా ఉన్న అభ్యర్థులు సులభంగానే ఈ పేపర్లోని న్యూమరికల్ ఎబిలిటీ ప్రశ్నలకు సమాధానం ఇవ్వొచ్చు అనేది నిపుణుల అభిప్రాయం. అదే విధంగా ఒక సమస్యను పరిశీలించడం, దాన్ని వాస్తవ ప్రభావాన్ని అంచనా వేయగలిగే సామర్థ్యాల ఆధారంగా డెసిషన్ మేకింగ్ విభాగం ప్రశ్నలకు కూడా సులువుగా సమాధానాలు గుర్తించవచ్చు
 
 ఆందోళన వీడితే
 విజయానికి చేరువగా
 సివిల్స్ ఔత్సాహిక అభ్యర్థులు ముందుగా ఈ పరీక్షకు లక్షల మంది పోటీ పడతారని, తాము వారికి సరితూగగలమా అనే ఆందోళనతో ఉంటారు. ముందుగా దీన్ని వదులుకుంటే మానసికంగా విజయానికి చేరువ అయినట్లే. ప్రిలిమ్స్‌లో విజయానికి పుస్తకాల ఎంపిక ఎంతో కీలకం. ఈ విషయంలోనూ జాగ్రత్త వహించాలి. సరైన పుస్తకాలను ఎంపిక చేసుకోవాలి. ఇందుకోసం సీనియర్లు, సబ్జెక్ట్ నిపుణుల సలహాలు తీసుకోవాలి. ప్రిపరేషన్ పరంగా తులనాత్మక అధ్యయనం అలవర్చుకోవడం ఎంతో ప్రధానం. ఫలితంగా విభిన్న అంశాలపై అవగాహన లభిస్తుంది. ప్రస్తుత సమయంలో తాజా అభ్యర్థులు రెండు నెలలు మాత్రం ప్రిలిమ్స్, మెయిన్స్ ఉమ్మడి ప్రిపరేషన్ సాగించి తర్వాత పూర్తిగా ప్రిలిమినరీకి కేటాయించడం ద్వారా సత్ఫలితాలు ఆశించొచ్చు.
 - మహ్మద్ ముషరగ్ అలీ ఫరూకీ,
 సివిల్స్-2014 విజేత (జాతీయ ర్యాంకు 80).
 
 సిలబస్‌లోని అన్ని అంశాలపైనా దృష్టిసారించాలి
 సాధారణంగా అభ్యర్థులు చేసే పొరపాటు ముఖ్యమైనవి ఏమిటి? ప్రాధాన్యం లేనివి ఏమిటి? అని ఆలోచించడం! కానీ, పోటీ పరీక్షల్లో ముఖ్యంగా సివిల్స్ వంటి అత్యున్నత పరీక్షకు సన్నద్ధత క్రమంలో ఇంపార్టెంట్, నాన్-ఇంపార్టెంట్ అని ఆలోచించే ధోరణి ఏమాత్రం సరికాదు. సిలబస్‌లో పేర్కొన్న అన్ని అంశాలు కవర్ అయ్యేలా అధ్యయనం చేయాలి. ప్రతి యూనిట్‌ను కనీసం మూడుసార్లు చదివేలా ప్రణాళిక రూపొందించుకోవాలి. అన్ని అంశాల్లో మాస్టర్స్ కాలేకపోయినా వాటి ప్రాథమిక విషయాలను ఒంటబట్టించుకుంటే విజయావకాశాలు పెరుగుతాయి.
 - శ్రీరంగం శ్రీరామ్,
 శ్రీరామ్స్ ఐఏఎస్, న్యూఢిల్లీ.
- 
      
                    కార్పొరేట్ కొలువు నుంచి ఐఎఫ్ఎస్కు..
 కార్పొరేట్ కొలువు.. ఆపై చేతినిండా సంపాదన.. ఈ రెండూ ఉన్నాయి! ఇంకేం బాగా బతికేయొచ్చు..! అని సరిపెట్టుకోకుండా సమాజానికి తన వంతుగా ఏదైనా చేయాలి.. అలాంటి అవకాశాన్ని కల్పించే ఉద్యోగాన్ని చేజిక్కించుకోవాలనే ఆలోచనే సివిల్ సర్వీసెస్ పరీక్ష దిశగా వెళ్లేలా చేసింది. ఆ సర్వీస్ సాధించకున్నా, దానికోం చేసిన సాధన ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్)లో నాలుగో ర్యాంకు రావడానికి ఉపయోగపడిందంటున్నాడు గుంటుపల్లి వరుణ్. ఈ విజయ ప్రస్థానం అతని మాటల్లోనే...
 
 సక్సెస్ స్టోరీ
 నాన్న చిన్న స్థాయి వ్యాపారవేత్త, అమ్మ గృహిణి. చెల్లి సాఫ్ట్వేర్ ఉద్యోగి. పదో తరగతి వరకు హైదరాబాద్‌లో చదివాను. పదో తరగతి పరీక్షల్లో స్కూల్ టాపర్‌గా నిలిచాను. తర్వాత ఇంటర్మీడియెట్, మద్రాస్ ఐఐటీ నుంచి కెమికల్ ఇంజనీరింగ్ బీటెక్ పట్టా తీసుకున్నాక, ఐఐఎం-ఇండోర్ నుంచి పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ (పీజీడీఎం) పూర్తిచేశాను.
 
 చదువు తర్వాత ఉద్యోగం
 ముంబైలో ఏడాదిన్నర పాటు డెస్టిమనీ ఎంటర్‌ప్రైజెస్‌లో పనిచేశా. తర్వాత ఎడెల్వైస్ సెక్యూరిటీస్ సంస్థలో ఈక్విటీ రీసెర్చ్ అనలిస్టుగా మూడేళ్లు ఉద్యోగం చేశాను.
 
 ఐఎఫ్ఎస్ దిశగా
 మంచి సంస్థల్లో ఉద్యోగం, సంతృప్తికరమైన సంపాదన ఉన్నా సివిల్ సర్వీసెస్ ద్వారా సమాజానికి సేవచేసే అవకాశం లభిస్తుందన్న ఉద్దేశంతో అటువైపు అడుగులు వేశాను. సివిల్ సర్వీసెస్ వల్ల అణగారిన ప్రజల ఉన్నతికి కృషి చేయొచ్చని, ఉద్యోగంలోనూ మంచి సంతృప్తి లభిస్తుందని భావించి, సివిల్స్ ప్రిపరేషన్‌ను ప్రారంభించాను. అయితే ఉద్యోగంలో తీరిక లేకుండా ఉండటం వల్ల ప్రిపరేషన్ సరిగా సాగలేదు. దీంతో రెండు సార్లు విఫలమయ్యాను. ఇక లాభం లేదనుకొని, 2012, సెప్టెంబర్‌లో ఉద్యోగానికి రాజీనామా చేసి, పూర్తిస్థాయిలో సివిల్స్ సన్నద్ధతపై దృష్టిపెట్టాను.
 
 ఉమ్మడి సన్నద్ధత
 మొదట్లో ఐఎఫ్ఎస్పై దృష్టి పెట్టలేదు. 2013లో యూపీఎస్సీ పరీక్ష విధానాన్ని మార్చింది. సివిల్ సర్వీసెస్ మెయిన్ పరీక్షలో ఒక ఆప్షనల్‌ను తగ్గించడంతో పాటు సివిల్స్‌కు, ఐఎఫ్ఎస్కు ఉమ్మడి ప్రిలిమినరీ పరీక్ష వెసులుబాటు నాకు ఎంతగానో ఉపయోగపడింది. ఒకేసారి రెండు పరీక్షలకు ప్రిపేరయ్యే అవకాశం లభించింది.
 
 ఐఎఫ్ఎస్లో రెండోసారి విజయం
 ఐఎఫ్ఎస్కు చేసిన తొలి ప్రయత్నంలో ఇంటర్వ్యూ వరకు వెళ్లాను. 29మార్కుల తేడాతో సర్వీస్ చేజారింది. రెండోసారి (2014) మ్యాథమెటిక్స్, ఫారెస్ట్రీ ఆప్షనల్ సబ్జెక్టులతో విజయం సాధించా. మ్యాథ్స్‌పై పట్టుసాధించాలంటే కనీసం ఆర్నెల్లు పడుతుంది. మొదటిసారి సరైన ప్రిపరేషన్ లేకపోవడం వల్ల మ్యాథ్స్‌లో తక్కువ మార్కులు వచ్చాయి. ఈ అనుభవం దృష్ట్యా లోపాలను సరిచేసుకొని రెండోసారి అధిక సమయం ప్రాక్టీస్ చేశాను. ఫలితంగా మ్యాథ్స్‌లో ఎక్కువ మార్కులు సాధించగలిగాను. ఫారెస్ట్రీ పేపర్‌కు ఎక్కువ సమయం కేటాయించకున్నా, జనరల్ స్టడీస్‌లో ఎన్విరాన్మెంట్ అంశాలను బాగా చదవడం ఆ ఆప్షన్‌ను సంతృప్తికరంగా రాసేందుకు ఉపయోగపడింది.
 
 ప్రిపరేషన్
 సొంతంగానే సివిల్స్‌కు, ఐఎఫ్ఎస్కు సిద్ధమయ్యాను. ప్రిలిమ్స్, మెయిన్స్‌కు ఉమ్మడి ప్రణాళికతో చదివాను. జనరల్ స్టడీస్‌లోని పేపర్ల కోసం ఎన్సీఈఆర్టీ, ఇతర ప్రామాణిక పుస్తకాలు చదివాను. కరెంట్ అఫైర్స్ కోసం పత్రికలు, ఇంటర్నెట్ను ఉపయోగించుకున్నా. సివిల్స్ మెయిన్స్ పేపర్ల కోసం రాయడం ప్రాక్టీస్ చేశాను. ఇది ఐఎఫ్ఎస్ జనరల్ నాలెడ్జ్ పేపర్‌కు ఉపయోగపడింది.
 
 ప్రిపరేషన్ సమయంలో ఒత్తిడిని జయించేందుకు సుడోకోను సాధించడం, పాటలు వినడం, స్నేహితులను కలవడం చేసేవాడిని. ఒకవేళ సర్వీస్ రాకపోతే తిరిగి కార్పొరేట్ ఉద్యోగంలో చేరేందుకు అవకాశం ఉండటంతో ఆందోళనకు గురికాకుండా దృష్టిని పూర్తిస్థాయి ప్రిపరేషన్‌పై పెట్టగలిగాను.
 
 ఇంటర్వ్యూ
 ఆర్థిక సంబంధిత సంస్థల్లో పనిచేసిన అనుభవం ఉండటం వల్ల ఇంటర్వ్యూలో వాటిపై ప్రశ్నలడిగారు. స్టాక్ మార్కెట్, ఫారెస్ట్రీలపై ప్రశ్నలు వచ్చాయి. కరెంట్ అఫైర్స్ నుంచి కూడంకుళం ప్రాజెక్టు, గ్రీన్ పీస్ ఎన్జీవో, పర్యావరణ కాలుష్యంతో పాటు నేను చదివిన మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ ఐఎఫ్‌ఎస్‌కి ఎలా ఉపయోగపడుతుందని భావిస్తున్నావనే ప్రశ్న కూడా అడిగారు. ఇంటర్వ్యూ 25 నిమిషాల పాటు జరిగింది.
 
 విజయానికి అండగా
 ఈ విజయాన్ని పూర్తిగా నా కుటుంబానికే అంకితమిస్తున్నాను. వారి ప్రోత్సాహం లేకపోతే ఇది సాధ్యమయ్యేది కాదు. ఐఎఫ్‌ఎస్‌కి సిద్ధమవుతున్న వారు కనీసం ఏడాది సమయం కేటాయించాలి. జనరల్ నాలెడ్జ్, రెండు ఆప్షనల్ సబ్జెక్టులను సమగ్రంగా చదవాలి. ప్రిలిమ్స్, మెయిన్స్‌లకు ఒకేసారి ప్రిపేర్ కావాలి. ఎందుకంటే ప్రిలిమ్స్ తర్వాత మెయిన్స్ పరీక్షలకు వ్యవధి చాలా తక్కువ ఉంటుంది. పోస్టులు తక్కువ, పోటీ ఎక్కువగా ఉండటంతో సివిల్ సర్వీసెస్ కంటే ఐఎఫ్ఎస్ ప్రిలిమ్స్ కటాఫ్ మార్కులు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ప్రిలిమ్స్‌లో మంచి మార్కులు సాధించాలి. మెయిన్స్‌కి రెండు నెలల ముందే సిలబస్ పూర్తిచేసి, రివిజన్‌పై దృష్టిసారించాలి. వారాలు, నెలల వారీ లక్ష్యాలను నిర్దేశించుకొని, చదివితే విజయం ఖాయం.
- 
      
                   
                                 నా బదిలీని ఆపండి
 
 క్యాట్‌ను ఆశ్రయించిన అంధ ఐఎఫ్ఎస్
 
 అవకతవకలపై నివేదించినందుకే ఇలా జరిగిందంటున్న అధికారవ ర్గాలు
 
 సాక్షి, హైదరాబాద్: తన బదిలీని ఆపాలని కోరుతూ విదేశీ మంత్రిత్వ శాఖలో బ్రాంచ్ సెక్రటేరియట్ అధికారి బుడిగి శ్రీనివాసరెడ్డి...సెంట్రల్ ఆడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (క్యాట్)ను ఆశ్రయించారు. హైదరాబాద్‌లోని సచివాలయంలో విదేశీ మంత్రిత్వ శాఖకు బ్రాంచ్ సెక్రటేరియట్ కార్యాలయం ఉంది. ఈ కార్యాలయానికి ఏడాది క్రితం ఐఎఫ్ఎస్ అధికారి శ్రీనివాసరెడ్డి వచ్చారు. ఒక అంధుడు ఐఎఫ్ఎస్ కావడం దేశంలోనే తొలిసారి. అయితే తాజాగా ఈయనను ఢిల్లీ ప్రధాన కార్యాలయానికి బదిలీ చేశారు.
 
 నిబంధనల ప్రకారం సాధారణ బదిలీల్లో భాగంగా వైకల్యమున్న అధికారులను బదిలీ చేయరాదని, ఒకవేళ అలా చేయాల్సివస్తే సదరు అధికారి కోరుకున్న చోటుకే పంపాలని, అయితే తనను ఉన్నఫళంగా ఢిల్లీకి బదిలీ చేశారంటూ శ్రీనివాసరెడ్డి క్యాట్‌ను ఆశ్రయించారు. శ్రీనివాసరెడ్డి బ్రాంచ్ సెక్రటేరియట్‌కు రాకముందు పాస్‌పోర్టు అధికారి ఇన్చార్జిగా ఉండేవారు.
 
 ఆ సమయంలో నిధుల దుర్వినియోగం జరిగినట్టు ఆరోపణలొచ్చాయి. ఈ అవకతవకలపై అప్పట్లోనే శ్రీనివాసరెడ్డి విచారణ జరిపి విదేశీమంత్రిత్వ శాఖకు నివేదిక ఇచ్చినట్టు తెలిసింది. దీంతో కొంతమంది అధికారులు ఉద్దేశ పూర్వకంగానే శ్రీనివాసరెడ్డిని బదిలీ చేయించినట్టు అధికారవర్గాలు చెబుతున్నాయి.
- 
  
      ఐఏఎస్, ఐపీఎస్‌ల కేటాయింపులు పూర్తి
- 
      
                   
                                 ఐఏఎస్, ఐపీఎస్‌ల కేటాయింపులు పూర్తి
 సాక్షి, హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాలకు అఖిల భారత స్థాయి అధికారుల కేటాయింపులు పూర్తయ్యాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల కేటాయింపుల తుది జాబితాను కేంద్ర ప్రభుత్వం గురువారం విడుదల చేసింది. దీంతో దాదాపు పది నెలలుగా జరిగిన కసరత్తు ఎట్టకేలకు ముగిసింది. రాష్ట్ర విభజన తర్వాత ఇరు రాష్ట్రాలకు ఉన్నతాధికారుల తాత్కాలిక కేటాయింపులు జరిగిన సంగతి తెలిసిందే. తర్వాత అధికారుల నుంచి అభ్యంతరాలు తీసుకుని తాత్కాలిక తుది కేటాయింపుల జాబితాను గత డిసెంబర్ 26న కేంద్రం ప్రకటించింది. అనంతరం 45 రోజుల్లోనే తుది జాబితాను ప్రకటించాలని ప్రధాని నరేంద్రమోదీ ఆదేశించినప్పటికీ కొంత ఆలస్యం జరిగింది. వాస్తవానికి గత నెల రెండో వారంలోనే ఈ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉన్నా.. వివిధ ఒత్తిళ్ల నేపథ్యంలో తుది కేటాయింపుల జాబితా ప్రకటన ఆలస్యమైంది.
 
 ఎట్టకేలకు సుదీర్ఘ కసరత్తు అనంతరం ఈ తుది జాబితాను తాజాగా కేంద్రం ప్రకటించింది. ఈ కేటాయింపుల ఆధారంగానే అధికారులంతా తమకు దక్కిన రాష్ర్ట కేడర్‌కు వెళ్లాల్సి ఉంటుంది. ఈ కేటాయింపులపై ఇంకా ఏమైనా అభ్యంతరాలు ఉంటే.. క్యాట్‌ను ఆశ్రయించడమో, కోర్టుల్లోనో తేల్చుకోవాల్సి ఉంటుంది. అంతేతప్ప తుది జాబితాలో మార్పుచేర్పులకు ఇక అవకాశం లేదు. అభ్యంతరాలున్న అధికారులు డెప్యూటేషన్‌పై తమకు నచ్చిన రాష్ర్టంలో పనిచేసే అవకాశమున్నా.. అందుకు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర ప్రభుత్వ ఆమోదం తప్పనిసరి. గతంలో ఏపీకి కేటాయించినప్పటికీ తెలంగాణలోనే పనిచేస్తున్న వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి పూనం మాలకొండయ్య, జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్, నిజామాబాద్ కలెక్టర్ రొనాల్డ్ రాస్, రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ అమ్రపాలీ ఇప్పుడు ఆంధ్రాకు వెళ్లక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. కాగా, గత ఏడాది జూన్ 2 నాటికి పదవిలో ఉన్న వారినందరినీ తుది జాబితాలో కేటాయింపులు చేశారు. ఏపీ నుంచి తెలంగాణకు వచ్చిన వారిలో సత్యనారాయణ మహంతి, జె.రామానంద్, బి.పి.ఆచార్య, టి.రాధ, షాలినీ మిశ్రా, శాంతికుమారి, జయేష్‌రంజన్, వికాస్‌రాజ్, శ్వేతా మహంతి, ఎస్కే సిన్హా, శశాంక్ గోయల్, రజత్‌కుమార్, జి.అశోక్‌కుమార్, వి.శేషాద్రి, యోగితా రాణా ఉన్నారు. తెలంగాణ నుంచి ఏపీకి దక్కిన వారిలో ఎ.కె. పరీడా, రణదీప్ సూడాన్, విద్యాసాగర్, రొనాల్డ్‌రాస్, వాకాటి కరుణ, ఆమ్రపాలి, పూనం మాలకొండయ్య, సోమేశ్‌కుమార్, ఏపీ సహానీ, రజత్ భార్గవ, అనిల్‌కుమార్ సింఘా ల్, ప్రవీణ్‌ప్రకాశ్, సిద్దార్థ జైన్, ప్రశాంతి ఉన్నారు. కాగా, వీరిలో ఎస్కే సిన్హా, చందనాఖన్, లక్ష్మీపార్థసారథి భాస్కర్, జె. రామానంద్ ఇప్పటికే పదవీవిరమణ చేశారు.
 
 ఐపీఎస్ కేటాయింపుల్లో స్పల్ప మార్పులు
 
 ఐపీఎస్ అధికారుల గత కేటాయింపులతో పోల్చితే తాజాగా ఏపీ నుంచి తెలంగాణకు నలుగురు, తెలంగాణ నుంచి ఏపీకి ఒకరు మారాల్సి వస్తోంది. తాజాగా తెలంగాణకు కేటాయించిన ఐపీఎస్‌ల సంఖ్య 92 నుంచి 95కి పెరిగింది. గతంలో తెలంగాణకు కేటాయించినప్పటికీ, తాత్కాలిక ప్రాతిపదికన ఏపీ నిఘా విభాగం చీఫ్‌గా కొనసాగుతున్న అదనపు డీజీ ఏఆర్ అనురాధను కేంద్రం ఏపీకే కేటాయించింది. ఇక ఏపీ పోలీస్ కంప్యూటర్ సర్వీసెస్ అదనపు డీజీ ఈష్ కుమార్, తాత్కాలిక కేటాయింపులో తెలంగాణకే వచ్చి ఇక్కడే ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ చీఫ్‌గా పని చేస్తున్న మహేష్ మురళీధర్ భగవత్, కేంద్ర సర్వీసుల్లో ఉన్న విజయ్‌కుమార్, గుంటూరు అర్బన్ ఎస్పీగా పనిచేస్తున్న రాజేష్‌కుమార్ కూడా తెలంగాణ కేడర్‌కే వచ్చారు. ప్రస్తుతం డిప్యుటేషన్‌పై సీఆర్పీఎఫ్ స్పెషల్ డెరైక్టర్‌గా పని చేస్తున్న కోడె దుర్గాప్రసాద్ కేటాయింపులో ఏ మార్పులేదు. గతంలో ఆయ న్ను తెలంగాణకు కేటాయించినప్పటికీ దుర్గాప్రసాద్ ఏపీ కేడర్‌కు వెళ్లేందుకు ఆసక్తి చూపినట్లు వార్తలొచ్చాయి. మాజీ డీజీపీ ఏకే మహంతి కుమారులైన అవినాష్ మహంతి, అభిషేక్ మహంతి ఇరు రాష్ట్రాలకూ చెరొకరు వచ్చారు. సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీగా పనిచేస్తున్న అవినాష్ తెలంగాణ క్యాడర్‌కు, విజయవాడ ఏసీపీగా విధు లు నిర్వర్తిస్తున్న అభిషేక్ మహంతి ఏపీకే కొనసాగనున్నారు. ఉమ్మడి ఏపీలో ఉన్న 256 ఐపీఎస్ పోస్టుల పంపకంలో భాగంగా, ఏపీకి 144 పోస్టులు, తెలంగాణకు 112 పోస్టులు వచ్చాయి. తాజా కేటాయింపుల తర్వాత కూడా తెలంగాణకు 17 మంది అధికారులు తక్కువయ్యారు. తుది కేటాయింపులకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్‌ను కేంద్రం త్వరలో విడుదల చేయనుంది. ఐఎఫ్ఎస్ అధికారుల తుది కేటాయింపుల ప్రకారం తెలంగాణకు 58 మంది, ఏపీకి 69 మంది వచ్చారు. తెలంగాణ కేడర్‌కు కేటాయించిన ఐఎఫ్ఎస్ల సంఖ్య 56 నుంచి 58కి పెరిగింది. ఏపీ కేడర్‌లో ఈ సంఖ్య 71 నుంచి 69కి తగ్గింది. ఏపీ నుంచి తెలంగాణకు వచ్చే వారిలో ఎం.రామ్ ప్రసాద్, హరీశ్చంద్ర మిశ్రా, సురేశ్ నగేష్ జాదవ్, బీహెచ్.బసివి రెడ్డి, సోని బాలాదేవి, షఫీయుల్లా వున్నారు. తెలంగాణ కేడర్ నుంచి ఏపీకి మారుతున్న వారిలో పి.మల్లికార్జున రావు, రాహుల్ పాండే, సి.సెల్వం, సుబ్బా రాఘవయ్య ఉన్నారు.
- 
      
                    ఏపీకి 161, టీఎస్ కు 133!
 ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాల్లో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ వంటి అత్యున్నత సర్వీసుల అధికారుల తుది ఎంపికను కేంద్రం పూర్తి చేసింది. రాష్ట్ర విభజన అనంతరం తీవ్ర ఉత్కంఠ రేపిన ఈ వ్యవహారంలో ఆయా సర్వీసుల అధికారుల తుది కేటాయింపులను గురువారం కేంద్రం ప్రకటించింది.
 
 ఇరు తెలుగు రాష్ట్రాల అత్యున్నత సర్వీసుల తుది కేటాయింపు వివరాలు ఇలా ఉన్నాయి..
 
 ఐఏఎస్ లు- ఏపీ-161, టీఎస్ 133
 
 ఐపీఎస్ లు - ఏపీ 116, టీఎస్ 95
 
 ఐఎఫ్ఎస్ లు- ఏపీ- 69, టీఎస్ 58
- 
      
                    పలువురు ఐఎఫ్ఎస్లకు బదిలీలు, పోస్టింగ్‌లు
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి చెందిన పలువురు ఐఎఫ్ఎస్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. మునీంద్రను అడిషనల్ ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్(ఎన్విరాన్మెంట్)గా, బి. ఆనంద్ మోహన్‌ను ఖమ్మం కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్‌గా బదిలీ చేస్తూ పోస్టింగ్‌లు ఇచ్చారు. పీవీ రాజారావును వరంగల్ సోషల్ ఫారెస్ట్రీ సర్కిల్ కన్సర్వేటర్గా, బి. శ్రీనివాస్‌ను హైదరాబాద్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్‌గా, ఎస్. రమేశ్‌ను దూలపల్లి ఫారెస్ట్ అకాడమీ జాయింట్ డెరైక్టర్‌గా నియమించారు. సంజీవ్‌కుమార్ గుప్తాను కవాల్ టైగర్ రిజర్వ్ ఫీల్డ్ డెరైక్టర్‌గా, వినయ్ కుమార్‌ను అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫీల్డ్ డెరైక్టర్‌గా పోస్టింగ్ ఇచ్చారు.
- 
      
                   
                                 సివిల్స్ అర్హత నిబంధనలు మారనున్నాయా?
 ఐఏఎస్.. ఐపీఎస్.. ఐఎఫ్ఎస్ వంటి అత్యున్నత సర్వీసుల ఎంపిక నిబంధనలు మారనున్నాయా..! లక్షల మంది అభ్యర్థుల ఆశలు.. అడియాశలు కానున్నాయా? సివిల్స్ స్వప్నం.. స్వప్నంగానే మిగిలిపోనుందా?! పరిపాలన సంస్కరణలు, ప్రజా ఫిర్యాదుల శాఖ వెబ్సైట్లో ప్రచురించిన విషయాలు.. ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం ఇస్తున్నాయి. రెండో పాలన సంస్కరణల సంఘం.. సివిల్ సర్వీసెస్ పరీక్షకు సంబంధించి గరిష్ట వయోపరిమితి, అటెంప్ట్‌ల కుదింపు వంటి సిఫార్సులను చేసింది. వీటిని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు మీడియాలో వస్తున్న కథనాలు దేశ వ్యాప్తంగా లక్షల మంది అభ్యర్థులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.
 
 రెండో ఏఆర్సీ సిఫార్సులు.. ప్రభుత్వ నిర్ణయాలు
 వయో పరిమితి:
 ఏఆర్సీ సిఫార్సులు: పరీక్ష జరిగే సంవత్సరంలో ఆగస్ట్ ఒకటో తేదీ నాటికి జనరల్ కేటగిరీ అభ్యర్థులు 21 నుంచి 25 ఏళ్లు; ఓబీసీ అభ్యర్థులు 21 నుంచి 28 ఏళ్లు; ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులు, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అభ్యర్థులు 21 నుంచి 29 ఏళ్ల మధ్యలో ఉండాలి.
 
 ప్రభుత్వ నిర్ణయం: జనరల్ కేటగిరీ అభ్యర్థుల గరిష్ట వయో పరిమితి 26 ఏళ్లకు పెంచింది. ఓబీసీ అభ్యర్థులు 21 నుంచి 28 ఏళ్లు; ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులు, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అభ్యర్థులు 21 నుంచి 29 ఏళ్ల మధ్యలో ఉండాలి.. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అభ్యర్థులకు మాత్రం అన్ని కేటగిరీల్లో రెండేళ్ల సడలింపు ఇవ్వాలని నిర్ణయించింది.
 
 అటెంప్ట్‌లు:
 ఏఆర్సీ సిఫార్సులు: జనరల్ కేటగిరీ అభ్యర్థులకు మూడు; ఓబీసీ వర్గానికి అయిదు; ఎస్సీ/ఎస్టీ వర్గాలకు, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అభ్యర్థులకు ఆరు అటెంప్ట్‌లు ఉండాలని సిఫార్సు చేసింది.
 
 ప్రభుత్వ నిర్ణయం: వీటిని యథాతథంగా అమలు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం.. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అభ్యర్థులకు మాత్రం రెండేళ్ల అదనపు అటెంప్ట్‌ల సదుపాయం కల్పించింది.
 
 పరీక్ష విధానంపై ఏమన్నారు?
 రెడో ఏఆర్సీ: పరీక్ష కు సంబంధించి రెండు విధానాలను సిఫార్సు చేసి.. రెండింటిలో ఏదో ఒకదాన్ని అమలు చేయాలని పేర్కొంది. అవి..
 
 విధానం1: ప్రిలిమినరీ, మెయిన్స్ ఎగ్జామినేషన్స్లు వరుసగా రెండు లేదా మూడు రోజుల్లో నిర్వహించాలి. ఖాళీల మేరకు ప్రిలిమ్స్‌కు నిర్దేశిత కటాఫ్ అనుసరించి వాటిని సాధించిన అభ్యర్థులనే మెయిన్స్ మూల్యాంకనలో పరిగణనలోకి తీసుకోవాలి. ఆ తర్వాత పర్సనాలిటీ టెస్ట్ నిర్వహించాలి.
 
 విధానం 2: ముందుగా ప్రిలిమినరీ పరీక్షను నిర్వహించాలి. నిర్దేశిత కటాఫ్ ప్రకారం అర్హులైన అభ్యర్థులను మెయిన్ ఎగ్జామినేషన్‌కు అనుమతించాలి. ర్యాంకుల ఆధారంగా.. ఖాళీలను పరిగణనలోకి తీసుకుని 1:2 లేదా 3 నిష్పత్తిలో పర్సనాలిటీ టెస్ట్‌కు అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేయాలి. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ముగిసిన రెండు నెలల్లోపు మెయిన్ ఎగ్జామినేషన్స్ నిర్వహించాలి.
 
 పరీక్ష ప్యాట్రన్:
 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్‌ను జనరల్ స్టడీస్ అంశాలపై ఒకటి లేదా రెండు పేపర్లలో నిర్వహించాలి. భారత రాజ్యాంగం, భారత న్యాయ వ్యవస్థ, భారత ఆర్థిక వ్యవస్థ, పాలిటీ, చరిత్ర, సంస్కృతి అంశాలను సిలబస్‌లో చేర్చాలి. ప్రిలిమినరీ స్థాయిలో ఎలాంటి ఆప్షనల్ సబ్జెక్ట్ ఉండకూడదు.
 
 మెయిన్ ఎగ్జామినేషన్‌ను కేవలం రెండు పేపర్లలో... కంపల్సరీ సబ్జెక్ట్స్‌గా డిస్క్రిప్టివ్ విధానంలో నిర్వహించాలి. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్‌లో పేర్కొన్న సిలబస్ అంశాలనే ఈ కంపల్సరీ సబ్జెక్ట్స్‌కు సిలబస్‌గా నిర్దేశించాలి. ఈ రెండు పేపర్లకు అదనంగా ఎస్సే పేపర్‌ను నిర్వహించాలి.
 
 ప్రభుత్వ నిర్ణయం: ఇటీవలే ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షల విధానంలో మార్పులు చేసిన ప్రభుత్వం ఈ విషయంలో ఏఆర్సీ సిఫార్సులను పరిగణనలోకి తీసుకోలేదు. ప్రస్తుతమున్న విధానాన్నే (సీశాట్, మెయిన్స్) కొనసాగించాలని నిర్ణయించింది.
 
 ఇప్పటివరకూ ఇలా..
 
 గత ప్రభుత్వం సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్‌కు హాజరయ్యే అభ్యర్థుల గరిష్ట వయోపరిమితి జనరల్ కేటగిరీ అభ్యర్థులకు 30 ఏళ్ల నుంచి 32 ఏళ్లకు, అటెంప్ట్‌ల సంఖ్యను కూడా 4 నుంచి ఆరుకు పెంచుతూ ఈ ఏడాది ఫిబ్రవరి 10న నిర్ణయం తీసుకుంది. దీనికి అనుగుణంగా రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థుల గరిష్ట వయోపరిమితి, అటెంప్ట్‌ల సంఖ్య కూడా పెరిగింది. ఓబీసీ వర్గాలకు ఏడు నుంచి తొమ్మిదిసార్లకు; ఎస్సీ/ఎస్టీలకు ఎలాంటి పరిమితి లేదు. ఇది దేశంలో లక్షల మంది అభ్యర్థుల్లో ఆనందోత్సాహాలు నింపింది.
 
 ఇప్పుడు ఆందోళన ఎందుకు?..
 
 2014 ఆగస్ట్ 24న నిర్వహించిన ప్రిలిమినరీ ఎగ్జామినేషన్‌కు దేశవ్యాప్తంగా మూడు లక్షల మందికిపైగా అభ్యర్థులు హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 30 వేలకుపైగా పరీక్ష రాశారు. కానీ తాజా నిర్ణయంతో అన్ని వర్గాల అభ్యర్థుల ఆందోళన చెందుతున్నారు. సివిల్స్ సిలబస్‌పై అవగాహన పొందడానికే చాలా సమయం పడుతుంది. కాబట్టి తాజా మార్పులు అమలైతే.. సివిల్స్ అవకాశం చేజారడమే కాకుండా.. కోర్ ఫీల్డ్‌లో తిరిగి ఉద్యోగం పొందడానికి ఇబ్బందులు ఎదురవుతాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. యువతకు ఉపాధి కల్పించే అంశాల్లో ఇలాంటి నిర్ణయాలు సరికాదని, వారి భవిష్యత్తును పరిగణనలోకి తీసుకుని నిర్ణయాలు తీసుకోవాలని నిపుణులు, అభ్యర్థులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
 
 నిపుణుల మాట..
 డీఓపీటీ ప్రకటనకు కట్టుబడి ఉండాలి
 
 సివిల్స్ ఎంపిక విధానంలో మార్పులు తేవాలని, అందుకు రెండో ఏఆర్సీ సిఫార్సులను ఇప్పటికిప్పుడు అమలు చేయాలనే కేంద్ర ప్రభుత్వ యోచన సరికాదు. వాస్తవానికి 2018 వరకు సివిల్స్ ఎంపిక ప్రక్రియలో ఎలాంటి మార్పులు ఉండవని డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ రెండు నెలల క్రితం స్పష్టం చేసింది. కానీ దీనికి విరుద్ధంగా నిర్ణయాలు తీసుకుని వాటిని అమలు చేయాలనుకోవడం అహేతుకుం. ప్రస్తుతం మన దేశంలో అమలవుతున్న విద్యా విధానం ప్రకారం.. చాలా మంది విద్యార్థులకు 25 ఏళ్ల వయస్సుకి గానీ సివిల్ సర్వీసెస్ పరీక్షపై అవగాహన రావడం లేదు. కాబట్టి గరిష్ట వయోపరిమితి 30 ఏళ్లుగా ఉండటమే సమంజసం. గరిష్ట వయోపరిమితిని 26 ఏళ్లకు కుదించడం అసంబద్ధం. ఈ నిర్ణయం వల్ల గ్రామీణ అభ్యర్థులు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు నష్టపోతారు.
 - శ్రీరంగం శ్రీరామ్, డెరైక్టర్, శ్రీరామ్స్ ఐఏఎస్ అకాడమీ
 
 విలువైన సమయం వృథా అవుతోంది
 
 సివిల్ సర్వీసెస్‌కు ఎంపికవడం అనేది నేటి యువతలో ప్రతి ఒక్కరి స్వప్నం. వందల సంఖ్యలో ఉండే పోస్టులకు లక్షల్లో పోటీ పడుతున్నారు. వీరంతా గరిష్ట వయోపరిమితి, అటెంప్ట్‌ల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని ఏళ్ల తరబడి కృషి చేస్తున్నారు. చివర్లో చిన్నపాటి పొరపాట్ల వల్ల విజయం పొందలేకపోతున్నారు. పర్యవసానంగా జీవితంలో విలువైన సమయం వృథా అవుతోంది. రెండు లేదా మూడు అటెంప్ట్‌లకు పరిమితమై, విజయ సాధ్యాసాధ్యాలను పరిశీలించుకోవాలి. సివిల్ సర్వీసెస్‌లో యంగ్ బ్లడ్‌ను ఎంపిక చేయాలనే ఉద్దేశంతో రెండో ఏఆర్సీ అర్హత నిబంధనలను కఠినం చేసింది. దీనివల్ల విద్యార్థుల్లో ఒక్క సివిల్ సర్వీసే కెరీర్ అనే భావన వీడి, ఇతర అవకాశాల సాధనలో తమ నైపుణ్యాలు ప్రదర్శించడానికి వీలవుతుంది. ఫలితంగా అన్ని రంగాల్లో నిపుణులైన అభ్యర్థులతో నాణ్యత ప్రమాణాలు మెరుగవుతాయి.
 - డాక్టర్ జయప్రకాశ్ నారాయణ్, రెండో ఏఆర్సీ సభ్యులు, మాజీ ఐఏఎస్ అధికారి
 
 అమలు చేయాలనే నిబంధన లేదు
 
 ఏఆర్సీ, ఇతర కమిటీలు ఇచ్చిన సిఫార్సులను ప్రభుత్వం ఆమోదించినట్లు ప్రకటించినా.. అమలు చేయాలనే నిబంధన ఏమీ లేదు. గతంలో సతీష్ చంద్ర కమిటీ వయోపరిమితిని తగ్గించాలని, నెగెటివ్ మార్కింగ్ ప్రవేశపెట్టాలని సూచించినా.. వెంటనే అమలు కాలేదు. కాబట్టి అభ్యర్థులు ఎలాంటి ఆందోళన చెందకుండా తమ ప్రిపరేషన్‌పై దృష్టిపెట్టాలి.
 -గోపాల కృష్ణ, డెరైక్టర్, బ్రెయిన్ ట్రీ
 
 ఈ అంశంపై పాఠకులు తమ అభిప్రాయాలను తెలియజేయవచ్చు. ఈ మెయిల్:
 sakshieducation@gmail.com
- 
      
                   
                                 మెయిన్స్‌లో విజయానికి వ్యూహాలు
 ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ వంటి అత్యున్నత సర్వీసుల్లో అడుగుపెట్టి వ్యక్తిగత వికాసంతో పాటు సామాజిక అభివృద్ధికి బాసటగా నిలిచే భాగ్యం కోసం సివిల్ సర్వీసెస్ రాస్తుంటారు. ఇలాంటి లక్ష్యంతో 2014 సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్‌కు హాజరైన లక్షల మందిలో విజయాన్ని అందుకున్నది కొందరే! ఇక రెండో మెట్టు మెయిన్స్.. ఇందులో మెరుగైన స్కోర్ సాధిస్తేనే గెలుపు గమ్యాన్ని చేరుకునేందుకు మార్గం కనిపిస్తుంది. మెయిన్స్‌లో విజయానికి అవసరమైన ప్రిపరేషన్ వ్యూహాలపై ఫోకస్...
 
 ముందుగా సివిల్స్ ప్రిలిమ్స్‌ను దిగ్విజయంగా పూర్తిచేసిన అభ్యర్థులకు అభినందనలు. ఇప్పటి నుంచి రెట్టించిన ఉత్సాహంతో డిసెంబర్లో జరిగే మెయిన్స్ పరీక్షలో మంచి స్కోర్ సాధించేందుకు సిద్ధంకావాలి. ఆప్షనల్ పేపర్లతో పాటు జనరల్ ఎస్సే (ఒక పేపర్), జనరల్ స్టడీస్ (నాలుగు పేపర్లు) రాయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో అభ్యర్థులు పటిష్ట ప్రణాళికను రూపొందించుకుని, ప్రిపరేషన్ కొనసాగించాలి.
 
 జనరల్ ఎస్సే
 ఈసారి జరిగే మెయిన్స్‌లో ఒకటి కంటే ఎక్కువ ఎస్సేలు రాయాల్సిన అవసరం ఉండొచ్చు. దీనికి సంబంధించి నోటిఫికేషన్లో సూచనప్రాయంగా (candidates may be required to write essays on multiple topics) పేర్కొన్నారు. ఈ క్రమంలో అభ్యర్థులు కొన్ని ముఖ్యమైన అంశాలపై ఎస్సేలు రాయటం ప్రాక్టీస్ చేయాలి. ఇటీవలి కాలంలో వివిధ రంగాల్లో చోటుచేసుకున్న ముఖ్యమైన పరిణామాలపై దృష్టిసారించాలి.
 
 ఉదా:
 ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం పాత్ర
 బాలల హక్కులు
 స్మార్ట్ సిటీలు
 ఒక ప్రవర్తనా సవాలుగా శుభ్రత
 కనిష్ట ప్రభుత్వం, గరిష్ట పాలన (కజీజీఝఠఝ జౌఠ్ఛిటఝ్ఛ్ట ్చఛీ క్చ్ఠజీఝఠఝ జౌఠ్ఛిట్చఛ్ఛి ్ఛ్టఛి.,)
 
 మనకంటూ ఓ ప్రత్యేకం
 జనరల్ ఎస్సేను జనరల్ స్టడీస్ నుంచి వేరుగా చూడాలి. రాసే విషయంలో ఒక్కొక్కరికీ ఒక్కో శైలి ఉంటుంది. ఓ అంశానికి సంబంధించి అభిప్రాయాలను సౌకర్యవంతంగా, స్వేచ్ఛగా వెల్లడించగల శైలి ఏంటన్నది గుర్తించి, దాన్ని అనుసరించాలి. సందర్భానుసారం గొప్ప వ్యక్తుల వ్యాఖ్యలను ఉదాహరించాలి. ఇవి అభిప్రాయాలకు బలం చేకూరుస్తాయి. అభ్యర్థి రాసే వ్యాసంలో ఆత్మస్థైర్యం, ఆశావాదం, నిర్మాణాత్మకత ప్రతిబింబించాలి. అనవసర విషయాల జోలికి వెళ్లకూడదు. ఎస్సే ద్వారా మన వ్యక్తిత్వం ఏంటన్నది బయటపడుతుంది. దీన్ని గుర్తుంచుకొని ముందడుగు వేయాలి. మంచి వాక్యాలతో ఉత్సాహంతో మనస్ఫూర్తిగా ఇష్టపడుతూ రాసే ఎస్సే.. ఎగ్జామినర్‌ను కట్టిపడేస్తుందనడంలో సందేహం లేదు.
 
 జనరల్ స్టడీస్
 జనరల్ స్టడీస్ పేపర్లలోని ప్రశ్నలకు సమాధానాలు రాసేటప్పుడు ప్రధానంగా అయిదు అంశాలను గుర్తుంచుకోవాలి.. 1.కిందటి సారి జరిగిన పరీక్షలో పదాల సంఖ్య భారంగా పరిణమించింది. అయితే ఈ విషయంలో అభ్యర్థులు భయపడాల్సిన అవసరం లేదు. పదాల పరిమితిపై ఆందోళన చెందకుండా, నాణ్యతకు ప్రాధాన్యమిస్తూ బాగా రాస్తే మంచి స్కోర్ సాధించవచ్చు.
 
 2.ప్రశ్నను బట్టి సమాధానాన్ని పాయింట్ల రూపంలో రాయాలా? లేదంటే దీంతోపాటు విశ్లేషణాత్మకత విధానంలోనూ రాయాలా? అనేది నిర్ణయించుకోవాలి. కొన్ని ప్రశ్నలకు పాయింట్ల రూపంలో సమాధానం రాయడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. మరికొన్నింటికి రెండు విధానాలనూ జోడిస్తూ రాసినప్పుడే మేలు జరుగుతుంది. నేషనల్ ఎర్లీ చైల్డ్‌హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ (ఈసీసీఈ); ప్రతిపాదిత మోటార్ వాహనాల చట్ట సవరణలు, జువైనల్ జస్టిస్ యాక్ట్ తదితర అంశాలను పాయింట్ల రూపంలో రాయొచ్చు. భారతదేశంలో పంట మార్పిడి ఆవశ్యకతకు సమాధానాన్ని రెండు విధానాల్లోనూ రాయొచ్చు.
 
 3.Comment, Elaborate, Illustrate, analyse, Be Critica.. తదితర పదాలు ప్రశ్నల్లో కనిపిస్తాయి. ఓ ప్రశ్నను రూపొందించే వ్యక్తి మీ నుంచి దేన్ని ఆశిస్తున్నాడనేది ఈ పదాల ద్వారా అర్థం చేసుకోవచ్చు. దానికి తగినట్లు సమాధానం రాయాలి. వ్యాఖ్యానించమన్నారా.. విశ్లేషించమన్నారా? లేదంటే విమర్శనాత్మకంగా విశ్లేషించమన్నారా? ఇలా సమాధానాన్ని ఏ కోణంలో రాయాలన్నది గుర్తించాలి. 4.మరో ముఖ్య విషయం కచ్చితమైన సమాధానమంటే కేవలం ఫ్యాక్ట్స్‌ను మాత్రమే రాయడం కాదు. విశ్లేషణాత్మకంగా సమాధానం రాయడం ప్రధానం. ఫ్యాక్ట్స్ అనేవి ఓ అంశంపై అభ్యర్థి శ్రద్ధను మాత్రమే తెలియజేస్తాయి. 5.కారణం ఏదైనా సరే ఒక పేపర్‌ను సరిగా రాయలేదని అనిపిస్తే అతిగా ఆలోచించకుండా అంతటితో దాన్ని మరచిపోయాలి. లేదంటే దీని ప్రభావం మరో పేపర్‌పై పడుతుంది.
 
 హిస్టరీ- కొన్ని ముఖ్యాంశాలు
 మొదటి ప్రపంచ యుద్ధం గదర్ పార్టీ భారతదేశానికి గాంధీజీ తిరిగి రాక (1915) 1914 నుంచి అరబ్ రాజకీయాలు టిబెట్ అంశం (1950-59) పంచశీల ఒప్పందం హెండర్సన్ బ్రూక్స్ రిపోర్టుసిమ్లా ఒప్పందం (1972) జాతీయ ఆత్యయిక పరిస్థితి (1975)జనతా పార్టీ (1977-79) కార్గిల్ యుద్ధం (1999) తదితర అంశాలపై దృష్టిసారించాలి. భౌగోళిక శాస్త్రం/పర్యావరణం: అయిచీ జీవ వైవిధ్య లక్ష్యాలు; తుఫాన్లు, ఎల్‌నినో, కరువుకాటకాలు; తీవ్ర వాతావరణ మార్పులు; ఆగ్రో ఫారెస్ట్రీ విధానం- 2014 తదితర అంశాలపై అవగాహన పెంపొందించుకోవాలి.సామాజిక అంశాలకు సంబంధించి ముఖ్యంగా యువత జీవనశైలి, ప్రపంచీకరణ అనంతరం భారతీయ సంస్కృతిలో మార్పులను అధ్యయనం చేయాలి.సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ (ఎల్పీజీ) విధానాలు అమలు కాలం (1991) నుంచి గ్రామీణ సమాజంలో వచ్చిన మార్పులపై అవగాహన పెంపొందించుకోవాలి.
 
 పాలిటీ, గవర్నెన్స: ఇందులో ప్రధానంగా ప్రతిపక్ష నేత, ఉరిశిక్ష అమలు, ఉమ్మడి పౌర స్మృతి, ఆర్టికల్ 370, సహకార సమాఖ్యవాదం, ఖనిజాలకు రాయల్టీ చెల్లింపుల పెరుగుదల, ఉన్నత స్థాయి న్యాయ వ్యవస్థలో న్యాయమూర్తుల నియామకాలకు సంబంధించి నేషనల్ జ్యుడీషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్-కొలీజియం వ్యవస్థ, ప్రధాని కార్యాలయం (పీఎంవో) తదితర అంశాలు ముఖ్యమైవని.అంతర్జాతీయ సంబంధాలు, జాతీయ వ్యవహారాలు, సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధిత అంశాలపై తప్పనిసరిగా దృష్టిసారించాలి.
 
 జీఎస్ పేపర్ 4 (నైతికత, నిజాయితీ, అభిరుచి): ఈ విభాగంలోని ప్రశ్నలకు వ్యక్తిగత అవగాహన సామర్థ్యం ప్రధానం. వివిధ కేస్‌స్టడీలను అధ్యయనం చేయడం ద్వారా దీన్ని పెంపొందించుకోవచ్చు. శక్తి, సంపద, ధర్మ (డ్యూటీ), నిజాయితీ తదితరాలకు సంబంధించిన మంచి కొటేషన్స్‌తో సిద్ధంగా ఉండాలి. ఈ అంశాలు మీరు రాసే సమాధానంలో ప్రతిబింబించాలి. ప్రభుత్వంలో పనిచేసే వారికి ఉండాల్సిన కనీస విలువలు, నైతిక ఆవశ్యకత అంశాలను క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. ఒక అంశంపై ఒక్కొక్కరికీ ఒక్కో అభిప్రాయం ఉంటుంది. ఎవరి విశ్లేషణ వారిది. విశ్వజనీన సమాధానాలను రూపొందించడం కష్టమైన పని. అందుకే స్వీయ వివేచన ఆధారంగా, నిర్మాణాత్మకంగా, ప్రాక్టికల్‌గా సాధ్యమయ్యేలా సమాధానాలు ఇవ్వాలి.
 ఆల్ ది బెస్ట్...
 
 మెయిన్స్ పరీక్ష విధానం
 పేపర్ మార్కులు
 అర్హత పేపర్లు:
 పేపర్-ఎ: 
 రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్లోని
 ఎంపిక చేసుకున్న భాష 300
 పేపర్-బి:
 ఇంగ్లిష్ 300
 మెరిట్‌కు పరిగణనలోకి తీసుకునే పేపర్లు:
 పేపర్-1 ఎస్సే 250
 పేపర్ 2 (జీఎస్-1) 250
 పేపర్ 3 (జీఎస్-2) 250
 పేపర్ 4 (జీఎస్-3) 250
 పేపర్ 5 (జీఎస్-4) 250
 పేపర్ 6 (ఆప్షనల్ సబ్జెక్టు పేపర్-1) 250
 పేపర్ 7 (ఆప్షనల్ సబ్జెక్టు పేపర్-2) 250
 మొత్తం మార్కులు 1750
 
 ఆలోచనా తీరు.. రాసే శైలి..
 విజయానికి కీలకం
 -శశాంక, సివిల్స్ 2012 టాపర్,
 అసిస్టెంట్ కలెక్టర్ అండర్ ట్రైనింగ్
 
 సివిల్స్ మెయిన్స్ ప్రిపరేషన్లో ‘రాయడం ప్రాక్టీస్’ చేయడమనేది కీలకమైన అంశం. ఎందుకంటే ఓ అంశానికి సంబంధించి ఎంతటి పరిజ్ఞానమున్నా, అవగాహన ఉన్నప్పటికీ రాతపూర్వకంగా సరిగా వ్యక్తీకరించకుంటే ఫలితం శూన్యం! వీలైనన్ని మాక్ టెస్ట్‌లు రాయడం ద్వారా లోపాలను అధిగమించి, రాత తీరును మెరుగుపరుచుకోవచ్చు.ఒకటి కంటే ఎక్కువ ఎస్సేలకు సమాధానాలు రాయాల్సి వస్తే సమయ పాలన కీలకపాత్ర పోషిస్తుంది. సమకాలీన అంశాలపై ఎస్సేలు రాసి నిపుణులతో దిద్దించుకోవాలి. దీనివల్ల బలాలు, బలహీనతలు తెలుస్తాయి. మెరుగుపరచుకోవాల్సిన అంశాలపై స్పష్టత వస్తుంది. జనరల్ స్టడీస్ పేపర్లను చాలా మంది బాగానే రాస్తున్నారు.. ఈ నేపథ్యంలో విజయాన్ని నిర్దేశించడంలో ఎస్సే, ఆప్షనల్ పేపర్లు, ఇంటర్వ్యూ కీలకమవుతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రిపరేషన్ సాగించాలి.
 
 ప్రతి రోజూ జనరల్ స్టడీస్, ఆప్షనల్
 ప్రిపరేషన్‌కు సమయం కేటాయించాలి. ఉదయం జనరల్ స్టడీస్ చదివితే, సాయంత్రం ఆప్షనల్ సబ్జెక్టు చదవాలి.
 సమయం ఎక్కువగా అందుబాటులో ఉండదు కాబట్టి ఒకట్రెండు పేపర్లతో పాటు ఒక ప్రామాణిక మ్యాగజైన్‌కు పరిమితమవ్వాలి. ముఖ్యమైన అంశాలను ప్రత్యేకంగా నోట్ చేసుకోవాలి.
 
 ఎంత ఎక్కువ చదివామనే దానికంటే చదివిన విషయం ఎంత వరకు గుర్తుంది అనేది ప్రధానం. అందుకే పునశ్చరణకు ప్రాధాన్యం ఇవ్వాలి.
 
 సామాజిక, ఆర్థిక సర్వే, బడ్జెట్, ముఖ్యమైన కమిటీల నివేదికలు వంటి వాటిని అధ్యయనం చేయడం ముఖ్యం. రాష్ట్రపతి, ప్రధానిమంత్రి ప్రసంగాలపై దృష్టికేంద్రీకరించాలి. ఎందుకంటే వీటి ద్వారా వివిధ అంశాలకు సంబంధించిన ప్రభుత్వ ఆలోచనా ధోరణి తేటతెల్లమవుతుంది.
 
 సమాధానం రాసేటప్పుడు ఒక ‘ఆఫీసర్’గా రాయాలి. ఆఫీసర్ అయినట్లు ఊహించుకుని సమాధానం రాస్తే ప్రాక్టికల్‌గా వీలయ్యే సూచనలు బయటపడతాయి.
 
 ఏదైనా సమస్య పరిష్కారానికి సూచనలు ఇచ్చేటప్పుడు క్షేత్రస్థాయిలో ప్రాక్టికల్‌గా అమలు చేయడానికి వీలయ్యే వాటిని సూచించాలి.
 
 సమాధానాల్లో నెగిటివ్ అభిప్రాయాలను రాయొద్దు. అన్నీ సమస్యలే.. అంతా అవినీతి మయం, ఏమీ చేయలేం.. వంటి నిరాశాజనక అభిప్రాయాలను కాకుండా ‘‘తప్పులున్నాయి.. వాటిని సరిదిద్దుకునేందుకు అవకాశముంది..’’ అనే సానుకూల ధోరణిని ప్రతిబింబించాలి.
 
 జనరల్ స్టడీస్ 4 పేపర్ ప్రిపరేషన్‌కు ఇగ్నో మెటీరియల్ ను సేకరించి వాటిలోని కేస్ స్టడీలను అధ్యయనం చేయాలి.
- 
      
                   
                                 పట్టు సాధిస్తే మెట్టు ఎక్కినట్లే!
 ఐఏఎస్, ఐఎఫ్ఎస్, ఐపీఎస్ వంటి ఉన్నత హోదాలను చేజిక్కించుకొని, జీవితాన్ని అత్యున్నతంగా తీర్చిదిద్దుకునే క్రమంలో గత ఆగస్టులో ఔత్సాహికులు సివిల్ సర్వీసెస్ పరీక్ష ప్రిలిమ్స్ రాశారు. వీటి ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 18,000 మంది మెయిన్సకు అర్హతకు సాధించారు. వీరు డిసెంబర్ 14 నుంచి జరిగే మెయిన్స్ మెట్టును అధిగమించాల్సిందే! ఈ నేపథ్యంలో మెయిన్స్ జనరల్ స్టడీస్ పేపర్-1 సిలబస్‌లో ఏయే అంశాలున్నాయి? వాటిపై పట్టుసాధించడమెలా? వంటి అంశాలపై సబ్జెక్టు నిపుణుల విశ్లేషణ...
 
 భూగోళశాస్త్రం వరల్డ్ ఫిజికల్ జాగ్రఫీ
 సివిల్స్ మెయిన్స్ జనరల్ స్టడీస్ పేపర్-1లో జాగ్రఫీకి సంబంధించిన సిలబస్‌లోని అంశాలు.. ప్రపంచ భౌతిక భూగోళ విశేషాంశాలు.ప్రపంచ వ్యాప్తంగా (దక్షిణాసియా, భారత ఉపఖండంతో సహా) ముఖ్యమైన సహజ వనరుల విస్తరణ.ప్రపంచ వ్యాప్తంగా (భారత్ సహా) వివిధ ప్రాంతాల్లో ప్రాథమిక, ద్వితీయ, తృతీయ రంగ పరిశ్రమల విస్తరణ- దానికి కారణాలు.భూకంపాలు, సునామీ, అగ్నిపర్వతాలు, తుఫానులు వంటి ముఖ్య భూభౌతిక దృగ్విషయాలు తదితర అంశాలు సిలబస్‌లో ఉన్నాయి.
 
 ఇంధనం, పర్యావరణానికి ప్రాధాన్యం
 కొత్త విధానంలో తొలిసారి గతేడాది మెయిన్స్ జరిగింది. జీఎస్ పేపర్-1 జాగ్రఫీకి సంబంధించి ఇంధనం, పర్యావరణానికి ప్రాధాన్యం ఇస్తూ ప్రశ్నలు వచ్చాయి. ఈసారి వీటితో పాటు కొత్త అంశాలకు కూడా ప్రాధాన్యమిస్తూ ప్రశ్నలు రావొచ్చు. అందువల్ల అభ్యర్థులు ఈ దిశగా ప్రిపరేషన్ కొనసాగించాలి. Ex: With growing scarcity of fossil fuels, the atomic energy is gaining more and more significance in India. Discuss the availability of raw material required for the generation of atomic energy in India and in the World
 
 గత పరీక్షలో అణుశక్తిపై ప్రశ్న వచ్చినందున, ఈసారి ఇతర శక్తి వనరులపై ప్రశ్నలు ఇచ్చేందుకు అవకాశముంది. అందువల్ల శక్తి వనరుల గురించి చదివేటప్పుడు వివిధ కోణాల్లో అధ్యయనం చేయాలి. ఉదాహరణకు జలవిద్యుత్ శక్తికి సంబంధించి ఉత్పత్తి సామర్థ్యం, అవసరాలు, ఎదుర్కొంటున్న సమస్యలు, అందుబాటులో ఉన్న పరిష్కార మార్గాలు తదితరాలపై అవగాహన పెంపొందించుకోవాలి. ఆర్కిటిక్, అంటార్కిటిక్ ప్రాంతాల వనరులు భవిష్యత్తులో కీలకంగా మారనున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాలపై భారత్ అనుసరిస్తున్న విధానాలపై అవగాహన పెంపొందించుకోవాలి. ఇంధన భద్రతలో ప్రస్తుతం చర్చకు తావిస్తున్న గ్యాస్పైప్లైన్ల సమాచారాన్ని తెలుసుకోవాలి.
 
 పారిశ్రామిక ప్రాంతాలు
 ప్రపంచ వ్యాప్తంగా ఏ ప్రాంతాల్లో ఏ రకమైన పరిశ్రమలు అధికంగా కేంద్రీకృతమై ఉన్నాయి.. దానికి గల కారణాలను తెలుసుకోవాలి. వనరుల విస్తరణకు, పారిశ్రామిక అభివృద్ధికి మధ్య సంబంధాన్ని విశ్లేషించాలి. ఈ విభాగంలో భారత్‌కు ప్రాధాన్యమిస్తూ చదవాలి. పెట్రో కెమికల్, ఆటోమొబైల్ తదితర రంగాలకు చెందిన సంస్థలు అభివృద్ధి చెందిన దేశాలకు బదులు అభివృద్ధి చెందుతున్న దేశాల వైపు దృష్టిసారిస్తుండటానికి కారణాలను తెలుసుకోవాలి. వ్యవసాయ, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఏ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నాయి, దానికి కారణాలను విశ్లేషించాలి. ప్రపంచ, భారతీయ పర్యాటక రంగం, అభివృద్ధికి అవకాశాలపై అవగాహన ఏర్పరుచుకోవాలి.
 
 భూభౌతిక దృగ్విషయాలు: భూకంపాలు, సునామీలు, అగ్నిపర్వతాలు, తుఫానులు తదితరాలకు సంబంధించిన ప్రాథమిక అంశాలపై పట్టు సాధించాలి. వీటిని చదువుతున్నప్పుడు భారత్‌ను దృష్టిలో ఉంచుకోవాలి. ఏ విపత్తులు ఏ ప్రాంతాల్లో ఎక్కువగా సంభవిస్తున్నాయి? వాటికి కారణాలను తెలుసుకోవాలి. హిమాలయ ప్రాంతంలో ఎక్కువగా భూకంపాలు సంభవించడానికి కారణాలేంటి? హిందూ మహాసముద్రంతో పోల్చితే పసిఫిక్ మహాసముద్రంలో ఎక్కువగా సునామీలు ఏర్పడుతున్నాయి ఎందుకు? వంటి ప్రశ్నలు వచ్చేందుకు అవకాశముంది.
 
 కాన్సెప్టు ఆధారిత ప్రశ్నలు
 జాగ్రఫీ, ఎకాలజీకి సంబంధించిన ముఖ్యమైన కాన్సెప్టులపై నేరుగా ప్రశ్నలు వచ్చేందుకు అవకాశముంది. అందువల్ల వీటిని గుర్తించి, అధ్యయనం చేయడం తప్పనిసరి. క్రమక్షయం (ఉటౌటజీౌ), శైథిల్యం (గ్ఛ్చ్టిజ్ఛిటజీజ), ఫుడ్ పిరమిడ్, ఫుడ్ వెబ్, న్యూట్రియెంట్ సైకిల్, బయో మ్యాగ్నిఫికేషన్ వంటి వాటిని చదవాలి. Ex: What do you understand by the theory of 'Continental drift'? Discuss the prominent evidences in its support? నదులు, హిమానీ నదాలు వంటి వాటిపై భూతాపం (గ్లోబల్ వార్మింగ్) ప్రభావం తెలుసుకోవాలి.
 
 ప్రాచీన చరిత్ర
 భారతదేశ చరిత్రపై ‘కార్ల్‌మార్క్స్’ అభిప్రాయం తెలపండి?
 ఈ రకమైన ప్రశ్నల ద్వారా అభ్యర్థుల అవగాహన తీరు, వారి ఆలోచనా దృక్పథాన్ని అంచనా వేస్తారు. చరిత్రకారుడు ఇర్ఫాన్ హబీబ్ మాటల్లో చెప్పాలంటే ‘జాతీయవాద చరిత్ర రచనా విధానంలో భాగంగా తలెత్తినదే మార్క్సిస్టు చరిత్ర రచనా విధానం. ఈ నేపథ్యంలో అభ్యర్థులు ప్రధానంగా జాతీయవాద చరిత్ర రచనా విధానం, మార్క్సిస్ట్ చరిత్ర రచనా విధానానికి మధ్య సామ్యాలు గమనించాలి.
 
 భారతదేశ చరిత్రపై వలసవాదుల అభిప్రాయాలు, వారు చరిత్ర అభివృద్ధికి దోహదం చేసిన తీరును వివరించండి?
 ప్రాచీన భారతీయులు సంప్రదాయ చరిత్రను మహాకావ్యాలుగా, పురాణాలుగా, ఆత్మకథలను పోతన రాతప్రతుల రూపంలో భద్రపరిచారు. కానీ బ్రిటిష్ యంత్రాంగం భారతదేశ చరిత్రపై ఆధునిక పరిశోధన చేసింది. ఈ ప్రక్రియను 1776లో మను ధర్మశాస్త్రాన్ని ‘ఏ కోడ్ ఆఫ్ జెంటూలాస్’ పేరిట అనువదించడంతో ప్రారంభించారు. 1785లో చార్లెస్ విల్కిన్స్ భగవద్గీతను ఇంగ్లిష్‌లోకి అనువదించారు. 1804లో బాంబే సొసైటీ, 1823లో ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ ప్రారంభమయ్యాయి. అభ్యర్థులు వీటిపై అవగాహన పెంపొందించుకోవాలి.
 
 భిన్న కోణాల్లో అధ్యయనం
 ప్రాచీన చరిత్రకు సంబంధించి ‘భారతీయ సంస్కృతి-వారసత్వం’పై ఎక్కువగా దృష్టిసారించాలి. చరిత్రను చారిత్రక దృక్పథంతో పాటు కళలు, సాంస్కృతిక సేవ, వారసత్వ సంపద కోణంలో ఆలోచించి ప్రిపరేషన్ కొనసాగించడం ఉత్తమం. ప్రాచీన భారతదేశంలోని కుల వ్యవస్థ, వర్ణ వ్యవస్థ, నూతన మతాల ఆవిర్భావం వాటి ప్రాధాన్యత, క్షీణత తదితర అంశాల నుంచి ప్రశ్నలు వచ్చేందుకు అవకాశముంది. శిల్పకళారంగం, చిత్రలేఖనం, సంగీతం అంశాలను కీలకమైనవిగా భావించాలి.
 
 మధ్యయుగం
 చోళుల సాంస్కృతిక సేవ-గ్రామ పాలన, రాజపుత్రుల సామాజిక-సాంస్కృతిక సేవ అతి ముఖ్యమైనవి. భూమి శిస్తు విధానం (ఉత్తర భారతదేశంలో)లో కేంద్ర ప్రభుత్వ పాలనలో ప్రభు వర్గానికి- భూస్వామికి; రైతుకు మధ్యగల ప్రత్యక్ష-పరోక్ష సంబంధాలు, శాఖలు, కరువు నివారణకు తీసుకున్న జాగ్రత్తలను అధ్యయనం చేయాలి. అంటరానితనం-తెగలతో సామాజిక వ్యవస్థలో వచ్చిన మార్పులపై కొంతైనా అధ్యయనం తప్పనిసరి. మధ్యయుగం నాటి ఆర్థిక విధానం ముఖ్యమైనది. మొగలు సామ్రాజ్యంలోని ముఖ్యమైన అంశాలపై అవగాహన అవసరం. స్త్రీలు- బానిసలు; విజయనగర సామ్రాజ్యంలోని వర్తక వాణిజ్య అంశాలనూ చదవాలి.
 
 ఆధునిక యుగం
 ఇది చాలా ముఖ్యమైన విభాగం. దీన్నుంచి ఎక్కువగా తులనాత్మక, లోతైన ప్రశ్నలు వచ్చేందుకు అవకాశముంది. బ్రిటిష్ విధానాలకు సంబంధించి స్వదేశీ సంస్థానాలపై బ్రిటిష్ సార్వభౌమత్వ విధానాలను పరిశీలించండి? వలసవాదం ముఖ్య లక్షణాలను అంచనా వేయండి? వంటి ప్రశ్నలు వచ్చేందుకు అవకాశముంది. ఈ విభాగంలో 1857 తిరుగుబాటు; మితవాదులు, అతివాదుల విధానాలు; మత, సంఘసంస్కరణ ఉద్యమాలు; 1909 చట్టంలోని ముఖ్యాంశాలు, గాంధీ సిద్ధాంతాలు, నిర్మాణాత్మక కార్యక్రమాలు తదితర అంశాలపై లోతైన అవగాహన అవసరం.
 
 ప్రపంచ చరిత్ర
 ఈ విభాగంపై అభ్యర్థులకు లోతైన అవగాహన ఉండదు. ప్రశ్నలు నేరుగా రావు. ఇవి స్టేట్మెంట్ల రూపంలో వస్తున్నాయి. ప్రపంచ చరిత్రకు సంబంధించి ఫ్రెంచి వైజ్ఞానిక తత్వవేత్తలు ప్రవచించిన సిద్ధాంతాలు, ఐరోపాలోని రాజకీయ ప్రభావాలతో పాటు మార్క్సియన్ సోషలిజం, ఫాబియన్ సోషలిజం తదితర సిద్ధాంతాలను విశ్లేషణాత్మకంగా అధ్యయనం చేయాలి. ప్రపంచ కార్మికోద్యమాల నేపథ్యం, జర్మనీ-ఇటలీ ఏకీకరణ ఉద్యమాల ప్రభావం, నెపోలియన్ భూఖండ విధానం, మొదటి ప్రపంచ యుద్ధానికి దారితీసిన పరిస్థితులు-వాటి ప్రభావం, నల్లమందు యుద్ధాలు తదితర అంశాలపై పట్టు తప్పనిసరి. 20వ శతాబ్దంలో జపాన్ సాధించిన ప్రగతి, బాల్కన్లో సంక్షోభం, జార్జ్ రాజుల నిరంకుశత్వం-రష్యా విప్లవం, లెనిన్ నూతన ఆర్థిక విధానం, జర్మనీలో నాజిజం, ఇటలీలో ఫాసిజం, చైనాలో కమ్యూనిజం, ప్రపంచ ఆర్థిక మాంద్యం, రెండో ప్రపంచ యుద్ధం-తదనంతర పరిణామాలు, మూడో ప్రపంచ దేశాల ఆవిర్భావం వంటి అంశాలను విశ్లేషణాత్మకంగా అధ్యయనం చేయాలి.
 
 ‘‘గతంతో పోలిస్తే జనరల్ స్టడీస్ పేపర్లో జాగ్రఫీ సబ్జెక్టు పరిధి విస్తృతమైంది. ప్రిపరేషన్లో ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది.. ఏ అంశాన్ని చదువుతున్నా వర్తమాన పరిస్థితులకు అన్వయించుకోవాలి. ఆయా అంశాలకు సంబంధించి భారత్ స్థితిగతులపై అవగాహన పెంపొందించుకోవాలి. గతేడాది 100, 200 పదాల్లో సమాధానాలు రాయాల్సిన ప్రశ్నలు వచ్చాయి. ఈసారి ఇలాగే అడగాలని లేదు. స్వల్ప సమాధాన ప్రశ్నలు పెరిగే అవకాశముంది. అలాంటప్పుడు విజయంలో సమయ పాలన కీలకమవుతుంది.
 
 ‘‘గాంధీ సిద్ధాంతాలు-నిర్మాణాత్మక కార్యక్రమాలు, పోరాట పద్ధతులపై వ్యాసరూప ప్రశ్నలు వచ్చేందుకు అవకాశముంది. సహాయ నిరాకరణ ఉద్యమం గాంధీ లాంటి గొప్ప వ్యక్తి చేయాల్సింది కాదని చర్చిల్ విమర్శించడం; గాంధీ వ్యక్తిత్వం, మేధస్సును సామాన్యులు అంచనా వేయలేరని ఐన్‌స్టీన్ వంటి మేధావి అనడం తదితర స్టేట్మెంట్లపై ఎక్కువగా దృష్టిసారించాలి. గాంధీ-అంబేద్కర్ మధ్య సారూప్యత, నెహ్రూ-చర్చిల్ మధ్య సారూప్యత వంటి వాటిపై అవగాహన పెంపొందించుకోవాలి’’
- 
      
                   
                                 కేటాయింపు పొందిన ప్రిలిమ్స్ అభ్యర్థులకు ఫౌండేషన్ కోర్సులో ప్రవేశం లేదు
 డీఓపీటీ ఉత్తర్వు జారీ
 
 న్యూఢిల్లీ: గత ఏడాది సివిల్ సర్వీసెస్ పరీక్ష ద్వారా ఐఏఎస్, ఐఎఫ్ఎస్, ఐపీఎస్‌లలో కేటాయింపు పొంది, తిరిగి ఈ ఏడాది సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షకు హాజరుకాదలిచిన అభ్యర్థులు ఫౌండేషన్ కోర్సుకు హాజరు కావడం కుదరదని ప్రభుత్వం స్పష్టంచేసింది. ఆఖిలభారత సర్వీసులైన ఐఏఎస్, ఐఎఫ్ఎస్, ఐపీఎస్‌లకు, కేంద్ర సర్వీసులకు, గ్రూప్-ఏ సర్వీసులకు 2013 సంవత్సరపు పరీక్షద్వారా కేటాయింపు పొందిన అభ్యర్థులు, తమకు సూచించిన సంస్థల్లో వచ్చే నెల 1నుంచి ఫౌండేషన్ కోర్సుకు హాజరుకావలసి ఉంటుందని సిబ్బంది, శిక్షణా వ్యవహారాల శాఖ (డీఓపీటీ) తన ఉత్తర్వులో పేర్కొంది. ఇలాగే సర్వీసుల కేటాయింపు పొందినా, ఈ నెల 24వ తేదీన జరగనున్న సివిల్స్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష రాయాలనుకుంటున్న అభ్యర్థులను మాత్రం ఫౌండేషన్ కోర్సుకు అనుమతించబోమని డీఓపీటీ స్పష్టంచేసింది. 
 గత ఏడాది నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణత ప్రాతిపదికగా వివిధ సర్వీసులకు 1,122మంది అభ్యర్థుల పేర్లను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సిఫార్సు చేసింది.
 
 వారిలో 981మంది అభ్యర్థులకు మాత్రమే సర్వీసుల కేటాయింపు జరిగింది. వివిధ కారణాలవల్ల 141మంది అభ్యర్థులకు కేటాయింపు జరగలేదు. కొంతమంది అభ్యర్థులు పరిమిత సంఖ్యలో సర్వీసులను మాత్రమే తమ ప్రాధాన్యతగా పేర్కొన్నారని, నిబంధనల ప్రకారం ప్రధాన జాబితా, రిజర్వ్డ్ జాబితాలనుంచి కేటాయింపులు పూర్తయిన తర్వాతే అలాంటి అభ్యర్థులకు కేటాయింపుల చేయడం సాధ్యమవుతుందని డీఓపీటీ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. కొందరు అభ్యర్థులు కచ్చితంగా ఓబీసీలేనా అన్నది కూడా నిర్ధారించుకోవలసి ఉందని, ముఖ్యమైన పత్రాలు సమర్పించనందున మరి కొందరి అభ్యర్థిత్వాలను తాత్కాలికమైనవిగా పరిగణిస్తున్నామని, కొందరి వైద్య పరీక్షలు కూడా పెండింగ్‌లో ఉన్నాయని డీఓపీటీ తెలిపింది. ఈ అంశాలన్నింటినీ నిర్ణీత కాలపరిమితిలో పరిష్కరించేందుకు అన్నివిధాలా కృషిచేస్తున్నామని, కొందరు అభ్యర్థులకు సర్వీసు కేటాయింపులు జరగకపోటవడానికి కారణాలను వెబ్సైట్లో పొందుపరుస్తున్నామని, అభ్యర్థులు తమకు ఇచ్చిన కోడ్ ద్వారా తెలుసుకోవచ్చని డీఓపీటీ తన ఉత్తర్వులో పేర్కొంది.
- 
      
                   
                                 సుస్థిర భవిష్యత్‌కు.. ఆర్బీఐ కొలువులు
 ఇటీవలి కాలంలో వెలువడుతున్న బ్యాంకింగ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ల పరంపరలో మరో మంచి అవకాశం ఆశావహుల ముంగిట నిలిచింది.. దేశంలో బ్యాంకులను నియంత్రించే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండి యా (ఆర్బీఐ).. గ్రేడ్-బి ఆఫీసర్ (జనరల్) పోస్టుల భర్తీ కోసం ప్రకటన విడుదల చేసింది. సుస్థిర భవిష్యత్‌కు మార్గం సుగమం చేసే ఆర్బీఐ గ్రేడ్-బి పోస్టులకు అర్హత, ఎంపిక ప్రక్రియ
 తదితర వివరాలు..
 
 మొత్తం ఖాళీలు: 117(జనరల్-58, ఎస్సీ-15, ఎస్టీ-8, ఓబీసీ-36)
 
 పరిమితంగానే:
 సివిల్స్ మాదిరిగా ఇందులో కూడా పరీక్ష హాజరుకు సంబంధించి కొన్ని పరిమితులు ఉన్నాయి. ఈ క్రమంలో జనరల్ అభ్యర్థులకు నాలుగు సార్లు మాత్రమే హాజరయ్యే అవకాశం కల్పించారు (గతంలో నాలుగు సార్లు రాసిన అభ్యర్థులు ఈ సారి పరీక్ష రాయడానికి అనర్హులు). ఇతర కేటగిరీల అభ్యర్థులకు ఎటువంటి పరిమితి లేదు.
 ఎంపిక విధానం:
 ఎంపిక విధానంలో రెండు దశలు ఉంటాయి. అవి..రాత పరీక్ష, ఇంటర్వ్యూ.
 
 రాత పరీక్ష:
 రాత పరీక్ష ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్ పద్ధతుల కలయికగా ఉంటుంది. ఇందులో రెండు దశలు ఉంటాయి. మొదటి దశ రాత పరీక్షను ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. ఇది ఆన్లైన్ విధానంలో ఉంటుంది. రెండో దశ రాత పరీక్షను డిస్క్రిప్టివ్ పద్ధతిలో నిర్వహిస్తారు.
 
 మొదటి దశ:
 మొదటి దశ పరీక్ష 200 మార్కులకు ఉంటుంది. ఇందులో జనరల్ అవేర్నెస్, ఇంగ్లిష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ వంటి నాలుగు విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి. సమాధానాలను గుర్తించడానికి 130 నిమిషాల సమయం కేటాయించారు. ఇందులో నిర్దేశించిన అర్హత మార్కులు సాధించిన అభ్యర్థులు మాత్రమే రెండో దశ డిస్క్రిప్టివ్ టెస్ట్‌కు హాజరు కావాల్సి ఉంటుంది.
 
 రెండో దశ:
 ఇందులో మూడు పేపర్లు ఉంటాయి. అవి పేపర్-1 ఇంగ్లిష్, పేపర్- 2 ఎకనామిక్ అండ్ సోషల్ ఇష్యూస్, పేపర్-3 ఫైనాన్స్ అండ్ మేనేజ్మెంట్. ప్రతి పేపర్‌కు 100 మార్కులు కేటాయించారు. సమాధానాలను మూడు గంటల్లో రాయాలి. ఇందులో ఇంగ్లిష్ మినహా మిగతా రెండు పేపర్లకు సమాధానాలను ఇంగ్లిష్/హిందీ భాషల్లో మాత్రమే రాయాలి.
 
 ప్రిపరేషన్:
 జనరల్ అవేర్నెస్: ఇందులో సమకాలీన జాతీయ, అంతర్జాతీయ సంఘటనలు, చరిత్ర, ఆర్థికశాస్త్రం, జాగఫ్రీ, జనరల్ సైన్స్, ప్రణాళికలు, బడ్జెట్, రాజ్యాంగం, పన్ను విధానం, ఆర్థిక సర్వే సంబంధిత అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. కరెంట్ అఫైర్స్ నుంచి అడిగే ప్రశ్నలు అధిక శాతం ఆర్థిక అంశాలపైనే ఉంటాయి. కాబట్టి సిలబస్‌లోని ఆర్థిక అంశాలను సమకాలీన సంఘటనలతో సమన్వయం చేసుకుంటూ విశ్లేషణాత్మక ప్రిపరేషన్ సాగించాలి.
 
 క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్: ఇందులో సంప్రదాయ ప్రశ్నలు కాకుండా డేటాఇంటర్‌ప్రిటేషన్ ప్రశ్నలు ఎక్కువగా అడుగుతున్నారు. కాబట్టి ఆపరేషన్ ఆన్ బ్రాకెట్స్,లీనియర్ ఈక్వేషన్స్, రేషియో, ప్రాఫిట్-లాస్, టైమ్-డిస్టెన్స్-స్పీడ్-వర్క్, జ్యామెట్రీ, వెన్‌డయాగ్రమ్స్ వంటి అంశాలను ప్రాధాన్యత క్రమంలో ప్రిపేర్ కావాలి. ఈ క్రమంలో ఆరు నుంచి పదో తరగతి వరకు ఉన్న ఆల్జీబ్రా, త్రికోణమితి, వైశ్లేషిక రేఖాగణితం, రేఖాగణితం, మెన్సురేషన్ వంటి అంశాల్లోని ప్రాథమిక భావనలపై అవగాహన పెంచుకోవాలి. ఎక్కువగా కాలిక్యులేషన్స్ ఉంటాయి. కాబట్టి తక్కువ సమయంలో ఎక్కువ సమస్యలను సాధించే విధంగా షార్ట్‌కట్ మెథడ్స్ నేర్చుకోవాలి. వీలైనంత ఎక్కువగా సమస్యలను ప్రాక్టీస్ చేయాలి.
 
 రీజనింగ్: అభ్యర్థిలోని విశ్లేషణాత్మక సామర్థ్యాన్ని పరీక్షించే విభాగం ఇది. ఇందులో స్టేట్మెంట్స్ అండ్ కన్‌క్లూజన్స్, ఇన్పుట్-అవుట్‌పుట్, రిలేషన్స్, కేలండర్స్, క్లాక్స్, డెరైక్షన్స్ వంటి అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. ముఖ్యంగా నంబర్స్-ఆల్ఫాబెట్స్, వర్డ్ ఇమేజెస్ వంటి అంశాలపై ఎక్కువగా దృష్టి సారించాలి.
 
 డిస్క్రిప్టివ్ పేపర్: విభాగానికి సంబంధించి ఇంగ్లిష్ పేపర్లో ఎస్సే, ప్రిసీస్ రైటింగ్, కాంప్రెహెన్షన్, బిజినెస్/ఆఫీస్ కరస్పాండెన్స్ వంటి అంశాలపై ప్రశ్నలు ఉంటాయి. పేపర్-2, పేపర్-3లలో వచ్చే ప్రశ్నలు అయా అంశాలపై అభ్యర్థుల విస్తృత అవగాహనను పరిశీలించే విధంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో కేవలం అవగాహన పెంచుకోవడమే కాకుండా..ఆ సమాచారాన్ని విశ్లేషణాత్మకంగా ఏవిధంగా ప్రెజెంట్ చేయాలో నేర్చుకోవాలి. ఈ విభాగానికి సంబంధించి గత ప్రశ్నపత్రాలు వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. కాబట్టి వీటిని అనుసరిస్తూ ప్రశ్నల సరళిపై అవగాహన ఏర్పర్చుకోవాలి. ఏయే అంశాల నుంచి ఎటువంటి ప్రశ్నలు వస్తున్నాయి? వాటికి సమకాలీనంగా ఎటువంటి ప్రాధాన్యత ఉంది? వంటి అంశాలను బేరీజు వేసుకుంటూ విశ్లేషణాత్మక ప్రిపరేషన్ సాగించాలి.
 
 చివరగా:
 రెండో దశలో నిర్వహించిన రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు చివరగా ఇంటర్వ్యూకు హాజరు కావాలి. ఇంటర్వ్యూలో ఇంగ్లిష్/హిందీ భాషల్లో మాత్రమే సమాధానాలివ్వాలి. రెండో దశ రాత పరీక్ష, ఇంటర్వ్యూలో సాధించిన మెరిట్ ఆధారంగా తుది నియామకాన్ని ఖరారు చేస్తారు.
 
 రిఫరెన్స్ బుక్స్
 - ఎన్సీఈఆర్టీ: 6 నుంచి 12వ తరగతి పుస్తకాలు
 - క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్: ఆర్ఎస్ అగర్వాల్
 - రీజనింగ్: ఆర్ఎస్ అగర్వాల్, టీఎస్ అగర్వాల్
 - ఇండియా ఇయర్ బుక్
 - ప్రతియోగితా దర్పణ్
 - ఇంగ్లిష్: జీఆర్ఈ బారెన్స్
 - ఆర్బీఐ గ్రేడ్-బి ఆఫీసర్స్ ఎగ్జామ్: ఉప్కార్ పబ్లికేషన్స్
 
 నోటిఫికేషన్ సమాచారం
 - అర్హత: 60 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ/
 కనీసం 55 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీ/50 శాతం మార్కులతో డాక్టరేట్ డిగ్రీ. లేదా బ్యాచిలర్
 డిగ్రీతోపాటు సీఏ/సీఎస్ లేదా పీజీ డిప్లొమా ఇన్
 మేనేజ్మెంట్/ఎంబీఏతోపాటు బ్యాచిలర్ డిగ్రీ.
 - వయసు: 21 నుంచి 30 ఏళ్లు (జూన్ 1, 2014
 నాటికి). రిజర్వ్డ్ అభ్యర్థులకు నిర్దేశించిన విధంగా వయోసడలింపు ఉంటుంది.
 - దరఖాస్తు: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
 - ఆన్లైన్లో ఫీజు చెల్లించడానికి చివరి తేదీ:
 జూన్ 23, 2014.
 - ఆఫ్‌లైన్‌లో ఫీజు చెల్లించడానికి చివరి తేదీ:
 జూన్ 26, 2014
 - ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: జూన్ 23, 2014.
 - మొదటి దశ రాత పరీక్ష తేదీలు: ఆగస్టు 2,3,9,10.
 వివరాలకు: http://rbi.org.in
- 
      
                   
                                 ఆ వైఫల్యాలే నా విజయానికి సోపానాలు
 ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్.. ప్రజలకు సేవ చేసేందుకు ప్రత్యక్ష మార్గం అనే బలమైన ఆలోచన..
 అదే విధంగా కుటుంబంలోని అందరూ సివిల్ సర్వీసుల్లో ఉండటంతో పీజీ చదివేటప్పుడే సివిల్స్‌ను లక్ష్యంగా పెట్టుకున్నాను. మూడు సార్లు ఓటమి ఎదురైనా.. నిబ్బరం కోల్పోకుండా.. దీక్ష, పట్టుదలతో
 నాలుగో ప్రయత్నంలో విజయం సాధించాను. ఆశించిన లక్ష్యం ఐఏఎస్ సొంతం చేసుకున్నాను’.. అంటున్న సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2013-14 30వ ర్యాంకర్ కృత్తిక జ్యోత్స్నతో ఇంటర్వ్యూ...
 
 అందరూ సివిల్ సర్వీసుల్లోనే.. అదే తొలి ప్రేరణ:
 కుటుంబ నేపథ్యం అంతా సివిల్ సర్వీసుల్లోనే. నాన్న ఎస్.బి.ఎల్. మిశ్రా ఐఎఫ్ఎస్ అధికారి. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ హోదాలో ఉన్నారు. అమ్మ నిరుపమ అలీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్లో అడిషనల్ కమిషనర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. సోదరుడు కార్తికేయ మిశ్రా ఐఏఎస్ అధికారి. ఆంధ్రప్రదేశ్ నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ సీఎండీ హోదాలో ఉన్నారు. సోదరి కనిక జ్యోత్స్న దుబాయ్‌లో స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్‌లో ఉన్నత హోదాలో పని చేస్తోంది. ఇలాంటి వాతావరణంలో పెరిగిన నేను చిన్నప్పటి నుంచే సివిల్ సర్వీసులు అంటే మక్కువ పెంచుకున్నాను. వీటి ద్వారా ప్రజలకు నేరుగా సేవ చేసే అవకాశం లభిస్తుందనే ఆలోచన బలంగా నాటుకుంది. దీంతో ఎలాగైనా సివిల్స్ విజయం సొంతం చేసుకోవాలని కృషి చేశాను. లక్ష్యం సాధించాను.
 
 పీజీ.. తర్వాత పూర్తి స్థాయిలో..:
 చిన్ననాటి నుంచే సివిల్స్ లక్ష్యంగా ఉన్నప్పటికీ ఢిల్లీ యూనివర్సిటీలో మ్యాథమెటిక్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక.. 2009 చివరి నుంచి పూర్తి స్థాయిలో సివిల్స్ ప్రిపరేషన్‌కు ఉపక్రమించాను. మొదటి సారి 2010లో సివిల్స్ ప్రిలిమ్స్‌కు హాజరయ్యాను. తొలుత పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ సబ్జెక్ట్‌లు ఆప్షనల్‌గా సివిల్స్ ప్రిపరేషన్ సాగించాను. ఇందుకోసం పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌కు మొదట్లో కోచింగ్ తీసుకున్నప్పటికీ.. ఆ తర్వాత అంతా స్వీయ ప్రిపరేషన్‌తోనే సన్నద్ధమయ్యాను.
 
 కుటుంబ సభ్యుల తోడ్పాటు ఎంతో:
 సివిల్స్ ప్రిపరేషన్ విషయంలో కుటుంబ సభ్యుల ప్రోత్సాహం మరువలేనిది. ముఖ్యంగా నాన్న, అన్నయ్య ఎంతో సహకరించారు. నిర్మాణాత్మక ప్రిపరేషన్‌కు అమూల్యమైన సలహాలిచ్చారు. అంతేకాకుండా జనరల్ స్టడీస్, జనరల్ ఎస్సేస్ విషయంలో వారే ఇంటర్నెట్ సోర్స్‌ల ద్వారా సమాచారం సేకరించి అందించారు.
 
 మూడు సార్లు నిరాశ.. అయినా చెదరని పట్టుదల:
 ప్రస్తుత విజయం నాకు నాలుగో ప్రయత్నంలో లభించింది. 2010 నుంచి 2012 వరకు మూడు సార్లు ఫలితాల్లో నిరాశే ఎదురైంది. రెండోసారి 2011లో ఇంటర్వ్యూ వరకు వెళ్లినా ఫలితం దక్కలేదు. మూడో ప్రయత్నంలోనూ అంతే. ఈ క్రమంలో మానసికంగా ఎంతో నిరుత్సాహానికి గురయ్యాను. ముఖ్యంగా మూడో ప్రయత్నం (2012)లో ఓటమి మానసికంగా ఎంతో కుంగదీసింది. అయితే ఈ సమయంలో సోదరి కనిక జ్యోత్స్న ఇచ్చిన సపోర్ట్ మరవలేనిది. నిరాశకు వెంటనే ఫుల్స్టాప్ పెట్టేసి చివరి ప్రయత్నంలో ఎట్టి పరిస్థితుల్లో సాధించాలనే పట్టుదలతో సాగాను.
 
 ప్రతిసారి.. నిత్య నూతనంగా:
 మూడు సార్లు ఓటమి ఎదురైనా .. ప్రతి అటెంప్ట్‌ను కొత్త సవాలుగా స్వీకరించి రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగాను. రెండో ప్రయత్నంలో అనారోగ్యం కారణంగా విఫలమయ్యాను. మూడో ప్రయత్నంలో రైటింగ్ ప్రాక్టీస్ సరిగా చేయక ముఖ్యంగా ఎస్సే పేపర్లో తక్కువ మార్కులు లభించాయి. ఇలా ప్రతిసారి ఎదురైన ఓటమి వెనుక కారణాలను అన్వేషించి తదుపరి అటెంప్ట్‌ను కొత్త ఛాలెంజ్‌గా తీసుకుని ప్రిపరేషన్‌కు ఉపక్రమించాను.
 
 స్వీయ ప్రిపరేషన్.. సాగించానిలా:
 సివిల్స్ తొలి ప్రయత్నానికి ఉపక్రమించే ముందు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఆప్షనల్ కోసం కొన్ని రోజులు కోచింగ్ తీసుకున్నాను. సిలబస్, ప్రశ్నల శైలిపై అవగాహన లభించాక సొంతగా చదవడం ప్రారంభించాను. ఈ క్రమంలో ప్రతి రోజు అయిదు నుంచి ఆరు గంటలు కేటాయించాను. ప్రతి రోజు చదివిన అంశాలకు సంబంధించి షార్ట్‌కట్ మెథడ్స్‌లో సొంత నోట్స్ రూపొందించుకోవడం, అంతుకుముందు రోజు చదివిన అంశాలను పునశ్చరణ చేసుకోవడం వంటి వ్యూహాలు అనుసరించాను. ఎన్సీఈఆర్టీ 6 నుంచి 12 తరగతుల పుస్తకాలు, మోడ్రన్ ఇండియన్ స్పెక్ట్రమ్, విజార్డ్ జాగ్రఫీ, ఇండియన్ పాలిటీ-లక్ష్మీకాంత్ పుస్తకాలను చదివాను. వీటితోపాటు కచ్చితంగా ప్రతి రోజు టీవీ చానళ్లలో ప్రసారమయ్యే చర్చా కార్యక్రమాలను చూసి ముఖ్యాంశాలను నోట్ చేసుకోవడం హాబీగా చేసుకున్నాను.
 
 ఆప్షనల్స్.. ఇవే:
 అకడెమిక్ నేపథ్యం మ్యాథమెటిక్స్ అయినప్పటికీ.. సివిల్ సర్వీస్ పరీక్ష విధానం, ప్రశ్నల శైలి, సిలబస్ తదితర కారణాలతో.. తొలుత పాత విధానంలోని సివిల్స్ మెయిన్స్ కోసం పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ సబ్జెక్ట్‌లను ఆప్షనల్స్‌గా ఎంచుకున్నాను. ఈ సబ్జెక్ట్‌లు చదివితే జనరల్ అవేర్నెస్ పెరుగుతుందనే భావనే ఇందుకు ప్రధాన కారణం. అప్పటి వరకు అకడెమిక్స్‌లో మ్యాథమెటిక్స్ ఓరియెంటేషన్‌తో చదవడంతో సివిల్స్‌లో జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్‌ల ప్రాధాన్యాన్ని గుర్తించి ఈ నిర్ణయం తీసుకున్నాను. ఇది కలిసొచ్చింది.
 
 మెయిన్స్ కొత్త ప్యాట్రన్కు ఇలా:
 మొదటిసారిగా 2010లో సివిల్స్ రాశాను. అప్పుడు ప్రిలిమ్స్ పేపర్-2 కోసం పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఆప్షనల్‌గా తీసుకున్నాను. ఇందుకోసం కొన్ని రోజులు కోచింగ్ తీసుకున్నాను. 2011లో ప్రిలిమ్స్‌లో మార్పులు చేసిన విషయం తెలిసిందే. రెండో పేపర్లో ఆప్షనల్ బదులు సీ-శాట్‌ను ప్రవేశపెట్టారు. సీ-శాట్ కోసం పదో తరగతి స్థాయి పుస్తకాలు చదివా.
 
 2013 మెయిన్స్‌లోనూ అంతే. రెండు ఆప్షనల్స్ స్థానంలో ఒకే ఆప్షనల్ విధానానికి రూపకల్పన చేశారు. అంతేకాకుండా.. ఎలాంటి నేపథ్యం ఉన్నవారికైనా అకడెమిక్స్‌తో అంతగా సంబంధం లేని ఎథిక్స్, మోరల్ వాల్యూస్ పేపర్ ప్రవేశపెట్టారు. ప్యాట్రన్ మారినా ఎలాంటి ఆందోళన చెందలేదు. అప్పటి వరకు సోషియాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లు ఆప్షనల్‌గా చదివిన నేను.. ఆ రెండింటిలో బాగా పట్టు లభించిన సోషియాలజీని ఆప్షనల్‌గా ఎంచుకున్నాను. మిగతా పేపర్లన్నీ జనరల్ స్టడీస్, జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్‌కు సంబంధించినవే కాబట్టి.. ప్రిపరేషన్ పరంగా ఇబ్బంది పడిన సందర్భాలు తక్కువ.
 
 అందరికీ కలిసొచ్చే.. కొత్త ప్యాట్రన్:
 మెయిన్స్ ఎగ్జామినేషన్ కొత్త ప్యాట్రన్ అందరికీ కలిసొచ్చేదిగా ఉంది. లెవల్ ప్లేయింగ్ ఫీల్డ్‌కు ఆస్కారం లభిస్తుంది. కాబట్టి అభ్యర్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సామాజిక అంశాలపై అవగాహన, కరెంట్ అఫైర్స్‌పై పట్టుతో మెయిన్స్‌ను సులువుగానే ఎదుర్కోవచ్చు. ఇందుకోసం భావ వ్యక్తీకరణ సామర్థ్యాన్ని, ఒక అంశాన్ని పూర్వాపరాలతో విశ్లేషించే నైపుణ్యాలను సొంతం చేసుకోవాలి. ఈ విషయంలో న్యూస్ పేపర్లు, ఇతర కాంపిటీటివ్ మ్యాగజైన్లలోని ఎడిటోరియల్స్, వ్యాసాలు చదవడం లాభిస్తుంది.
 
 ఇంటర్వ్యూ.. 25 నిమిషాలు:
 ఏప్రిల్ 15న ఆఫ్టర్నూన్ సెషన్లో అల్కా సిరోహి నేతృత్వంలోని అయిదుగురు సభ్యుల బోర్డ్ ఇంటర్వ్యూ నిర్వహించింది. 20 నుంచి 25 నిమిషాల వ్యవధిలో ఎంతో ఆహ్లాదకర వాతావరణంలో సాగింది. వేదిక్ మ్యాథ్స్, నా అభిమాన కవి జాన్ మిల్టన్ పోయట్రీ, మేథో సంపత్తి హక్కులు, విద్యా హక్కు, మానవాభివృద్ధి సూచీ-భారత స్థానం- ఇతర దేశాలతో పోలిక, నాయకత్వ లక్షణాలు, చిన్న రాష్ట్రాలు-పెద్ద రాష్ట్రాల ఏర్పాటుపై జరుగుతున్న చర్చలు, నక్సలిజం, ప్రీ-పోల్, పోస్ట్ పోల్ సర్వేల గురించి ప్రశ్నలు అడిగారు. కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వడంలో తడబడినా.. బోర్డ్ సభ్యులు హింట్స్ ఇచ్చి ఒత్తిడి లేని వాతావరణంలో ఇంటర్వ్యూ చేశారు. ముఖ్యంగా మొదటి ప్రశ్నగా నా పేరులోని అర్థం చెప్పమంటే.. చెప్పలేకపోయాను. దీనికి కొంత ఆందోళన చెందాను. కానీ బోర్డ్ సభ్యులు హింట్ ఇచ్చి సహకరించారు. ఇంటర్వ్యూ పూర్తయ్యాక కచ్చితంగా విజయం సాధిస్తాననే నమ్మకం కుదిరింది. అది నిజమైంది. నాన్న, అన్నయ్య సలహాలతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌ను ప్రాధాన్యతగా ఎంచుకున్నాను.
 
 అభ్యర్థులకు సలహా:
 ఔత్సాహిక అభ్యర్థులకు నా సలహా.. సహనం, ఓర్పు సహజ లక్షణాలుగా అలవర్చుకోవాలి. సుదీర్ఘ వ్యవధిలో సాగే ఎంపిక ప్రక్రియలో ఎట్టి పరిస్థితుల్లోనూ నిరాశ, నిస్పృహలను దరి చేరనీయకూడదు. ఇక.. ప్రిపరేషన్ విషయానికొస్తే.. తొలి ప్రయత్నానికి కనీసం సంవత్సరం ముందు నుంచి ఆ దిశగా వ్యూహాలు రూపొందించుకోవాలి. మార్కెట్లో విస్తృతంగా లభించే మెటీరియల్ అంతటినీ చదవాలనే ఆతృత సరికాదు. నాణ్యమైన మెటీరియల్‌ను ఎంపిక చేసుకోవాలి. అంతేకాకుండా సిలబస్, గత ప్రశ్న పత్రాల పరిశీలన ద్వారా ఎంపిక చేసుకున్న మెటీరియల్‌లో చదవాల్సిన అంశాలపై అవగాహన ఏర్పరచుకోవాలి. కోచింగ్, ప్రిపరేషన్‌కు కేటాయించే సమయం అనేది వ్యక్తిగత సామర్థ్యంపై ఆధారపడి ఉంటాయి. ప్రస్తుతం సివిల్స్ ప్యాట్రన్ అన్ని నేపథ్యాల అభ్యర్థులకు అనుకూలించేదిగా ఉంది. ప్రిలిమ్స్‌లో సీ-శాట్ విషయంలో నాన్-మ్యాథ్స్ విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. కానీ ఈ పేపర్లో మ్యాథమెటికల్ ఎబిలిటీ కంటే ఇతర విభాగాలకు వెయిటేజీ ఎక్కువ. అంతేకాకుండా అడిగే ప్రశ్నలన్నీ పదో తరగతి స్థాయిలోనే ఉంటున్నాయి. కాబట్టి చక్కటి ప్రణాళికతో చదివితే విజయం సాధ్యం.
 
 మూడు సార్లు ఓటమి ఎదురైనా .. ప్రతి అటెంప్ట్‌ను కొత్త సవాలుగా స్వీకరించి రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగాను. ఇలా ప్రతిసారి ఎదురైన ఓటమి వెనుక కారణాలను అన్వేషించి తదుపరి అటెంప్ట్‌ను కొత్త ఛాలెంజ్‌గా తీసుకుని ప్రిపరేషన్‌కు ఉపక్రమించాను.
 
 అకడెమిక్ ప్రొఫైల్
 - భారతీయ విద్యా భవన్ హైస్కూల్ (హైదరాబాద్)లో 2002లో 10వ తరగతి ఉత్తీర్ణత (91 శాతం)
 - ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో 2004లో + 2 ఉత్తీర్ణత (85 శాతం)
 - ఢిల్లీ యూనివర్సిటీ నుంచి 2007లో బీఎస్సీ (75 శాతం)
 - ఢిల్లీ యూనివర్సిటీ నుంచి 2009లో మ్యాథమెటిక్స్‌లో పీజీ (52 శాతం)
 
 చదివిన పుస్తకాలు
 - జనరల్ స్టడీస్: ఆరు నుంచి 12 తరగతుల వరకు ఎన్సీఈఆర్టీ పుస్తకాలు
 - ఇండియన్ పాలిటీ: లక్ష్మీకాంత్
 - ఇండియన్ ఎకానమీ సిన్స్ ఇండిపెండెన్స్: ఉమా కపిల
 - హిస్టరీ: స్పెక్ట్రమ్ పబ్లికేషన్స్
 - జాగ్రఫీ ఫర్ జనరల్ స్టడీస్: విజార్డ్ పబ్లికేషన్స్
 - ఇండియన్ కల్చర్: స్పెక్ట్రమ్ పబ్లికేషన్స్
 - సోషియాలజీ: బీఏ సోషియాలజీ పుస్తకాలు, ఇగ్నో ఎంఏ (సోషియాలజీ) మెటీరియల్; సోషియాలజీ థీమ్స్ అండ్ పర్స్పెక్టివ్స్- హరాలమ్బస్; సోషియలాజికల్ థియరీ - రిట్జర్
 - ఎథిక్స్: ఎథిక్స్ ఇన్ గవర్నెన్స్- రమేశ్ కె.అరోరా.
 - వీటితోపాటు క్రమం తప్పకుండా దినపత్రికల్లోని ఎడిటోరియల్ వ్యాసాలు, టీవీ చర్చా
 కార్యక్రమాలు.
- 
      
                   
                                 వాణిజ్య వృద్ధికి మీరే ఉత్ప్రేరకాలు
 న్యూఢిల్లీ: భారతదేశ శక్తిసామర్థ్యాలపై ప్రపంచ దేశాలకు అవగాహన పెంచే ఉత్ప్రేరకాలుగా పనిచేయాలని ఇండియన్ ఫారిన్ సర్వీస్ అధికారుల(ఐఎఫ్ఎస్)ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కోరారు. దేశ వాణిజ్య రంగ అభివృద్ధికి కృషిచేయాల్సిన బాధ్యత వారిపైనే ఉందన్నారు. ఐఎఫ్ఎస్ ప్రొబేషనరీ అధికారులను ఉద్దేశించి గురువారం మోడీ ప్రసంగించారు. విదేశాల్లో విధుల్లో ఉన్నప్పుడు భారతదేశ ప్రత్యేకతను, ఆత్మగౌరవాన్ని ప్రతిబింబించాలని ఈ సందర్భంగా మోడీ వారిని కోరారు. దేశ చరిత్ర, వివిధ దేశాలతో భారత్‌కున్న చారిత్రక సంబంధాలపై అవగాహన పెంచుకోవాలని వారికి సూచించారు. ఎగుమతులు వృద్ధి చెందాలంటే అత్యంత నాణ్యమైన, లోపరహిత ఉత్పాదనలపై భారత్ దృష్టి పెట్టాల్సి ఉందన్నారు.
 
 అలాగే వాటి ప్యాకేజింగ్, ప్రజెంటేషన్ల విధానాన్ని కూడా మెరుగుపర్చాలన్నారు. భారతీయ హెర్బల్ ఉత్పత్తులు ప్రపంచంలోనే అత్యంత నాణ్యమైనవైనా.. ప్యాకేజింగ్‌లో లోపం కారణంగా చైనా ఉత్పత్తుల కన్నా వెనకబడి ఉన్నాయని మోడీ ఉదహరించారు.
 
- 
      
                   
                                 సివిల్ సర్వీసెస్ ఆశావహులకు శుభవార్త
 ఇక నుంచి మరో రెండు ప్రయత్నాలకు అవకాశం
 
 గరిష్ట వయోపరిమితి రెండేళ్లు పెంపు
 1,291 పోస్టులతో నోటిఫికేషన్
 
 న్యూఢిల్లీ: ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ వంటి ప్రతిష్టాత్మక అఖిలభారత సర్వీసు ఉద్యోగాలను సాధించాలనుకునే ఆశావహ విద్యార్థులకు శుభవార్త. భారీ మార్పులతో ఈ ఏడాది పరీక్షలు నిర్వహించేందుకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సిద్ధమైంది. అంగ వైకల్య అభ్యర్థులకు ప్రత్యేకించిన 26 సహా దాదాపు 1,291 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇప్పటి నుంచి అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో రెండేళ్ల సడలింపుతో పాటు పరీక్షలకు అదనంగా రెండు ప్రయత్నాలు (అటెమ్ట్స్) చేసుకొనే అవకాశం లభిస్తుంది. ఈ లెక్కన నిర్దేశిత వయోపరిమితికి లోబడి జనరల్ అభ్యర్థులు గరిష్టంగా ఆరుసార్లు (గతంలో నాలుగు సార్లు) పరీక్షలకు హాజరుకావచ్చు. నోటిఫికేషన్ ప్రకారం ఓబీసీ అభ్యర్థులకు ఏడు ప్రయత్నాల వరకు అవకాశం ఉంది.
 
 ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఈ ప్రయత్నాలపై పరిమితి లేదు. ఈ ఏడాది ఆగస్టు 1 నాటికి 21-32 ఏళ్ల మధ్య వయసు (1982 ఆగస్టు 2 కంటే ముందు, 1993 ఆగస్టు 1 తర్వాత జన్మించి ఉండకూడదు) ఉన్న అర్హులెవరైనా యూపీఎస్సీ పరీక్షలకు హాజరుకావచ్చు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు మరో ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మరో మూడేళ్లు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. అయితే ఈసారి పరీక్షల నిర్వహణ విధానంలో కానీ, సిలబస్‌లో కానీ ఎలాంటి మార్పులూ చేయలేదు. ఈ ఏడాది ఆగస్టు 24న ప్రాథమిక పరీక్ష (ప్రిలిమినరీ), తర్వాత ప్రధాన పరీక్షలు (మెయిన్స్), మౌఖిక పరీక్ష (ఇంటర్వ్యూ) ద్వారా అభ్యర్థులను పోస్టులకు ఎంపిక చేస్తారు. అభ్యర్థులు ఈనెల 30వ తేదీ మధ్యాహ్నం 12 గంటల్లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి గడువు ఉంది. ప్రాథమిక పరీక్షలో ఉత్తీర్ణులైనవారు సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో మెయిన్స్ పరీక్షలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది
- 
      
                    సివిల్స్ రాయడానికి మరో రెండు ఛాన్సులు
 సివిల్స్ రాయాలనుకునే అభ్యర్థులకు శుభవార్త. ఈ పరీక్షల విషయంలో యూపీఎస్సీ భారీ సంస్కరణలకు తెరతీసింది. ఇప్పటివరకు నాలుగుసార్లు మాత్రమే ఈ పరీక్ష రాసే అవకాశం ఉండగా దాన్నిప్పుడు ఆరుకు పెంచారు. దాంతోపాటు వయసు మినహాయంపు కూడా లభించనుంది. ఈ మేరకు యూపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంతకుముందులాగే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు మాత్రం ఎన్నిసార్లయినా ఈ పరీక్ష రాసుకోవచ్చు. అలాగే 21 నుంచి 32 ఏళ్ల మధ్య వయసున్నవారు ఈ ప్రతిష్ఠాత్మ పరీక్షకు హాజరు కావచ్చు.
 
 ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్.. ఇలాంటి ప్రతిష్ఠాత్మక సర్వీసుల కోసం యూపీఎస్సీ ఈ సివిల్స్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. 2014 సంవత్సరానికి సంబంధించిన ప్రిలిమ్స్ పరీక్ష ఆగస్టు 24న జరగనుంది. ఈసారి సుమారు 1291 పోస్టులను భర్తీ చేయాలని యోచిస్తున్నారు.
- 
      
                    సీమాంధ్రకు 211..తెలంగాణకు 163 ఐఏఎస్‌లు
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ, సీమాంధ్ర రాష్ట్రాలకు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ పోస్టుల విభజన పూర్తయింది. ఏ రాష్ట్రానికి ఎన్ని పోస్టులో నిర్ణయిస్తూ కేంద్ర సిబ్బంది, శిక్షణ శాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇరు రాష్ట్రాలకు ఏ స్థాయిలో ఎన్నెన్ని పోస్టులు ఉండాలో నిర్దేశించింది. ప్రస్తుతం పని చేస్తున్న కేడర్‌తోపాటు, ఖాళీను కూడా కలిపి ఇరు రాష్ట్రాలకు 13:10 నిష్పత్తిలో విభజన చేసింది.
 
 ఐఏఎస్‌లను సీమాంధ్రకు 211, తెలంగాణకు 163 మందిని కేటాయించింది. వీరిలో సీమాంధ్రకు పదోన్నతుల ద్వారా 64 మంది, డెరైక్ట్ రిక్రూటీలు 147 మంది ఉండాలని, తెలంగాణలో పదోన్నతుల ద్వారా 49 మంది, డెరైక్టర్ రిక్రూటీలు 114 మంది ఉండాలని పేర్కొంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కేడర్‌లో ఉన్న సంఖ్యలో ఏ మాత్రం తేడా లేకుండా వీరిని పంపిణీ చేశారు. ఐపీఎస్‌లను సీమాంధ్రకు 144 మంది, తెలంగాణకు 112 మందిని కేటాయించింది. డీజీ స్థాయి పోస్టులు సీమాంధ్రకు 2, తెలంగాణకు 1 కేటాయించారు. ఐఎఫ్ఎస్లు సీమాంధ్రకు 82, తెలంగాణకు 65 కేటాయించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి స్థాయిలో కేంద్రం నిర్ణయించిన సంఖ్యకు మించి ఎక్స్ కేడర్ పోస్టులను సృష్టించడానికి వీల్లేదని స్పష్టం చేసింది. సీనియర్ డ్యూటీ పోస్టుల్లో రాష్ట్ర డెప్యుటేషన్ రిజర్వ్ 25 శాతానికి, కేంద్ర డెప్యుటేషన్ రిజర్వ్ 40 శాతానికి మించడానికి వీల్లేదని పేర్కొంది. శిక్షణ, జూనియర్ రిజర్వ్ పోస్టులు 3.5 శాతానికి మించకూడదని చెప్పింది. రాష్ట్రంలో మొత్తం 258 ఐపీఎస్ పోస్టులుండగా, ప్రస్తుతం 206 మంది అధికారులే ఉన్నారు. మిగతా 52 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వ ఉత్తర్వుల్లో మాత్రం 256 పోస్టుల ప్రస్తావనే ఉంది. మిగిలిన రెండు పోస్టులనూ ఒక్కో రాష్ట్రానికి ఒకటి చొప్పున ఇచ్చే అవకాశం ఉందని ఉన్నతాధికారులు తెలిపారు.
 
 సర్వీస్ రూల్స్ ప్రకారం ప్రతి 100 ఐపీఎస్ పోస్టులకు 67 మంది డెరైక్ట్ రిక్రూటీలు, 33 మంది కన్ఫర్డ్ ఐపీఎస్‌లు ఉండాలి. 67 డెరైక్ట్ పోస్టుల్లోనూ 2/3 వంతు బయటి రాష్ట్రాలకు చెందిన వారు, 1/3 వంతు సొంత రాష్ట్రం వారు ఉంటారు. ఈ లెక్క ప్రకారం సీమాంధ్రకు 101 డెరైక్ట్ రిక్రూట్, 43 కన్ఫర్డ్ పోస్టులు, తెలంగాణకు 78, 34 చొప్పున కేటాయించారు. వీటిలో హెచ్చుతగ్గులు ఉంటే డెప్యుటేషన్లపై ఆ లోటును పూడుస్తారు. ఐఎఫ్ఎస్లలో ఆంధ్రప్రదేశ్‌కు డెరైక్ట్ రిక్రూటీలు 58, పదోన్నతుల పోస్టులు 24, తెలంగాణలో డెరైక్ట్ రిక్రూటీలు 46, పదోన్నతుల పోస్టులు 19 కేటాయించారు.


